ప్లేఆఫ్స్ కి చేరేదెవరు? : Who will reach the playoffs?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 16 వ సీజన్ ప్రారంభ మ్యాచ్‌లు చప్పగా సాగినప్పటికీ... రానురానూ ఎంతో ఆసక్తిగా మారుతున్నాయి. అభిమానులను ఎంతగానో అలరిసున్నాయి. దాదాపు రెండు నెలలపాటు సాగే ఈ లీగ్ లో సగం మ్యాచ్‌లు పూర్తయ్యాయి. అన్ని జట్లూ ఇప్పటికే ఏడేసి మ్యాచ్‌లు ఆడడంతో సగం మ్యాచ్‌లు పూర్తయినట్లయింది. దీంతో అందరి దృష్టి ప్లేఆఫ్స్ కి ఏ జట్లు చేరుకుంటాయని దానిపై పడింది. ఆయా జట్ల అభిమానులు, క్రీడా విశ్లేషకులు దీనిపై అంచనాలు వేస్తున్నారు.
ప్లేఆఫ్స్ కి చేరేదెవరు? : Who will reach the playoffs?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 16 వ సీజన్ ప్రారంభ మ్యాచ్‌లు చప్పగా సాగినప్పటికీ... రానురానూ ఎంతో ఆసక్తిగా మారుతున్నాయి. అభిమానులను ఎంతగానో అలరిసున్నాయి. దాదాపు రెండు నెలలపాటు సాగే ఈ లీగ్ లో సగం మ్యాచ్‌లు పూర్తయ్యాయి. అన్ని జట్లూ ఇప్పటికే ఏడేసి మ్యాచ్‌లు ఆడడంతో సగం మ్యాచ్‌లు పూర్తయినట్లయింది. దీంతో అందరి దృష్టి ప్లేఆఫ్స్ కి ఏ జట్లు చేరుకుంటాయని దానిపై పడింది. ఆయా జట్ల అభిమానులు, క్రీడా విశ్లేషకులు దీనిపై అంచనాలు వేస్తున్నారు.
టాప్-2 లో చెన్నై, గుజరాత్ : CSK, GT are in Top-2
మొదటి మ్యాచ్ లో ఓడిపోయినప్పటికీ తరువాతి మ్యాచ్‌లలో పుంజుకుని అగ్రస్థానంలోకి చేరుకున్న జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ (CSK) నిలిచింది. తరువాతి స్థానంలో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ (GT) ఉంది. ఈ రెండు జట్లూ కూడా తలో 10 పాయింట్లతో (10 points) పాయింట్ల పట్టికలో టాప్-2 (Top-2) లో కొనసాగుతున్నాయి. ఒకసారి ఆయా జట్లు సాధించిన విజయాలు, ఆయా జట్ల యొక్క ఆటతీరుతో భవిష్యత్ అంచనాలను ఒకసారి పరిశీలిద్దాం.
చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) : Chennai Super Kings (CSK)
గత 15 సీజన్ల ఐపీఎల్ లో రెండేళ్ల పాటు టోర్నీలో పాల్గొనకుండా నిషేధం ఎదురైనా చెన్నై సూపర్ కింగ్స్ పట్టుదలతో తిరిగి టోర్నీలో అడుగుపెట్టి టైటిల్ గెలుచుకుంది. మొత్తమ్మీద ఇప్పటివరకూ నాలుగుసార్లు ఐపీఎల్ టైటిళ్లను గెలుచుకుంది. మరో 5 సార్లు ఫైనల్స్ కి చేరుకుంది. ఇదంతా ఆ జట్టు సారథి ధోనీ సారథ్యంలోనే సాధ్యమయ్యింది. మిస్టర్ కూల్ ధోని సారథ్యంలోని సీఎస్కే (CSK) ఈ ఏడాది జరుగుతున్న 16 వ సీజన్ ఐపీఎల్ లో 7 మ్యాచ్‌లు ఆడిన చెన్నై 5 మ్యాచ్‌లు గెలిచింది. ఓడిన రెండు మ్యాచ్‌లు కూడా గత ఏడాది ఫైనలిస్ట్ జట్లు గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ కావడం గమనార్హం. సీఎస్కే మరో 4-5 మ్యాచ్‌లలో గెలిస్తే ప్లేఆఫ్స్‌కి చేరడం ఖాయం. సీఎస్కే ఖాతాలో 10 పాయింట్లు ఉన్నాయి. గుజరాత్ టీమ్ కి అన్నే పాయింట్లు ఉన్నప్పటికీ నెట్ రన్ రేట్ కారణంగా అగ్రస్థానంలో ఉంది.
