ఏజెంట్ చిత్రం విశేషాలు : Agent Movie Updates

1995లో విడుదలైన సిసింద్రీ చిత్రంలో తన చిన్నారి నటనతో ఆకట్టుకుని పెద్దయ్యాక హలో, మిస్టర్ మజ్ను వంటి చిత్రాలతో హిట్ అందుకున్నాడు అఖిల్. ఇప్పుడు యాక్షన్ థ్రిలర్ తో "ఏజెంట్"గా రానున్నాడు

ఏజెంట్ చిత్రం విశేషాలు : Agent Movie Updates

ఏజెంట్ చిత్రం విశేషాలు : Agent Movie Features

1995లో విడుదలైన సిసింద్రీ చిత్రంలో తన చిన్నారి నటనతో ఆకట్టుకుని పెద్దయ్యాక హలో, మిస్టర్ మజ్ను వంటి చిత్రాలతో హిట్ అందుకున్నాడు అఖిల్. ఇప్పుడు యాక్షన్ థ్రిలర్ తో "ఏజెంట్"గా రానున్నాడు.

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అనిల్ సుంకర నిర్మాతగా, హిప్ హాప్ తమిజా మ్యూజిక్, వక్కంతం వంశీ కథను అందించిన "ఏజెంట్" చిత్రం వచ్చే ఏడాది వేసవికి విడుదల కానుంది. అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్ హీరోగా నటిస్తున్న యాక్షన్ రొమాంటిక్ అల్ట్రా-స్టైలిష్ చిత్రం కోసం ప్రేక్షకులు, అఖిల్ అభిమానులు ఎంతో ఉత్సుకతతో ఎదురు చూస్తున్నారు. అఖిల్ కు జోడీగా హీరోయిన్ సాక్షి వైద్య నటిస్తోంది. మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తున్నారు.

 

ఇప్పటివరకు లవర్ బాయ్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న అఖిల్ పోరాట సన్నివేశాలు, తనకే సాధ్యమైన రొమాంటిక్ యాక్షన్ తో ప్రేక్షకులను అలరించనున్నాడు. ఏడాది ఆగష్టు లోనూ, అనంతరం జనవరిలో సినిమాను విడుదల చేయాలని అనుకున్నా, పలు కారణాలతో 2023 అక్టోబర్ లో సినిమాను విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయించింది. షూటింగ్ పూర్తి కాకపోవడమే ఆలస్యానికి కారణంగా చిత్రం యూనిట్ తెలిపింది.

 

మమ్ముట్టి గ్రేట్ ఆర్టిస్ట్ : Mammootty is the Great Artist

వృత్తి పట్ల అంకితభావం, నిబద్ధత కలిగిన మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి సినిమాలో నటిస్తారో లేదో అని తొలుత కొన్ని సందేహాలు వెలువడ్డాయి. అయితే కెలక పాత్రలో నటించేందుకు ఆయన ఒప్పుకోవడంతో సినిమా విజయంపై అంచనాలు మరింత బలపడ్డాయి. ఆయన తన ట్విట్టర్ లో ఒక ఫోటోను షేర్ చేశారు. అది ఎంతో వైరల్ అయ్యింది. పోస్టర్ లో మమ్ముట్టి తన ప్రత్యర్థిపై దాడి చేయడానికి తుపాకీని పట్టుకున్నట్లు చూడవచ్చు.

ముదురు రంగు యూనిఫాం, మ్యాచింగ్ క్యాప్ ధరించిన మమ్ముట్టి ఎప్పటిలాగే డాషింగ్గా కనిపిస్తున్నాడు. పోస్టర్లోని క్యాప్షన్ ద్వారా సినిమాలో ఆయన పాత్ర ఏంటనేది తెలుసుతుంది. "ది డెవిల్ జాలి లేని  రక్షకుడు" అని  రాసి ఉంది. మలయాళం ఆక్టర్ అయినప్పటికీ ఆయన నటించిన ఎన్నో చిత్రాలు తెలుగు ప్రేక్షకులను అలరించాయి. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్రను చిత్రంగా తీసిన సినిమాలో ఆయన పోషించిన టైటిల్ పాత్ర అందరి హృదయాలను కట్టిపడేసింది. దళపతి, గాడ్ ఫాదర్, వీరసింహం, అంకుల్, వాసుకి వంటి చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

 

