ఐపీఎల్ లో నేడు రెండు ధమాకా మ్యాచ్‌లు : today 2 matches in ipl
అత్యంత ఆదరణ పొందుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) లో నేడు రెండు ధమాకా మ్యాచ్‌లు (matches) క్రికెట్ ప్రేమికులను అలరించనున్నాయి. అత్యంత ఉత్ఖంఠంగా, పోటాపోటీగా ఐపీఎల్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి.
ఐపీఎల్ లో నేడు రెండు ధమాకా మ్యాచ్‌లు : Today 2 matches in IPL
అత్యంత ఆదరణ పొందుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) లో నేడు రెండు ధమాకా మ్యాచ్‌లు (matches) క్రికెట్ ప్రేమికులను అలరించనున్నాయి. అత్యంత ఉత్ఖంఠంగా, పోటాపోటీగా ఐపీఎల్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి.
కేకేఆర్ vs గుజరాత్ : KKR vs GT
నేడు మొదటి మ్యాచ్‌లో కోల్కతా నైట్ రైడర్స్ (KKR), గుజరాత్ టైటాన్స్ (GT) జట్లు తలపడనున్నాయి. కేకేఆర్ జట్టుకు నితీష్ రాణా కెప్టెన్ కాగా, గుజరాత్ టైటాన్స్ (GT) వ్యవహరించనున్నారు. కేకేఆర్ హోమ్ గ్రౌండ్ ఈడెన్ గార్డెన్స్ లో (Eden gardens) ఈ మ్యాచ్ జరగనుంది. ఇరు జట్లూ రెండు సార్లు తలపడగా, చెరో మ్యాచ్‌లో గెలుపొందాయి. కేకేఆర్ అత్యధిక స్కోర్ 207 పరుగులు కాగా, 148 అత్యల్ప పరుగులు. గుజరాత్ టీమ్ 204 పరుగులు అత్యధికం, అత్యల్ప స్కోర్ నమోదు చేసింది. కోల్కతా (KKR) ఈ మ్యాచ్‌లో తప్పనిసరిగా విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. ఇప్పటివరకూ ఆడిన 8 మ్యాచ్‌లలో 3 మ్యాచ్‌లు గెలిచి 5 మ్యాచ్‌లు ఓడిపోయింది. దీంతో 6 పాయింట్లతో పాయింట్ల పట్టికలో 7 వ స్థానంలో (7th place) ఉంది. మంచి ఆరంభాలని విజయాలుగా మలచడంలో కేకేఆర్ విఫలం అవుతుండడం ఆ జట్టుకి మైనస్ గా మారింది.
కోల్‌కతా నైట్ రైడర్స్ ప్రాబబుల్ XI : KKR probable XI
వెంకటేష్ అయ్యర్, నారాయణ్ జగదీశన్ (వికెట్ కీపర్), జాసన్ రాయ్, సునీల్ నరైన్, నితీష్ రాణా (కెప్టెన్), ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్, డేవిడ్ వైస్, వైభవ్ అరోరా, ఉమేష్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, సుయాష్ శర్మ
కేకేఆర్ ఫుల్ స్క్వాడ్ : KKR full squad
ఎన్ జగదీశన్, జాసన్ రాయ్, నితీష్ రాణా, ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్, సునీల్ నరైన్, డేవిడ్ వీస్, కుల్వంత్ ఖేజ్రోలియా, సుయాష్ శర్మ, ఉమేష్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, వెంకటేష్ అయ్యర్, మన్‌దీప్ సింగ్, అనుకుల్ రాయ్, వైభవ్ అరోరా, లిట్టన్ దాస్, టిమ్ సౌథీ, లాకీ ఫెర్గూసన్, శార్దూల్ ఠాకూర్, రహ్మానుల్లా గుర్బాజ్, హర్షిత్ రాణా, ఆర్య దేశాయ్.
విజయాల బాటలో గుజరాత్ : Gujarat on the way to success
డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ (Defending champion GT) జట్టు ఈ ఐపీఎల్ లో లయను అందుకుని విజయాలు సాధిస్తోంది. 7 మ్యాచ్‌లు ఆడిన గుజరాత్ జట్టు 5 మ్యాచ్‌లు గెలిచి 10 పాయింట్లతో పాయింట్ల పట్టికలో 3 వ స్థానంలో (3rd place) నిలిచింది. కుర్రాళ్లతో (young cricketers) నిండిన టీమ్ సమతుల్యం ఎంతగానో బాగుంది. వృద్ధిమాన్ సాహా మంచి ఫామ్‌లో (Saha in form) ఉంది జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అయితే ఎన్నో ఆశలు పెట్టుకున్న గిల్ ఫామ్ లోకి రావడం కలిసివచ్చే అంశమని చెప్పవచ్చు. కెప్టెన్ హార్థిక్ పాండ్యా (Captain Pandya) సైతం తన వంతు పాత్ర పోషిస్తూ జట్టు విజయాల్లో పాలుపంచుకుంటున్నాడు. స్పిన్నర్ రషీద్ ఖాన్ (Rasheed Khan) అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ లో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్నాడు. మహ్మద్ షమీ (Shami), మోహిత్ శర్మ తమ పేస్ బౌలింగ్ తో విశేషంగా రాణిస్తున్నారు.
