పాపులర్ సినిమాల్ని రిజెక్ట్ చేసిన బాలీవుడ్ నటుడు : An actor rejected 200 popular movies in Bollywood
సినీ పరిశ్రమలో టాలెంట్ ఒక్కటే సరిపోదు. కొన్నిసార్లు అదృష్టం కూడా కలిసిరావాలి. ఎంతో టాలెంట్ ఉండి కూడా అదృష్టం కలసి రాకపోవడం కారణంగా తెరమరుగైన నటులు చాలా మందే ఇండస్ట్రీలో కనిపిస్తారు. అలాంటి వారిలో బాలీవుడ్ కి చెందిన నటుడు సుదేశ్ బెర్రీ ఒకరు.
పాపులర్ సినిమాల్ని రిజెక్ట్ చేసిన బాలీవుడ్ నటుడు : An actor rejected 200 popular movies in Bollywood
ప్రముఖ బాలీవుడ్ నటుడు సుదేశ్ బెర్రీ (Sudesh Berry) తన సుదీర్ఘ సినీ కెరీర్‌లో 200 పైగా సినిమాలు వదులుకున్నాడు. సుదేశ్ బెర్రీ రిజెక్ట్ చేసిన సినిమాల్లో నటించిన అమీర్‌ఖాన్, షారుఖ్‌ఖాన్‌లకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. సినీ పరిశ్రమలో టాలెంట్ ఒక్కటే సరిపోదు. కొన్నిసార్లు అదృష్టం కూడా కలిసిరావాలి. ఎంతో టాలెంట్ ఉండి కూడా అదృష్టం కలసి రాకపోవడం కారణంగా తెరమరుగైన నటులు చాలా మందే ఇండస్ట్రీలో కనిపిస్తారు. అలాంటి వారిలో బాలీవుడ్ కి చెందిన నటుడు సుదేశ్ బెర్రీ ఒకరు.
ఘాయల్ మూవీతో (Ghayal movie) పేరుప్రఖ్యాతులు...
1980-90 దశకంలో బాలీవుడ్‌లో పలు విజయవంతమైన సినిమాల్లో నటించాడు సుదేశ్ బెర్రీ. పలు వైవిధ్యమైన పాత్రలతో విలక్షణ నటుడిగా ప్రేక్షకుల ప్రశంసలతో పాటుగా విమర్శకుల మన్ననలను కూడా అందుకున్నాడు. 1988లో రిలీజైన ఖత్రోంకి ఖిలాడి (Khatron ke Khiladi) మూవీతో సుదేశ్ బెర్రీ కెరీర్ ప్రారంభమైంది. పాపులర్ సినిమాల్ని రిజెక్ట్ చేసిన బాలీవుడ్ నటుడు (An actor rejected popular movies in Bollywood) సన్నీ డియోల్ హీరోగా నటించిన ఘాయల్ చిత్రంలో నటుడిగా బాలీవుడ్‌లో మంచి పేరును సొంతం చేసుకున్నాడు సుదేష్ బెర్రీ.
200 సినిమాలు రిజెక్ట్ : (rejected 200 movies)
ఘాయల్ (Ghayal) సినిమాలో తన నటనతో బాలీవుడ్ వర్గాల దృష్టిని ఆకర్షించాడు సుదేశ్. ఘాయల్ చిత్రం సాధించిన సూపర్ హిట్‌తో సుదేష్‌కు హీరోగా చాలా అవకాశాలు వచ్చాయి. కానీ స్క్రిప్ట్ ని ఎంపిక చేసుకోవడంలో మొదటి మూవీ నుంచి సెలెక్టివ్‌గా ఉన్న సుదేష్ బెర్రీ కథలు, క్యారెక్టర్స్ నచ్చక ఎన్నో సినిమాలను వదలుకున్నాడు. సుదేశ్ బెర్రీ తన కెరీర్ మొత్తంలో వదులుకున్న సినిమాల సంఖ్య 200లకుపైనే ఉన్నాయనే విషయాన్ని సుదేష్ బెర్రీ స్వయంగా ఇటీవల తాను ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.
డర్ (Darr) లో షారుఖ్ కంటే ముందు : before the Sharukh movie Darr
సుదేశ్ బెర్రీ తాను వదులుకున్న సినిమాలలో నటించిన షారుఖ్‌ఖాన్, అమీర్‌ఖాన్, అజయ్ దేవ్‌గణ్ వంటి హీరోలు స్టార్‌డమ్‌ను సంపాదించుకోవడం గమనార్హం. డర్ మూవీలో సుదేష్ బెర్రీని హీరోగా సెలెక్ట్ చేశారు డైరెక్టర్ యశ్ చోప్రా. ఈ మూవీకి సంబంధించి స్క్రీన్ టెస్ట్ కూడా చేశారు. కానీ ఈ సినిమాలో ఉన్న నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్టర్ చేయడం ఇష్టం లేక ఈ మూవీని సుదేశ్ బెర్రీ రిజెక్ట్ చేశాడు. సుదేశ్ బెర్రీ రిజెక్ట్ చేసిన ఈ మూవీ బాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ హిట్‌గా నిలిచింది. షారుఖ్‌ఖాన్‌కు (Shahrukh Khan) హీరోగా ఎంతో పేరును తీసుకొచ్చింది. అదేవిధంగా పలు హిట్ సినిమాల్లో అవకాశం వచ్చినప్పటికీ నటించలేకపోయాడు సుదేశ్.
మూడేళ్లుగా బాలీవుడ్‌కు దూరం ...
