మరో 50 రోజుల్లో వన్డే ప్రపంచ కప్ : ODI World Cup 50 days to go

క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న పురుషుల వన్డే ప్రపంచ కప్ (Men's ODI World Cup) మరో 50 రోజుల్లో ప్రారంభం కానుంది.

మరో 50 రోజుల్లో వన్డే ప్రపంచ కప్ : ODI World Cup 50 days to go

క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న పురుషుల వన్డే ప్రపంచ కప్ (Men's ODI World Cup) మరో 50 రోజుల్లో ప్రారంభం కానుంది. దీని కోసం క్రికెట్ ప్రేమికులు ఎంతో ఉత్ఖంఠంగా ఎదురు చూస్తున్నారు. ప్రపంచ కప్ కి సంబంధించిన మ్యాచ్ వివరాలు, మ్యాచ్ లు జరిగే మైదానాల వివరాలు, పూర్తి షెడ్యూల్ ను ఒకసారి పరిశీలిద్దాం.

 

పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ 13 ఎడిషన్ అక్టోబర్ 5 నుండి నవంబర్ 19, 2023 వరకు భారతదేశంలో జరగనుంది. 2023 సంవత్సరంలో జరిగే 50 ఓవర్ల ప్రపంచ కప్ ప్రారంభ మ్యాచ్ ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య అక్టోబర్ 5 అహ్మదాబాద్లో జరగనుంది. టీమ్ ఇండియా తన మొదటి మ్యాచ్ ను అక్టోబర్ 8 చెన్నైలో ఆస్ట్రేలియాతో ఆడనుంది. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఉత్ఖంఠంగా ఎదురు చూసే ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ అక్టోబర్ 14 అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. ఇతర ముఖ్యమైన మ్యాచ్ల్లో అక్టోబర్ 29 ధర్మశాలలో ఆస్ట్రేలియా న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. నవంబర్ 4 అహ్మదాబాద్లో ఆస్ట్రేలియా ఇంగ్లండ్ జట్ల మధ్య, నవంబర్ 1 పుణెలో న్యూజిలాండ్ సౌతాఫ్రికా  జట్ల మధ్య, బెంగళూరులో భారత్ నెదర్లాండ్స్  జట్ల మధ్య చివరి లీగ్ దశ మ్యాచ్ నవంబర్ 12 జరగనున్నాయి.

 

2023 లో జరిగే వన్డే ప్రపంచ కప్ వేదికలు పూర్తిగా ప్రకటించారు. ఇందులో వార్మప్ మ్యాచ్ మైదానాలు కూడా ఉన్నాయి. వన్డే ప్రపంచ కప్ 2023కి భారతదేశం పూర్తిగా ఆతిథ్యం ఇవ్వనుంది. భారత ఉపఖండంలోని ఇతర దేశాలతో కలిసి 1987, 1996 2011 టోర్నమెంట్లను సంయుక్తంగా నిర్వహించిన తర్వాత, భారతదేశం పూర్తిగా టోర్నమెంట్ను నిర్వహించడం ఇదే మొదటిసారి.

 

అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ధర్మశాల, హైదరాబాద్, కోల్కతా, లక్నో, ముంబై మరియు పూణే ఇలా మొత్తం 10 వేదికలు ఆయా దేశాల మధ్య జరిగే మ్యాచ్ కోసం ఆతిథ్యం ఇవ్వనున్నాయి. అంతే కాకుండా హైదరాబాద్, గౌహతి మరియు తిరువనంతపురంలోని మైదానాలు సెప్టెంబర్ 29 నుండి అక్టోబర్ 3 వరకు వార్మప్ మ్యాచ్లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. పురుషుల ఐసీసీ ప్రపంచ కప్ 2023కి నేరుగా అర్హత సాధించిన జట్లలో న్యూజిలాండ్, ఇంగ్లండ్, భారత్ (ఆతిథ్య), బంగ్లాదేశ్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, దక్షిణాఫ్రికా ఉన్నాయి. వీటితో పాటుగా నెదర్లాండ్స్, శ్రీలన్క జట్లు అర్హత మ్యాచ్ ఫలితం ఆధారంగా టోర్నమెంట్ కి అర్హత సాధించాయి. మొత్తం 10 జట్లు ప్రపంచ కప్ టోర్నీలో పాల్గొననున్నాయి.

