ఆకట్టుకుంటున్న ఆది పురుష్ ట్రైలర్ : Impressive trailer of Adi Purush
ప్రభాస్ రాముడిగా (Prabhas as Ram), కృతిసనన్ సీతగా నటించిన 'ఆది పురుష్' చిత్రం ట్రైలర్ ను నేడు (మంగళవారం) విడుదల చేసారు. ఓం రౌత్ దర్శకత్వం (Director Om Raut) వహించిన ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకొంటోంది.
ఆకట్టుకుంటున్న ఆది పురుష్ ట్రైలర్ : Impressive trailer of Adi Purush
ప్రభాస్ రాముడిగా (Prabhas as Ram), కృతిసనన్ సీతగా నటించిన 'ఆది పురుష్' చిత్రం ట్రైలర్ ను నేడు (మంగళవారం) విడుదల చేసారు. ఓం రౌత్ దర్శకత్వం (Director Om Raut) వహించిన ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకొంటోంది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదలైన ఈ ట్రైలర్ (Trailer) అందరినీ విశేషంగా అలరిస్తోంది. ఈ చిత్రంలో రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan as Ravan), లక్ష్మణుడిగా సన్నీ సింగ్ (Sunny Singh as Lakshman), హనుమంతుడిగా దేవదత్త (Devadata as Hanuman) నటించారు. సీతాదేవిని రావణుడు అపహరించుకుపోవడం, శబరి ఇచ్చిన ఎంగిలి పళ్ళను రాముడు తినడం, హనునంతుడు సంజీవనీ పర్వతాన్ని పెకిలించడం, లంకను తోకకు అంటించిన అగ్గితో అంటించడం, లంకకు వెళ్లేందుకు సముద్రంలో బండ రాళ్లను వేసి దారి ఏర్పరచడం వంటి ఘట్టాలను అద్భుతంగా చిత్రీకరించారు.
'నా ప్రాణమే జానకితో ఉంది', 'మనం జన్మతో కాదు చేసే కర్మతో చిన్నాపెద్ద అవుతాం', 'నాకోసం పోరాడొద్దు, వేళా సంవత్సరాల తరువాత తల్లులు మీ వీరగాథలు చెబుతూ పిల్లల్ని పెంచాలి. ఆరోజు కోసం పోరాడండి... పోరాడతారా? అయితే దూకండి ముందుకు... అహంకారం రొమ్ము చీల్చి ఎగురుతున్న విజయ ధ్వజాన్ని పాతండి' అని ప్రభాస్ చెప్పిన డైలాగులు రోమాలు నిక్కబొడిచేలా ఉన్నాయి. 'రాఘవ నన్ను పొందడానికి శివధనస్సును విరిచారు. ఇప్పుడు రావణుడి గర్వాన్ని విరిచేయాలి' అని సీత చెప్పే డైలాగులు బాగున్నాయి.
రామాయణం ఆధారంగా రూపొందిన ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతారియా, క్రిషణ్ కుమార్, రాజేష్ నాయర్, వంశీ, ప్రమోద్‌లు కలిసి నిర్మించారు. ప్రపంచవ్యాప్తంగా (worldwide) జూన్ 16 న ఈ చిత్రం విడుదల కానుంది.
దర్శకత్వం (Director) : ఓం రౌత్ (Om Raut)
సంగీతం (Music) : అజయ్ అతుల్ (Ajay Atul)
సినిమాటోగ్రాఫర్ (Cinematographer) : కార్తీక్ పల్నాని
విడుదల తేదీ (Release Date) : జూన్ 16 (June 16)