హాస్యానికి మరోపేరు బ్రహ్మానందం : Brahmanandam is another name for comedy

హాస్యానికి మారుపేరుగా నిలిచిన బ్రహ్మానందం 1250 కి పైగా చిత్రాల్లో (above 1250 pictures) నటించి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ (Guinness book of records) లో తన పేరు లిఖించుకున్నారు.

హాస్యానికి మరోపేరు బ్రహ్మానందం  : Brahmanandam is another name for comedy

నవ్వించే వాడు యోగి... నవ్వే వాడు భోగి... నవ్వని వాడు రోగి... అని పెద్దవాళ్ళు అంటుంటారు. అలా తెలుగు టాలీవుడ్ లోనే కాకుండా ప్రపంచంలోని అన్ని భాషల్లోని సినిమాల్లో కామెడీకి ఎంతగానో ప్రాధాన్యతనిస్తారు. తెలుగు చలన చిత్ర రంగంలో హాస్యానికి (comedy) మొట్టమొదటి నుంచీ పెద్ద పీటే వేశారు. అప్పట్లో రేలంగి, అల్లు రామలింగయ్య, రాజబాబు, పద్మనాభం ఇలా ఎంతో మంది తమ హాస్య చతురతతో ప్రేక్షకులను అలరించారు.  వారి తరువాత బ్రహ్మానందం (Brahmanandam) టాలీవుడ్ లో పేరు సంపాదించుకున్నాడు.

గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో బ్రహ్మీ : Brahmi in Guinness book of records

హాస్యానికి మారుపేరుగా నిలిచిన బ్రహ్మానందం 1250 కి పైగా చిత్రాల్లో (above 1250 pictures) నటించి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ (Guinness book of records) లో తన పేరు లిఖించుకున్నారు. భారతదేశంలోని వివిధ భాషల చిత్రాల్లో ఆయన నటించి అక్కడ కూడా ఎంతో పేరు సంపాదించుకున్నారు. నార్త్ ఇండియాలో ఆయన్ని ఎక్కువగా 'కిల్ బిల్ పాండే' అని ముద్దుగా పిలుచుకుంటారు. ఇప్పటి తరం కామెడియన్లకు అవకాశాలు ఇవ్వాలని చెప్పి ఆయన సినిమాలు తగ్గించుకుంటూ వస్తున్నారు. ఎన్ని బాధలున్నా ఏ సందర్భంలోనైనా బ్రహ్మీ (nick name Brahmi) పేరు తలచుకుంటే పెదవులపై చిరునవ్వు రాకమానదు. ఒకసారి బ్రహ్మానందం గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం.

గత 30 సంవత్సరాలుగా విరామం లేకుండా ప్రేక్షకుల్ని నవ్విస్తున్నాడు. కన్నెగంటి ఆయన ఇంటిపేరు. తెలుగు సబ్జెక్ట్ లో ఎంఏ (MA) పూర్తి చేసి పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలిలో తెలుగు లెక్చరర్ గా (Telugu lecturer) పనిచేశారు. ఆ సమయంలోనే జంధ్యాల దర్శకత్వం వచ్చిన 'అహ నా పెళ్ళంట' (first movie ‘Aha Na Pellanta’) చిత్రంతో అరగుండు పాత్రతో బ్రహ్మానందం తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టారు. నటించిన తొలి చిత్రంతోనే అందరినీ నత్తినత్తిగా మాట్లాడే పాత్రతో నవ్వించారు. ఆయన నటించే చిత్రాల దర్శకులు బ్రహ్మానందం కోసమే ప్రత్యేకించి పాత్రలను క్రియేట్ చేసి రాసుకునేవారు అంటే ఆయనకున్న క్రేజ్ (craze) ఏంటో అర్ధం చేసుకోవచ్చు.