బాల్యం నుంచే  నటన : Childhood onwards Acting

 ప్రముఖ హీరో అక్కినేని నాగార్జున, ఒకప్పటి స్టార్ హీరోయిన్ అమల దంపతులకు పుట్టిన వాడే అఖిల్. 1994 ఏప్రిల్ 8 కాలిఫోర్నియా లోని సాన్ జోస్ లో జన్మించాడు. సిసింద్రీ సినిమాలో నటించినప్పటి అఖిల్ సంవత్సరం వయసున్న బాలుడు. ఆంగ్ల హాస్య చిత్రం అయిన "బేబీస్ డే అవుట్" ఆధారంగా సినిమాను నిర్మించారు. అనంతరం ఎటువంటి సినిమాల జోలికి పోకుండా చదువుపై శ్రద్ధ పెట్టాడు. 2014లో ఆయన విక్రం కుమార్ దర్శకత్వం వహించిన మనం చిత్రంలో చివరి సన్నివేశంలో కనిపించాడు.

 

2015లో వీవీ వినాయక్ దర్శకత్వంలో విడుదలైన అఖిల్ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అనంతరం హలో, మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాల్లో హీరోగా నటించాడు. ఇప్పుడు ఏజెంట్ గా అభిమానులను అలరించేందుకు స్పై థ్రిల్లర్ పాత్రలో రానున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్ ఎంతగానో ఆకట్టుకుంది. అఖిల్ గెటప్, డైలాగులు, ఆక్షన్ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. హాలీవుడ్ స్టార్ ఆర్నాల్డ్ ను మరిపిస్తున్నట్లు అభిమానులు మురిసిపోతున్నారు.

ఏజెంట్ అఖిల్ డెత్ నోట్ : Agent Akhil Death Note

ఏజెంట్ సినిమాలో అఖిల్ ఒక పవర్ఫుల్ పాత్రలో నటించనున్నట్లు విధుల చేసిన టీజర్ ద్వారా అర్ధమవుతోంది. అఖిల్ పాత్రను తీర్చిదిద్దిన విధానం, గెటప్ ఎంతగానో ఆకట్టుకుంటోంది. మమ్ముట్టి చెప్పే డైలాగులు ఏజెంట్ అఖిల్ పాత్ర ఎలా ఉండబోతోందో చెబుతున్నాయి. ఏజెంట్ చాల భయంకరమైన వాడని, తన డెత్ నోట్ పేపర్లు కూడా ముందుగానే సిద్ధం చేసుకున్నట్లు మమ్ముట్టి చెప్పే విధానం ఎంతో ఆసక్తికరం గా ఉంది. ప్రత్యర్థులపై గన్ ఫైరింగ్ ఎంతో ఉత్కంఠతను కలిగిస్తుంది. కొన్ని చోట్ల హీరోయిన్ అఖిల్ ని వైల్డ్ సేల్ అని పిలవడం నవ్వు తెప్పిస్తుంది.

కోవిడ్ కారణంగా సినిమా వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు 2023 వేసవిలో చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో చిత్రం విడుదల కానుంది.

ఏజెంట్ చిత్రం లేటెస్ట్ అప్‌డేట్స్  : Agent Movie Latest Updates 

అక్కినేని నాగార్జున తనయుడు, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అఖిల్ తాజా చిత్రం ‘ఏజెంట్’. స్టైలిష్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై ఎ.రామ‌బ్ర‌హ్మం సుంక‌ర నిర్మాత‌గా అనిల్ సుంక‌ర నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్‌ తేదీలు చాలాసార్లు వాయిదాలు మీద వాయిదాలు ప‌డుతూ వ‌చ్చింది. చివరికి ఈ స్పై థ్రిల్ల‌ర్ ఏజెంట్ (అఖిల్ అక్కినేని ) చిత్రాన్ని ఏప్రిల్ 28న తెలుగు, మ‌ల‌యాళం, హిందీ, త‌మిళ భాషల్లో విడుద‌ల చేస్తున్నట్లు నిర్మాత‌లు ప్రకటించారు. అదేవిధంగా దీనికి సంబంధించిన పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్ లో అఖిల్ ముఖమంతా రక్తంతో తడిసి ఉంటుంది. త‌న లుక్ అద్భుతంగా ఉంది. చిత్రం రిలీజ్ డేట్ ప్రకటించడంతో అఖిల్ ఫ్యాన్స్ ఖుషీ ఖుషీగా ఉన్నారు.