సినీతారల సెలబ్రిటీ క్రికెట్ లీగ్ : Cinema Stars Celebrity Cricket League

సినిమాల్లో తమ యాక్టింగ్‌తో (Actors) అభిమానుల‌ను అల‌రించే సినిమా స్టార్స్ (Cine Stars) క్రికెట్ గ్రౌండ్‌లో అడుగు పెట్ట‌బోతున్నారు. త‌మ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విన్యాసాల‌తో ఫ్యాన్స్‌కు వినోదాన్ని పంచేందుకు తెలుగు, త‌మిళ్‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, భోజ్‌పురి, బెంగాలీ, పంజాబీ, హిందీ భాష‌ల‌కు చెందిన అగ్ర నటీనటులు (Star Heroes) సిద్ధ‌మ‌వుతున్నారు.

సినీతారల సెలబ్రిటీ క్రికెట్ లీగ్ : Cinema Stars Celebrity Cricket League

సినీతారల సెలబ్రిటీ క్రికెట్ లీగ్ : Cine Stars Celebrity Cricket League

సినిమాల్లో తమ యాక్టింగ్‌తో (Actors) అభిమానుల‌ను అల‌రించే సినిమా స్టార్స్ (Cine Stars) క్రికెట్ గ్రౌండ్‌లో అడుగు పెట్ట‌బోతున్నారు. త‌మ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విన్యాసాల‌తో ఫ్యాన్స్‌కు వినోదాన్ని పంచేందుకు తెలుగు, త‌మిళ్‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, భోజ్‌పురి, బెంగాలీ, పంజాబీ, హిందీ (Telugu, Tamil, Kannada, Malayalam, Bhojpuri, Bengali, Punjabi, Hindi) భాష‌ల‌కు చెందిన అగ్ర నటీనటులు (Star Heroes) సిద్ధ‌మ‌వుతున్నారు. 

CCL (సెలబ్రిటీ క్రికెట్ లీగ్) (Celebrity Cricket League) భారతీయ సినిమాలోని తొమ్మిది ప్రధాన ప్రాంతీయ చలనచిత్ర పరిశ్రమలకు (Film Industry) చెందిన వారు పాల్గొనే క్రికెట్ ఈవెంట్ (Cricket Event). ఈ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ 2011లో ప్రారంభమైంది. CCL లీగ్ లో పాల్గొనే జట్లు మ్యాచ్ లు ఆడేందుకు వివిధ వేదికలను ఉపయోగిస్తాయి. భారతీయ మీడియా ఈ లీగ్ కు  విస్తృతమైన కవరేజీని (Media Broad Coverage) ఇస్తుంటాయి. ఈ ఏడాది CCL-2023 లీగ్ మ్యాచ్ లు భారతదేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో (Different Places in India ) ఆరు ప్రధాన నగరాల్లో (6 Cites) ఈ సీజన్‌లో 19 మ్యాచ్‌లు (Total 19 Matches) జరుగుతాయి. 

అన్ని భాషల మేళవింపు CCL : All Language Combination CCL 

దేశంలోని అన్ని భాషల సినీ పరిశ్రమలకు చెందిన ఆటగాళ్లు ఐపీఎల్ తరహాలో (IPL type Tourney ) ఆడే ‘సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్)’ దేశంలో ప్రసిద్ధి చెందడం అందరికీ తెలిసిందే. 2011 నుంచి 2019 వరకు మొత్తంగా ఎనిమిది సీజన్ల పాటు జరిగిన ఈ టోర్నీ తొమ్మిది సంవత్సరాల్లో కేవలం 2018లో మాత్రమే జరగలేదు.

ఫిబ్రవరి 18 న ప్రారంభం కానున్న టోర్నీ : Tournament will start on February 18 

అయితే కరోనా వైరస్ కారణంగా 2019 తర్వాత నాలుగేళ్ల పాటు (Due to Corona 4 years not played) ఈ టోర్నీ జరగనే లేదు. ఆ తరువాత ఇప్పుడు 2023లో తిరిగి ఈ టోర్నీని నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను కూడా ఇటీవలే విడుదల (Released the Schedule) చేశారు. ఫిబ్రవరి 18వ తేదీన మొదలై మార్చి 19వ తేదీ వరకు ఈ టోర్నీ జరగనుంది. లక్నో, జైపూర్, బెంగళూరు, త్రివేండ్రం, జోధ్‌పూర్, హైదరాబాద్‌ల్లో (Lucknow, Jaipur, Bangalore, Trivandrum, Jodhpur, Hyderabad) టోర్నమెంట్ జరగనుంది. సెమీ ఫైనల్స్, ఫైనల్స్‌కు హైదరాబాద్ (Semi-Final, Final in Hyderabad) వేదిక కానుంది.

