జూన్ 18 ఫాదర్స్ డే : June 18th is Father's Day

జూన్ 18 ఫాదర్స్ డే : June 18th is Father's Day

కంటి వెనక దాగి ఉన్న కష్టాలను దాచుకుని పైకి చిరునవ్వులు చిందిస్తూ... కుటుంబ శ్రేయస్సే ధ్యేయంగా పనిచేసే నిదర్శనమే... నాన్న... అవును... జన్మనిచ్చింది అమ్మే అయినా, పిల్లలను, తహన కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడడమే కాకుండా... వారికి మంచి చెడులను నేర్పించి, సమాజంలో ఒక స్థానంలో నిలబెట్టే వ్యక్తిగా ఆయన శ్రమను మరువలేము. తన పిల్లల సంతోషం కోసం తన కోరికలను కూడా త్యాగం చేసే మహోన్నత మూర్తి... నాన్న... 18 జూన్ 2023 ఫాదర్స్ డే (Father’s Day) సందర్భంగా వారికి వందనం.

అందరూ కూడా ఎల్లప్పుడూ జన్మనిచ్చిన తల్లి గురించే మాట్లాడతారు. నవమాసాలు (9 months) మోసి ఆమె పిల్లల్ని సాకుతుంది. అయితే ఇక్కడే తండ్రి పాత్రను తక్కువ చేయలేము. తల్లి బిడ్డల్ని 9 నెలలు మాత్రమే మోస్తుంది. అయితే అక్కడి నుండి తన బిడ్డలా బాధ్యతను తండ్రి జీవితాంతం మోస్తాడు. తన కష్టాన్ని బైట పడనీయకుండా మదిలోనే దాచుకుంటూ పిల్లల భవిష్యత్తే జీవితంగా జీవిస్తాడు. బిడ్డలా ఆనందమే తన సంతోషంగా ఆ తండ్రి భావిస్తాడు. అంతలా కష్ట పడుతూ మన బంగారు భవిష్యత్తుకి బాటలు వేసే ఆ తండ్రికి చూపించడానికి మొదలు పెట్టిందే ఈ 'ఫాదర్స్ డే' (Father’s Day). తండ్రి యొక్క ప్రాముఖ్యాన్ని చెప్పే ఈ రోజుని పతి ఏడాది జూన్ మూడవ ఆదివారం రోజున చాలా దేశాల్లో జరుపుకుంటారు. భారత దేశంలో కూడా జరుపుకోనున్నారు. అసలు ఫాదర్స్ డే ఎలా మొదలయిదో ఒకసారి చూద్దాం.

1910 వ సంవత్సరంలో అమెరికాలో సోనోరా స్మార్ట్ డాడ్ అనే మహిళ ఫాదర్స్ డే ను మొదలు పెట్టింది. తల్లి లేని సోనోరాను ఆమె తండ్రే అన్నీ తానై పెంచి పెద్ద చేసాడు. దీంతో సోనోరా తన తండ్రి తనపై చూపుతున్న నిస్వార్థమైన ప్రేమను, తన జీవితం పట్ల ఆయనకున్న  అంకితభావాన్ని చూసి, ఆయన్ని ఎలా గౌరవించాలి అని ఆలోచించింది. దీంతో సోనోరా తన తండ్రి గొప్పదనాన్ని చెబుతూ దానికి గుర్తింపు ఉండాలని కోరుతూ ప్రచారం ప్రారంభించింది. ఆమె ఆలోచనలకు గుర్తింపుగా అమెరికాలో 1910 వ సంవత్సరంలో మొట్టమొటిసారిగా ఫాదర్స్ డే జరిపారు. ఆ తరువాత 1916 లో అమెరికా అధ్యక్షుడు ఉడ్రో విల్సన్ ఫాదర్స్ డే ఆలోచనకు పచ్చ జెండా ఊపారు. 1966 లో అప్పటి అధ్యక్షుడు లిండన్ జాన్సన్ జూన్ 3 వ తేదీన ఫాదర్స్ డే కోసం అధికారికంగా ప్రకటించారు. ఆ ఏడాది నుండి క్రమం తప్పకుండా ఫాదర్స్ డే జరుపుకుంటున్నారు.

Also Read About - National Science Day 2023