“ఉగ్రం” రివ్యూ : "Ugram” movie review

కామెడీ పాత్రలకు (comedy rolls) పెట్టింది పేరైన 'అల్లరి' నరేష్ (Allari Naresh) కొన్నాళ్ల నుంచి తన పంథా మార్చాడు. నేను, విశాఖ ఎక్స్ప్రెస్, శంభో శివ శంభో, గమ్యం, మహర్షి వంటి చిత్రాల్లో తనలోని మరో నటన కోణాన్ని ఆవిష్కరించాడు. అనంతరం నాంది అనే చిత్రంతో విమర్శకుల (critics) నుంచి ప్రశంసలు కూడా అందుకున్నాడు.

“ఉగ్రం” రివ్యూ : "Ugram” movie review

“ఉగ్రంరివ్యూ : "Ugram” movie review

కామెడీ పాత్రలకు (comedy rolls) పెట్టింది పేరైన 'అల్లరి' నరేష్ (Allari Naresh) కొన్నాళ్ల నుంచి తన పంథా మార్చాడు. నేను, విశాఖ ఎక్స్ప్రెస్, శంభో శివ శంభో, గమ్యం, మహర్షి వంటి చిత్రాల్లో తనలోని మరో నటన కోణాన్ని ఆవిష్కరించాడు. అనంతరం నాంది అనే చిత్రంతో విమర్శకుల (critics) నుంచి ప్రశంసలు కూడా అందుకున్నాడు. అప్పటి నుంచి సీరియస్ కథలకు ప్రాధాన్యత ఇస్తూ వస్తున్న నరేష్ కామెడీ కథలకు స్వస్తి పలికాడు. తాజాగా కనకమేడల విజయ్ దర్శకుడిగా 'ఉగ్రం' సినిమాలో (‘Ugram’ movie) పవర్ ఫుల్ పోలీస్ అధికారి పాత్రలో (Police officer role) కనిపించాడు. సినిమాలో నరేష్ కి మలయాళ హీరోయిన్ మిర్నా మీనన్ జోడీ కట్టింది. షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది చిత్రాన్ని నిర్మించారు. పాకాల శ్రీ చరణ్ చిత్రానికి సంగీతాన్ని అందించాడు.

 

కథ : Story

సీఐ శివకుమార్ (అల్లరి నరేష్) వరంగల్ సిటీలో ఉన్న ఎన్నో చిక్కుముడులున్న క్లిష్టమైన కేసులను అవలీలగా పరిష్కరిస్తూ ఉంటాడు. ఇంతలో శివకుమార్ జీవితంలోకి అపర్ణ (మిర్నా మీనన్) ప్రవేశిస్తుంది. తొలిచూపులోనే అపర్ణతో ప్రేమలో పడిపోతాడు. అపర్ణ కూడా శివకుమార్ కోసం తన తండ్రిని సైతం ఎదిరించి మరీ పెళ్లి చేసుకుంటుంది. వీరికి ఒక పాప పుడుతుంది. ఎంతో అన్యోన్యంగా సాగిపోతున్న తరుణంలో వీరి కుటుంబం యాక్సిడెంట్ కి గురవుతుంది. ప్రమాదంలో శివకుమార్ తన గతాన్ని మర్చిపోతాడు. ప్రమాదం తరువాత అతని భార్య, కూతురు కనిపించకుండా పోతారు. ఇలా వీరే కాకుండా సిటీలోని చాలామంది కనిపించకుండా పోతుంటారు. దీనికి సిటీలో ఉన్న హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠానే కారణంగా తెలుస్తుంది. ఇలా తప్పిపోయిన వాళ్లందరినీ వెదకి తీసుకొచ్చే క్రమంలో శివకుమార్ కి ఎదురైనా సవాళ్లు ఏంటి... హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా ఆగడాలకు ఎలా చెక్ పెట్టాడు... అనేది సినిమా ప్రధాన అంశం.

 

సినిమా మొత్తాన్ని తన నటనతో ఎంతగానో కట్టిపడేసాడు నరేష్. పవర్ ఫుల్ పోలీస్ అధికారిగా మెప్పించాడు. అయితే సినిమా ప్రథమ భాగం నెమ్మదిగా సాగుతుంది. దీంతోపాటు లవ్ స్టోరీ వర్కవుట్ కాలేదు. అయితే ఇంటర్వెల్ సన్నివేశాన్ని మాత్రం అద్భుతంగా తెరకెక్కించారు. సెకండ్ హాఫ్ లో మిస్టరీ, ఇందులో వచ్చే ట్విస్టులు, ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. ఇటీవల విడుదలైన టీజర్ నరేష్ అభిమానులతో పాటు అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. కామెడీ పాత్రల నుంచి సీరియస్ పాత్రలకు మారిన 'అల్లరి' నరేష్ ప్రేక్షకులను మెప్పించాడనే చెప్పవచ్చు.

విడుదల తేదీ (Release date) : మే 05, 2023

నటీనటులు (Actors) : ‘అల్లరినరేష్, మిర్నా, శ్రీకాంత్ అయ్యంగార్, ఇంద్రజ, శత్రు

దర్శకులు (Director) : విజయ్ కనకమేడల

నిర్మాతలు (Producers) : సాహు గారపాటి & హరీష్ పెద్ది

సంగీత దర్శకులు (Music Director) : శ్రీ చరణ్ పాకల

సినిమాటోగ్రఫీ (Cinematography) : సిద్ధార్థ్ జె

ఎడిటర్ (Editor) : ఛోటా కె ప్రసాద్

బ్యానర్ (Banner) : షైన్ స్క్రీన్