కశ్మీర్ బ్యాక్ డ్రాప్ లవస్టోరీగా 'ఖుషి' మూవీ : Kashmir backdrop love story 'Khushi' movie

కశ్మీర్ బ్యాక్ డ్రాప్ లవస్టోరీగా 'ఖుషి' మూవీ : Kashmir backdrop love story 'Khushi' movie

సమంతా రూత్ ప్రభు (Samantha), విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) నటించిన తాజా చిత్రం 'ఖుషి' (Khushi). వీరిద్దరి కలయికలో 2018 లో వచ్చిన చిత్రం మహానటి తర్వాత కలిసి నటిస్తున్న చిత్రం మతాల మధ్య సాగే ప్రేమకథగా, కశ్మీర్ బ్యాక్ డ్రాప్ లవస్టోరీగా (Kashmir backdrop love story) తెరకెక్కుతోంది. చిత్రం యొక్క ట్రైలర్ విడుదలైన తరువాత ప్రేక్షకులను ఆకట్టుకుందని చెప్పాలి. మతాంతర ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కిన చిత్రం కశ్మీర్లోని సుందరమైన పరిసరాలు, అక్కడి అద్భుత దృశ్యాల మధ్య చిత్రాన్ని ఎంతో సుందరంగా తీర్చిదిద్దారు. ఇది వచ్చే నెల సెప్టెంబరు 1    తేదీన థియేటర్లలో విడుదల (releasing on September 1st) కానుంది. చాన్నాళ్లుగా విజయం కోసం ఎదురు చూస్తున్న విజయ్ దేవరకొండ, సమంత చిత్రం విజయంపై ఎనో ఆశలు పెట్టుకున్నారు.

 

2 నిమిషాల 41 సెకన్ల నిడివి గల ట్రైలర్లో విక్రమ్ (విజయ్) కాశ్మీర్కు వెళతాడు. అక్కడ ఆరాధ్య (సమంత) తో అతను ప్రేమలో పడతాడు. అమ్మాయి బ్రాహ్మణురాలిగా మారుతుంది. ఇద్దరూ కూడా తమ తల్లిదండ్రులను తమ పెళ్ళికి అంగీకరించేలా చేయడానికి తమ వంతు ప్రయత్నం చేస్తారు. అది కుదరకపోవడంతో ఎదో ఒక విధంగా పెళ్లి చేసుకుంటారు. అయితే, వీరి కష్టాలు అక్కడితో ముగియవు. ఇప్పుడు వివాహం చేసుకున్న తరువాత ఆరాధ్య, విక్రమ్ వైవాహిక జీవితాన్ని ముందుకి నడపడం ఎంతో కష్టంగా ఉంటుంది. ఒకరితో ఒకరు నిరంతరం యుద్ధం చేస్తూ ఉంటారు. వీరిద్దరి వైవాహిక జీవితం అల్లకల్లోలంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్రంలో అంచనాలు వేసినప్పటికీ వీరిద్దరూ పెళ్లి చేసుకొని అవినాభావ బంధం ఉందని నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు ట్రైలర్లో చూపించారు.

 

ఖుషి గురించి : About Khushi movie

శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఖుషి సినిమాలో జయరామ్, సచిన్ ఖేడాకర్, మురళీ శర్మ, లక్ష్మి, అలీ, రోహిణి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య తదితరులు నటించారు. ట్రైలర్కి కౌంట్డౌన్ సెట్ చేయడానికి సమంతా చిత్రం నుండి కొత్త పోస్టర్ను సినిమా బృందం షేర్ చేసింది. ఇందులో విజయ్ దేవరకొండ, సమంత కలిసి నేలపై కూర్చుని ఉన్నట్లు చూపించారు. టైటిల్ సాంగ్... నా రోజా నువ్వే, చిత్రంలోని మరో మూడు రొమాంటిక్ పాటలు ఇప్పటికే విడుదలయ్యాయి. ఇవి విజయ్, సమంత అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

<iframe width="560" height="315" src="https://www.youtube.com/embed/AsvGScyj4gw" title="YouTube video player" frameborder="0" allow="accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture; web-share" allowfullscreen></iframe>

