యూపీఐ పేమెంట్ ఫెయిల్ అయితే ఏమి చేయాలి? : What to do if UPI payment fails?
సాధారణంగా యూపీఐ పేమెంట్ చేసే సమయంలో సంబంధిత లావాదేవీలు ఫెయిల్ అవడం ప్రతి ఒక్కరూ ఎదో ఒక సమయంలో ఎదుర్కొనే ఉండుంటారు. మన దేశంలో స్మార్ట్‌ఫోన్ ఉన్న వారందరూ దాదాపు ఈ యూపీఐ చెల్లింపుల ద్వారానే లావాదేవీలను చేస్తున్నారు.
యూపీఐ పేమెంట్ ఫెయిల్ అయితే ఏమి చేయాలి? : What to do if UPI payment fails?
సాధారణంగా యూపీఐ పేమెంట్ చేసే సమయంలో సంబంధిత లావాదేవీలు ఫెయిల్ అవడం ప్రతి ఒక్కరూ ఎదో ఒక సమయంలో ఎదుర్కొనే ఉండుంటారు. మన దేశంలో స్మార్ట్‌ఫోన్ ఉన్న వారందరూ దాదాపు ఈ యూపీఐ చెల్లింపుల ద్వారానే లావాదేవీలను చేస్తున్నారు. ఈ సాంకేతికత (technology) కారణంగా మన చెల్లింపులు ఎంతో సులభతరం అయ్యాయి. ఈ యూపీఐ కారణంగానే నిత్యం మార్కెట్లోకి వెళ్లినా, షాపింగ్ చేసినా, పెట్రోల్ బంకులో ఇలా ఎక్కడికి వెళ్లినా ఆన్‌లైన్ లావాదేవీలు (online transactions) అత్యంత వేగంగా అయిపోతున్నాయి. మన దైనందిన జీవితంలో ఒక భాగంగా మారిపోయింది.
ఈ లావాదేవీల వలెనే మనం నగదును ఎక్కువగా తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా పోయింది. కేవలం ఎమర్జెన్సీ సమయంలో మాత్రమే నగదును వాడుతున్నాం. అంతలా యూపీఐ టెక్నాలజీపై ఆధారపడుతున్నాం. అయితే ఇలా లావాదేవీలు చేసేటప్పుడు కొన్ని సందర్భాల్లో పేమెంట్ ఫెయిల్ అని లేదా పేమెంట్ పెండింగ్, ప్రోసెసింగ్ లో (transaction failed, processing, pending) ఉందని చూపుతూ ఉంటుంది. ఇలాంటి సమయంలో అనేక సమస్యలను మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉదాహరణకు మనం ఏదైనా ఆర్డర్ చేసినప్పడు యూపీఐ ద్వారా లావాదేవీలు చేయాల్సిన సమయంలో అది ఫెయిలైతే చాలా సమస్యగా ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో లావాదేవీలను (transactions) ఎలా పూర్తి చేయాలి... అందుకోసం ఏయే పనులు చేయాలనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...
యూపీఐ లిమిట్ చెక్ చేయాలి : check the UPI limit
మీ బ్యాంకు అకౌంట్, లావాదేవీల గేట్ వే యూపీఐ లావాదేవీల (UPI transactions) కోసం మీరు రోజుకు ఎంత డబ్బు పంపవచ్చనే లిమిట్ గురించి ముందుగా తెలుసుకోవాలి. NPCI (National Payments Corporation of India) మార్గదర్శకాల ప్రకారం, యూపీఐ లావాదేవీలను రోజుకు గరిష్టంగా రూ.1 లక్ష మాత్రమే చేయాల్సి ఉంటుంది. కాబట్టి రోజుకు రూ.ఒక లక్ష లోపే లావాదేవీలను చేయడం మంచిది.
UPI పేమెంట్స్ ఫెయిల్ అవ్వడం లేదా లావాదేవీలు చేయలేకపోవడం అనేది తరచుగా జరుగుతుంటే దీనికి బ్యాంకు సర్వర్ రద్దీ కూడా ఒక కారణం కావొచ్చు. ఇలాంటి పరిస్థితులను నివారించడానికి యూపీఐ ఐడీకి (UPI ID) మల్టీ బ్యాంక్ అకౌంట్లను లింక్ (Link the multi bank accounts) చేయడం మంచిది. దీని వల్ల ఒక బ్యాంకు సర్వర్ డౌన్ అయినా... మరో బ్యాంక్ అకౌంట్ నుంచి ఈ లావాదేవీలను పూర్తి చేయవచ్చు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే... డబ్బు పంపించే సమయంలో బ్యాంక్ అకౌంట్ నెంబర్, IFSC కోడ్, యూపీఐ వివరాలను చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు డబ్బు పంపించేటప్పుడు ఏ ఒక్క అంకె అయినా తప్పుగా టైప్ చేసినా ఆ లావాదేవీ ఫెయిల్ (transaction will be fail) అవుతుంది. కాబట్టి ఎవరికైనా డబ్బు పంపించే టైమ్‌లో ఆ వివరాలను సరిగ్గా చెక్ చేయండి. ఫోన్, ఏటీఎం, ఇమెయిల్ వంటి వాటికి మనం పాస్‌వర్డ్ పెట్టుకుంటూ ఉంటాం. అయితే యూపీఐ పిన్‌ను (UPI Pin) మరచిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మీరు మీ యూపీఐ పిన్ నెంబర్‌ను మరచిపోతే, మీరు ‘‘UPI pin forget’’ ఆప్షన్‌ను ప్రెస్ చేసి, సీక్రెట్ పిన్‌ని (secret pin) రీసెట్ చేయొచ్చు. మీరు రెగ్యులర్‌గా మీ పిన్‌ను మరచిపోతే, దాన్ని ఎక్కడైనా పర్సనల్ బుక్‌లో రాసుకోవచ్చు. యూపీఐ పిన్ నెంబర్‌ను ఎవ్వరితోనూ షేర్ చేసుకోకుండా ఉండాలి.
ఇంటర్నెట్ కనెక్షన్ చెక్ చేసుకోండి : Check the internet connection
యూపీఐ (UPI) లావాదేవీలు ఫెయిల్ అవ్వడానికి ప్రధాన కారణాలలో నెట్‌వర్క్ సమస్య కూడా ఒకటి. మీ ఫోన్‌కు మంచి సిగ్నల్, ఇంటర్నెట్ కనెక్షన్ సరిగ్గా లేకపోతే లావాదేవీలు అనేవి సజావుగా జరగవు. నెట్‌వర్క్ సరిగా లేని సమయంలో మీకు దగ్గర్లో ఎవరిదైనా హాట్ స్పాట్ ఆన్ చేయడం వల్ల లావాదేవీలు సులభంగా చేయొచ్చు. నెట్‌వర్క్ సమస్యలు, యూపీఐ లావాదేవీలు ఫెయిల్ అవ్వడానికి ప్రధాన కారణాలు బ్యాంకు సర్వర్లు డౌన్ (bank servers down) అవ్వడం. ఇలాంటి సమయంలో వినియోగదారులకు సహాయం చేయడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) గత ఏడాది యూపీఐ లైట్‌ని (UPI lite) ప్రవేశపెట్టింది. దీని ద్వారా మీరు రూ.200 వరకు లావాదేవీలు తక్షణమే చేయవచ్చు. ఈ యాప్ ద్వారా రోజుకు రూ.2 వేల నుంచి రూ.4 వేల వరకు లావాదేవీలు జరుపుకోవచ్చు.