నేడు ఐపీఎల్ లో సమఉజ్జీల పోరు : Today is a battle of equals in IPL

రసవత్తరంగా సాగుతోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 16 వ సీజన్లో నేడు మరో రసవత్తరమైన మ్యాచ్ జరగనుంది. 5 సార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ (MI), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్ల మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. దీనిని సమఉజ్జీల పోరుగా చెప్పవచ్చు. నేడు జరిగే మ్యాచ్‌లో బెంగళూరు టీమ్ ఫేవరేట్‌గా (Bangalore favorite) బరిలోకి దిగనుంది. ముంబై టీమ్ హోమ్ గ్రౌండ్ వాంఖడే స్టేడియంలో మ్యాచ్ జరగనుంది.

నేడు ఐపీఎల్ లో సమఉజ్జీల పోరు : Today is a battle of equals in IPL

నేడు ఐపీఎల్ లో సమఉజ్జీల పోరు : Today is a battle of equals in IPL 

రసవత్తరంగా సాగుతోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 16 వ సీజన్లో నేడు మరో రసవత్తరమైన మ్యాచ్ జరగనుంది. 5 సార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ (MI), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్ల మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. దీనిని సమఉజ్జీల పోరుగా చెప్పవచ్చు. నేడు జరిగే మ్యాచ్‌లో బెంగళూరు టీమ్ ఫేవరేట్‌గా (Bangalore favorite) బరిలోకి దిగనుంది. ముంబై టీమ్ హోమ్ గ్రౌండ్ వాంఖడే స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. 

వాస్తవానికి ఈ ఐపీఎల్ (IPL) సీజన్లో మ్యాచ్‌లు హోరాహోరీగా సాగుతున్నాయి. చివరి బంతి వరకూ ఫలితం కోసం క్రికెట్ ప్రేమికులను ఉత్కంఠతకు గురి చేస్తున్నాయి. దీంతో రాబోయే మ్యాచ్‌ల ఫలితాలు కూడా ఎలా ఉంటాయనే దానిపై అభిమానులు ఎంతో ఉత్సుకతతో ఎదురు చూస్తున్నారు. ప్లేఆఫ్స్‌కు చేరువయ్యే కొద్దీ మ్యాచ్‌లు ఎంతో ఆసక్తిగా కొనసాగుతున్నాయి. నేటి రాత్రి జరగనున్న ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ప్లే ఆఫ్ రేసులో ముందంజ వేస్తుంది. గత మ్యాచ్‌ల ఫలితాలు గమనిస్తే బెంగళూరు జట్టే ఫేవరెట్ గా బరిలోకి దిగనుంది. అయితే ముంబై హోమ్ గ్రౌండ్ లో మ్యాచ్ జరుగుతుండడం, అభిమానుల ప్రోత్సాహంతో ఆ జట్టుకు కలిసి వస్తుందనే చెప్పవచ్చు. 

ముంబై ఇండియన్స్ (MI), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ముఖాముఖి తలపడిన 6 ఐపీఎల్ (IPL) మ్యాచుల్లో 5 మ్యాచుల్లో బెంగళూరు విజయం సాధించగా, ముంబై ఒక్క మ్యాచ్ లో మాత్రమే విజయం సాధించింది. ప్రస్తుతం జరుగుతున్న 16 వ సీజన్ ఐపీఎల్ లో రెండు జట్లూ ఇప్పటి వరకూ తలో 10 మ్యాచ్‌లు ఆడి ఐదేసి మ్యాచ్‌లు గెలిచాయి. అయితే నెట్ రన్ రేట్ పరంగా బెంగళూరు 6 వ స్థానంలోనూ (RCB 6th place), ముంబై 8 వ స్థానంలోనూ (MI 8th place) నిలిచాయి. 

ఈ ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ (MI) కెప్టెన్ రోహిత్ శర్మ పేలవ ఫామ్ (Rohit is not in form) కొనసాగుతోంది. రోహిత్ ఆటతీరు టీమ్ తో పాటు అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ సీజన్లో ఇప్పటి వరకూ రోహిత్ తానాడిన 10 10 మ్యాచ్‌ల్లో కేవలం 184 రన్స్ మాత్రమే చేయగలిగాడు. ఇందులో కేవలం ఒక్క హాఫ్ సెంచరీ మాత్రమే ఉంది. 5 సార్లు ముంబై ఇండియన్స్ కి టైటిళ్లు అందించిన రోహిత్ కెప్టెన్సీ ఈ సీజన్లో ఫెయిల్ అయిందని అభిమానులు నిరుత్సాహ పడుతున్నారు. గత 33 ఐపీఎల్ మ్యాచుల్లో రోహిత్ శర్మ (Rohit) కేవలం రెండు హాఫ్ సెంచరీలు (33 IPL matches 2 half centuries) మాత్రమే చేయడం గమనార్హం. సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్, తిలక్ వర్మ మంచి ఫామ్‌లో ఉన్నారు. ఇషాన్ కిషన్ కూడా ఫామ్ లోకి రావడం జట్టుకి మేలు చేస్తుందని చెప్పవచ్చు.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) సైతం ఈ సీజన్లో ముంబై లాంటి పరిస్థితినే ఎదుర్కొంటోంది. కెప్టెన్ డుప్లెసిస్, విరాట్ కోహ్లీ మంచి ఫామ్ లో ఉన్నారు. వీరిద్దరూ ఇప్పటి వరకూ 9 హాల్ సెంచరీలు చేసారు. మహిపాల్ లామ్రార్ ఫామ్‌లోకి రావడం జట్టుకి కలిసొస్తుందని చెప్పవచ్చు. దినేశ్ కార్తీక్, మ్యాక్స్‌వెల్ చెలరేగితే ముంబై టీమ్ కి కష్టాలు తప్పవు. మహ్మద్ సిరాజ్, హసరంగ, జోష్ హేజిల్‌వుడ్ బౌలింగ్ లో అద్భుతంగా రాణిస్తున్నారు.