గుజరాత్ టైటాన్స్ : Gujarat Titans
ఐపీఎల్ 15 వ సీజన్లో అడుగుపెట్టిన గుజరాత్ టైటాన్స్ (GT) టైటిల్ ఎగరేసుకుపోయి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అదే ఏడాది చూపించిన ప్రదర్శనను ఈ ఏడాది కూడా పునరావృతం చేస్తోంది. అన్ని విభాగాల్లోనూ పటిష్టంగా ఉన్న టైటాన్స్ జట్టు భారీ స్కోర్లు నమోదు చేయడంతో పాటుగా తక్కువ స్కోర్ల మ్యాచులను సైతం కాపాడుకుంటోంది. హార్థిక్ పాండ్యా సారథ్యంలోని టైటాన్స్ జట్టు 7 మ్యాచ్‌లు ఆడి 5 గెలిచింది. టైటాన్స్ టీమ్ ఫామ్ చూస్తుంటే ప్లేఆఫ్స్‌కి ఖచ్చితంగా చేరే అవకాశం ఉంది.
రాజస్థాన్ రాయల్స్ : Rajasthan Royals
ఐపీఎల్ లో గత కొన్ని సంవత్సరాలుగా నిలకడగా రాణిస్తున్న టీమ్ ఏదైనా ఉందంటే అది రాజస్థాన్ జట్టు మాత్రమే అని చెప్పవచ్చు. గతేడాది 15 వ సీజన్ ఐపీఎల్ లో ఫైనల్స్ కి చేరిన జట్టు గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచింది. ఇప్పుడు జరుగుతున్న 16 వ సీజన్ ఐపీఎల్ లో కూడా మొదటి 5 మ్యాచుల్లో 4 మ్యాచులను గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. అయితే మిగతా రెండు మ్యాచ్‌లు ఓడిపోవడంతో మూడో స్థానానికి పడిపోయింది. సంజూ శాంసన్ సారథ్యంలోని జట్టు ఇదేవిధంగా నిలకడగా ఆడితే ప్లేఆఫ్స్‌కి సునాయాసంగా చేరుకుంటుంది. ఇందుకోసం టీమ్ లోని బ్యాట్స్‌మన్లు, బౌలర్లు సమిష్టిగా రాణించాల్సి ఉంది.
