'రావణాసుర' మూవీ రివ్యూ : Ravanasura review

ధమాకా (Dhamaka), 'వాల్తేరు వీరయ్య' (Waltair Veerayya) వంటి హిట్ సినిమాల తర్వాత రవితేజ (Raviteja) నటించి, నిర్మించిన చిత్రం 'రావణాసుర’ (Ravanasura). గత సినిమాల సక్సెస్ తో మంచి ఊపు మీదున్న రవితేజ ఈ చిత్రంలో నెగెటివ్ షేడ్స్ (negative shades role) ఉన్న పాత్రలో నటించారని టీజర్ చూస్తే తెలుస్తుంది.

'రావణాసుర' మూవీ రివ్యూ : Ravanasura review

'రావణాసుర' మూవీ రివ్యూ : Ravanasura review

ధమాకా (Dhamaka), 'వాల్తేరు వీరయ్య' (Waltair Veerayya) వంటి హిట్ సినిమాల తర్వాత రవితేజ (Raviteja) నటించి, నిర్మించిన చిత్రం 'రావణాసుర’ (Ravanasura). గత సినిమాల సక్సెస్ తో మంచి ఊపు మీదున్న రవితేజ చిత్రంలో నెగెటివ్ షేడ్స్ (negative shades role) ఉన్న పాత్రలో నటించారని టీజర్ చూస్తే తెలుస్తుంది. దీంతో రవితేజ ఫ్యాన్స్ (Raviteja fans) తో పాటు, అందరిలోనూ ఎంతో ఆసక్తిని సినిమా కలిగించింది. మరి ఇన్ని అంచనాల మధ్య విడుదలైన 'రావణాసుర' మూవీ ఎలా ఉందో చూద్దాం.

 

విశ్లేషణ (Ravanasura Movie Analysys) : కథను సింపుల్ గా రెండు పాయింట్లలో (story in 2 lines) చెప్పాలంటే ... నగరంలో కొన్ని వరుస హత్యలు (murders in city) జరుగుతాయి. హత్యలను ఎవరు చేశారు? ఎందుకు చేశారు? అనేది క్లుప్తంగా సినిమా. మూవీ ట్రైలర్ లో ఒక డైలాగ్ ఉంటుంది... 'వాడు క్రిమినల్ లాయర్ కాదు... లా చదివిన క్రిమినల్' ('He is not a criminal lawyer... a criminal who studied law') - ఒక్క డైలాగులోనే మొత్తం కథ ఉంది. ఇక కథలోకి వెళితే...

 

రావణాసుర కథ : Ravanasura Story

క్రిమినల్ లాయర్ (criminal lawyer) కనక మహాలక్ష్మి (ఫరియా అబ్దుల్లా) దగ్గర రవీంద్ర (రవితేజ, Raviteja) జూనియర్ లాయర్ (Jr.Lawyer) గా పని చేస్తుంటాడు. ఆయన దగ్గరకు పెద్ద ఫార్మా కంపెనీకి సీఈవో (Pharma company CEO) అయిన హారిక (మేఘా ఆకాష్) వచ్చి తన తండ్రి కేసును టేకప్ చేయమని అడుగుతుంది. అయితే కేసు వాదించేందుకు ససేమిరా అంటుంది. హారిక అందానికి పడిపోయిన రవీంద్ర కేసును ఎలాగైనా వాదించేలా ఒప్పిస్తానని హరికకు మాటిస్తాడు. ఒక రిసార్టులో వ్యక్తిని ఆమె తండ్రి మర్డర్ (Father murdered) చేసిన దానికి సంబంధించి వీడియోలతో సహా సాక్ష్యాలు (video evidence) ఉంటాయి. తాను మర్డర్ చేయలేదని, దానికి నాకు సంబంధము లేదని, అసలు మర్డర్ జరిగిన రాత్రి తనకు ఏం జరిగిందో గుర్తు లేదని హారిక తండ్రి (సంపత్ రాజ్) చెబుతాడు. నగరంలో ఇటువంటి మర్డర్స్ (more murders) కొన్ని జరుగుతాయి. సిటీ కమిషనర్ కూడా హత్యకు గురి అవుతాడు. హారికను కూడా రేప్ చేసి హత్య చేస్తారు. వరుస హత్యలు చేస్తున్నది ఎవరు? దీని వెనుక ఉన్నది ఎవరు? పోలీసులు (Police) సాకేత్ (సుశాంత్, Sushant Akkineni) దగ్గరకు ఎందుకు వెళతారు? అసలు సాకేత్ ఎవరు? రెండు నెలల్లో రిటైర్ కానున్న ఏసీపీ హనుమంతురావు (జయరామ్) కేసును పరిశోధన చేసినప్పుడు ఆయనకు ఏం తెలిసింది? ఇవన్నీ తెలియాలంటే సినిమాను చూడవలసిందే.