మూడేళ్లు విజేతలుగా తెలుగు వారియర్స్ : Telugu Warriors wins Trophy 3 times

ఈ టోర్నమెంట్‌లో టాలీవుడ్‌కు (Tollywood) చెందిన తెలుగు వారియర్స్ జట్టుకు అద్భుతమైన రికార్డు ఉంది. ఏకంగా మూడు సార్లు టోర్నమెంట్ విన్నర్‌గా నిలిచింది. మిగతా అన్ని అన్ని జట్ల కంటే ఇదే అత్యధికం. 2015, 2016, 2017 సీజన్లలో (3 times continues Winners) వరుసగా మూడు సార్లు తెలుగు వారియర్స్ విజేతగా నిలిచింది. 2013లో రన్నరప్‌గా నిలిచింది. 2011, 2012 సీజన్లలో సెమీస్‌కు (2 times semis) చేరుకుంది. 2014, 2019లో గ్రూప్ దశలోనే వెనుదిరిగింది.

తెలుగు వారియర్స్‌కు కెప్టెన్‌గా అఖిల్ : Akhil Captain of Telugu Warriors 

తెలుగు వారియర్స్‌కు (Telugu Warriors) అఖిల్ అక్కినేని కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ ఫ్రాంచైజీకి సచిన్ జోషి యజమాని (Sachin Joshi is the Owner). విక్టరీ వెంకటేష్ మెంటార్‌గా (Venkatesh Mentor) వ్యవహరించనున్నారు. జట్టులో మిగతా సభ్యులుగా సచిన్ జోషి, అశ్విన్ బాబు, సాయి ధరమ్ తేజ్, ఆదర్శ్, నంద కిషోర్, నిఖిల్, సామ్రాట్, తారకరత్న, తరుణ్, విశ్వ, ప్రిన్స్, సుశాంత్, ఖయ్యూమ్, హరీష్‌లు సభ్యులుగా ఉన్నారు.

తెలుగు వారియర్స్‌ షెడ్యూల్ : Telugu Warriors Schedule  

తెలుగు టైటాన్స్ తన మొదటి మ్యాచ్‌లో కేరళ స్ట్రైకర్స్‌తో (Kerala Strikers) తలపడనుంది. ఫిబ్రవరి 19వ తేదీన ఈ మ్యాచ్ జరగనుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 25వ తేదీన చెన్నై రైనోస్‌తో (Chennai Rhinos), మార్చి 4వ తేదీన బెంగాల్ టైగర్స్‌తో (Bengal Tigers), మార్చి 12వ తేదీన పంజాబ్ షేర్ తో (Punjab De Share) జరగనుంది. ఒకవేళ సెమీస్, ఫైనల్స్‌కు చేరుకుంటే మార్చి 18,19వ తేదీల్లో ఆడాల్సి ఉంటుంది.

ఈ సెల‌బ్రిటీ క్రికెట్ లీగ్ (CCL) లో మొత్తం ఎనిమిది టీమ్‌లు (8 Teams) పోటీ ప‌డ‌నున్నాయి. 

  1. తెలుగు వారియ‌ర్స్‌ (Telugu Warriors)
  2. బెంగాల్ టైగ‌ర్స్‌ (Bengal Tigers)
  3. చెన్నై రినోస్‌ (Chennai Rhinos)
  4. కేర‌ళ స్ట్రైక‌ర్స్‌ (Kerala Strikers)
  5. క‌ర్ణాట‌క బుల్డోజ‌ర్స్‌ (Karnataka Bulldozers)
  6. ముంబై హీరోస్‌ (Mumbai Heroes)
  7. భోజ్‌పురి ద‌బాంగ్స్‌ (Bhojpuri Dabangs)
  8. పంజాబ్ షేర్ (Punjab De Share 

సీసీఎల్ వివరాలు : CCL Details 

– బరిలోకి మొత్తం 8 జట్లు (Total Teams 8)

– మొత్తం 19 మ్యాచ్ లు (Total Matches 19)

– మొత్తం ఆటగాళ్లు 120 మంది (Participants 120)

మ్యాచ్ లు జరిగే ప్రాంతాలు : Venues of Matches 

– ఈనెల 18వ తేదీ నుంచి మ్యాచ్ లు (will start on February 18) జరుగనున్నాయి. రాయ్ పూర్, బెంగళూరు, జోధ్ పూర్, త్రివేండ్రం, జైపూర్ మ్యాచ్ లకు ఆతిథ్యం (Hosting) ఇవ్వనున్నాయి.

– మార్చి 18, 19న సెమీ ఫైనల్స్, ఫైనల్ మ్యాచ్ లు హైదరాబాద్ లో జరుగనున్నాయి. 