లక్నో సూపర్ జెయింట్స్ : Lucknow Super Giants
నిలకడగా రాణిస్తున్న జట్టు ఒక్కసారిగా స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక ఓటమి చెంది పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది లక్నో సూపర్ జెయింట్స్ (LSG) టీమ్. గుజరాత్ టైటాన్స్ (GT) తో జరిగిన మ్యాచ్‌లో ఇది సంభవించింది. ఈ టీమ్ లో ఆల్‌రౌండర్లకు కొరత లేదు. అవకాశాలను వినియోగించుకుని ఉంటే మరింత మెరుగైన స్థితిలో ఉండేది. ఈ సీజన్‌లో ఆడిన 7 మ్యాచుల్లో 4 విజయాలు, 3 ఓటములతో పాయింట్ల పట్టికలో 4 వ స్థానంలో నిలిచింది. నిలకడగా, సామర్థ్యం ప్రకారం రాణిస్తే ప్లేఆఫ్స్ రేసులో లక్నో కూడా ఉంటుంది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : Royal Challengers Bangalore
ఐపీఎల్ లో వ్యక్తిగత, టీమ్ ప్రకారంగా రికార్డులు ఎక్కువ ఏ జట్టు సాధించిందంటే అది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) అని చెప్పవచ్చు. ఎంత నిలకడగా రాణించినప్పటికీ, ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ సాధించకపోవడం నిజంగా జట్టు దురదృష్టమని చెప్పవచ్చు. చాన్నాళ్లు కెప్టెన్ గా ఉన్న కోహ్లీ, ప్రస్తుత కెప్టెన్ డుప్లెసిస్ మంచి జోరులో ఉన్నారు. మహ్మద్ సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేస్తూ బ్యాట్స్‌మన్లకు ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. ఇప్పటివరకూ అందుబాటులో లేని స్టార్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ పూర్తి ఫిట్నెస్ తో ఉండడం జట్టుకి కలిసొస్తుందని చెప్పవచ్చు. ఈ సీజన్‌లో ఆడిన 7 మ్యాచుల్లో 4 విజయాలు, 3 ఓటములతో పాయింట్ల పట్టికలో 5 వ స్థానంలో నిలిచింది. లక్నో కూడా అన్నే విజయాలు ఉన్నప్పటికీ నెట్ రన్ రేట్ తక్కువగా ఉండడంతో 5 వ స్థానంలో నిలిచింది.
పంజాబ్ కింగ్స్ : Punjab Kings XI
భీకర ఫామ్‌లో ఉన్న కెప్టెన్ శిఖర్ ధావన్ గాయం కారణంగా దూరమవడంతో పంజాబ్ కింగ్స్ (PBKS) ను దురదృష్టం వెంటాడింది. దీంతో ఈ ఏడాది ఐపీఎల్ (IPL) సీజన్‌ను రెండు విజయాలతో ఘనంగా ఆరంభించిన పంజాబ్ టీమ్ ఆ తరువాత స్థాయికి తగ్గ ఆటను ప్రదర్శించలేకపోయింది. 7 మ్యాచుల్లో 4 మ్యాచులు గెలిచిన పంజాబ్ కింగ్స్ జట్టు నెట్ రన్ రేట్ తక్కువ ఉన్న కారణంగా 8 పాయింట్లతో పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో నిలిచింది. ఆల్‌రౌండర్, స్టార్ క్రికెటర్ లివింగ్ స్టోన్ జట్టుకు అందుబాటులోకి రావడం టీమ్ కి కలిసొచ్చే అవకాశమని చెప్పవచ్చు.
ముంబయి ఇండియన్స్ : Mumbai Indians
ఐపీఎల్ చరిత్రలో ఎంతో ఘనమైన రికార్డు ఉన్న ముంబై ఇండియన్స్ (MI) టీమ్ 16 వ సీజన్లో మాత్రం తీవ్రమైన నిలకడలేమితో పేలవమైన ప్రదర్శన కనబరుస్తోంది. రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై టీమ్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో బలహీనంగా ఉంది. బౌలర్లు ఆఖరి ఓవర్లలో (death overs) ధారాళంగా పరుగులు సమర్పిస్తున్నారు. ఈ సీజన్లో ప్రారంభంలో ఆడిన రెండు మ్యాచ్‌లు ఓడిపోయింది. తిరిగి పుంజుకుని వరుసగా మూడు మ్యాచ్‌లు గెలుపొందింది. ఆ తరువాత జరిగిన రెండు మ్యాచ్‌లు ఓటమి పాలై 3 విజయాలు, 4 ఓటములతో పాయింట్ల పట్టికలో 7 వ స్థానంలో నిలిచింది. అత్యధికంగా 5 ఐపీఎల్ టైటిల్స్ (5 IPL titles) సాధించిన జట్టుగా రికార్డు సృష్టించిన ముంబై ఇండియన్స్ తిరిగి పుంజుకుంటే నాకౌట్ చేరడం ఖాయం.
