నేడు ఐపీఎల్ లో లక్నో vs హైదరాబాద్ మ్యాచ్ : LSG vs SRH match in IPL today

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) లో నేడు 10 వ మ్యాచ్ లక్నో సూపర్ జెయింట్స్ (LSG), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్ల మధ్య జరగనుంది.

నేడు ఐపీఎల్ లో లక్నో vs హైదరాబాద్ మ్యాచ్ : LSG vs SRH match in IPL today

నేడు ఐపీఎల్ లో లక్నో vs హైదరాబాద్ మ్యాచ్ : LSG vs SRH match in IPL today

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) లో నేడు 10 మ్యాచ్ లక్నో సూపర్ జెయింట్స్ (LSG), సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్ల మధ్య జరగనుంది.

 

2023 ఐపీఎల్ లో లక్నో ప్రయాణం : 2023 IPL Lucknow journey

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) లో నేడు 10 మ్యాచ్ లక్నో సూపర్ జెయింట్స్ (LSG), సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్ల మధ్య జరగనుంది. లక్నో తాము ఆడిన మొదటి మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్పై (DC) 50 పరుగుల తేడాతో గెలిచింది. అయితే అదే జోరును తరువాతి మ్యాచ్లో కొనసాగించలేక పోయింది. తమ రెండో మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) చేతిలో ఓటమి చవిచూసింది. లక్నో టీమ్ బౌలర్లు (Lucknow bowlers) మార్క్ వుడ్, రవి బిష్ణోయ్ తమ బౌలింగ్ లో  చెరో మూడు వికెట్లు పడగొట్టారు. అయితే చెన్నై జట్టు భారీ స్కోర్ చేయకుండా ఆపలేకపోయారు. టాప్ ఆర్డర్లో (Top order) కైల్ మేయర్స్ 53 పరుగులు చేశాడు. అయితే సరైన భాగస్వామ్యాలు (no big partnerships) లేకపోవడంతో 12 పరుగుల తేడాతో ఓడిపోయింది. అయితే నేటి మ్యాచ్కి ముందుగా లక్నోకు నిజంగా ఒక శుభవార్త అందింది. లక్నో సూపర్జెయింట్స్జట్టుతో దక్షిణాఫ్రికాకు చెందిన క్వింటన్ డి కాక్ (Quinton de Kock) చేరనున్నాడు. దీంతో జట్టు మరింత పటిష్టంగా మారింది.

 

2023 ఐపీఎల్ లో హైదరాబాద్ ప్రయాణం  : 2023 IPL Hyderabad journey

ఐపీఎల్ లో ఆడిన తమ తొలి మ్యాచ్లోనే సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) ఘోర పరాజయం చెందింది. సొంత ప్రేక్షకుల మధ్య ఆడిన మ్యాచ్లో హైదరాబాద్ అన్ని విభాగాల్లోనో పూర్తిగా విఫలమయ్యింది. అయితే నేడు లక్నో సూపర్ జెయింట్స్ (LSG) టీమ్ తో జరగనున్న మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ (Aiden Markram) అందుబాటులోకి రానున్నాడు. మార్క్రమ్ పై జట్టు ఎన్నో ఆశలను పెట్టుకుంది. దీనికి తగ్గట్లుగానే మార్క్రమ్ ఇటీవల కాలంలో అన్ని ఫార్మాట్లలోనూ (form in all formats) నిలకడగా రాణిస్తున్నాడు. ఇటీవల ఐర్లాండ్ తో జరిగిన వన్డే సిరీస్ (Ireland series) మ్యాచ్లో అద్భుతమైన శతకాన్ని సాధించాడు. ఐపీఎల్ లో కూడా మెరుపులు మెరిపించాలని చూస్తున్నాడు.

హైదరాబాద్ బలాబలాలు : SRH strengths

సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ (SRH captain Aiden Markram) రాణిస్తే జట్టుకి విజయం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు. ఇంకా జట్టులోని విధ్వంసకర బ్యాట్స్మెన్లు (batsmens) రాహుల్ త్రిపాఠి, ఫిలిప్స్లపై కూడా జట్టు ఎన్నో ఆశలు పెట్టుకుంది. వీరందరూ రాణిస్తే జట్టుకు దేమ ఉంటుంది. వీరితో పాటుగా అభిషేక్, మయాంక్, బ్రూక్, సమద్, రషీద్, సుందర్ అందరూ కూడా తమవంతు పాత్రను పోషిస్తే లక్నో జట్టుకు తిప్పలు తప్పవు. సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టుకి ప్రధాన సమస్య నిలకడలేమి (stability). దీనిని అధిగమిస్తే జట్టుకి ఐపీఎల్ లో తిరుగే ఉండదని చెప్పవచ్చు.

 

లక్నో బలాబలాలు : LSG strengths

మ్యాచ్ కు ఆతిథ్యం ఇవ్వనున్న లక్నో సూపర్జెయింట్స్ (LSG) మ్యాచ్లో ఫేవరెట్గా (favorite) బరిలోకి దిగనుంది. హైదరాబాద్ జట్టుతో పోల్చితే అన్ని విభాగాల్లో లక్నో బలంగా ఉందని చెప్పవచ్చు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే బౌలర్లు, బ్యాట్స్మెన్లు (bowlers, batsmen) జట్టులో ఉన్నారు. బ్యాటింగ్ లో KL రాహుల్ తో పాటు మేయర్స్, స్టోయినిస్, కృనాల్, దీపక్, నికోలస్ పూరన్ వంటి విధ్వంసక బ్యాట్స్మెన్లు ఉన్నారు. బౌలింగ్ విభాగంలో అవేశ్ ఖాన్, కృష్ణప్ప గౌతం వంటి మ్యాచ్ ని గెలిపించే బౌలర్లు ఉన్నారు. దీంతో నేడు జరిగే మ్యాచ్ రసవత్తరంగా (exciting match) ఉంటుందని ఇరు జట్ల అభిమానులు ఆశిస్తున్నారు.