35 ఏళ్ల తన సినీ కెరీర్‌లో అతడు చేసిన సినిమాలకంటే రిజెక్ట్ చేసిన మూవీస్ ఎక్కువగా ఉన్నాయి. బోర్డర్ (Border), ఎల్‌వోసీ (LOC), బోర్డర్ హిందుస్థాన్ కా (Border Hindustan Ka) సినిమాల్లో తానా అసమాన నటనతో ఆకట్టుకున్నాడు. కొత్త తరం నటుల రాకతో పోటీ పురఃడంతో సుదేశ్ బెర్రీకి సినిమా అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. దీంతో గత మూడేళ్లుగా బాలీవుడ్‌కు దూరంగా ఉంటున్నాడు సుదేశ్ బెర్రీ. 2021లో రిలీజైన రాజ్‌నందిని మూవీతో చివరిసారిగా బాలీవుడ్ ప్రేక్షకులకు కనిపించాడు సుదేశ్ బెర్రీ.
25 సీరియల్స్...
ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే సీరియల్స్‌పై ఫోకస్ పెట్టాడు సుదేశ్. ఇందులో భాగంగా మహాభారత్ సీరియల్‌లో విచిత్రవీర్య పాత్ర చేశాడు. బాలీవుడ్ నటుడు (An actor rejected popular movies in Bollywood) మహాభారత్ లో పాత్ర మంచి పేరు తెచ్చిపెట్టడంతో బుల్లితెరపై మాత్రం సూపర్‌స్టార్‌గా నిలిచాడు. ముప్పైకి పైగా సీరియల్స్‌లో విలన్‌గా, సహాయక పాత్రల్లో నటించాడు. ప్రస్తుతం హిందీలో టెలికాస్ట్ అవుతోన్న పూర్ణిమ సీరియల్‌లో సుదేశ్ కీలక పాత్ర చేస్తున్నాడు.
సుదేష్ బెర్రీ ఒక భారతీయ టెలివిజన్ మరియు చలనచిత్ర నటుడు, అతను ఖత్రోన్ కే ఖిలాడీ చిత్రంతో ప్రజాదరణ పొందాడు, ఆపై యుద్ధ్‌పత్, బోర్డర్, రెఫ్యూజీ, LOC కార్గిల్ మరియు టాంగో చార్లీ వంటి చిత్రాలతో అతని కీర్తిని పెంచుకున్నాడు. టెలివిజన్ పరిశ్రమలో, స్టార్ ప్లస్‌లో ప్రసారమైన మహాభారత్ (2013) సిరీస్‌లో ద్రుపద రాజు పాత్రను పోషించినందుకు అతను ప్రశంసలు అందుకున్నాడు. సుదేష్ 1960లో జన్మించాడు మరియు అతను ముంబైకి చెందినవాడు. సుదేష్ సరితను వివాహం చేసుకున్నాడు మరియు ఈ దంపతులకు సూరజ్ బెర్రీ అనే కుమారుడు ఉన్నాడు.
మూడు సంవత్సరాల తరువాత, అతను వో బేవఫా థీలో కనిపించాడు మరియు రెఫ్యూజీలో అభిషేక్ బచ్చన్, కరీనా కపూర్, జాకీ ష్రాఫ్, సునీల్ శెట్టి మరియు అనుపమ్ ఖేర్‌లతో సహా సమిష్టి తారాగణంలో భాగమయ్యాడు. ఇది బాక్సాఫీస్ వద్ద హిట్ అయ్యింది. ఆ సంవత్సరపు చిత్రాలను డామినేట్ చేసి, కొన్ని అవార్డులను కూడా గెలుచుకుంది. అతని తదుపరి ముఖ్యమైన నటన 2002లో మా తుఝే సలామ్‌లో గుల్ మస్తాన్ పాత్రలో కనిపించాడు. ఇది ఉగ్రవాదులను ఓడించడానికి భారతదేశం-పాకిస్తాన్ సరిహద్దులో డ్యూటీని కేటాయించిన ఒక మేజర్ మరియు అతని బృందం కథ. మరుసటి సంవత్సరం, అతను మరొక ప్రసిద్ధ చిత్రం LOC కార్గిల్‌లో కల్నల్ పాత్రలో కనిపించాడు. దీని తర్వాత 2003లో బోర్డర్ హిందుస్థాన్ కా, 2004లో వజాహ్, 2008లో వఫా మరియు 2010లో అడ్మిషన్స్ ఓపెన్ వంటి సినిమాల్లో నటించారు.
సుదేష్ ఆ తర్వాత సహారా వన్‌లో ప్రసారమైన కామినీ దామిని అనే డ్రామా సిరీస్‌లో నటించాడు మరియు ఇది బాలీవుడ్ సినిమా సీతా ఔర్ గీత ఆధారంగా రూపొందించబడింది. స్టార్ ప్లస్‌లో 2013 పౌరాణిక డ్రామా సిరీస్ మహాభారత్ ద్రుపద్ పాత్రలో సుదేష్ నటించారు. అధిక వీక్షకులను పొందిన ఈ ధారావాహిక అతనిని నిజంగా ప్రజాదరణ పొందింది మరియు అతని నటనకు ప్రశంసలను పొందింది. అతను రోజువారీ సోప్ ఒపెరా బెగుసరాయ్‌లో మనోహర్ ఠాకూర్‌గా మరియు సియా కే రామ్ పరశురామ పాత్రలో నటించడం ద్వారా దీనిని అనుసరించాడు. అతని 2016 టెలివిజన్ ప్రదర్శన శక్తి - అస్తిత్వ కే ఎహసాస్ కీతో హరక్ సింగ్‌గా వచ్చింది, ఇందులో అతను పునరావృత పాత్రలో కనిపించాడు. అతని 2019 విడుదలలో ఖిచిక్ కూడా ఉంది.