నేడు ఐపీఎల్ లో తలపడనున్న చెన్నై, రాజస్థాన్ : CSK vs RR will face today in IPL
రెండు పటిష్టమైన జట్లు... ఒకటి టాప్ పొజిషన్... మరొకటి మూడో స్థానం... టాప్ ను నిలబెట్టుకోవాలని ఒకరు, మూడు నుంచి టాప్ కి వెళ్లాలని మరొకరు. వెరసి నేడు ఐపీఎల్ (IPL) లో అభిమానులకు ఉత్కంఠ కలిగించే మ్యాచ్ కనువిందు చేయనుంది.
నేడు ఐపీఎల్ లో తలపడనున్న చెన్నై, రాజస్థాన్ : CSK vs RR will face today in IPL
రెండు పటిష్టమైన జట్లు... ఒకటి టాప్ పొజిషన్... మరొకటి మూడో స్థానం... టాప్ ను నిలబెట్టుకోవాలని ఒకరు, మూడు నుంచి టాప్ కి వెళ్లాలని మరొకరు. వెరసి నేడు ఐపీఎల్ (IPL) లో అభిమానులకు ఉత్కంఠ కలిగించే మ్యాచ్ కనువిందు చేయనుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 16 వ సీజన్లో పాయింట్ల పట్టికలో (Points table) అగ్రస్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు మూడో స్థానంలో ఉన్న రాజస్థాన్ రాయల్స్ (RR) టీమ్ తో తలపడనుంది. రాజస్థాన్ టీమ్ హోమ్ గ్రౌండ్ (Home ground) సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో (Sawai Mansingh Stadium) నేటి రాత్రి 7:30 నిమిషాలకు జరగనుంది. సీఎస్కేను (CSK) ఓడించి అగ్రస్థానంలో నిలవాలని రాజస్థాన్ ఆశిస్తుండగా, ఈ మ్యాచ్లో విజయం సాధించి అగ్రస్థానంలోనే నిలవాలని సీఎస్కే జట్టు భావిస్తోంది. దీంతో పోటీ రసవత్తరంగా మారనుంది. రాజస్థాన్, సీఎస్కే జట్ల మధ్య జరిగిన మొదటి మ్యాచ్లో రాజస్థాన్ టీమ్ విజయం (RR wins first match against CSK) సాధించింది. అయితే ఆ తరువాత నుంచి చెన్నై జట్టు వరుసగా విజయాలను నమోదు చేస్తూ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. చెన్నై టీమ్ ఆడిన 7 మ్యాచ్లలో 5 మ్యాచ్లలో (5 wins out of 7) విజయం సాధించగా, రాజస్థాన్ జట్టు అన్నే మ్యాచ్లు ఆడి నాలుగు మ్యాచ్ల్లో విజయం సాధించింది. రెండు జట్లలో కూడా మంచి ఆల్ రౌండర్లు (All-rounders), బ్యాటింగ్ దిగ్గజాలు, బౌలర్లు ఉన్నారు. దీంతో రెండు జట్లూ పటిష్టంగా (both are strong teams) ఉండడంతో నేడు జరిగే మ్యాచ్ హోరాహోరీగా ఉండనుందని, అభిమానులకు కనువిందు చేయనుందని అభిమానులు సంబరపడుతున్నారు.
ఫామ్ లో సీఎస్కే ఆటగాళ్లు : CSK players in form
చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టులోని ఆటగాళ్లు అన్ని విభాగాల్లోనూ రాణిస్తున్నారు. ప్రధానంగా అజింక్య రహానే, ఋతురాజ్ గైక్వాడ్, డారెన్ కాన్వే, శివమ్ దూబే అద్భుతమైన ఫామ్ తో పరుగుల వరద పారిస్తున్నారు. ముఖ్యంగా ఎవ్వరూ ఊహించని రీతిలో రహానే (Rahane) చెలరేగిపోయాడు. టెస్ట్ క్రికెటర్ గా ముద్రపడిన రహానే 199 కి పైగా స్ట్రైక్ రేట్ (199 Strike rate) తో భీకర ఫామ్ లో ఉన్నాడు. దీంతో త్వరలో జరగబోయే ప్రపంచ టెస్ట్ క్రికెట్ ఫైనల్ కి కూడా ఎంపికయ్యాడు. బౌలింగ్ విభాగం కూడా పటిష్టంగానే ఉంది. పేస్ దళం పతిరణ, మహేశ్ తీక్షణ పదునైన బంతులతో బ్యాట్స్మెన్లను పరుగులు చేయకుండా కట్టడి చేస్తున్నారు. ఇక స్పిన్ విభాగంలో మొయిన్ అలీ, రవీంద్ర జడేజా బంతులను తిప్పేస్తున్నారు. ఇక జట్టుకు ప్రధాన బలం కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) మ్యాచ్ గెలుపు కోసం తీసుకునే నిర్ణయాలు జట్టు విజయానికి ప్రధానంగా నిలుస్తున్నాయి.
