స్లీప్ మోడ్‌లో మ్యాక్‌బుక్ బ్యాటరీ డ్రైన్ అయితే పరిష్కారం ఎలా? Fix It
unplug the USB devices if MacBook's Battery Draining in Sleep Mode. మీరు మ్యాక్ బుక్ లో తెరిచి ఉంచిన అన్ని యాప్‌లు (యాక్టివిటీ మానిటర్‌లో) ఉపయోగించిన మెమరీ మొత్తాన్ని
మీరు ఎప్పుడైనా మీ మ్యాక్‌బుక్, మ్యాక్‌బుక్ ప్రో లేదా మ్యాక్‌బుక్ ఎయిర్ స్లీప్ మోడ్‌లో ఉండి, బ్యాటరీ డ్రైన్ అయితే గనుక చాలా ఇబ్బంది ఎదుర్కొంటుంటారు. ఇలా అవకూడదని మీరు భావిస్తుండవచ్చు. అయితే ఇది బ్యాటరీ లోపం మాత్రం కాదని చెప్పవచ్చు. ముందుగా మీరు బ్యాటరీ యొక్క సామర్ధ్యాన్ని చూడాల్సి ఉంటుంది. ఒకవేళ బ్యాటరీ ఇంత త్వరగా ఎలా ఖాళీ అయిపోతుంది? దీనిని ఆపడం ఎలా అని ఆలోచిస్తే గనుక... మీకోసమే ఈ కథనం.
యూఎస్బీ పరికరాలను అన్‌ప్లగ్ చేయాలి : unplug the USB devices
మీ మ్యాక్ బుక్ నుండి వెళ్లే పవర్ డివైజ్ లను స్లీపింగ్ మోడ్ లో ఉన్నప్పుడు మీరు దీనిని ఉపయోగించవచ్చు. మీ మ్యాక్‌బుక్‌లో ప్లగ్ చేయబడిన మౌస్ లేదా కీబోర్డ్ కోసం USB ట్రాన్స్‌సీవర్ బ్యాటరీని ఖాళీ చేస్తుంది. దీన్ని ఆపడానికి ఏకైక మార్గం పరికరాన్ని అన్‌ప్లగ్ (unplug) చేయడమే. అనవసరమైన ప్రాసెస్ లు ఏమైనా నడుస్తున్నాయి లేదో ఒకసారి తనిఖీ చేసుకోవాలి. ఎందుకంటే ఇవి తరచుగా లాగిన్ ఐటమ్స్ ద్వారా మొదలవుతాయి. మీరు లాగిన్ అయినపుడు వాటంతట అవే ఓపెన్ అయ్యే అప్లికేషన్‌లు. ఇవి సీపీయూ (CPU), మ్యాక్ పవర్ ను అధికంగా వినియోగిస్తాయి. మ్యాక్ బుక్ బ్యాటరీ ఛార్జ్ కోల్పోవడం జరుగుతుంటే గనుక ఆ సమస్యను నివారించవచ్చు. దాని లైఫ్ ను కూడా పొడిగించవచ్చు. దీనికి క్లీన్ మై మ్యాక్ X (CleanMyMac X) అనే టూల్ ద్వారా నిర్ధారించుకోవచ్చు. ఈ యాప్ లో మీ బ్యాటరీ గురించి తెలుసుకునేందుకు సులభంగా అర్ధమయ్యే ప్రతి సమాచారం అందుబాటులో ఉంటుంది.
పవర్ నాప్ అనేది మాకోస్ (macOS) ప్రధాన లక్షణం. ఇది మీ మ్యాక్ బుక్ కొత్త ఈమెయిల్ తో పాటు క్యాలెండర్, ఐక్లౌడ్ అప్‌డేట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అయితే ఇందుకోసం ఐక్లౌడ్ కనెక్ట్ చేయాలి. దేనికోసం బ్యాటరీ పవర్ ఉపయోగించాల్సి ఉంటుంది. మీ మ్యాక్ బుక్ (MacBook) గనుక స్లీపింగ్ మోడ్ (sleeping mode) లో ఉన్నప్పుడు బ్యాటరీ డ్రెయిన్‌ను తగ్గించాలనుకుంటే మీరు తప్పనిసరిగా పవర్ నాప్‌ని ఆఫ్ చేయాలి. నిపుణులు సూచించినట్లుగా వై-ఫై (Wi-Fi), బ్లూటూత్ ని ఆఫ్ చేసి ఉంచాలి. భద్రత కోసం లొకేషన్ ను సైతం ఆఫ్ చేయాలి.
