మార్చి 12న ఆస్కార్ అవార్డ్స్ ప్రదానోత్సవం : march 12th oscar awards ceremony

ఆస్కార్ (Oscar) అందుకోవడం అంటే సినీ ప్రపంచంలో అందరికీ ఒక తీయని కల... ఎందుకంటే అంతర్జాతీయ స్థాయిలో ఇదే అతి పెద్ద అవార్డు కావడం (International biggest Award).

మార్చి 12న ఆస్కార్ అవార్డ్స్ ప్రదానోత్సవం : march 12th oscar awards ceremony

మార్చి 12న ఆస్కార్ అవార్డ్స్ ప్రదానోత్సవం : March 12th oscar awards ceremony

ఆస్కార్ (Oscar) అందుకోవడం అంటే సినీ ప్రపంచంలో అందరికీ ఒక తీయని కల... ఎందుకంటే అంతర్జాతీయ స్థాయిలో ఇదే అతి పెద్ద అవార్డు కావడం (International biggest Award).

 

RRRకి ఆస్కార్ దక్కుతుందా : Will RRR get an Oscar

95 ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం (95th Oscar event) నెల 12 జరగనుంది. ప్రపంచ సినీ ప్రేమికులందరూ ఈరోజు కోసం ఎదురుచూస్తున్నారు. ఈసారి భారతీయ సినిమాల్లో ఒక ప్రాంతీయ తెలుగు భాషా చిత్రం (Telugu language movie) ఆర్ఆర్ఆర్ (RRR) బెస్ట్ ఒరిజినల్ సాంగ్ (Best Original Song) విభాగంలో నామినేట్ అయింది. కొద్దిరోజుల క్రితం మూవీ గోల్డెన్ గ్లోబ్ పురస్కారాన్ని (Golden Globe Award) గెలుచుకుంది. ఇదే కాకుండా ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులు (International Awards) కూడా అందుకుంది. ‘లాస్ఏంజెల్స్ఫిల్మ్క్రిటిక్స్అసోసియేషన్‌’ (Los Angeles Film Critics Association) అవార్డ్స్లో బెస్ట్మ్యూజిక్కేటగిరిలోఆర్ఆర్ఆర్‌’ గాను MM కీరవాణి (MM Keeravani) బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా ఎంపికయ్యారు. అవతార్ వంటి అద్భుతమైన చిత్రాన్ని అందించిన హాలీవుడ్ సూపర్ డైరెక్టర్ స్టీవెన్ స్పీల్బర్గ్ (Steven Spielberg) సైతం ఆర్ఆర్ఆర్ పై ప్రశంసలు కురిపించారు. ఆర్ఆర్ఆర్ (RRR) చిత్రానికి ఎస్ఎస్. రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వం వహించాడు. రామ్ చరణ్ (Ram Charan), జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) హీరోలుగా నటించారు. ఇంకా చిత్రంలో ఆలియా భట్, రే స్టీవెన్సన్, ఒలివియా మోరిస్, అజయ్ దేవగణ్, సముద్ర ఖని తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఆస్కార్ అవార్డులు ప్రారంభమైన 1929 సంవత్సరం నుంచి ఇప్పటివరకూ భారతీయ చిత్రాలు అత్యధికంగా నామినేట్ అవడం ఇదే మొదటిసారి (First time in Oscar history). ఇంతటి ప్రాశస్త్యమున్న ఆస్కార్ చరిత్రలో అవార్డు అందుకున్న మన భారతీయులను ఒకసారి పరిశీలిద్దాం.

