ఐపీఎల్ లో నేడు రెండు మ్యాచ్‌లు : Two matches in IPL today

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో (IPL) భాగంగా నేడు రెండు మ్యాచ్‌లు (2 matches) జరగనున్నాయి. 49 వ మ్యాచ్‌లో 4 సార్లు ఐపీఎల్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK), 4 సార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ (MI) తలపడనున్నాయి. 50 వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (DC), రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు (RCB) జట్లు తలపడనున్నాయి.

ఐపీఎల్ లో నేడు రెండు మ్యాచ్‌లు : Two matches in IPL today

ఐపీఎల్ లో నేడు రెండు మ్యాచ్లు : Two matches in IPL today

ఇండియన్ ప్రీమియర్ లీగ్లో (IPL) భాగంగా నేడు రెండు మ్యాచ్లు (2 matches) జరగనున్నాయి. 49 మ్యాచ్లో 4 సార్లు ఐపీఎల్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK), 4 సార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ (MI) తలపడనున్నాయి. 50 మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ (DC), రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు (RCB) జట్లు తలపడనున్నాయి.

 

చెన్నై vs ముంబై : CSK vs MI

చెన్నై సూపర్ కింగ్స్(CSK), ముంబయి ఇండియన్స్(MI) జట్లు చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగే కీలక పోరులో నేడు తలపడనున్నాయి. ధోనీ, రోహిత్ శర్మ ఉండడంతో అభిమానులకు ఈరోజు పండగే అని చెప్పవచ్చు. దీంతో నేడు జరిగే మ్యాచ్ కోసం అభిమానులు (fans) ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చెన్నై టీమ్ 11 పాయింట్లతో పాయింట్ల పట్టికలో మూడవ స్థానంలోనూ (CSK 3rd place), ముంబై ఇండియన్స్ 10 పాయింట్లతో 6 స్థానంలోనూ (MI 6th place) ఉన్నాయి.

 

హెడ్-టు-హెడ్ : head to head

చెన్నై (CSK), ముంబై (MI) జట్లు ఐపీఎల్ అన్ని సీజన్లలో 35 మ్యాచుల్లో (35 matches) తలపడ్డాయి. ఇందులో ముంబై 20 మ్యాచుల్లో విజయం సాధించగా, చెన్నై జట్టు 15 మ్యాచుల్లో విజయం సాధించింది. ఇరుజట్లూ కూడా విజయం సాధించి పాయింట్ల పట్టికలో తమ స్థానాల్ని మెరుగుపరచుకోవాలని (looking to improve their position in the points table) చూస్తున్నాయి.

చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయింగ్ XI : CSKI playing XI

డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ, బెన్ స్టోక్స్, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, MS ధోని (కెప్టెన్, వికెట్ కీపర్), శివమ్ దూబే, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, RS హంగర్గేకర్

 

చెన్నై ఫుల్ స్క్వాడ్ : CSK full squad

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు: డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ, బెన్ స్టోక్స్, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని(కెప్టెన్, వికెట్ కీపర్), శివమ్ దూబే, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ఆర్ఎస్ హంగర్గేకర్, తుషార్ దేశ్పాండే, సుభ్రాంశు సేనాపతి, షేక్ రషీద్, అజింక్యా రహానే, నిశాంత్ సింధు, డ్వైన్ ప్రిటోరియస్, అజయ్ జాదవ్ మండల్, ప్రశాంత్ సోలంకి, సిమర్జీత్ సింగ్, ఆకాష్ సింగ్, భగత్ వర్మ

 

ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ XI : MI playing XI

రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, కామెరాన్ గ్రీన్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, నెహాల్ వధేరా, హృతిక్ షోకీన్, పీయూష్ చావ్లా, జోఫ్రా ఆర్చర్, అర్షద్ ఖాన్

ముంబై ఇండియన్స్ ఫుల్ స్క్వాడ్ : MI full squad

కామెరాన్ గ్రీన్, రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, జోఫ్రా ఆర్చర్, డెవల్డ్ బ్రేవో, టిమ్ డేవిడ్, ట్రిస్టన్ స్టబ్స్, తిలక్ వర్మ, జే రిచర్డ్సన్, సూర్యకుమార్ యాదవ్, జేసన్ బెహ్రెండార్ఫ్, పీయూష్ చావ్లా, అర్జున్ టెండూల్కర్, షామ్స్ ములానీ, నేహాల్ వధేరా, కుమార్ కార్తికేయ, హృతిక్ షౌకీన్, ఆకాష్ మాధవల్, అర్షద్ ఖాన్, రాఘవ్ గోయెల్, డువాన్ జాన్సెన్, విష్ణు వినోద్.

