2023 లో విడుదల కానున్న తెలుగు చిత్రాలు : Ready to Release Movies in 2023

యావత్ ప్రపంచ దృష్టిని తన వైపుకు తిప్పుకున్న తెలుగు సినీ పరిశ్రమ టాలీవుడ్. పాన్ ఇండియా సూపర్ స్టార్స్ గా వెలుగుతూ విదేశాల్లో సైతం తమ చిత్రాలను ఆదరించేలా తమ నటనా కౌశలాన్ని ప్రదర్శిస్తున్నారు మన హీరోలు.

2023 లో విడుదల కానున్న తెలుగు చిత్రాలు : Ready to Release Movies in 2023

2023 లో విడుదల కానున్న తెలుగు చిత్రాలు : Ready to Release Movies in 2023

యావత్ ప్రపంచ దృష్టిని తన వైపుకు తిప్పుకున్న తెలుగు సినీ పరిశ్రమ టాలీవుడ్. పాన్ ఇండియా సూపర్ స్టార్స్ గా వెలుగుతూ విదేశాల్లో సైతం తమ చిత్రాలను ఆదరించేలా తమ నటనా కౌశలాన్ని  ప్రదర్శిస్తున్నారు మన హీరోలు.

 

సంక్రాంతికి సినిమాల పండుగ : Sankranti Festival Movies

 సంక్రాతి పండుగ అంటే తెలుగువారికి ఎంతో ముఖ్యమైనది. రంగురంగుల హరివిల్లులు, గొబ్బెమ్మలు, భోగి మంటలు, రకరకాల పిండి వంటలు... కోడి పందేలు ఇలా అందరూ ఎంతో ఆనందిస్తూ పండుగను ఆస్వాదిస్తారు. పండుగలో అందరికీ మరింత వినోదాన్ని అందించేందుకు... బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు, సినిమా పరిశ్రమకు చెందిన పెద్ద హీరోల నుంచి చిన్న హీరోల వరకు తమ సినిమాలను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. తెలుగుతో పాటు రెండు తమిళ చిత్రాలు కూడా విడుదల కానున్నాయి.

 

ఇప్పటికే భారీ ప్రాజెక్టులు దాదాపు పూర్తి కావొచ్చాయి. ఇందులో మెగాస్టార్ చిరంజీవి టైటిల్రోల్చేస్తున్న వాల్తేరు వీరయ్య, నందమూరి బాలకృష్ణ నటిస్తోన్న వీరసింహారెడ్డి, తమిళ చిత్రాలు వారిసు , తునివు సంక్రాంతి రేసులో ఉన్నాయి. ఇవే కాకుండా రామ్ చరణ్, జూ.ఎన్టీఆర్ వంటి యంగ్ స్టార్స్ చిత్రాలు కూడా రేసులో వున్నాయి. కోట్లాది రూపాయలు వ్యయం చేసి నిర్మిస్తున్న చిత్రాల వివరాలను పరిశీలిస్తే ...

 

"ఆదిపురుష్"లో రాముని పాత్రలో ప్రభాస్

బాహుబలి రెండు భాగాలతో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అందులో నటించిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ లో నటిస్తున్నారు. 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రానికి సంబంధించిన పోస్టర్ ను ఏడాది మహా శివరాత్రి రోజున విడుదల చేసారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది.

 

సినిమాను టీ-సిరీస్ఫిల్మ్స్నిర్మిస్తోంది. ప్రభాస్ ఏడాది నటించిన రాధేశ్యామ్, ఆదిపురుష్ రెండు సినిమాలకు 300 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా సినిమాను ముందుగా 2023 జనవరి 12 సంక్రాంతి కానుకగా విడుదల కానున్నట్లు మహాశివరాత్రి రోజు పోస్టర్ విడుదల చేశారు దర్శక నిర్మాతలు. అయితే మళ్ళీ దీనిని జూన్ 16 కి వాయిదా వేశారు. సినిమాలో రాముడిగా ప్రభాస్.. సీతగా కృతి సనన్.. లక్ష్మణుడిగా సన్నీ సింగ్ నటిస్తున్నారు. రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారు.