ఆస్కార్‌ ఒక కల : Oscar is a dream

ఆస్కార్ అందుకోవడం అంటే సినీ ప్రపంచంలో అందరికీ ఒక తీయని కల... ఎందుకంటే అంతర్జాతీయ స్థాయిలో ఇదే అతి పెద్ద అవార్డు కావడం (Most popular award). ఒకప్పుడు భారతీయ సినిమాలకు ఆస్కార్ (Indian movies Oscar Award) అవార్డు అంటే మనవాళ్లకు అందని ద్రాక్షలా ఉండేది. అవార్డు దక్కడం కాదుకదా కనీసం ఆస్కార్ కోసం నామినేషన్ (Nominate) వరకూ వెళ్లడం చాలా తక్కువ. అయితే కొద్దిమంది మాత్రం అకాడమీ అవార్డులను (Academy Awards) అందుకుని భారతీయ చిత్రాలకు కూడా అంతర్జాతీయ చిత్రాలకు గుర్తింపు తీసుకువచ్చారు. అటువంటివారిలో కొంతమంది గురించి తెలుసుకుందాం. దీనికి ముందుగా అసలు ఆస్కార్ గురించి ఇప్పుడు ప్రస్తావన ఎందుకు అనేది మనసులో రావొచ్చు. ఎందుకంటే ఆస్కార్ 2023 నామినేషన్లో ఈసారి మూడు భారతీయ చిత్రాలకు (3 films nominated for Oscar) అవకాశం లభించింది. 130 కోట్ల మంది భారతీయుల అసలు ఈసారి జరిగే ఆస్కార్ పండుగ అవార్డులను పండిస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఈసారి నామినేషన్లకు ఎంపికైన వాటిలో ఆర్ఆర్ఆర్‌ (RRR) తెలుగు సినిమాలోని నాటు నాటు పాట బెస్ట్ ఒరిజనల్ సాంగ్ విభాగంలో (Best original song category) అకాడమీకి పోటీ పడుతోంది. ఆల్ దట్ భ్రీథ్స్ (All That Breathes) అనే డాక్యుమెంటరీ (Documentary), ది ఎలిఫెంట్ విస్పర్స్ (The Elephant Whispers) అనే షార్ట్ ఫిల్మ్ (Short Film) నామినేషన్లో అవకాశం దక్కించుకున్నాయి.

భాను అతయా : Bhanu Athaiya (1982)

1982లో తెరకెక్కిన గాంధీ సినిమాతో భాను అతయా (Bhanu Athaiya) అంతర్జాతీయ గుర్తింపు దక్కించుకున్నారు. విలియం అటెన్ బరో (William Attenborough) నిర్మించిన సినిమాకు భాను అతయా (Bhanu Athaiya) బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ (Best Costume Design) విభాగంలో ఆస్కార్ (Oscar) అవార్డును అందుకుంది. భారత్ కు ఇదే మొట్టమొదటి అకాడమీ అవార్డు కావడం విశేషం.మహారాష్ట్రలోని కోల్హాపుర్లో భాను ఆతియా జన్మించారు. ఎన్నో సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేసారు. 1956లో కాస్ట్యూమ్ డిజైనర్ గురు దత్ దర్శకత్వం (Director Guru Dutt) వహించినసిఐడిచిత్రంతో భాను అతయా (Bhanu Athaiya) సినీ జీవితాన్ని ప్రారంభించారు. ఆయన రూపొందించినప్యాసా(1957)’, ‘చౌద్వి కా చంద్చిత్రాలకు ఆమె కాస్ట్యూమ్ డిజైనర్గా (Costume Designer) వ్యవహరించారు. గురు దత్ తో పాటు, యష్ చోప్రా, బీఆర్ చోప్రా, విజయ్ ఆనంద్ వంటి అనేకమంది ప్రముఖులతో ఆమె కలిసి పనిచేశారు. ఆమె ఆమ్రాపాలి (1966), గైడ్ (1965), స్వదేశ్ (2004) లాంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. 100 కి పైగా సినిమాలకు ఆమె కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేసారు. ఆమె రెండు జాతీయ పురస్కారాలను (2 National awards) సైతం అందుకున్నారు. లెకిన్ (1990), లగాన్ (2001) సినిమాలకు గానూ పురస్కారాలను అందుకున్నారు. 2012లో బ్రెయిన్ ట్యూమర్ రావడంతో అనారోగ్యం పాలయ్యారు. 2015 నుంచి ఆమె మంచం మీదనే ఉన్నారు. ఆరోగ్యం విషమించడంతో 2020 అక్టోబర్ 15 తన 91 ఏళ్ల వయస్సులో ముంబైలోని కొలాబాలో తన ఇంటి వద్ద తుది శ్వాస విడిచారు.