 

10 జట్లను ఐదు చొప్పున రెండు గ్రూపులుగా విభజించారు, ఒక్కో జట్టు గ్రూప్ దశలో మ్యాచ్లు ఆడుతుంది. ప్రతి గ్రూప్ నుండి మొదటి నాలుగు జట్లు టోర్నీలో నాకౌట్ దశకు చేరుకుంటాయి.

 

2023 ప్రపంచ కప్ అర్హత ప్రక్రియ

ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్ లో ఐదు జట్లు చొప్పున రెండు గ్రూపులుగా విభజించారు. ఆయా జట్లు రౌండ్ రాబిన్ ఫార్మాట్లో మ్యాచుల్లో పోటీ పడతాయి, ప్రతి జట్టు తొమ్మిది మ్యాచ్ చొప్పున ఆడుతుంది. క్వాలిఫైయర్ టోర్నమెంట్లో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు 2023 ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ఫైనల్ కి చేరుకుంటాయి.

 

ఐసీసీ వన్డే ప్రపంచ కప్ 2023 పూర్తి షెడ్యూల్ : ICC ODI World Cup 2023 Full Schedule

అక్టోబర్ 5 ఇంగ్లాండ్ vs న్యూజిలాండ్, అహ్మదాబాద్

అక్టోబర్ 6 పాకిస్థాన్ vs నెదర్లాండ్స్, హైదరాబాద్

అక్టోబర్ 7 బంగ్లాదేశ్ vs ఆఫ్ఘనిస్తాన్ (డి), ధర్మశాల

అక్టోబర్ 7 దక్షిణాఫ్రికా vs శ్రీలంక, ఢిల్లీ

అక్టోబర్ 8 ఇండియా vs ఆస్ట్రేలియా, చెన్నై

అక్టోబర్ 9 న్యూజిలాండ్ vs నెదర్లాండ్స్, హైదరాబాద్

అక్టోబర్ 10 ఇంగ్లాండ్ vs బంగ్లాదేశ్ (డి), ధర్మశాల

అక్టోబర్ 10 పాకిస్థాన్ vs శ్రీలంక, హైదరాబాద్

అక్టోబర్ 11 ఇండియా vs ఆఫ్ఘనిస్తాన్, ఢిల్లీ

అక్టోబర్ 12 ఆస్ట్రేలియా vs దక్షిణాఫ్రికా, లక్నో

అక్టోబర్ 13 న్యూజిలాండ్ vs బంగ్లాదేశ్, చెన్నై

అక్టోబర్ 14 భారత్ vs పాకిస్థాన్, అహ్మదాబాద్

అక్టోబర్ 15 ఇంగ్లండ్ vs ఆఫ్ఘనిస్తాన్, ఢిల్లీ

అక్టోబర్ 16 ఆస్ట్రేలియా vs శ్రీలంక, లక్నో

అక్టోబర్ 17 దక్షిణాఫ్రికా vs నెదర్లాండ్స్, ధర్మశాల

అక్టోబర్ 18 న్యూజిలాండ్ vs ఆఫ్ఘనిస్తాన్, చెన్నై

అక్టోబర్ 19 భారత్ vs బంగ్లాదేశ్, పూణె

అక్టోబర్ 20 ఆస్ట్రేలియా vs పాకిస్థాన్, బెంగళూరు

అక్టోబర్ 21 నెదర్లాండ్స్ vs శ్రీలంక (డి), లక్నో

అక్టోబర్ 21 ఇంగ్లండ్ vs సౌతాఫ్రికా, ముంబై

అక్టోబర్ 22 భారత్ vs న్యూజిలాండ్, ధర్మశాల

అక్టోబర్ 23 పాకిస్థాన్ vs ఆఫ్ఘనిస్తాన్, చెన్నై

అక్టోబర్ 24 దక్షిణాఫ్రికా vs బంగ్లాదేశ్, ముంబై

అక్టోబర్ 25 ఆస్ట్రేలియా vs నెదర్లాండ్స్, ఢిల్లీ

అక్టోబర్ 26 ఇంగ్లండ్ vs శ్రీలంక, బెంగళూరు

అక్టోబర్ 27 పాకిస్థాన్ vs దక్షిణాఫ్రికా, చెన్నై

అక్టోబర్ 28 ఆస్ట్రేలియా vs న్యూజిలాండ్ (డి), ధర్మశాల

అక్టోబర్ 28 నెదర్లాండ్స్ vs బంగ్లాదేశ్, కోల్కతా

అక్టోబర్ 29 భారత్ vs ఇంగ్లాండ్, లక్నో