2018 చిత్రం మహానటి తర్వాత సమంత, విజయ్ కలయికలో ఖుషి చిత్రం రానుంది. చిత్ర నిర్మాత శివతో సమంతకు ఇది రెండో చిత్రం కూడా. అతను ఇంతకు ముందు 2019 లో వచ్చిన అద్భుతమైన చిత్రం 'మజిలీ'కి దర్శకత్వం వహించాడు, ఇందులో సమంత మాజీ భర్త నాగ చైతన్య కూడా నటించాడు. తన ఆరోగ్యంపై దృష్టి పెట్టడానికి సినిమాల నుండి కొన్ని నెలలు విరామం తీసుకున్న సమంత, ఖుషి ప్రమోషన్స్ కోసం సమయం కేటాయించాలని భావించిన తరువాత ఆమె ఇటీవల బాలిలో విహారయాత్ర నుండి తిరిగి వచ్చింది.

 

విజయ్, సమంతలకు ఖుషి చాలా ముఖ్యం : Important movie to Samantha and Vijay

ఖుషి సినిమా విజయ్, సమంతా ఇద్దరికీ ఎంతో ముఖ్యమైన చిత్రంగా ఉండనుంది. ఎందుకంటే వీరిద్దరూ చివరిగా నటించిన భారీ బడ్జెట్ చిత్రాలు విడుదలైన తరువాత బాక్సాఫీస్ వద్ద సరైన విజయాన్ని అందుకోలేదు. విజయ్ గత సంవత్సరం అనన్య పాండే సరసన లైగర్ చిత్రంతో హిందీ చలనచిత్ర రంగంలో (Vijay in Liger Hindi movie) ప్రవేశం చేసాడు. అయితే ఇది విమర్శకులు, సినీ ప్రేక్షకుల నుండి ఏమాత్రం అంచనాలను అందుకోలేక బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. సమంత కూడా ఎంతో నమ్మకం పెట్టుకుని విజయంపై ఎంతో నమ్మకంతో ఎదురు చూసిన చిత్రం శాకుంతలం కూడా మేకర్స్ ఎంతో భారీ అంచనా వ్యయంతో VFX తో నిర్మాణం చేసినప్పటికీ అంచనాలకు అనుగుణంగా ఆడలేక సమంతకు నిరాశను మిగిల్చింది.

 

ఖుషి సినిమాతో పాటు, విజయ్... శ్రీలీలతో కలిసి గౌతమ్ తిన్ననూరి నిర్మిస్తున్న నూతన చిత్రానికి తాత్కాలికంగా VD 12 అనే టైటిల్ను పెట్టారు. సమంతా వెబ్ సిరీస్లో కూడా నటించింది. వరుణ్ ధావన్తో కలిసి కలిసి రస్సో బ్రదర్స్ యాక్షన్ సిరీస్ సిటాడెల్ లో నటించిన వెబ్ సిరీస్ ను రాజ్, DK నిర్మించారు. వెబ్ సిరీస్ ను అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం అవుతుంది.

 

ఖుషి సినిమా మజిలీ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వం (Director Shiva) వహించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం. చిత్రంలో విజయ్ దేవరకొండ, సమంత ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇంకా చిత్రంలో మిగిలిన ప్రధాన పాత్రల్లో జయరామ్, సచిన్ ఖేడాకర్, మురళీ శర్మ, లక్ష్మి, అలీ, రోహిణి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, ఇంకా పలువురు సహాయక పాత్రల్లో నటిస్తున్నారు. చిత్రానికి సంగీతాన్ని హేషమ్ అబ్దుల్ వహాబ్ (Music by Hesham Abdul Wahab) అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ జి మురళి (Cinematography by G Murali) నిర్వహిస్తుండగా, ఎడిటర్ గా ప్రవీణ్ పూడి (Praveen Pudi as Editor) బాధ్యతలు నిర్వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై (Mytri Movie Makers) నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి (Producers Naveen Yerneni, Ravi Shankar Yalamanchili) చిత్రాన్ని నిర్మించారు.