ఐపీఎల్ లో నేడు తలపడనున్న పంజాబ్, కోల్కతా : Punjab vs Kolkata match in IPL today

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) క్రికెట్ ప్రేమికులను ఎంతగానో రంజింపజేస్తోంది. గత కొన్ని మ్యాచుల్లో పెద్ద స్కోర్లు (Big scores) నమోదవుతున్న వాటిని కూడా అలవోకగా ఛేదించేస్తున్నారు. దీంతో ఈ ఐపీఎల్ 16 వ సీజన్ (16th IPL season) రసవత్తరంగా మారింది.

ఐపీఎల్ లో నేడు తలపడనున్న పంజాబ్, కోల్కతా : Punjab vs Kolkata match in IPL today

ఐపీఎల్ లో నేడు తలపడనున్న పంజాబ్, కోల్కతా : Punjab vs Kolkata match in IPL today

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) క్రికెట్ ప్రేమికులను ఎంతగానో రంజింపజేస్తోంది. గత కొన్ని మ్యాచుల్లో పెద్ద స్కోర్లు (Big scores) నమోదవుతున్న వాటిని కూడా అలవోకగా ఛేదించేస్తున్నారు. దీంతో ఈ ఐపీఎల్ 16 వ సీజన్ (16th IPL season) రసవత్తరంగా మారింది.

 

ఐపీఎల్ లో నేడు మరో బిగ్ ఫైట్ (big fight) మ్యాచ్ అభిమానులను అలరించనుంది. నేడు పంజాబ్ కింగ్స్ (PBKS), కోల్కతా నైట్ రైడర్స్ (KKR) మధ్య ఐపీఎల్ 16 వ సీజన్ 53 వ మ్యాచ్ కోల్కతాలో ఈడెన్ గార్డెన్స్ లో జరుగనుంది. పంజాబ్ కింగ్స్ జట్టు తాము ఇప్పటి వరకూ ఆడిన 10 మ్యాచుల్లో 5 గెలిచి 10 పాయింట్లతో (10 points) పాయింట్ల పట్టికలో 7 వ స్థానంలో (7th place in points table) ఉంది. ముంబై ఇండియన్స్ (MI) తో జరిగిన గత మ్యాచ్ లో (last match) 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 214 పరుగులను చేసినప్పటికీ మ్యాచ్ ను కాపాడుకోలేక ఓటమి (lost previous match) పాలయింది. ముంబై 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 18.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. పంజాబ్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ తన బౌలింగ్ కోటాలో 3.5 ఓవర్లలో 66 పరుగులు ఇచ్చాడు. పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ (Shikar Dhavan), లియామ్ లివింగ్‌స్టన్ (Livingstone), జితేష్ శర్మ (Jitesh Sharma) నిలకడైన బ్యాటింగ్ చేస్తున్నారు. అయితే కీలక మ్యాచుల్లో బౌలర్లు తేలిపోతుండడం జట్టుకి ఆందోళన కలిగిస్తోంది. నేడు జరిగే మ్యాచ్ లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఏకంగా మూడో స్థానానికి (Eyes on the third place) చేరుకుంటుంది. అందుకే నేడు జరిజే మ్యాచ్ టీమ్ కి కీలకం (crucial match) కానుంది.

కోల్కతా నైట్ రైడర్స్ (KKR) ఈ సీజన్లో ఇప్పటివరకూ 10 మ్యాచ్ లు ఆడింది. ఇందులో 4 విజయాలతో 8 పాయింట్లతో (8 points) పాయింట్ల పట్టికలో 8 వ స్థానంలో (8th place on points table) నిలిచింది. ప్లేఆఫ్‌కు చేరాలంటే మిగిలిన 4 మ్యాచులను తప్పనిసరిగా గెలవాల్సి ఉంది. కోల్కతా హైదరాబాద్ టీమ్ తో ఆడిన గత మ్యాచ్ (47th match) లో విజయం సాధించింది. కోల్కతా జట్టులో కెప్టెన్ నితీష్ రాణా (Nitesh Rana), రింకు సింగ్ (Rinku Singh) అద్భుతమైన ఫామ్ లో ఉంది మంచి స్కోర్లను సాధిస్తున్నారు. సునీల్ నరైన్ (Sunil Naraine), వరుణ్ చక్రవర్తి, శార్దూల ఠాకూర్ అద్భుతంగా బౌలింగ్ లో రాణిస్తున్నారు. నేడు పంజాబ్ తో జరిగే మ్యాచ్ లో ఎట్టి పరిస్థితుల్లోనైనా గెలవాలనే పట్టుదలతో కోల్కతా జట్టు ఉంది. దీంతో ఈ మ్యాచ్ బిగ్ ఫైట్ గా జరగనుందని అభిమానులు భావిస్తున్నారు.

 

పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ XI : PBKS playing XI

శిఖర్ ధావన్ (కెప్టెన్), ప్రభ్‌సిమ్రాన్ సింగ్, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), సామ్ కరన్, షారుక్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, నాథన్ ఎల్లిస్, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్, రిషి ధావన్.

