వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్లు : highest individual scores in odis

అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌ల్లో వ్యక్తిగతంగా అత్యధిక పరుగులు చేసిన టాప్ ఆటగాళ్లలో భారత్ కి చెందిన క్రికెటర్లే అత్యధికంగా ఉండడం గమనార్హం. వీరందరిలో రోహిత్ శర్మ అగ్ర స్థానంలో ఉన్నాడు.

వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్లు : highest individual scores in odis

వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్లు : highest individual scores in odis

అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌ల్లో వ్యక్తిగతంగా అత్యధిక పరుగులు చేసిన టాప్ ఆటగాళ్లలో భారత్ కి చెందిన క్రికెటర్లే అత్యధికంగా ఉండడం గమనార్హం. వీరందరిలో రోహిత్ శర్మ అగ్ర స్థానంలో ఉన్నాడు. రోహిత్ శర్మ మొత్తం మూడు డబల్ సెంచరీలు చేసాడు. టాప్ లో ఉన్న ఆటగాళ్లు అందరూ డబల్ సెంచరీలు సాధించడం విశేషం. అత్యధిక వ్యక్తిగత పరుగులను సాధించిన వారి వివరాలను ఒకసారి పరిశీలిద్దాం.

 

1. రోహిత్ శర్మ 264, ఇండియా : Rohit Sharma 264, India

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మ అంతర్జాతీయ వన్డే క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ గా మొదటి స్థానంలో నిలిచాడు. 13 నవంబర్ 2014 న శ్రీలంకతో ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన మ్యాచ్ లో రోహిత్ శర్మ 152.60 స్ట్రయిక్ రేట్ తో 264 పరుగులు చేసాడు. కేవలం 173 బంతులను మాత్రమే ఎదుర్కొన్న రోహిత్ డబల్ సెంచరీలో 33 ఫోర్లు, 9 సిక్సర్లు ఉన్నాయి.

2. మార్టిన్ గుప్తిల్ 237*, న్యూజిలాండ్ : Martin Guptill 237*, New Zealand 

న్యూజిలాండ్ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ మార్టిన్ గుప్తిల్ 21 మార్చి 2010 న వెస్టిండీస్ తో జరిగిన మార్చిలో అంతర్జాతీయ వన్డే క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత పరుగుల విభాగంలో రెండవ స్థానంలో నిలిచాడు. ఈ మ్యాచ్ లో మార్టిన్ 163 బంతుల్లో 237 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. 24 ఫోర్లు, 11 భారీ సిక్సర్లతో ఈ స్కోర్ సాధించాడు, 145.39 స్ట్రయిక్ రేట్

3. వీరేంద్ర సెహ్వాగ్ 219, ఇండియా : Virendra Sehwag 219, India  

వచ్చిన బాల్ ని వచ్చినట్లు స్టాండ్స్ లోకి పంపించడమే ధ్యేయంగా బ్యాటింగ్ చేసే సెహ్వాగ్ భారతీయ జట్టులో ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్. 2011 డిసెంబర్ 8 న ఇండోర్ లో వెస్టిండీస్ తో జరిగిన వన్డే మ్యాచ్ లో సెహ్వాగ్ 149 బంతుల్లో 219 పరుగులను సాధించాడు. ఇందులో 25 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి. సెహ్వాగ్ స్ట్రయిక్ రేట్ 146.97

 

4. క్రిస్ గేల్ 215, వెస్టిండీస్ : Chris Gayle 215, West Indies

యూనివర్సల్ మాస్టర్ గా పేరొందిన వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్ 2015 ఫిబ్రవరి 24 న జింబాబ్వేతో జరిగిన వన్డే మ్యాచ్ లో 147 బంతుల్లో 215 పరుగులను సాధించాడు. కాన్బెర్రాలో జరిగిన ఈ మ్యాచ్ లో క్రిస్ గేల్ చెలరేగి 10 ఫోర్లు, 16 భారీ సిక్సర్లతో విరుచుకుపడి ఈ పరుగులను చేసాడు. గేల్ స్ట్రయిక్ రేట్ 146.25

5. ఫఖర్ జమాన్ 210*, పాకిస్తాన్ : Fakhar Zaman 210*, Pakistan

పాకిస్థాన్ కి చెందిన ఫఖర్ జమాన్ జింబాబ్వేపై 156 బంతుల్లో 210 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. 2018 జులై 20 వ తేదీన బులవాయోలో జరిగిన ఈ మ్యాచ్ లో 134.61 స్ట్రయిక్ రేట్ తో ఈ పరుగులను సాధించాడు. ఫఖర్ ఇన్నింగ్స్ లో 24 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి.

