మహేష్ సినిమాకు 'గుంటూరు కారం' టైటిల్ ఖరారు : Mahesh's movie title name is 'Guntur Karam'
సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా అంటే ఫ్యాన్స్ కి పండగే. అతడు, ఖలేజా సినిమాల తరువాత మూడో సినిమాగా చిత్రీకరణ జరుపుకుంటోన్న చిత్రానికి అందరూ అనుకుంటున్నట్లుగానే 'గుంటూరు కారం' టైటిల్ ఖరారు చేసారు.
మహేష్ సినిమాకు 'గుంటూరు కారం' టైటిల్ ఖరారు : Mahesh's movie title name is 'Guntur Karam'
సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా అంటే ఫ్యాన్స్ కి పండగే. అతడు, ఖలేజా సినిమాల తరువాత మూడో సినిమాగా చిత్రీకరణ జరుపుకుంటోన్న చిత్రానికి అందరూ అనుకుంటున్నట్లుగానే 'గుంటూరు కారం' టైటిల్ ఖరారు చేసారు. దీనికి సంబంధించి విడుదల చేసిన గ్లింప్స్ ఫ్యాన్స్ ని కిర్రెక్కిస్తున్నాయి.ఈ సినిమాకి సంబంధించి హీరో పాత్రను పరిచయం చేస్తూ ఒక ప్రత్యేకమైన వీడియోను విడుదల చేసారు. ఇందులో మహేష్ బాబు ఊర మాస్ పాత్రలో దర్శనమిచ్చాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్.రాధాకృష్ణ (చినబాబు) ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ‘గుంటూరు కారం’ మాస్ స్ట్రైక్ పేరుతో ఒక స్పెషల్ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది.
‘గుంటూరు కారం’ మాస్ స్ట్రైక్ వీడియోలో మహేష్ బాబు లుక్, యాటిట్యూడ్ చూసి ఫ్యాన్స్ సంతోషానికి హద్దులే లేకుండా పోయింది. ఎరుపు రంగు గళ్ల చొక్కా, జీన్స్‌లో తలకు ఎరుపు రంగు తుండు కట్టుకుని మాస్ లుక్‌లో బాబు ఫ్యాన్స్ కి కిక్కెక్కించాడు. నోట్లో నుంచి బీడీ తీయడం, దాన్ని అగ్గిపుల్లతో అంటించిన తీరు... ఇంతవరకూ మహేష్ బాబుని ఇంత మాస్ అవతారంలో ఫ్యాన్స్ చూడలేదు. దీనికి తోడు తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, యాక్షన్ కొరియోగ్రఫీ, మహేష్ బాబు చెప్పిన డైలాగ్ ఈ వీడియోకి హైలైట్‌గా మారాయి. ‘ఏంది అట్టా చూస్తున్నా.. బీడీ త్రీడీలో కనబడతాందా’ అంటూ మహేష్ బాబు చెప్పే డైలాగ్ అభిమానులతో ఈలలు వేయిస్తుంది. ఇక ఈ స్పెషల్ వీడియోలో బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే పాట చాలా బాగుంది. దానికి అనుగుణంగా కర్రతో మహేష్ బాబు చేసే ఫైట్... ఈ చిన్న వీడియోలో ప్రతి ఫ్రేమ్ ఫ్యాన్స్ కోసమే అన్నట్టుంది. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సినిమాకు నవీన్ నూలి ఎడిటర్. ఎ.ఎస్.ప్రకాశ్ ఆర్ట్ డైరెక్టర్. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ దశలో ఉంది.