150 కోట్లు దాటిన అలియా వ్యాపారం : Alia business crossed 150 crores
సినిమాల్లో నటించడంతో పాటుగా వ్యాపారంలోనూ (Business) రాణిస్తోంది బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ (Alia Bhatt). తల్లిగా, భార్యగా, హీరోయిన్ గా ఇప్పుడు బిజినెస్ వుమెన్ గా ఇలా నిజ జీవితంలో (real life) అన్ని పాత్రలకు న్యాయం చేస్తోంది అలియా.

150 కోట్లు దాటిన అలియా వ్యాపారం : Alia business crossed 150 crores
సినిమాల్లో నటించడంతో పాటుగా వ్యాపారంలోనూ (Business) రాణిస్తోంది బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ (Alia Bhatt). తల్లిగా, భార్యగా, హీరోయిన్ గా ఇప్పుడు బిజినెస్ వుమెన్ గా ఇలా నిజ జీవితంలో (real life) అన్ని పాత్రలకు న్యాయం చేస్తోంది అలియా.
బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ (Alia Bhatt) 2022 నుంచి నిర్వహిస్తున్న దుస్తుల వ్యాపారం 150 కోట్లను దాటింది. ఆర్ఆర్ఆర్ (RRR) మూవీతో తెలుగు సినీ ప్రేక్షకులను అలరించిన అలియా భట్ గత ఏడాది ఎడ్-ఎ-మమ్మా (Ed-a-mamma) అనే బ్రాండ్ పేరుతో బట్టల విక్రయాలను కూడా మొదలుపెట్టింది. అభిమానుల ఆదరాభిమానాలతో పాటుగా, అలియా భట్ తాను నిర్వహిస్తున్న వ్యాపారం (business) కూడా లాభసాటిగా సాగడంతో అలియా ఆనందానికి అవధులు లేవు. ఇప్పుడు అలియా భట్ పాన్ ఇండియా హీరోయిన్ గా మారిందనడంలో అతిశయోక్తి లేదు.
అలియా స్థాపించిన కంపెనీ (Alia company) లో చిన్న పిల్లల (for kids) నుంచి 14 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవారికి దుస్తులు (dresses) అందుబాటులో ఉంటాయి. కంపెనీకి చెందిన ఆన్లైన్ వెబ్సైట్లో (online website) సుమారు 700 నుంచి 800 వరకు బ్రాండెడ్ వస్తువులు (branded) అందుబాటులో ఉంటాయి. వ్యాపారం ప్రారంభించిన ఏడాది కాలంలోనే కంపెనీ విలువ 10 రెట్లు పెరగడం (within one year 10 times growth) విశేషం. అలియా భట్ హీరోయిన్ గా గ్లామర్ పాత్రలతో (glamor roles) పాటు ప్రాధాన్యమున్న పాత్రల్లో నటిస్తూ (lead roles) కోట్లాది మంది అభిమానులని సంపాదించుకుంది.
వ్యాపారంలోనూ రాణిస్తున్న అలియా భట్ : Alia Bhatt excels in business
ఇటీవలే మార్చి 15 వ తేదీన 30 వ (15th March 30th birthday) పుట్టిన రోజుని జరుపుకుంది అలియా భట్ రణ్ బీర్ కపూర్ ను ప్రేమించి 2022 ఏప్రిల్ 14న పెళ్లి (married Ranbir Kapoor) చేసుకుంది. పెళ్ళికి ముందే గర్భవతి అయిన అలియా ఆడబిడ్డకు (girl child) జన్మనిచ్చింది. ఉత్తమ జంటగా (best couple) అలియా-రణ్ బీర్ బాలీవుడ్ లో నిలిచారు. తాము ఎంతో అన్యోన్యంగా ఉంటామని ఎప్పుడూ చెప్పే అలియా బిజినెస్ (Alia business) నిర్వహించడానికి ఎన్నో విషయాలను నేర్చుకున్నట్లు ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. పెద్ద ఎత్తున బిజినెస్ కాకుండా ఏదో సరదాగా చేద్దామని (casually started the business) మొదలు పెట్టానని, అయితే అనుకోకుండా ఇది ఊహించని విధంగా కేవలం 12 నెలల వ్యవధిలోనే 150 కోట్ల రూపాయల వ్యాపారానికి (in12 months reached 150 crores business) చేరడం తనకు ఎంతో ఆనందంగా ఉందని సంతోషం వ్యక్తం చేసింది.
అలియా ఎడ్-ఎ-మామా (Ed-a-mama) లో మాత్రమే కాకుండా… నైకా, ఫూల్.కో, స్టైల్ క్రేకర్ వంటి కంపెనీల్లో (invested in companies) కూడా పెట్టుబడులు పెట్టింది. అంతే కాకుండా అలియా భట్ 'ఎటర్నల్ సన్ షైన్ ప్రొడక్షన్స్' (Eternal Sunshine Productions) అనే సొంత నిర్మాణ సంస్థ ను కూడా స్థాపించింది. ఫోర్బ్స్ వెల్లడించిన నివేదికల (as per Forbes reports) ప్రకారం 2017 లో 39.88 కోట్ల (39.88 crores) రూపాయలు రాగా, 2018 వ సంవత్సరంలో అది 58.83 కోట్ల (58.83 crores) రూపాయలకు, 2019 వ సంవత్సరంలో అది 59.21 కోట్లకు (59.21 crores) చేరింది. ఇప్పుడు ఏకంగా 150 కోట్లకు చేరుకోవడం విశేషం. అద్భుతమైన నటనతో సినీ రంగంలో రాణిస్తున్న అలియా బిజినెస్ విమెన్ (business women) గా కూడా విజయవంతం కావాలని అభిమానులు ఆశిస్తున్నారు.
అలియా సినీ కెరీర్ : Alia cine career
2012 లో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ (Student of the year) సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది అలియా. ఆ తరువాత విజయవంతమైన ఎన్నో చిత్రాల్లో నటించి సినీ ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. హైవే (Highway), రాజి (Razi), ఉడతా పంజాబ్ (Udatha Punjab), గల్లీ బాయ్ (Gully boy) వంటి హిట్ చిత్రాల్లో నటించింది. బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన గంగూభాయ్ కతియావాడి (Gangubai Kathiawadi) చిత్రంలో అలియా భట్ తన నటనా విశ్యరూపం ప్రదర్శించింది. ఈ చిత్రంతో ఆమె స్టార్ హీరోయిన్ గా మారిందనడంలో సందేహం లేదు. టాలీవుడ్ లోకి (tollywood) ఇటీవలే ఆస్కార్ అందుకున్న ఆర్ఆర్ఆర్ (RRR) మూవీతో ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంలోని అలియా నటన తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. రాబోయే కాలంలో అలియా తెలుగులో మరిన్ని చిత్రాల్లో అలియా నటించాలని అభిమానులు ఆశిస్తున్నారు.
అలియా భట్ గురించి : About Alia Bhatt
జన్మ తేదీ : 15 మార్చి 1993 (30 సంవత్సరాలు)
భర్త (Spouse) : రణబీర్ కపూర్
తల్లిదండ్రులు (Parents) : మహేష్ భట్, సోని రజ్దాన్
రాబోయే చిత్రాలు (upcoming movies) : హార్ట్ ఆఫ్ స్టోన్ (Heart of stone), రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ (Rocky Aur Rani Ki Prem Kahani)