విడుదలైన 'స్పై' మూవీ ట్రైలర్ : 'Spy' movie trailer released

కార్తికేయ 2 (Kartikeya 2) ... ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదలై భారతీయ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇందులో హీరోగా నటించిన నిఖిల్ సిద్ధార్థ్ (Nikhil Siddharth) తాజాగా నటించిన చిత్రం 'స్పై'. ఈ చిత్రం పాన్ ఇండియా మూవీగా విడుదల కానుంది.

విడుదలైన 'స్పై' మూవీ ట్రైలర్ : 'Spy' movie trailer released

విడుదలైన 'స్పై' మూవీ ట్రైలర్ : 'Spy' movie trailer released

కార్తికేయ 2 (Kartikeya 2) ... చిత్రం రెండు భాగాలుగా విడుదలై భారతీయ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇందులో హీరోగా నటించిన నిఖిల్ సిద్ధార్థ్ (Nikhil Siddharth) తాజాగా నటించిన చిత్రం 'స్పై'. చిత్రం పాన్ ఇండియా మూవీగా విడుదల కానుంది. నిఖిల్ నటించిన చిత్రం యొక్క ట్రైలర్ (Spy movie trailer) నేడు విడుదలయింది. విమాన ప్రమాదంలో మరణించాడని భావిస్తున్న సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ ఆధారంగా చిత్రాన్ని తెరకెక్కించారు. ‘ఓరి దేవుడా’, ‘ఎవరు’, ‘హిట్’, ‘గూఢచారి’, వంటి చిత్రాలకు ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహించిన గ్యారీ బీహెచ్ చిత్రంతో దర్శకుడిగా (Directed by Gary BH) మారాడు. ఈడీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై (ED Entertainment Banner) కె.రాజశేఖర్రెడ్డి చిత్రాన్ని నిర్మించారు. చిత్రం నెల 29 న (releasing June 29th) ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

 

రెండో ప్రపంచ యుద్ధ కాలంలో అజాద్ హింద్ ఫౌజ్ (Azad Hind Fauz) ను స్థాపించిన నేతాజీ సుభాష్ చంద్ర బోస్ (Subhash Chandra Bose) దీని ద్వారా లక్షలాది మందిని సైనికులుగా తయారు చేసారు. వీరిలో స్వాతంత్య్ర సమర స్ఫూర్థిని నింపిన బోస్ 1945 లో జరిగిన యుద్ధం సమయంలో విమాన ప్రమాదానికి గురైన తరువాత ఆయన గురించిన జాడ తెలియలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ సుభాష్ చంద్ర బోస్ బ్రతికున్నారా? లేదా? అనే ఆచూకీ తెలియలేదు. ఇప్పటికీ అయన అది మిస్టరీగానే (Death mystery) మిగిలింది. దీని ఆధారంగా కథను తయారు చేసి తెరకెక్కించారు. పలు సూపర్ హిట్ చిత్రాలకు ఎడిటర్ గా పనిచేసిన గ్యారీ బీహెచ్ తొలిసారి చిత్రంతో దర్శకుని అవతారం ఎత్తాడు. నేడు విడుదల చేసిన 'స్పై' థియేట్రికల్ ట్రైలర్ ('Spy' Theatrical Trailer) లోని సన్నివేశాల ఎంతో ఉత్కంఠభరితంగా రోమాలు నిక్కబొడిచేలా (goosebumps) ఉన్నాయి.

 

చరిత్ర మనకు ఎప్పుడూ నిజం చెప్పదు... దాస్తుంది. దానికి సమాధానం మనమే వెతకాలిఅనే డైలాగ్తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. ఉగ్రవాద నాయకుడు ఖాదిర్ పాయింట్ గా చేసుకుని కథ నడుస్తుందని ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. అయితే దీంతో నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణ రహస్యానికి సంబంధం ఏమిటనేది ఆసక్తి రేకెత్తిస్తుంది. ట్రైలర్లో ఒకప్పుడు హీరోగా పలు చిత్రాల్లో నటించిన ఆర్యన్ రాజేష్ హీరో నిఖిల్ సిద్దార్థ్ కి అన్నయ్యగా నటించాడు. నిఖిల్ చిత్రంలో 'రా' ఏజెంట్ పాత్రలో (role of 'Raw' agent) నటించాడు. తన అన్నయ్య మరణం వెనకున్న రహస్యాన్ని కూడా ఛేదించాలని నిర్ణయించుకుంటాడు. మొత్తానికి సినిమాలో యాక్షన్ సన్నివేశాలు, డైలాగులతో ట్రైలర్ గూస్ బంప్స్ తెప్పించింది. ఆఖర్లో ఆఖర్లో దగ్గుబాటి రానా ఫైటర్ జెట్ పైలట్గా (Rana as a fighter jet pilot) కనిపించాడు. రానా క్యారెక్టర్నుస్వాతంత్య్రం అంటే ఒకరు ఇచ్చేది కాదు... లాక్కునేది... ఇది నేను చెప్పింది కాదు, నేతాజీ చెప్పిందిఅనే డైలాగ్ తో పరిచయం చేసారు. సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా కంపోజ్ చేసాడు.

 

నటీ నటులు...

నిఖిల్ హీరోగా నటిస్తున్న చిత్రంలో ఐశ్వర్య మీనన్, సన్యా ఠాకూర్, అభినవ్ గోమటం, మకరంద్ దేశ్పాండే, జిషు సేన్ గుప్తా, నితిన్ మెహతా, రవివర్మ, కృష్ణ తేజ, ప్రిషా సింగ్, సోనియా నరేష్ తదితరులు నటిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్లుగా వంశీ పచ్చిపులుసు, మార్క్ డేవిడ్ పనిచేశారు. విదేశాల్లో జరిపిన షూటింగ్ సన్నివేశాలకు సినిమాటోగ్రఫీని జూలియన్ అమర్ ఎస్ట్రాడా DFP, కైకో నకహరా అందించారు. చిత్రంలోని పాటలను శ్రీచరణ్ పాకాల, విశాల్ చంద్రశేఖర్ కంపోజ్ చేసారు. చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్ గా అర్జున్ సూరిశెట్టి పని చేసారు. ఎడిటర్ బాధ్యతలను చిత్ర దర్శకుడు గ్యారీ బీహెచ్ నిర్వహించారు. తెలుగుతో పాటుగా హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో చిత్రం నెల 29 తేదీన విడుదల కానుంది.