గుజరాత్ టైటాన్స్ ప్రాబబుల్ XI : GT probable XI
వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), శుభమన్ గిల్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, అభినవ్ మనోహర్, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, మహ్మద్ షమీ, మోహిత్ శర్మ, జాషువా లిటిల్
గుజరాత్ టైటాన్స్ ఫుల్ స్క్వాడ్ : GT full squad
హార్దిక్ పాండ్యా (కెప్టెన్), శుభమన్ గిల్, డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్, సాయి సుదర్శన్, వృద్ధిమాన్ సాహా, మాథ్యూ వేడ్, రషీద్ ఖాన్, రాహుల్ తెవాటియా, విజయ్ శంకర్, మహమ్మద్ షమీ, అల్జారీ జోసెఫ్, యశ్ దయాల్, ప్రదీప్ సాంగ్వాన్, దర్శన్ నల్కండే, జయంత్ యాదవ్, ఆర్ సాయి కిషోర్, నూర్ అహ్మద్, కేన్ విలియమ్సన్, ఒడియన్ స్మిత్, కెఎస్ భరత్, శివమ్ మావి, ఉర్విల్ పటేల్, జాషువా లిటిల్, మోహిత్ శర్మ.
రెండో మ్యాచ్‌లో హైదరాబాద్ vs ఢిల్లీ ఢీ : SRH vs DC face in 2nd match
పాయింట్ల పట్టికలో ఆఖరి రెండు స్థానాల్లో (9th & 10th place) నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), ఢిల్లీ క్యాపిటల్స్ (DC) జట్లు ఐపీఎల్ లో నేడు ఢిల్లీ హోమ్ గ్రౌండ్ అరుణ్ జైట్లీ స్టేడియంలో (Arun Jaitley Stadium) జరగనుంది. ఢిల్లీ కెప్టెన్ గా డేవిడ్ వార్నర్, హైదరాబాద్ జట్టుకు ఐడెన్ మార్క్రామ్ కెప్టెన్ గా వ్యవహరించనున్నారు. రెండు జట్లూ ఇప్పటివరకూ ఏడేసి మ్యాచ్‌లు ఆడాయి. చెరో రెండేసి మ్యాచ్‌లు (out of 7 matches 2 matches win) మాత్రమే గెలిచి 5 మ్యాచ్‌లు ఓడిపోయాయి. దీంతో నాలుగేసి పాయింట్లతో 9, 10 స్థానాల్లో నిలిచాయి. అయితే నెట్ రన్ రేట్ లో హైదరాబాద్ ముందులో ఉంది. ప్లేఆఫ్ చేరాలంటే ఖచ్చితంగా ఈ మ్యాచ్‌లో (win compulsory) గెలవాలి.
ఈ సీజన్లో (current season) రెండు జట్ల మధ్య జరిగిన 34 వ మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు 7 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు 144 పరుగులకే ఆలౌటైంది. అనంతరం హైదరాబాద్ జట్టు 6 వికెట్ల నష్టానికి 137 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. స్వల్ప స్కోర్ ను కూడా ఛేదించలేక (unable to chase even a low score) జట్టు చేతులెత్తేసింది. దీంతో నేడు జరిగే మ్యాచ్‌లో గెలిచి గత మ్యాచ్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని హైదరాబాద్ భావిస్తోంది. ఇప్పటి వరకూ జరిగిన ఐపీఎల్ అన్ని సీజన్లలో 22 సార్లు (22 head to head maches) ఇరు జట్లూ తలపడ్డాయి. ఇందులో చెరో 11 మ్యాచ్‌లు గెలిచాయి. హైదరాబాద్ జట్టు అత్యధిక పరుగులు 219 కాగా, అత్యల్ప స్కోరు 116 పరుగులు. ఢిల్లీ జట్టు అత్యధిక పరుగులు 207 కాగా, అత్యల్ప స్కోరు 80 పరుగులు.