 

రాజకీయ నాయకుడిగా... కలెక్టర్ గా రామ్ చరణ్

ప్రభాస్కు పోటీగా మరో రెండు పాన్ ఇండియా సినిమాలు కూడా బరిలోకి రానున్నాయి. రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కూడా 2023 సంక్రనీతి విడుదల కానుంది. 250 కోట్ల రూపాయల బడ్జెట్తో దిల్ రాజు సినిమాను నిర్మిస్తున్నాడు. రాజకీయ నేపథ్యంలో సాగే సినిమాలో చరణ్ రాజకీయ నాయకుడిగానే కాకుండా ... కలెక్టర్ పాత్రలో నటిస్తున్నాడు. ఒకే ఒక్కడు సినిమా సీక్వెల్ మాదిరిగా ఇది ఉండనుందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. కియారా అద్వానీ సినిమాలో హీరోయిన్గా నటిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నాడు.

 

ఆర్ఆర్ఆర్ మూవీతో ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది హృదయాలను గెలుచుకున్న రామ్ చరణ్ మూవీ కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మెగా స్టార్ చిరంజీవి పుత్రునిగా సినీ రంగ ప్రవేశం చేసిన చరణ్ అనతి కాలంలోనే కోట్లాది మంది ఫ్యాన్స్ అభిమానం పొందాడు. మగధీరతో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు పొందాడు. రామ్ చరణ్ ఏడాది తాను నటించిన ఆచార్య, ఆర్ఆర్ఆర్ సినిమాలకు 120 నుంచి 150 కోట్లు తీసుకున్నట్లు టాక్.

 

స్టూడెంట్ లీడర్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్

ఆర్ఆర్ఆర్ మూవీ సూపర్ డూపర్ హిట్ తో ఎన్టీఆర్ కూడా రాబోయే తన సినిమాను ప్రతిష్టంగా భావించి రెగ్యులర్ షూటింగ్ ని కొనసాగిస్తున్నాడు. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో సినిమా రూపుదిద్దుకుంటోంది. సినిమా రాజకీయా నేపథ్యంలో ఉండనున్నట్లు తెలుస్తోంది. సినిమాలో ఎన్టీఆర్ స్టూడెంట్ లీడర్ గా నటిస్తున్నాడు. గతంలో నాగ సినిమాలో రాజకీయ నేపథ్యంలో ఉన్న పాత్ర పోషించాడు. అనంతరం మళ్ళీ ఇప్పుడు నటిస్తున్నాడు. కొసరాజు హరికృష్ణ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కాగా, మిక్కిలినేని సుధాకర్, నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మాతలుగా వ్యవహరించారు.

 

ఎన్టీఆర్ మనవడిగా సినీ రంగ ప్రవేశం చేసిన జూనియర్ ఎన్టీఆర్ చిన్న వయసునుండే సినిమాల్లో నటించడం మొదలు పెట్టాడు. దమ్ము, ఆంధ్రావాలా, జనతా గ్యారేజ్, నాన్నకు ప్రేమతో, అరవింద సమేత వంటి హిట్ చిత్రాల్లో నటించాడు. ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్, ప్రస్తుతం నటిస్తున్న చిత్రాలకు 100 నుంచి 120 కోట్లు తీసుకున్నట్లు టాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.