బెంగళూరు vs ముంబై హెడ్ టు హెడ్ : RCB vs MI head to head 

ఇప్పటివరకూ జరిగిన ఐపీఎల్ అన్ని సీజన్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు (RCB), ముంబై ఇండియన్స్ (MI) 31 మ్యాచుల్లో తలపడ్డాయి. ఇందులో బెంగళూరు జట్టుపై ముంబై ఇండియన్స్ టీమ్ దే పైచేయి.  ఇందులో బెంగళూరు జట్టు 14 మ్యాచుల్లో గెలుపొందగా, ముంబై జట్టు 17 మ్యాచుల్లో గెలుపొందింది. 

అత్యధిక స్కోర్లు (Highest scores) : బెంగళూరు (RCB) 235 పరుగులు, ముంబై (MI) 213 పరుగులు

అత్యల్ప స్కోర్లు (Lowest scores) : బెంగళూరు (RCB) 122 పరుగులు, ముంబై (MI) 111 పరుగులు

ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ XI : Mumbai Indians playing XI 

ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), కామెరాన్ గ్రీన్, రోహిత్ శర్మ (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, నెహాల్ వదేరా, జోఫ్రా ఆర్చర్, పియూష్ చావ్లా, కుమార్ కార్తికేయ, అర్షద్ ఖాన్.

ముంబై ఇండియన్స్ ఫుల్ స్క్వాడ్ : MI full squad

కామెరాన్ గ్రీన్, రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, జోఫ్రా ఆర్చర్, డెవల్డ్ బ్రేవో, టిమ్ డేవిడ్, ట్రిస్టన్ స్టబ్స్, తిలక్ వర్మ, జే రిచర్డ్సన్, సూర్యకుమార్ యాదవ్, జేసన్ బెహ్రెండార్ఫ్, పీయూష్ చావ్లా, అర్జున్ టెండూల్కర్, షామ్స్ ములానీ, నేహాల్ వధేరా, కుమార్ కార్తికేయ, హృతిక్ షౌకీన్, ఆకాష్ మాధవల్, అర్షద్ ఖాన్, రాఘవ్ గోయెల్, డువాన్ జాన్సెన్, విష్ణు వినోద్.

బెంగళూరు ప్లేయింగ్ XI : Royal Challengers Bangalore playing XI 

ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, మహిపాల్ లామ్రార్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, సుయాష్ ప్రభుదేశాయ్ లేదా అనుజ్ రావత్, కేదార్ జాదవ్, దినేశ్ కార్తీక్, వనిందు హసరంగ, హర్షల్ పటేల్, జోష్ హేజిల్‌వుడ్, మహ్మద్ సిరాజ్.

ఆర్సీబీ ఫుల్ స్క్వాడ్ : RCB full squad 

విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్, మహిపాల్ లోమ్రోర్, గ్లెన్ మాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్, సుయాష్ ప్రభుదేశాయ్, డేవిడ్ విల్లీ, వనిందు హసరంగా, మహ్మద్ సిరాజ్, విజయ్‌కుమార్ వైషాక్, హర్షల్ పటేల్, ఆకాశ్ దీప్, ఫిన్, ఫిన్ అనుజ్ రావత్, మైకేల్ బ్రేస్‌వెల్, సిద్దార్థ్ కౌల్, సోనూ యాదవ్, మనోజ్ భాండాగే, వేన్ పార్నెల్, రాజన్ కుమార్, అవినాష్ సింగ్, హిమాన్షు శర్మ.

ముంబై ఇండియన్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (MI vs RCB) IPL 2023, మ్యాచ్ 54

తేదీ, సమయం : మే 9, 2023, 7:30 PM

వేదిక (Stadium) : వాంఖడే స్టేడియం, ముంబై (Wankhede stadium, Mumbai)

లైవ్ స్ట్రీమింగ్ (Live streaming) : జియో సినిమా (Jio cinema)

ప్రసారం (Broadcast) : స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ (Star sports network)