కోల్‌కతా నైట్ రైడర్స్ : Kolkata Knight Riders
నిలకడలేమి అనేది అన్ని జట్లకూ ప్రధానమైనది. మొదటి మ్యాచ్‌లో డక్ వర్త్ లూయిస్ పద్దతిలో ఓటమి చెందిన కోల్కతా నైట్ రైడర్స్ (KKR) జట్టు ఆ తరువాత జరిగిన రెండు మ్యాచ్‌లలో ఘన విజయం సాధించింది. ఇక జట్టు గాడిన పడింది అనుకుంటే ఆ తరువాత జరిగిన 4 మ్యాచుల్లో ఓటమి చెంది పాయింట్ల పట్టికలో 8 వ స్థానంలో నిలిచింది. గుజరాత్ తో జరిగిన మ్యాచ్‌లో రింకూ సింగ్ ఆఖరి ఓవర్లో 5 సిక్సులు కొట్టి జట్టుకి అద్భుతమైన విజయాన్ని అందించాడు. అయితే జట్టు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ గాయం కారణంగా మొత్తం లీగ్‌కు దూరమవడం జట్టు మనోస్థైర్యాన్ని దెబ్బతీసింది. జట్టులోని ఆల్ రౌండర్లు రస్సెల్, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి రాణిస్తే గనుక ప్లేఆఫ్స్‌కి చేరుకునే అవకాశం ఉంటుంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ : Sunrisers Hyderabad
కోట్లు ఖర్చు చేసి తెచ్చుకున్న ఇంగ్లాండ్ టెస్ట్ క్రికెట్ ఆటగాడు హ్యారీ బ్రూక్ ఒక్క మ్యాచ్‌లోనే సత్తా చాటగలిగాడు. కెప్టెన్ ని మార్చినా తలరాత మారలేదు. అదే సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) టీమ్ ప్రస్తుత పరిస్థితి. ఆటగాళ్ల గణాంకాలు చూస్తే ఎంతో బలంగా ఉన్న జట్టు... మైదానంలోకి దిగితే చతికిలబడుతోంది. ఇప్పటి వరకు సీజన్ ప్రారంభంలో మొదటి రెండు మ్యాచులలో ఓడి, తరువాతి రెండు మ్యాచుల్లో గెలుపొందింది. తరువాత వరుసగా జరిగిన మూడు మ్యాచుల్లో ఓడిపోయింది. హైదరాబాద్ జట్టు ఇప్పటివరకూ 7 మ్యాచుల్లో 2 విజయాలతో పాయింట్ల పట్టికలో 9 వ స్థానంలో ఉంది. కొత్త కెప్టెన్ మార్‌క్రమ్ ఆశించిన మేర జట్టును నడిపించలేక పోతున్నాడు. టీమ్ గనుక ఇంకో రెండు మ్యాచులలో ఓడితే మాత్రం ప్లేఆఫ్స్ ఆశలు వదులుకోవడమే.
ఢిల్లీ క్యాపిటల్స్ : Delhi Capitals
మొదటి 5 మ్యాచుల్లో వరుస ఓటమి. ఇక ఇంతేనా అనుకున్న సమయంలో కొత్త కెప్టెన్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్ (DC) జట్టు వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచి పాయింట్ల ఖాతా తెరిచింది. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ టీమ్ కెప్టెన్ రిషబ్ పంత్ మొత్తం లీగ్ కి డ్డూరమయ్యాడు. వార్నర్ సారథ్యంలోని జట్టుకి చెందిన బ్యాట్స్‌మన్లు పూర్తిగా విఫలమయ్యారు. ఇప్పటి నుంచి జరగబోయే అన్ని మ్యాచ్‌లు గెలిస్తేనే ప్లేఆఫ్స్ అవకాశాలు ఉంటాయి. పాయింట్ల పరంగా ఢిల్లీ టీమ్ చివరి స్థానంలో నిలిచింది.
IPL 2023 పాయింట్ల పట్టిక : IPL 2023 Points table