అద్భుతంగా బిచ్చగాడు 2 ట్రైలర్ : Bicchagadu 2 movie awesome trailer

బిచ్చగాడు సినిమాతో పెద్ద హిట్ అందుకున్న విజయ్ ఆంటోనీ (Vijay Antony) దానికి సీక్వెల్ గా నిర్మించిన బిచ్చగాడు-2 (Bicchagadu-2) సినిమా ట్రైలర్ (Trailer) నేడు రిలీజ్ అయింది. ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ప్రతి ఒక్కరూ ట్రైలర్ చూసిన తరువాత షాక్ అయ్యారు. విజయ్ ఆంటోనీ అద్భుతంగా నటించారని, పిక్చరైజేషన్ అమోఘంగా ఉందని ట్రైలర్ కి టాక్ వచ్చింది.

అద్భుతంగా బిచ్చగాడు 2 ట్రైలర్ : Bicchagadu 2 movie awesome trailer

అద్భుతంగా బిచ్చగాడు 2 ట్రైలర్ : Bicchagadu 2 movie awesome trailer

బిచ్చగాడు సినిమాతో పెద్ద హిట్ అందుకున్న విజయ్ ఆంటోనీ (Vijay Antony) దానికి సీక్వెల్ గా నిర్మించిన బిచ్చగాడు-2 (Bicchagadu-2) సినిమా ట్రైలర్ (Trailer) నేడు రిలీజ్ అయింది. ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ప్రతి ఒక్కరూ ట్రైలర్ చూసిన తరువాత షాక్ అయ్యారు. విజయ్ ఆంటోనీ అద్భుతంగా నటించారని, పిక్చరైజేషన్ అమోఘంగా ఉందని ట్రైలర్ కి టాక్ వచ్చింది. 

2016లో రిలీజైన 'బిచ్చగాడు' (Bicchagadu) సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సంచలన విజయం (Super hit) సాధించింది. సినిమా మొదటి భాగం అందరి అంచనాలను తలక్రిందులు చేసి బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ అయ్యింది. రికార్డు స్థాయిలో కలెక్షన్లను కొల్లగొట్టింది. మొదటి భాగం తెలుగుతో పాటుగా తమిళంలోనూ (Hit in Telugu and Tamil) సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. దీంతో ఈ సినిమాకి సీక్వెల్ (sequel) రానుందని ప్రకటించినప్పుడే ఈ సినిమాపై అందరికీ ఎంతో ఆసక్తి కలిగింది. ఈ నేపథ్యంలో ట్రైలర్ ను మేకర్స్ విడుదల (makers released the trailer) చేసారు. ఇది ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తోంది. హీరో, సంగీతం, నిర్మాత ఇలా అన్ని రంగాల్లోనో విజయ్ ఆంటోనీ సిద్ధహస్తుడు. లక్ష కోట్లకు అధిపతిగా విజయ్ ఆంటోనీ ఇంట్రడక్షన్ (excellent introduction) అదిరిపోయింది. ముందు భాగంలో ఉన్నట్లే రెండో భాగంలో సైతం దీక్ష తీసుకున్నట్లు కనబడుతుంది. ఇందులో కొత్తగా బ్రెయిన్ ట్రాన్స్ ప్లాంటేషన్ అనే ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ (Brain Transplantation concept is interesting) ఆసక్తిని రేకెత్తిస్తోంది. దీంతో ఇప్పటివరకూ సినిమాపై ఉన్న అంచనాలు... ఈ ట్రైలర్ తో ఒక్కసారిగా పెరిగిపోయాయి. విజయ్ ఆంటోని, కావ్య థాపర్ (Kavya Thapar) హీరో హీరోయిన్లుగా నటించారు. దర్శకుడిగా విజయ్ ఆంటోనీకి ఇదే తొలి సినిమా. ఈ సినిమాకు ఆయనే ఎడిటర్, మ్యూజిక్ డైరెక్టర్ కూడా. హరీష్ పేరడి కీలక పాత్ర పోషిస్తున్నారు. విజయ్ ఆంటోని భార్య ఫాతిమా విజయ్ ఈ ప్రాజెక్ట్‌ను విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్‌పై నిర్మించారు. విజయ్ లుక్ సరికొత్తగా ఉంది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ట్రైలర్‌ను చాలా ఇంట్రెస్టింగ్‌గా కట్ చేశారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచేయగా, ఇప్పుడు ట్రైలర్ మరింత హైప్ ని క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి అయింది. దీంతో ఈ సినిమా మే 19న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

ట్రైలర్ పూర్తి స్థాయిలో పరిశీలిస్తే భారతదేశంలో ఉన్న ధనవంతుల్లో ఏడవ అత్యంత సంపన్నుడైన విజయ్ గురుమూర్తిగా విజయ్ ఆంటోనిని పరిచయం చేస్తూ ట్రైలర్ స్టార్ట్ (trailer part) అవుతుంది. ఆ తర్వాత ఊహించని విధంగా విజయ్ గురుమూర్తి హత్యకు (murder) గురవుతాడు. కానీ ఇందులో ట్విస్ట్ ఏంటంటే... విజయ్ గురుమూర్తిలా ఉండే సత్య అనే వ్యక్తి ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడు అవుతాడు. బిచ్చగాడు 2 సినిమా 'బ్రెయిన్ ట్రాన్స్‌ప్లాంటేషన్' అనే ఐడియా చుట్టూ తిరుగుతుంది. రామానుజం, మహాత్మా గాంధీ, ఐన్‌స్టీన్ లాంటి మహానుభావుల మెదడు వేరే వాళ్లకు ట్రాన్స్‌ప్లాంట్ చేస్తే... దీని ద్వారా వారి ఆలోచనలను బతికించినవారం అవుతాం కదా అని ఓ డాక్టర్ ఇందులో చెబుతారు. అయితే "హిట్లర్ లాంటి ఉన్మాదులు ఈ సర్జరీని దుర్వినియోగం చేసి చనిపోకుండా ఉండిపోతే…? అది ప్రపంచానికే ప్రమాదం కదా డాక్టర్" అన్న ప్రశ్నతో సినిమాపై ఇంట్రెస్ట్ పెరిగింది. ఈ సినిమాలో దేవ్ గిల్ విలన్ రోల్ చేశారు.