అహ నా పెళ్ళంట చిత్రంలో కోట శ్రీనివాసరావు దగ్గర పనివాడిగా అరగుండు పాత్రలో, రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన మనీ చిత్రంలో ఖాన్ దాదాగా ఒక సీరియస్ పాత్రలోనూ, ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన జంబలకిడి పంబ చిత్రంలో మొగుడు చచ్చిన విధవ పాత్రలో తొక్కతొక్క అంటూ అందరినీ నవ్వించాడు. అనగనగా ఒకరోజు చిత్రంలో నెల్లూరు పెద్దారెడ్డి తెలుసా నీకు అంటూ సీరియస్ గా కామెడీని పండించారు. అదుర్స్ మూవీలో భట్టాచార్య (భట్టు) గా ఆయన పలికిన హావభావాలు, రేసుగుర్రంలో సీరియస్ పోలీస్ పాత్రలో కిల్ బిల్ పాండేగా ఆయన పలికిన డైలాగులు… ఇలా మరపురాని ఎన్నో పాత్రల్లో నటించి తానేంటో తెలుగు చిత్ర రంగానికి తెలియజేసాడు బ్రహ్మానందం. బ్రహ్మానందం అంటే కామెడీకి కేరాఫ్ అడ్రస్ గా మారాడు. ఏ పాత్ర చేసినా అందులో తన హావభావాలతో నవ్వించే వాడు. 2000 సంవత్సరం నుంచి బ్రహ్మానందం కామెడీ మార్క్ నడుస్తోంది. బ్రహ్మీ కామెడీ ఉంటే ఆ సినిమా సూపర్ హిట్ అనేంత రేంజ్ కి బ్రహ్మీ ఎదిగాడు.

Also Read - 'Bhagavanth Kesari' movie Teaser released

ఎక్కడో ఒక కాలేజీలో చిన్న లెక్చరర్ గా మొదలైన బ్రహ్మానందం జీవితం గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో పేరు ఎక్కిందంటే దాని వెనుక ఆయన పడ్డ శ్రమ, కృషి ఏంటో మనకి అర్ధమవుతుంది. దాదాపు 1250 (above 1250 films) కి పైగా చిత్రాల్లో బ్రహ్మానందం నటించాడు.బ్రహ్మీ అంటే కామెడీకి ఒక బ్రాండ్ అంబాసిడర్ గా మారాడు. రవితేజతో (combination with hero Raviteja) ఆయన పండించిన ప్రతి సినిమాలోని కామెడీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. స్టార్ హీరోలతో (star heroes’ range) పాటుగా ఆయన ఎంతో క్రేజ్ సంపాదించుకున్నారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అందుకే గత రెండు దశాబ్దాలుగా తెలుగు ఇండస్ట్రీలో అయన ప్రస్థానం ఎదురులేకుండా కొనసాగుతోంది. ఈ ఏడాది ఉగాది కానుకగా ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ ప్రధాన తారలుగా దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించిన చిత్రం 'రంగమార్తాండ' విదలయ్యింది. ఎప్పుడూ ప్రేక్షకులను నవ్వించే బ్రహ్మానందం ఈ సినిమాలోని తన నటనతో ప్రేక్షకులతో కంటతడి పెట్టించాడు.

ఎన్నో అవార్డులు అందుకున్న బ్రహ్మీ : Brahmi who received many awards

1987 వ సంవత్సరంలో జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన అహ నా పెళ్ళంట చిత్రంలో బ్రహ్మానందం చేసిన అరగుండు పాత్ర అందరినీ ఎంతగానో మెప్పించింది. బ్రహ్మీ తన 35 సంవత్సరాల సినీ కెరీర్లో 6 సార్లు నంది అవార్డులు (6 times Nandi awards), ఒకసారి ఫిలిం ఫేర్ అవార్డు (one film fare award), మూడు సార్లు సైమా అవార్డు (3 times SIIMA award) అందుకున్నారు. 2009 లో ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ (in 2009 Padma Shri award) పురస్కారం వరించింది. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం బ్రహ్మానందానికి గౌరవ డాక్టరేట్ (Acharya Nagarjuna University facilitate the Doctorate) ప్రదానం చేసింది.

బ్రహ్మీకి పేరు తెచ్చిన కొన్ని డైలాగులు : Some dialogues which made Brahmi famous

'ఢీ' సినిమాలో... రావు గారూ... నన్ను ఇన్వాల్వ్ చేయకండి

'కిక్' సినిమాలో... రాజ్... హల్వా రాజ్...

అదుర్స్' సినిమాలో... ఒరేయ్ చారీ...