బెంగాల్ టైగర్స్ స్క్వాడ్ : Bengal Tigers Squad 

జిష్షు (కెప్టెన్), జాయ్,ఇంద్రాశిష్, యూసఫ్, ఉదయ్, శాండీ, సుమన్, వివేక్, మోహన్, దేబు, మాంటీ, నంది, జిమ్మీ, సుశీల్, రత్నదీప్, జో 

పంజాబ్ షేర్ స్క్వాడ్ : Punjab De Sher Squad 

సోనూ సూద్ (కెప్టెన్), మీకా సింగ్, జిమ్మీ షేర్‌గిల్, ఆయుష్మాన్ ఖురానా, బిన్ను ధిల్లాన్, మన్వీర్ సరన్, రాహుల్ దేవ్, నవరాజ్ హన్స్, జాజీ, హర్మీత్ సింగ్, పీయూష్ మల్హోత్రా, గుల్జార్ చాహల్, రోషన్ ప్రిన్స్, అమరీందర్ గిల్, అంగద్ బేడీ, యువరాజ్ హన్స్, రాజు శర్మ, దిల్రాజ్ ఖురానా

కేరళ స్ట్రైకర్స్ స్క్వాడ్ : Kerala Strikers Squad 

మోహన్ లాల్ (కెప్టెన్), ఇంద్రజిత్, ఆసిఫ్ అలీ, రాజీవ్ పిళ్లై, నివిన్ పౌలీ, మణికుట్టన్, సైజు కురుప్, రియాజ్ ఖాన్, రాకేందు, విను మోహన్, బినీష్ కొడియేరి, వివేక్ గోపన్, ప్రజోద్ కళాభవన్, శ్రీశాంద్, మదన్ మోహన్, షఫీక్ రెహమాన్, రాహుల్ మాధవ్, ఉన్ని ముకుందన్, బాల, మున్నా సైమన్, నిఖిల్ మీనన్, రెజిత్ మీనన్

కర్ణాటక బుల్డోజర్స్ స్క్వాడ్ : Karnataka Bulldozers Squad 

సుదీప్ (కెప్టెన్), ప్రదీప్, తరుణ్ చంద్ర, చిరంజీవి సర్జా, జై కార్తీక్, ప్రసన్న, అభిమన్యు, భాస్కర్, రాహుల్, రాజీవ్, ధర్మ, సౌరవ్, తరుణ్ సుధీర్, విశ్వాస్, దర్శన్

చెన్నై రైనోస్ స్క్వాడ్ : Chennai Rhinos Squad 

ఆర్య (కెప్టెన్), అశోక్ సెల్వం, భారత్, శామ్, బోస్ వెంకట్, హేమచంద్రన్, కళైయారసన్, మహేంద్రన్, నందా, పృథ్వి, రమణ, సంజయ్ భారతి, శాంతను, శరణ్, ఉదయ్ కుమార్, విక్రాంత్, విష్ణు

తెలుగు వారియర్స్ స్క్వాడ్ : Telugu Warriors Squad 

అఖిల్ అక్కినేని (కెప్టెన్), వెంకటేష్, సచిన్ జోషి, సుధీర్ బాబు, తరుణ్, ప్రిన్స్ సిసిల్, సాయి ధరమ్ తేజ్, అజయ్, అశ్విన్ బాబు, ఆదర్శ్ బాలకృష్ణ, నందకిషోర్, నిఖిల్, సిద్దార్థ్, ప్రభు, రఘు, సుశాంత్, శ్రీకాంత్, తారక్ రత్న, సామ్రాట్ రెడ్డి, విశ్వ

ముంబై హీరోస్ స్క్వాడ్ : Mumbai Heroes Squad 

రితేష్ దేశ్‌ముఖ్ (కెప్టెన్), బాబీ డియోల్, సునీల్ శెట్టి, వరుణ్ బదోలా, అఫ్తాబ్ శివదాస్ని, సమీర్ కొచ్చర్, ఇంద్రనీల్ సేన్‌గుప్తా, అపూర్వ లఖియా, కబీర్ సదానంద్, కునాల్ ఖేము, రాజా భేర్వాణి, షబ్బీర్ అహ్లువాలియా, శరద్ ఖేల్కర్, సోహైల్ ఖాన్, షకీబ్ సలీమ్, తుషార్ జలోటా, వాట్సాల్ సేథ్, సాహిల్ చౌదరి

భోజ్‌పురి దబాంగ్స్ స్క్వాడ్ : Bhojpuri Dabangs Squad 

మనోజ్ తివారి (కెప్టెన్), రవి కిషన్, దినేష్ లాల్ యాదవ్, రామ్ పర్వేశ్ యాదవ్, ఉదయ్ తివారీ, అజయ్ శర్మ, విక్రాంత్ సింగ్, ఆదిత్య ఓఝా, ప్రకాష్ జాయిస్, అయాజ్ ఖాన్, శైలేష్ సిన్హా, వైభవ్ రాజ్, అస్గర్ రషీద్ ఖాన్, వికాస్ సింగ్, అక్బర్ నక్వి, గజేంద్ర ప్రతాప్ ద్వివేది, జై ప్రకాష్ యాదవ్, రాజ్ చౌహన్, పవన్ సింగ్, బాబీ సింగ్, ప్రదీప్ పాండే, యష్ కుమార్