 

సత్యజిత్ రే : Satyajit Ray (1992)

భారతీయ చలన చిత్ర పరిశ్రమలో (Indian film industry) సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ వ్యక్తిగా నిలిచారు సత్యజిత్ రే (Satyajit Ray). 1921 మే 2 కోల్కతాలో జన్మించారు. బెంగాలీ చలనచిత్ర దర్శకుడు, రచయిత, చిత్రకారుడిగా ఆయన ప్రపంచ ప్రసిద్ధి చెందారు. అస్యాన తొలిచిత్రం 1955 లో విడుదలైన పథేర్ పాంచాలి (Pather Panchali) సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా (Worldwide) భారత చిత్ర పరిశ్రమకు గుర్తింపు తీసుకువచ్చారు. సినిమాలో దుర్గ పాత్ర చనిపోయినప్పుడు నేనెందుకు ఏడవాలీ? అని సినిమాను చూస్తున్నవారు ఎంత కఠినంగా ఉందామని అనుకున్నా... కన్నీళ్లు (tears) వాటంతట అవే కారకుండా వుండవు. అందుకే సినిమా రెండు జాతీయ అవార్డులతో (National Awards) పాటు, 11 ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డులు (International Film Awards) సొతం చేసుకుంది. ఈయన చలనచిత్ర పరిశ్రమ రంగంలో చేసిన కృషికి గానూ 1992లో ఆస్కార్ లైఫ్ అచీవ్ మెంట్ (Oscar lifetime achievement Award) అవార్డు, లభించింది. దీంతో పాటు అదే ఏడాది భారతరత్న (Bharat Ratna) అవార్డును అందుకున్నారు. నిజ జీవితంలోని వెలుగు జిలుగులు, రాగద్వేషాలకుండే విలువలకు పట్టం కట్టడం, సున్నితమైన ప్రేమానుబంధాలు, అంతులేని గూడుకట్టుకున్న విషాదాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించడం రే ప్రత్యేకత. సత్యజిత్ రే తన 70 ఏట అంటే, 1992 ఏప్రిల్ 23 కోల్కతాలో కన్నుమూశారు.

రసూల్ పూకుట్టి : Rasul Pookutty (2008)

సౌండ్ డిజైనర్ అయిన రసూల్ పూకుట్టి (Rasul Pookutty) 2008లో విడుదలైన స్లమ్ డాగ్ మిలియనీర్ (Slumdog Millionaire) సినిమాకు ఇయాన్ టాప్ (Ian Topp), రిచర్డ్ ప్రైక్ (Richard Pryke) తో కలిసి సంయక్తంగా బెస్ట్ సౌండ్ మిక్సింగ్ (Best Sound Mixing) విభాగంలో ఆస్కార్ అవార్డు (Oscar Award) లభించింది. రసూల్హిందీ, మలయాళం, తమిళం, తెలుగులో పలు చిత్రాలకు పనిచేశారు. రా వన్ (2011), హైవే (2014), కొచ్చాడియన్ (2014), పుష్ప (2021) వంటి పలు చిత్రాలకు రసూల్ పనిచేసారు. కేరలవా వర్మ పళాసిరాజ (Keralavaa varma Palasiraja) అనే సినిమాకు 2009లో జాతీయ అవార్డును (National Award) కూడా గెల్చుకున్నారు. ఆర్ఆర్ఆర్ (RRR) తెలుగు సినిమా ఆస్కార్ అవార్డు రేసులో నిలవడం, ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఎన్నో అవార్డులను గెలుచుకుని అందరి చేత ప్రశంసలందుకుంటూ చరిత్ర సృష్టిస్తోంది. అటువంటి సినిమాను రసూల్ 'ఆర్ఆర్ఆర్' మూవీ ఒక చెత్త సినిమా అని... గే మూవీలా ఉందంటూ విమర్శలు చేసి వార్తల్లో నిలిచాడు. ఆస్కార్ అవార్డు వచ్చిన తరువాత తనకు అవకాశాలే లేకుండా పోయాయని రసూల్ ఇప్పటికీ బాధపడుతున్నాడు.

