విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ : Global Investors Summit (GIS) in Visakhapatnam

విశాఖలో మార్చి 3, 4 తేదీలలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (GIS) జరగనుంది. ఈ సదస్సులో లక్షల కోట్లలో వ్యాపార ఒప్పందాలు జరుగుతాయి. ఇప్పుడు జరగబోయే ఈ సదస్సు ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్ని పెట్టుబడుల ఒప్పందాలు (Investment agreements) కుదుర్చుకుంటుంది? అందులో ఎన్ని కార్యరూపం దాల్చుతాయనే దానిపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ : Global Investors Summit (GIS) in Visakhapatnam

విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ : Global Investors Summit (GIS) in Visakhapatnam 

విశాఖలో మార్చి 3, 4 తేదీలలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (GIS) జరగనుంది. ఈ సదస్సులో లక్షల కోట్లలో వ్యాపార ఒప్పందాలు జరుగుతాయి. ఇప్పుడు జరగబోయే ఈ సదస్సు ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్ని పెట్టుబడుల ఒప్పందాలు (Investment agreements) కుదుర్చుకుంటుంది? అందులో ఎన్ని కార్యరూపం దాల్చుతాయనే దానిపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

 

హాజరుకానున్న పారిశ్రామిక దిగ్గజాలు : Industrial giants to attend 

విశాఖలో జరగనున్న సమ్మిట్‌ కు హాజరు కానున్న జాబితాలో అమెజాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జెఫ్ బెజోస్ (Amazon Executive Chairman Jeff Bezos), సామ్‌సంగ్ చైర్మన్, సీఈఓ ఓహ్-హ్యున్ క్వాన్ (Samsung Chairman and CEO Oh-Hyun Kwon), ముకేశ్ అంబానీ (Mukesh Ambani), గౌతమ్ అదానీ (Gautam Adani), ఆనంద్ మహీంద్రా (Anand Mahindra), కుమార్ మంగళం బిర్లా (KM Birla), ఆది గోద్రేజ్, రిషద్ ప్రేమ్‌జీ, ఎన్. చంద్రశేఖరన్ వంటి భారతీయ పరిశ్రమ దిగ్గజాలు (Indian industry Giants) ఉన్నారు. వీరే కాకుండా జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ (JSPL) అధినేత నవీన్ జిందాల్ (Naveen Jindal), జీఎమ్మార్ గ్రూప్ చైర్మన్ (GMR Group Chairman) గ్రంథి మల్లిఖార్జునరావు కూడా హాజరవుతున్నారు. సుమారు 25 నుంచి 40 దేశాల కు చెందిన 7,500 మంది వ్యాపార, పరిపాలన ప్రతినిధులు ఈ సమ్మిట్ కి హాజరు కానున్నారు.

కేంద్ర మంత్రులు (Central Ministers) సైతం పలువురు హాజరుకానున్నారు. వారిలో కేంద్ర ఉపరితల రవాణా శాఖా మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari), వాణిజ్య శాఖా మంత్రి పీయూష్ గోయల్ (Piyush Goyal), విద్యుత్ శాఖా మంత్రి ఆర్కే సింగ్ (RK Singh), పర్యాటక శాఖా మంత్రి కిషన్ రెడ్డి (G Kishan Reddy) ఉన్నారు. ముగింపు రోజైన 4వ తేదీన కేంద్ర పోర్టులు, షిప్పింగ్ శాఖా మంత్రి శర్బానంద సోనావాల్ (Sarbananda Sonawal), కేంద్ర నైపుణ్య అభివృద్ధి, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ (Rajeev Chandrasekhar) బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు (PV Sindhu) తదితరులు పాల్గొననున్నారు.

 

2 లక్షల కోట్లు నుంచి 10 లక్షల కోట్లు లక్ష్యం : Target is 2 lakh crore to 10 lakh

ముచ్చటగా మూడోసారి గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (GIS) విశాఖలో జరగబోతోంది.ఆంధ్ర  ప్రదేశ్ విభజన తర్వాత ఏపీకి విశాఖ ఆర్థిక రాజధానిగా (Financial capital) మారిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఏపీలో పరిశ్రమల స్థాపనకు ఉన్న అపార అవకాశాలు, అందుబాటులో ఉన్న వనరులను సదస్సుకు హాజరయ్యే సంస్థలకు వివరించి పెట్టుబడులను ఆకర్షించడమే (Attracting Investments) ముఖ్య ఉద్దేశం. దీర్ఘకాలిక అభివృద్ధికి అవకాశం ఉన్న ఏరోస్పేస్ (Aerospace), డిఫెన్స్ (Defense), అగ్రి & ఫుడ్ ప్రాసెసింగ్ (Agri & Food Processing), ఆటోమొబైల్స్, ఈవీలు, ఎలక్ట్రానిక్స్, ఐటీ (IT), హెల్త్‌కేర్, మెడికల్ ఎక్విప్‌మెంట్, లాజిస్టిక్స్ (Logistics), పెట్రోలియం (Petroleum), ఫార్మా (Pharma), టెక్స్‌టైల్స్, టూరిజం (Tourism), హాస్పిటాలిటీ (Hospitality) వంటి రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకు తగ్గట్లుగా తగిన ప్రణాళికలను ఇప్పటికే సిద్ధం చేసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రూ. 2 లక్షల కోట్ల నుంచి రూ. 10 లక్షల కోట్లు పెట్టుబడులను తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యంగా ఉంది.

మూడేళ్ళలో 60 వేలకు పెరిగిన ఎంఎస్ఎంఈలు : MSMEs increased to 60K in 3 years

ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డ్ (APEDB) వెల్లడించిన లెక్కల ప్రకారం... రాష్ట్రంలో గత మూడేళ్లలో ఎంఎస్ఎంఈ (Ministry of Micro, Small & Medium Enterprises) యూనిట్లు 37,956 నుంచి 60,800కు పెరిగాయి. 4,04,939 మందిగా ఉన్న ఉద్యోగుల సంఖ్య 5,61,235 మందికి చేరుకుంది. అలాగే గత మూడేళ్లుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో (Ease Of Doing) ఆంధ్రప్రదేశ్ నిలకడగా మొదటి స్థానంలో (AP is in 1st Place) ఉంది. ఇప్పటివరకు విడుదల చేసిన లెక్కల ప్రకారం, 2021-22లో దేశంలో అత్యధికంగా రెండంకెల స్థూల రాష్ట్ర ఉత్పత్తి వృద్ధి రేటు (GSDP) 11.43% గా ఉంది. 974 కిలో మీటర్ల పొడవైన తీరప్రాంతం కలిగి ఉన్న రాష్ట్రంగా దేశంలోనే రెండో స్థానంలో ఉంది. దేశంలో నిర్మిస్తున్న 11 పారిశ్రామిక కారిడార్లలో (Industrial Corridors) మూడింటిని ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) నిర్మిస్తున్నారు.