ఢిల్లీ క్యాపిటల్స్ ప్రాబబుల్ XI : DC probable XI
డేవిడ్ వార్నర్ (కెప్టెన్), ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్), మిచెల్ మార్ష్, మనీష్ పాండే, సర్ఫరాజ్ ఖాన్, అక్షర్ పటేల్, అమన్ ఖాన్, రిపాల్ పటేల్, అన్రిచ్ నోర్ట్జే, కుల్దీప్ యాదవ్, ఇషాంత్ శర్మ, ముఖేష్ కుమార్
ఢిల్లీ క్యాపిటల్స్ ఫుల్ స్క్వాడ్ : DC full squad
డేవిడ్ వార్నర్(సి), పృథ్వీ షా, మిచెల్ మార్ష్, యశ్ ధుల్, మనీష్ పాండే, ఫిల్ సాల్ట్, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, చేతన్ సకారియా, అమన్ హకీమ్ ఖాన్, లలిత్ యాదవ్, విక్కీ ఓస్త్వాల్, అన్రిచ్ నార్ట్జే, కుల్దీప్ యాదవ్, ముస్తాఫిజుర్ రెహమాన్, ముఖేష్ కుమార్, కమలేష్ నాగర్‌కోటి, సర్ఫరాజ్ ఖాన్, ప్రవీణ్ దూబే, రిలీ రోసౌవ్, రోవ్‌మాన్ పావెల్, ఖలీల్ అహ్మద్, ఇషాంత్ శర్మ, లుంగి ఎంగిడి, రిపాల్ పటేల్
సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రాబబుల్ XI : SRH probable XI
మయాంక్ అగర్వాల్, హ్యారీ బ్రూక్, ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, మార్కో జాన్సెన్, వాషింగ్టన్ సుందర్, మయాంక్ మార్కండే, భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్, ఉమ్రాన్ మలిక్, రాహుల్ త్రిపాఠి
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫుల్ స్క్వాడ్ : SRH full squad
ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్, మయాంక్ అగర్వాల్, అన్మోల్‌ప్రీత్ సింగ్, హ్యారీ బ్రూక్, మయాంక్ డాగర్, ఫజల్‌హాక్ ఫరూక్, అకేల్ హొసేన్, మార్కో జాన్సెన్, కార్తీక్, త్యాగి, హెన్రిచ్ క్లాసెన్, హేన్రిచ్ క్లాసెన్, టి నటరాజన్, నితీష్ కుమార్ రెడ్డి, గ్లెన్ ఫిలిప్స్, ఆదిల్ రషీద్, సన్వీర్ సింగ్, రాహుల్ త్రిపాఠి, ఉమ్రాన్ మాలిక్, వివ్రాంత్ శర్మ, సమర్థ్ వ్యాస్, వాషింగ్టన్ సుందర్, ఉపేంద్ర యాదవ్
ఆరెంజ్ క్యాప్ : Orange Cap
ఈ టోర్నీలో ఇప్పటి వరకు అత్యధిక పరుగులు సాధించిన ఫాఫ్ డుప్లెసిస్ (Duplessis) ఆరెంజ్ క్యాప్‌తో (Orange Cap) కొనసాగుతున్నాడు. అతడు 8 మ్యాచ్‌ల్లో 422 పరుగులు చేశాడు. 333 పరుగులతో విరాట్ కోహ్లీ రెండో ప్లేస్‌లో ఉండగా... చెన్నై బ్యాటర్లు డేవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్ 3,4 స్థానల్లో కొనసాగుతున్నారు. కాన్వే 322 పరుగులు చేయగా. రుతురాజ్ గైక్వాడ్ 317 పరుగులు సాధించాడు.
పర్పుల్ క్యాప్ : Purple Cap
అత్యధిక వికెట్ల తీసి లీడింగ్ వికెట్ టేకర్‌గా ఆర్సీబీ బౌలర్ మహమ్మద్ సిరాజ్ (Siraj 14 వికెట్లు) కొనసాగుతున్నాడు. ఫలితంగా పర్పుల్ క్యాప్ (Purple Cap) అతడి వద్దే ఉంది. గుజరాత్ స్పిన్నర్ రషీద్ ఖాన్, పంజాబ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్, చెన్నై బౌలర్ తుషార్ దేశ్‌పాండే 14 వికెట్లతోనే ఆ తదుపరి స్థానాల్లో ఉన్నారు.
IPL 2023 పాయింట్ల పట్టిక : IPL Points Table
స్థానం |
జట్టు |
మ్యాచ్లు |
విజయాలు |
ఓటములు |
పాయింట్లు |
నెట్ రన్ రేట్ |
1 |
రాజస్థాన్ రాయల్స్ (RR) |
8 |
5 |
3 |
10 |
0.939 |
2 |
లక్నో సూపర్ జెయింట్స్ (LSG) |
8 |
5 |
3 |
10 |
0.841 |
3 |
గుజరాత్ టైటాన్స్ (GT) |
7 |
5 |
2 |
10 |
0.580 |
4 |
చెన్నై సూపర్ కింగ్స్ (CSK) |
8 |
5 |
3 |
10 |
0.376 |
5 |
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) |
8 |
4 |
4 |
8 |
-0.139 |
6 |
పంజాబ్ కింగ్స్ (PBKS) |
8 |
4 |
4 |
8 |
-0.510 |
7 |
కోల్కతా నైట్ రైడర్స్ (KKR) |
8 |
3 |
5 |
6 |
-0.027 |
8 |
ముంబై ఇండియన్స్ (MI) |
7 |
3 |
4 |
6 |
-0.620 |
9 |
సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) |
7 |
2 |
5 |
4 |
-0.725 |
10 |
ఢిల్లీ క్యాపిటల్స్ (DC) |
7 |
2 |
5 |
4 |
-0.961 |