సినిమా ప్రారంభం నుంచి మంచి ఆసక్తిగా (interest) ఉంటుంది. కామెడీ సీన్లు (comedy scenes) కూడా ఫరవాలేదనిపిస్తాయి. అయితే వరుసగా జరుగుతున్నా హత్యలు ఎవరు చేస్తున్నారు... అనేది తెలిసిన తరువాత దర్శకుడు (Director) కొన్ని సీన్లను చక్కగా పండేలా తీసాడు. అయితే కథ, కథనం (story, screenplay) చాలా రొటీన్ గా ఉన్నప్పటికీ రవితేజ తనదైన మార్క్ తో సరికొత్త యాంగిల్ లో డిఫరెంట్ గా నటించాడు (different acting).

 

సినిమాలో థీమ్ సాంగ్ (theme song), దానిని చిత్రికరించిన (picturize) విధానం బావుంది. మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో (music director Bheems Ceciroleo) అందించిన సంగీతం, పాటలు బావున్నాయి. ముఖ్యంగా 'డిక్కా డిష్యూం' ఇప్పటికే ఎంతో హిట్ అయ్యింది. హర్షవర్ధన్ రామేశ్వర్ చక్కటి నేపథ్య సంగీతం అందించారు. రీరికార్డింగ్ అద్భుతంగా ఉందిసినిమాటోగ్రఫీ,. ప్రొడక్షన్ వాల్యూస్ (production values) బాగున్నాయి.  

 

సినిమాలో రవితేజ తనదైన మార్క్ కామెడీతో పాటు, డ్యాన్స్ (Raviteja comedy, dance) ఇరగదీసాడు. అంటే కాకుండా మొదటిసారి విలనిజం ఉన్న షేడ్స్ తో అభిమానులను ఎంతగానో అలరించాడు. సుశాంత్ (Akkineni Sushant) పాత్ర నిడివి పెంచితే బాగుండేది. కొన్ని సీన్లలో 'హైపర్' ఆది (Hyper Aadi), ఫరియా అబ్దుల్లా రవితేజతో కలిసి కొన్ని సీన్లలో బాగా నటించారు. ఇంకా చిత్రంలో నటించిన హీరోయిన్లు మేఘా ఆకాష్, అనూ ఇమ్మాన్యుయేల్, పూజితా పొన్నాడ, నవ్యా స్వామిల పాత్రలు కేవలం కొన్ని సీన్లకు (for some scenes) మాత్రమే పరిమితమయ్యాయి. ఏది ఏమైనా రవితేజ విభిన్నమైన పాత్రతో తన అభిమానులను అలరించారనే చెప్పవచ్చు.

నటీనటులు (Actors) : రవితేజ, సుశాంత్, జయరామ్, శ్రీరామ్, అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్ తదితరులు.

 

సినిమాటోగ్రఫీ (Cinematography) : విజయ్ కార్తీక్ కన్నన్!

కథ, మాటలు (Story, Dialogues) : శ్రీకాంత్ విస్సా

సంగీతం (Music) : హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో (డిక్కా డిష్యూం)

నిర్మాతలు (Producers) : అభిషేక్ నామా, రవితేజ

కథనం, దర్శకత్వం (Direction) : సుధీర్ వర్మ

బ్యానర్ (Banner) : అభిషేక్ పిక్చర్స్ (Abhishek pictures), RT టీమ్ వర్క్స్ (RT Team works)

విడుదల తేదీ (Release Date) : ఏప్రిల్ 7, 2023