 

"వాల్తేరు వీరయ్య"గా చిరంజీవి

రాబోయే సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద విడుదల కానున్న మరో పెద్దా చిత్రం  మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న "వాల్తేరు వీరయ్య". ఈపాటికే విడుదలైన పాటాలు అభిమానులను అలరిస్తున్నాయి. మెగా స్టార్ గా టాలీవుడ్ లో చిరంజీవికి ఉన్న క్రేజ్ ఏంటో చెప్పనక్కర్లేదు. అప్పట్లో ఆయన సినిమాల్లో చేసిన బ్రేక్ డాన్స్, డిస్కో డాన్స్ కి ఫ్యాన్స్ కేరింతలు కొట్టేవారు. అప్పటి బ్లాక్ బస్టర్ మూవీ ఖైదీ సినిమాతో ఆయన మెగా స్టార్ గా మారారు. శృతి హాసన్ హీరోయిన్. రవితేజ కీలక పాత్రలో నటిస్తున్నారు. కేఎస్ రవీంద్ర దర్శకుడు కాగా, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

 

1978లో పునాదిరాళ్ళు సినిమాతో తన సినీ నటనా జీవితాన్ని ప్రారంభించారు. అయితే దానికంటే ముందే ప్రాణం ఖరీదు విడుదల అయింది. స్వయంకృషి, ఘరానా మొగుడు, రౌడీ అల్లుడు, గ్యాంగ్ లీడర్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించారు. 2008లో రాజకీయా రంగప్రవేశం చేసారు. ప్రజారాజ్యం పార్టీని స్థాపించి 2009 ఎన్నికల్లో పోటీ చేసారు. 294 స్థానాల్లో పోటీ చేసిన పార్టీ అభ్యర్థులు 18 స్థానాల్లో గెలుపొందారు. ప్రసిద్ధ హీరో రామ్ చరణ్ కు చిరంజీవి తండ్రి. ఆచార్య, గాడ్ ఫాదర్, వాల్తేర్ వీరయ్య సినిమాలకు 80 నుంచి 100 కోట్లు రెమ్యూనరేషన్.

మరోసారి రాయలసీమ నేపథ్యంలో బాలకృష్ణ

సుప్రసిద్ధ హీరో బాలకృష్ణ నటిషున్న మరో సీమ పౌరుష కథా చితం "వీర సింహా రెడ్డి". సినిమాలో బాలకృష్ణ డ్యూయల్ రోల్ పోషిస్తుండడంతో ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతతో సినిమా విడుదల కోసం చూస్తున్నారు. ఒక పాత్ర విలేజ్ బ్యాక్డ్రాప్ క్యారెక్టర్ వీరసింహారెడ్డి, మరొకటి యుఎస్-రిటర్న్ రోల్ అయిన బాల సింహారెడ్డి. సాప్ట్ వేర్ నుంచి వచ్చిన వాడు ఫ్యాక్షన్ రాజకీయాల్లోకి వస్తే ఏం చేస్తాడులే అని లైట్ తీసుకున్న వాళ్లకు ఎలా బుద్ది చెప్పాడు అనేది మెయిన్ పాయింట్ అంటున్నారు.

 

యాక్షన్ డ్రామా సినిమాలో బాలయ్య సరసన శృతి హాసన్ జోడిగా నటిస్తోంది. థమన్ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా గోపీచంద్ మలినేని యాక్షన్ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కిస్తున్నారు. సినిమాలో వరలక్ష్మి శరత్కుమార్, దునియా విజయ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. బాలకృష్ణ 40 నుంచి 50 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.

 

https://www.youtube.com/watch?v=LMLhrj5GWuA

సీమ పౌరుషం, రాజసం తన నటనలో చూపాలంటే అది ఒక్క బాలకృష్ణకు సాధ్యం అన్నంతలా నటిస్తారు నందమూరి బాలకృష్ణ. ఒకప్పటి స్టార్ హీరో, ముఖ్యమంత్రిగా పనిచేసిన స్వర్గీయ ఎన్టీఆర్ కుమారుడే బాలకృష్ణ. మంగమ్మ గారి మనవడు, అపూర్వ సహోదరులు, అశ్వమేధం, ముద్దుల మావయ్య, సమరసింహా రెడ్డి, నరసింహ నాయుడు వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించారు.