లక్నో ప్లేయింగ్  XI : LSG playing XI

KL రాహుల్, క్వింటన్ డి కాక్, దీపక్ హుడా, కృనాల్ పాండ్యా, మార్కస్ స్టోయినిస్/కైల్ మేయర్స్, నికోలస్ పూరన్, ఆయుష్ బడోని, రవి బిష్ణోయ్, మార్క్ వుడ్, జయదేవ్ ఉనద్కత్/యశ్ ఠాకూర్, అవేష్ ఖాన్.

 

లక్నో ఫుల్ స్క్వాడ్ : LSG full squad

కేఎల్ రాహుల్ (కెప్టెన్), కైల్ మేయర్స్, దీపక్ హుడా, కృనాల్ పాండ్యా, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), ఆయుష్ బడోని, మార్క్ వుడ్, జయదేవ్ ఉనద్కత్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, కృష్ణప్ప గౌతమ్, ప్రేరక్ మంకాడ్ స్వప్నిల్ సింగ్, నవీన్-ఉల్-హక్, యశ్ ఠాకూర్, డేనియల్ సామ్స్, రొమారియో షెపర్డ్, యుధ్వీర్ సింగ్ చరక్, కరణ్ శర్మ, మయాంక్ యాదవ్, అమిత్ మిశ్రా, మనన్ వోహ్రా

 

హైదరాబాద్ ప్లేయింగ్ XI : SRH playing XI

అభిషేక్ శర్మ, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రామ్, హ్యారీ బ్రూక్, గ్లెన్ ఫిలిప్స్, మార్కో జాన్సెన్/ఆదిల్ రషీద్, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, టి నటరాజన్

హైదరాబాద్ ఫుల్ స్క్వాడ్ : SRH full squad

రాహుల్ త్రిపాఠి, గ్లెన్ ఫిలిప్స్ (వికెట్ కీపర్), ఉమ్రాన్ మాలిక్, ఫజల్ హక్ ఫారూఖీ, కార్తీక్ త్యాగి, టి నటరాజన్, భువనేశ్వర్ కుమార్, అబ్దుల్ సమద్, మార్కో జాన్సెన్, అభిషేక్ శర్మ, వాషింగ్టన్ సుందర్, హ్యారీ బ్రూక్, మయాంక్ అగర్వాల్, హెన్రిచ్ క్లాసెన్, ఆదిల్ రషీద్, మయాంక్ మార్కండే, వివ్రంత్ శర్మ, సమర్థ్ వ్యాస్, సన్వీర్ సింగ్, ఉపేంద్ర యాదవ్, మయాంక్ దాగర్, నితీష్ కుమార్ రెడ్డి, అకేల్ హోసేన్, అన్మోల్ప్రీత్ సింగ్

 

నెట్ రన్ రేట్ : Net run rate 

లక్నో సూపర్ జెయింట్స్ (LSG) ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్లలో (2 matches) ఒకదానిలో గెలిచి పాయింట్ల పట్టికలో 2 పాయింట్లతో ఐదో స్థానంలో (5th place in points table) నిలిచింది. జట్టు నికర రన్ రేట్ (net run rate) 0.950 ఉన్నాయి. మరోవైపు, సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) ఇప్పటివరకు ఆడిన ఏకైక గేమ్లో ఓడిపోయింది (played and lost one match). ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నికర రన్ రేట్ (net run rate) -3.600తో చివరి స్థానంలో (last place in points table) ఉంది.

 

పిచ్ రిపోర్ట్ : Pitch report

గ్రౌండ్ లో సగటు (average) తొలి ఇన్నింగ్స్ స్కోరు (1st innings score) 160 పరుగులు.

ఛేజింగ్ లో సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్టుకి మైదానంలో (stadium) మంచి రికార్డు ఉంది. సెకండ్ బ్యాటింగ్ లో 60 శాతం (60% win in second batting) విజయాలు నమోదయ్యాయి. ఇక్కడి పిచ్ (pitch) బ్యాట్స్మెన్లకు స్వర్గధామనని చెప్పవచ్చు. దీంతో ఇక్కడ భారీ స్కోర్లు (massive scores) నమోదయ్యే అవకాశం ఉంది.

ఐపీఎల్ మ్యాచ్ నెంబర్ 10 (IPL match number 10) శుక్రవారం, ఏప్రిల్ 7 (April 7, friday)

సమయం (Time) : 7:30 PM

టీమ్స్ (teams) : లక్నో సూపర్ జెయింట్స్ (LSG), సన్రైజర్స్ హైదరాబాద్ (SRH)

ప్రత్యక్ష ప్రసారం (Live telecast) : స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్‌ (Star sports network)

మ్యచ్ లైవ్ స్ట్రీమింగ్ (match live streaming) : జియో సినిమా (Jio cinema) లో 10 విభిన్న భాషల్లో (available in 10 different languages) ఆస్వాదించవచ్చు.