ఏఆర్ రెహమాన్ : AR Rahman (2008)

భారతీయ సంగీత చరిత్రను తిరగరాసిన చిత్రాల్లో 'రోజా' (Roja) ఒకటి. చిత్రంలోని పాటలు, సంగీతం (Songs and Music) ఇప్పటికీ అందరినీ అలరిస్తుంటాయి. చిత్రానికి జాతీయ అవార్డు (National Award) కూడా లభించింది. అటువంటి చిత్రానికి సంగీతాన్ని అందించిన ఏఆర్ రెహమాన్ (AR Rahman) భారతీయ సంగీతంలో ఒక కొత్త ఒరవడిని సృష్టించాడు. తెలుగు, తమిళం, హిందీ చిత్రాలకు రెహమాన్ సంగీతాన్ని అందించారు. 2008 లో విడుదలైన స్లమ్ డాగ్ మిలియనీర్ (Slumdog Millionaire) సినిమాలోని 'జై హో' (Jai Ho) అనే పాటకు సంగీతాన్ని సమకూర్చిన రెహమాన్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ (Best Original Song), బెస్ట్ ఒరిజినల్ స్కోర్ (Best Original Score) విభాగాల్లో ఆస్కార్ అవార్డులను అందుకున్నారు. ఆస్కార్ అవార్డును రెండు విభాగాల్లో గెల్చుకున్న మొట్ట మొదటి భారతీయుడిగా (1st Indian) ఏఆర్ రెహమాన్ చరిత్ర సృష్టించారు. 30 ఏళ్ళ తన సినీ సంగీత ప్రపంచంలో ఆయన ఎన్నో చిత్రాలకు అద్భుతమైన సంగీతాన్ని అందించారు. అంతర్జాతీయ సినిమాలకు సంగీతాన్ని అందించిన ఘనత కూడా ఆయనకు దక్కింది. ఆయన ఇప్పటి వరకు రెండు గ్రామీ పురస్కారాలు (2 Grammy Awards), గోల్డెన్ గ్లోబ్ పురస్కారం (Golden Globe Award), 4 జాతీయ అవార్డులు (National Awards), 15 ఫిల్మ్ ఫేర్ అవార్డులు (Film fare Awards) ఉన్నాయి. బొంబాయి, ప్రేమదేశం, జీన్స్, సఖి, జెంటిల్మేన్ వంటి చిత్రాలకు అద్భుతమైన సంగీతాన్ని అందించారు.

 

గుల్జార్ : Gulzar (2008)

గుల్జార్ (Gulzar) గా ప్రసిద్ధి చెందిన ప్రముఖ హిందీ పాటల రచయిత అసలు పేరు సంపూర్ణసింగ్ కల్రా. 2008 లో విడుదలైన స్లమ్ డాగ్ మిలియనీర్ (Slumdog Millionaire) సినిమాలోని 'జై హో' (Jai Ho) పాటకు గానూ ఏఆర్ రెహమాన్తో సంయుక్తంగా (Oscar taken Jointly with AR Rehman) పురస్కారాన్ని అందుకున్నారు. సాహిత్య అకాడమీ అవార్డు, పద్మభూషణ, దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారంతో పాటుగా 2012లో ఇందిరా గాంధీ జాతీయ సమైక్యతా పురస్కారం కూడా అందుకున్నారు.

వ్యక్తిగత విభాగంలోనే కాకుండా డాక్యుమెంటరీ విభాగంలో (Documentary Category) కూడా ఆస్కార్ అందుకుంది. ఇరానియన్-అమెరికన్ డైరెక్టర్ రైకా జేటాబాచీ దర్శకత్వం వహించిన పీరియడ్ ఎండ్ ఆఫ్ సెంటెన్స్ (Period End of Sentence) అనే డాక్యుమెంటరీకి (Documentary) కూడా ఆస్కార్ అవార్డు (Oscar Award) లభించింది. 2019లో డాక్యుమెంటరీని భారత నిర్మాత గునీత్ మోంగా నిర్మించారు.

ఆర్ఆర్ఆర్ (RRR) ఆస్కార్ అవార్డు అందుకుని 130 కోట్ల మంది భారతీయుల ఆశలను ఆనందింప చేస్తుందా లేదా అనేది ఆసక్తిగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది సినీ ప్రేమికులను అలరించిన చిత్రం ఆస్కార్ అవార్డు అందుకోవాలని ఆశిద్దాం.