బెంగుళూరు vs ఢిల్లీ : RCB vs DC

ఐపీఎల్ (IPL)లో నేడు జరిగే రెండో మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ (DC), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్లు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా తలపడనున్నాయి. ఢిల్లీకి మ్యాచ్ చావోరేవోగా (crucial match) ఉండనుంది. ఆరు పాయింట్లతో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో (10 స్థానం) ఉంది. ప్లేఆఫ్ రేసులో (playoff race) నిలబడాలంటే ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్లో ఎట్టి పరిస్థితిలోనైనా గెలవాలి. జట్టులో కెప్టెన్ వార్నర్ కి (captain warner) మిగతా ఆటగాళ్ల నుంచి సహకారం అందక పోతుండడంతో జట్టుకి వరుస ఓటములు ఎదురవుతున్నాయి. బెంగళూరు టీమ్ 10 పాయింట్లతో 5 స్థానంలో (RCB 5th place) ఉంది. జట్టులో అందరూ భీకర ఫామ్ లో ఉండడంతో బెంగళూరు కె విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే నేడు ఢిల్లీ టీమ్ హోమ్ గ్రౌండ్ (Delhi playing in home ground) లో మ్యాచ్ జరగనుండడం జట్టుకి ఆత్మవిశ్వాసం పెంచుతుందనడంలో సందేహం లేదు. అయితే టీమ్ మొత్తం సమిష్టిగా ఆడితే గెలుపు అసాధ్యం కాకపోవచ్చు.

 

చరిత్ర సృష్టించేందుకు 12 పరుగుల దూరంలో కోహ్లీ : Kohli is 12 runs away from making history

నేడు ఢిల్లీ క్యాపిటల్స్ (DC) టీమ్ తో జరగనున్న మ్యాచులో కోహ్లీ మరో 12 పరుగులు (12 runs) సాధిస్తే ఐపీఎల్ చరిత్రలో (IPL history) 7000 పరుగుల మార్క్ (7000 runs mark) అందుకున్న తొలి బ్యాట్స్మన్ గా చరిత్ర సృష్టిస్తాడు. కోహ్లీ ఇప్పటి వరకూ జరిగిన ఐపీఎల్ లో 232 మ్యాచులో ఆడి 6988 పరుగులు చేసాడు. ఏడాది జరుగుతున్న ఐపీఎల్ 16 సీజన్లో కోహ్లీ భీకర ఫామ్ (good form) లో ఉన్నాడు. ఇప్పటివరకూ జరిగిన 9 మ్యాచుల్లో (9 matches) 5 హాఫ్ సెంచరీలు (5 half centuries) సహా 364 పరుగులు (364 runs) చేసాడు.

హెడ్ టు హెడ్ : head to head

ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకూ ఢిల్లీ క్యాపిటల్స్ (DC), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య మొత్తం 29 మ్యాచ్లు (29 matches) జరిగాయి. ఇందులో బెంగుళూరు జట్టు 18 సార్లు గెలుపొందగా, ఢిల్లీ క్యాపిటల్స్ 10 సార్లు మాత్రమే గెలవగలిగింది. ఒక మ్యాచ్లో ఫలితం రాలేదు.

 

ఆర్సీబీ ప్రాబబుల్ ప్లేయింగ్ XI : RCB probable playing XI

విరాట్ కోహ్లి (కెప్టెన్), ఫాఫ్ డు ప్లెసిస్, మహిపాల్ లోమ్రోర్, గ్లెన్ మాక్స్వెల్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), సుయాష్ ప్రభుదేశాయ్, డేవిడ్ విల్లీ, వనిందు హసరంగా, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్.

 

ఆర్సీబీ ఫుల్ స్క్వాడ్ : RCB full squad

విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్, మహిపాల్ లోమ్రోర్, గ్లెన్ మాక్స్వెల్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్, సుయాష్ ప్రభుదేశాయ్, డేవిడ్ విల్లీ, వనిందు హసరంగా, మహ్మద్ సిరాజ్, విజయ్కుమార్ వైషాక్, హర్షల్ పటేల్, ఆకాశ్ దీప్, ఫిన్, ఫిన్ అనుజ్ రావత్, మైకేల్ బ్రేస్వెల్, సిద్దార్థ్ కౌల్, సోనూ యాదవ్, మనోజ్ భాండాగే, వేన్ పార్నెల్, రాజన్ కుమార్, అవినాష్ సింగ్, హిమాన్షు శర్మ.

ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ XI : DC playing XI

డేవిడ్ వార్నర్ (కెప్టెన్), ఫిలిప్ సాల్ట్, మిచెల్ మార్ష్, మనీష్ పాండే, ప్రియమ్ గార్గ్, అక్షర్ పటేల్,  రిపల్ పటేల్,  కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నోర్జ్, ఇషాంత్ శర్మ, ముఖేష్ కుమార్

 

ఢిల్లీ క్యాపిటల్స్ ఫుల్ స్క్వాడ్ : DC full squad

డేవిడ్ వార్నర్ (కెప్టెన్), పృథ్వీ షా, మిచెల్ మార్ష్, యశ్ ధుల్, మనీష్ పాండే, ఫిల్ సాల్ట్, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, చేతన్ సకారియా, అమన్ హకీమ్ ఖాన్, లలిత్ యాదవ్, విక్కీ ఓస్త్వాల్, అన్రిచ్ నార్ట్జే, కుల్దీప్ యాదవ్, ముస్తాఫిజుర్ రెహమాన్, ముఖేష్ కుమార్, కమలేష్ నాగర్కోటి, సర్ఫరాజ్ ఖాన్, ప్రవీణ్ దూబే, రిలీ రోసౌవ్, రోవ్మాన్ పావెల్, ఖలీల్ అహ్మద్, ఇషాంత్ శర్మ, లుంగి ఎంగిడి, రిపల్ పటేల్