రాజస్థాన్ సైతం ఫామ్ : RR also strong
రాజస్థాన్ రాయల్స్ (RR) సైతం సీఎస్కే టీమ్ (CSK team) కి ఏమాత్రం తీసిపోలేదు. ఈ టీమ్ సైతం ఎంతో పటిష్టంగా ఉంది. టీమ్ కెప్టెన్ సంజు శాంసన్ (Samson) జట్టును సమిష్టి కృషితో ముందుకు తీసుకెళుతూ విజయాలు సాధించేలా కృషి చేస్తున్నాడు. జో రూట్, పడిక్కల్ తో పాటు కెప్టెన్ శాంసన్ (Captain Samson) సైతం మంచి ఫామ్ లో ఉండి జట్టు విజయాల్లో కీలకంగా ఉన్నారు. బౌల్ట్, అశ్విన్, చాహల్ వంటి బౌలర్లు అటు బంతోతోనూ, ఇటు బ్యాట్ తోనూ అద్భుతాలు చేస్తున్నారు. సీఎస్కే టీమ్ తో జరిగిన మొదటి మ్యాచ్ ను గెలుచుకున్న రాజస్థాన్ నేడు జరిగే మ్యాచ్ లో కూడా విజయం సాధించాలనే ఉత్సాహంతో ఉంది. హోమ్ గ్రౌండ్ (home ground) లో మ్యాచ్ జరుగుతుండడం రాజస్థాన్ జట్టుకి కలిసివచ్చే అంశమని చెప్పవచ్చు. అయితే వరుస విజయాలతో దూసుకెళుతున్న చెన్నై జట్టు విజయాలకు రాజస్థాన్ బ్రేక్ వేస్తుందో లేదో చూడాలి.
చెన్నై vs రాజస్థాన్ హెడ్ టు హెడ్ : CSK vs RR head to head
చెన్నై సూపర్ కింగ్స్ (CSK), రాజస్థాన్ రాయల్స్ (RR) మధ్య ఇప్పటి జరిగిన ఐపీఎల్ మ్యాచ్లు (IPL Matches) గమనిస్తే చెన్నై జట్టుదే పైచేయిగా ఉంది. అన్ని ఐపీఎల్ సీజన్లలో ఇరు జట్ల మధ్య మొత్తం 27 మ్యాచ్లు జరిగాయి. ఇందులో చెన్నై 15 మ్యాచ్లలో విజయం సాధించగా, రాజస్థాన్ 12 మ్యాచ్లు గెలుపొందింది. చెన్నై అత్యధిక స్కోర్ 246 కాగా, అత్యల్ప స్కోర్ 109 పరుగులు. రాజస్థాన్ అత్యధిక స్కోర్ 223 కాగా, అత్యల్ప స్కోర్ 126 పరుగులు. ఈ సీజన్లో (current season) రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో చెన్నై కేవలం 3 పరుగుల స్వల్ప తేడాతో మాత్రమే ఓడిపోయింది.
సీఎస్కే ప్రాబబుల్ XI : CSK probable XI
రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, శివమ్ దూబే, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, MS ధోని (కెప్టెన్, వికెట్ కీపర్), తుషార్ దేశ్పాండే, మహేశ్ తీక్షణ, మతీషా పతిరణ, ఆకాష్ సింగ్
చెన్నై సూపర్ కింగ్స్ ఫుల్ స్క్వాడ్ : CSK full squad
రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, శివమ్ దూబే, అంబటి రాయుడు, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, MS ధోనీ (కెప్టెన్, వికెట్ కీపర్), మతీషా పతిరణ, తుషార్ దేశ్పాండే, మహేశ్ తీక్షణ, ఆకాశ్ సింగ్, డ్వైన్ ప్రిటోరియస్, సుభ్రాంశు సేనాపతి, షేక్ రషీద్, ఆర్ఎస్ హంగర్గేకర్, మిచెల్ సాంట్నర్, అజయ్ జాదవ్ మండల్, ప్రశాంత్ సోలంకి, సిమర్జీత్ సింగ్, భగత్ వర్మ, నిశాంత్ సింధు
రాజస్థాన్ రాయల్స్ ప్రాబబుల్ XI : RR probable XI
జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, సంజు శాంసన్ (కెప్టెన్, వికెట్ కీపర్), షిమ్రాన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, సందీప్ శర్మ, ఆడమ్ జంపా, ట్రెంట్ బౌల్ట్, యజువేంద్ర చాహల్
రాజస్థాన్ రాయల్స్ ఫుల్ స్క్వాడ్ : RR full squad
యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, దేవదత్ పడిక్కల్, సంజు శాంసన్ (కెప్టెన్, వికెట్ కీపర్), షిమ్రాన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, జాసన్ హోల్డర్, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, యజువేంద్ర చాహల్, అబ్దుల్ బాసిత్, ఆకాష్ వశిష్ట్, డోనవ్ వశిష్త్, డోనావన్ ఫెరీరా, మురుగన్ అశ్విన్, కెఎమ్ ఆసిఫ్, రియాన్ పరాగ్, జో రూట్, ఆడమ్ జంపా, నవదీప్ సైనీ, కెసి కరియప్ప, ఒబెద్ మెక్కాయ్, కుల్దీప్ యాదవ్, కుల్దీప్ సేన్, కునాల్ సింగ్ రాథోడ్