6. ఇషాన్ కిషన్ 210, ఇండియా : Ishan Kishan 210, India

భారతీయ బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్ చట్టోగ్రామ్ లో 10 డిసెంబర్ 2022 న జరిగిన మ్యాచ్ లో ఆకాశమే హద్దుగా చెలరేగి తన డబల్ సెంచరీని సాధించాడు. 131 బంతుల్లో 210 పరుగులు చేసిన ఇషాన్ ఇన్నింగ్స్ లో 24 ఫోర్లు, 10 సిక్సులు ఉన్నాయి. ఇషాన్ 134.61 స్ట్రయిక్ రేట్ 160.30 కావడం గమనార్హం.

7. రోహిత్ శర్మ 209, ఇండియా : Rohit Sharma 209, India

రోహిత్ శర్మ అంతర్జాతీయ వన్డే క్రికెట్లో తన మొదట్టమొదటి డబల్ సెంచరీని 2 నవంబర్ 2013 న బెంగళూర్ లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో రోహిత్ శర్మ 132.27 స్ట్రయిక్ రేట్ తో 209 పరుగులు చేసాడు. కేవలం 158 బంతులను మాత్రమే ఎదుర్కొన్న రోహిత్ డబల్ సెంచరీలో 12 ఫోర్లు, 16 సిక్సర్లు ఉన్నాయి.

8. రోహిత్ శర్మ 208*, ఇండియా : Rohit Sharma 208*, India

రోహిత్ శర్మ తన మూడవ డబల్ సెంచరీని 2017 డిసెంబర్ 13 న మొహాలీలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో సాధించాడు. 153 బంతులను ఎదుర్కొన్న రోహిత్ శర్మ 208 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఇందులో 13 ఫోర్లు, 12 సిక్సర్లు ఉన్నాయి. 135.94 రోహిత్ బ్యాటింగ్ స్ట్రయిక్ రేట్.

9. శుభమన్ గిల్ 208, ఇండియా : Shubhaman Gill 208, India

భారత వర్ధమాన క్రికెటర్లలో తనదైన ముద్ర వేసుకున్న బ్యాట్స్‌మెన్ గా శుభమన్ గిల్ నిలిచాడు. ఈ ఏడాది జనవరి 18 న హైదరాబాద్ లో న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో శుభమం 149 బంతుల్లో 208 పరుగులను సాధించాడు. ఈ డబల్ సెంచరీలో 19 ఫోర్లు, 9 సిక్సర్లు ఉన్నాయి. శుభమన్ బ్యాటింగ్ స్ట్రయిక్ రేట్ 139.59 గా ఉంది.

 

10. సచిన్ టెండూల్కర్ 200*, ఇండియా : Sachin Tendulkar 200*, India

క్రికెట్ ఆఫ్ గాడ్ గా పిలవబడే సచిన్ టెండూల్కర్ ప్రపంచ క్రికెట్లో ఎన్నో రికార్డులను సృష్టించాడు. వన్డేల్లో కూడా మొట్ట మొదటి సెంచరీని సాధించిన బ్యాట్స్‌మెన్ గా కూడా సచిన్ నిలిచాడు. 2010 ఫిబ్రవరి 24 న గ్వాలియర్ లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో సచిన్ తన డబల్ సెంచరీని సాధించాడు. 147 బంతులను ఎదుర్కొన్న సచిన్ సరిగ్గా 200 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇందులో 25 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. స్ట్రయిక్ రేట్ 136.05

 

అంతర్జాతీయంగా టెస్టులు, వన్డేలు, టీ20లు ఇలా అన్ని ఫార్మాట్లలో ఎందరో బ్యాట్స్‌మెన్‌లు ఎప్పటికప్పుడు ఆయా రికార్డులను సవరిస్తూ ఉంటారు. ఇప్పటికే ఎందరో వర్ధమాన క్రికెటర్లు తమ బ్యాటింగ్ నైపుణ్యంతో పరుగుల వరద పారిస్తూ రికార్డుల మీద రికార్డులను సాధిస్తున్నారు. ఇప్పటికే ఉన్న ఈ వన్డే క్రికెట్ లోని డబల్ సెంచరీల రికార్డులు కూడా ఎప్పుడో ఒకప్పుడు బద్దలవుతాయనడంలో సందేహమే లేదని చెప్పవచ్చు. కోట్లాది మందిని ఎంతగానో అలరిస్తున్న క్రికెట్ మరింత అభివృద్ధి చెందాలని ఆశిద్దాం.