అక్టోబర్ 30 ఆఫ్ఘనిస్తాన్ vs శ్రీలంక, పూణే

అక్టోబర్ 31 పాకిస్థాన్ vs బంగ్లాదేశ్, కోల్కతా

నవంబర్ 1 న్యూజిలాండ్ vs సౌతాఫ్రికా, పూణె

నవంబర్ 2 భారత్ vs శ్రీలంక, ముంబై

నవంబర్ 3 నెదర్లాండ్స్ vs ఆఫ్ఘనిస్తాన్, లక్నో

నవంబర్ 4 న్యూజిలాండ్ vs పాకిస్థాన్ (డి), బెంగళూరు

నవంబర్ 4 ఇంగ్లండ్ vs ఆస్ట్రేలియా, అహ్మదాబాద్

నవంబర్ 5 భారత్ vs సౌతాఫ్రికా, కోల్కతా

నవంబర్ 6 బంగ్లాదేశ్ vs శ్రీలంక, ఢిల్లీ

నవంబర్ 7 ఆస్ట్రేలియా vs ఆఫ్ఘనిస్తాన్, ముంబై

నవంబర్ 8 ఇంగ్లండ్ vs నెదర్లాండ్స్, పూణె

నవంబర్ 9 న్యూజిలాండ్ vs శ్రీలంక, బెంగళూరు

నవంబర్ 10 సౌతాఫ్రికా vs ఆఫ్ఘనిస్తాన్, అహ్మదాబాద్

నవంబర్ 11 ఆస్ట్రేలియా vs బంగ్లాదేశ్ (డి), పూణె

నవంబర్ 11 ఇంగ్లండ్ vs పాకిస్థాన్, కోల్కతా

నవంబర్ 12 భారత్ vs నెదర్లాండ్స్, బెంగళూరు

నవంబర్ 15 సెమీఫైనల్ 1 మ్యాచ్ మొబైలో జరగనుంది

నవంబర్ 16 సెమీఫైనల్ 2 మ్యాచ్ కోల్కతాలో జరగనుంది

నవంబర్ 19 ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది.

 

నెల 25 నుండి అందుబాటులో ఆన్లైన్లో టిక్కెట్లు : Online tickets available from 25th of this month

2023 వన్డే ప్రపంచ కప్ కోసం నెల 25 నుండి ఆన్లైన్లో టిక్కెట్లు అందుబాటులో ఉండనున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) తెలిపింది. ఇందుకోసం ఒక లింక్ ని ఐసీసీ ప్రవేశ పెట్టింది. లింక్ ద్వారా టిక్కెట్లు కావాల్సిన వారు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పేర్కొంది. 12 భారతీయ నగరాల్లో 5 అక్టోబర్ మరియు 19 నవంబర్ మధ్య జరిగే ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ టిక్కెట్ల నమోదును https://www.cricketworldcup.com/register ఇక్కడ యాక్సెస్ చేయవచ్చు. ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లను చూసే ఉత్తమ అవకాశాన్ని వీలైనంత ఎక్కువ మంది అభిమానులకు అందించడానికి, టిక్కెట్లు క్రింది తేదీలలో దశలవారీగా అమ్మకానికి వస్తాయి:

 

25 ఆగస్ట్ : నాన్-ఇండియా వార్మప్ మ్యాచ్లు మరియు అన్ని నాన్-ఇండియా ఈవెంట్ మ్యాచ్లు

30 ఆగస్టు : గౌహతి మరియు తిరువనంతపురంలో భారత్ మ్యాచ్లు

31 ఆగస్టు : చెన్నై, ఢిల్లీ మరియు పుణెలో భారత్ మ్యాచ్లు

1 సెప్టెంబర్ : ధర్మశాల, లక్నో మరియు ముంబైలో భారత్ మ్యాచ్లు

2 సెప్టెంబర్ : బెంగళూరు మరియు కోల్కతాలో భారత్ మ్యాచ్లు

3 సెప్టెంబర్: అహ్మదాబాద్లో భారత్ మ్యాచ్లు

15 సెప్టెంబర్: సెమీ ఫైనల్స్ మరియు ఫైనల్