ఆపిల్ మెనూ ఓపెన్ చేసి సిస్టం సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి. కుడివైపున ఉన్న బ్యాటరీ ఆప్షన్ ను ఎంచుకోవాలి. ఎనబ్లె పవర్ నాప్ (Enable Power Nap) ను సెలెక్ట్ చేసుకోవాలి. అందులో యాప్స్, ప్రాసెస్ లు ఏమైనా ఉన్నాయా లేదా అని గుర్తించాలి. మీ మ్యాక్ బుక్ (MacBook) స్లీప్ మోడ్ లోకి వెళ్లకుండా నిరోధించే యాప్స్, ప్రెస్సెస్ ప్రాసెస్ లను గుర్తించడం మంచిది. వీటిని గనుక ఫాలో అయితే మీ మ్యాక్ బుక్ మీ బ్యాటరీ డ్రైన్ (battery draining) కాకుండా చూసుకోవచ్చు. వైరస్‌లు, ట్రోజన్‌లు, యాడ్‌వేర్, ఇతర మాల్వేర్‌లు మీ బ్యాటరీ జీవిత కాలాన్ని తగ్గించేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అందుకే దాని భద్రతా కోసం మీరు మీ మ్యాక్ బుక్ ని చెక్ చేసుకోవడం చాలామంచిది. అయితే ఇక్కడ మీరు CleanMyMac X యాప్ ను ఉపయోంచడం మీకు ఎంతగానో ఉపయోగంగా ఉంటుందని చెప్పవచ్చు. దీనిని ఉపయోగించి మాల్వేర్ కోసం మీ మ్యాక్ బుక్ ను స్కాన్ చేయడం చాలా సులభం. ఇది వివిధ రకాల మాల్వేర్‌లను గుర్తించి వాటిని వెంటనే తొలగిస్తుంది. మాల్వేర్‌ను మాన్యువల్‌గా గుర్తించడం చాలా శ్రమతో కూడుకున్నది. అంతేకాకుండా ఇది చాలా సుదీర్ఘమైన ప్రక్రియ. CleanMyMac X యాప్ మ్యాక్ సిస్టంని పూర్తిగా అంతర్గత లోతుల్లోకి వెళ్లి స్కాన్ చేస్తుంది.
మీరు మ్యాక్ బుక్ లో తెరిచి ఉంచిన అన్ని యాప్‌లు (యాక్టివిటీ మానిటర్‌లో) ఉపయోగించిన మెమరీ మొత్తాన్ని కనుగొనడం ద్వారా మీరు ఖచ్చితమైన మేల్కొనే సమయాన్ని గుర్తించవచ్చు. ఆ సంఖ్యను మీ SSD యొక్క రీడ్ స్పీడ్‌తో భాగించవచ్చు (దీనిని బ్లాక్‌మ్యాజిక్ స్పీడ్ టెస్ట్ ఉపయోగించి కొలవవచ్చు). ఆధునిక ఆపిల్ SSDల రీడ్ వేగం 2700 MB/s బాల్‌పార్క్‌లో ఉంది. అందుకే 6–8 GB డేటాను చదవడానికి దాదాపు 3 సెకన్ల సమయం పడుతుంది. మీ మ్యాక్ బుక్ బ్యాటరీని డ్రైనింగ్ నుండి కాపాడుకోవడానికి పైన సూచించిన విధానాలు పాటిస్తే మీ మ్యాక్ బుక్ బ్యాటరీ జీవిత కాలం చాన్నాళ్లపాటు ఉంటుందని చెప్పవచ్చు.
Keep yourself updated on Technology - 2023 Advance Technology