 

కోలీవుడ్ స్టార్ విజయ్

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన "వారసుడు" చిత్రాన్ని 2023 సంక్రాంతి బరిలో నిలుపుతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఇటీవల ఒక తెలుగు సినిమాలో నటించేందుకు ఆయన 100 కోట్ల రెమ్యూనరేషన్ అడిగినట్లు వార్తలు వచ్చాయి. విజయ్ కి తమిళ్ తో పాటు తెలుగులో కూడా ఆయన చిత్రాలకు డిమాండ్ ఉంది. ఆయన నటించిన చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. రాజు, శిరీష్, పెరల్ వి  పొట్లూరి, పరం వి పొట్లూరి నిర్మాతలుగా వ్యవహరించారు. స్వయంకృషితో ఎవరి అండా లేకుండా స్టార్ హీరోగా ఎదిగిన విజయ్ చిత్రం కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

 

తమిళ్ స్టార్ అజిత్ కుమార్

అలానే మరో తమిళ అగ్ర హీరో అజిత్ కుమార్ నటిస్తున్న "తునివు" సినిమాని కూడా పండుగకే రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అజిత్ సినిమాలకు తెలుగులో ఎంతో క్రేజ్ ఉంది. వాలి వంటి చిత్రంతో తెలుగు వారి మనస్సులో నిలిచాడు. వినోద్ చిత్రాన్ని డైరెక్ట్ చేసారు. బోనీ కపూర్ నిర్మాతగా వ్యవహరించారు. అజిత్ సరసన మంజు వారియర్ హీరోయిన్ గా నటిస్తోంది.

 

అజిత్ నటించిన ఎన్నో చిత్రాలు తెలుగులోకి విడుదలయ్యాయి. ప్రియురాలు పిలిచింది, డేవిడ్ బిళ్ళ, ఆరంభం, ఆవేశం, వివేకం వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. 100 కోట్లకు పైగా సినిమాకు డిమాండ్ చేస్తున్నట్లు భోగట్టా.

 

రాహుల్ విజయ్

జనవరి 14 సంక్రాంతికి విడుదల కానున్న మరో చిత్రం రాహుల్విజయ్‌, శివానీ రాజశేఖర్ప్రధాన పాత్రల్లో నటిస్తున్న విద్యా వాసుల అహం. ఇప్పటికే విడుదలైన చిత్రం కూల్పోస్టర్ఫీమేల్ లీడ్ క్యారెక్టర్మేల్ క్యారెక్టర్పై ఎలా ఆధిపత్యం చెలాయిస్తుందో చెబుతూ.. సినిమాపై ప్రేక్షకుల్లో ఎంతో  క్యూరియాసిటీని పెంచుతోంది. తెల్లవారితే గురువారం సినిమా ఫేం మణికాంత్గిల్ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు.

 

ఎటర్నిటీ ఎంటర్టైన్మెంట్బ్యానర్పై లక్ష్మి నవ్య మక్కపాటి-రంజిత్కుమార్కొడాలి సంయుక్తంగా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కల్యాణి మాలిక్ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి జనవరి 12 విడుదలవుతుండగా.. వాల్తేరు వీరయ్య జనవరి 13 విడుదల కానుంది రెండు భారీ చిత్రాలతో పోటీగా జనవరి 14 విడుదల చేస్తున్నట్లు చిత్ర నిర్మాతలు ప్రకటించారు.

 

బడా హీరోల సినిమాలతో పాటు చిన్న హీరోల సినిమాలు కూడా రిలీజ్ కానున్నాయి. ప్రేక్షకులను అలరించేందుకు ఎన్ని చిత్రాలు విడుదలైనా అవి విజయం సాధిస్తాయా లేక నిరాశ పరుస్తాయి అంటే.. దానికోసం సంక్రాంతి వరకు వేచి చూడక తప్పదు.