 

పంజాబ్ కింగ్స్ పూర్తి జట్టు : PBKS full squad

ప్రభ్‌సిమ్రాన్ సింగ్, శిఖర్ ధావన్ (కెప్టెన్), మాథ్యూ షార్ట్, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), సామ్ కరన్, షారుక్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, రిషి ధావన్, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్, నాథన్ ఎల్లిస్, సికందర్ రజా, అథర్వ తైదే, మోహిత్ రాఠీ, శివమ్ సింగ్, కగిసో రబాడా, హర్‌ప్రీత్ సింగ్ భాటియా, భానుకా రాజపక్స, బల్తేజ్ సింగ్, విధ్వత్ కావరప్ప, గుర్నూర్ బ్రార్

కోల్‌కతా నైట్ రైడర్స్ ప్లేయింగ్ XI : KKR playing XI

జాసన్ రాయ్, రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా (కెప్టెన్), ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి.

కోల్‌కతా నైట్ రైడర్స్ పూర్తి జట్టు : KKR full squad

జాసన్ రాయ్, లిట్టన్ దాస్ (వికెట్ కీపర్), వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా (కెప్టెన్), మన్‌దీప్ సింగ్, ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్, సునీల్ నరైన్, కుల్వంత్ ఖేజ్రోలియా, ఉమేష్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, అనుకుల్ రాయ్, టిమ్ సౌథీ, డేవిడ్ వైస్, శార్దూల్ ఠాకూర్, లాకీ ఫెర్గూసన్, ఎన్ జగదీసన్, రహ్మానుల్లా గుర్బాజ్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, సుయాష్ శర్మ, ఆర్య దేశాయ్

 

పంజాబ్ vs కోల్కతా హెడ్ టు హెడ్ : PBKS vs KKR head-to-head

పంజాబ్ కింగ్స్ (PBKS), కోల్కతా నైట్ రైడర్స్ (KKR) జట్లు తలపడిన సందర్భాల్లో కోల్కతా జట్టుదే పైచేయి. ఐపీఎల్ చరిత్రలో రెండు జట్లూ ఇప్పటివరకూ 31 మ్యాచుల్లో తలపడ్డాయి. ఇందులో కోల్కతా 20 మ్యాచుల్లో గెలుపొందగా, పంజాబ్ 10 మ్యాచుల్లో గెలుపొందింది. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 16 వ సీజన్లో తలపడిన మ్యాచులో పంజాబ్ డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో గెలిచింది.

 

అత్యధిక స్కోర్లు : కోల్కతా 245 పరుగులు కాగా, పంజాబ్ 214 పరుగులు

అత్యల్ప స్కోర్లు : కోల్కతా 109 పరుగులు కాగా, పంజాబ్ 119 పరుగులు

కోల్కతా vs పంజాబ్ కింగ్స్ (KKR vs PBKS) IPL 2023, మ్యాచ్ 53

తేదీ, సమయం : మే 8, 2023, 7:30 PM

వేదిక (Stadium) : ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా (Eden gardens, Kolkata)

లైవ్ స్ట్రీమింగ్ (Live streaming) : జియో సినిమా (Jio cinema)

ప్రసారం (Broadcast) : స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ (Star sports network)

 

ప్రస్తుతం, బెంగళూరు ఆటగాడు ఫాఫ్ డు ప్లెసిస్ IPL 2023లో ఆరెంజ్ క్యాప్‌ని (Orange Cap) కలిగి ఉన్నాడు. డు ప్లెసిస్ 10 మ్యాచ్‌లలో 157.71 స్ట్రైక్ రేట్‌తో 511 పరుగులు చేశాడు.

 

స్థానం

ఆటగాడు

జట్టు

పరుగులు

1

ఫాఫ్ డు ప్లెసిస్

బెంగళూరు

511 పరుగులు

2

యశస్వి జైస్వాల్

రాజస్థాన్

477 పరుగులు

3

శుభమన్ గిల్

గుజరాత్

469 పరుగులు

4

డెవాన్ కాన్వే

చెన్నై

458 పరుగులు

5

విరాట్ కోహ్లీ

బెంగళూరు

419 పరుగులు

 

ప్రస్తుతం, గుజరాత్కు చెందిన మహమ్మద్ షమీ IPL 2023లో పర్పుల్ క్యాప్ని (Purple Cap) కలిగి ఉన్నాడు. షమీ 11 మ్యాచ్లలో 7.23 ఎకానమీ రేటుతో 19 వికెట్లు తీశాడు.

 

స్థానం

ఆటగాడు

జట్టు

వికెట్లు

1

మహ్మద్ షమీ

గుజరాత్

19 వికెట్లు

2

రషీద్ ఖాన్

గుజరాత్

19 వికెట్లు

3

తుషార్ దేశ్‌పాండే

చెన్నై

19 వికెట్లు

4

పీయూష్ చావ్లా

ముంబై

17 వికెట్లు

5

యుజ్వేంద్ర చాహల్

రాజస్థాన్

17 వికెట్లు