ఢిల్లీ గెలిస్తే పంజాబ్ ప్లేఆఫ్ ఆశలు గల్లంతే : If Delhi wins, Punjab will lose their playoff hopes

నేడు జరిగే మ్యాచ్ లో విజయం సాధించి ప్లేఆఫ్స్ కి చేరుకోవాలని ఒక జట్టు... తమను ప్లేఆఫ్స్ నుంచి దూరం అయ్యేలా చేసిన జట్టుని ఓడించాలని మరో జట్టు... దీంతో నేడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) లో భాగంగా జరిగే మ్యాచ్ అభిమానులకు కనువిందు చేయనుంది.

ఢిల్లీ గెలిస్తే పంజాబ్ ప్లేఆఫ్ ఆశలు గల్లంతే : If Delhi wins, Punjab will lose their playoff hopes

ఢిల్లీ గెలిస్తే పంజాబ్ ప్లేఆఫ్ ఆశలు గల్లంతే : If Delhi wins, Punjab will lose their playoff hopes 

నేడు జరిగే మ్యాచ్ లో విజయం సాధించి ప్లేఆఫ్స్ కి చేరుకోవాలని ఒక జట్టు... తమను ప్లేఆఫ్స్ నుంచి దూరం అయ్యేలా చేసిన జట్టుని ఓడించాలని మరో జట్టు... దీంతో నేడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) లో భాగంగా జరిగే మ్యాచ్ అభిమానులకు కనువిందు చేయనుంది. 

ఐపీఎల్ (IPL) 16 వ సీజన్లో భాగంగా నేడు పంజాబ్ కింగ్స్ (PBKS), ఢిల్లీ క్యాపిటల్స్ (DC) జట్లు తలపడనున్నాయి. ఇప్పటికే ప్లేఆఫ్స్ కి దూరమైన ఢిల్లీ జట్టు గనుక ఈ మ్యాచ్ లో గెలిస్తే పంజాబ్ ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతాయని చెప్పవచ్చు. ఐదు రోజుల క్రితం ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో పంజాబ్ నెగ్గి ఢిల్లీని ఈ సీజన్ నుంచి బైటకి పంపించింది. దీనికి ప్రతీకారం తీర్చుకునేందుకు నేడు ఢిల్లీకి అవకాశం వచ్చిందని భావిస్తోంది. అందుకే నేడు జరిగే మ్యాచ్ లో గెలిచి పంజాబ్ ను దెబ్బకొట్టాలని ఆశిస్తోంది.

ఈ సీజన్లో ఇంక ఏడు మ్యాచ్ లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇప్పటికి మాత్రం ప్లేఆఫ్స్ కి చేరిన మొదటి జట్టుగా డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ (GT) నిలిచింది. ఢిల్లీ క్యాపిటల్స్ (DC), సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్లు ప్లేఆఫ్ రేసు నుండి వైదొలగాయి. ఇంక బరిలో ఏడు జట్లు మూడు బెర్తుల కోసం తలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో నేడు జరిగే మ్యాచ్ పంజాబ్ జట్టుకు కీలకం కానుంది. అంతే కాకుండా మిగతా మ్యాచ్ లు సైతం కీలకం కానున్నాయి. పంజాబ్ జట్టుకు నేడు జరిగే మ్యాచ్ కాకుండా ఇంకో మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ రెండింటిలో గెలిస్తేనే ప్లేఆఫ్స్ కి చేరుకునే అవకాశాలు ఉంటాయి. 2014 సీజన్ నుంచి ఇప్పటి వరకూ పంజాబ్ టీమ్ ఒక్కసారి కూడా లీగ్ దశను దాటకపోవడం గమనార్హం. 

పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ XI : PBKS playing XI 

ప్రభ్‌సిమ్రాన్ సింగ్, శిఖర్ ధావన్ (కెప్టెన్), లియామ్ లివింగ్ స్టోన్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), సామ్ కర్రన్, సికిందర్ రజా, షారుఖ్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, రిషీ ధావన్, రాహుల్ చాహర్, అర్షదీప్ సింగ్, కగిసో రబాడా

పంజాబ్ కింగ్స్ పూర్తి జట్టు : PBKS full squad

ప్రభ్‌సిమ్రాన్ సింగ్, శిఖర్ ధావన్ (కెప్టెన్), మాథ్యూ షార్ట్, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), సామ్ కరన్, షారుక్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, రిషి ధావన్, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్, నాథన్ ఎల్లిస్, సికందర్ రజా, అథర్వ తైదే, మోహిత్ రాఠీ, శివమ్ సింగ్, కగిసో రబాడా, హర్‌ప్రీత్ సింగ్ భాటియా, భానుకా రాజపక్స, బల్తేజ్ సింగ్, విధ్వత్ కావరప్ప, గుర్నూర్ బ్రార్

ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ XI : DC playing XI 

డేవిడ్ వార్నర్ (కెప్టెన్), ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్), మిచెల్ మార్ష్, రోవ్‌మన్ పావెల్ లేదా అన్రిచ్ నోర్జే, అమన్ హకీమ్ ఖాన్, అక్షర్ పటేల్, ప్రవీణ్ దూబె, కుల్దీప్ యాదవ్, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్, ముఖేశ్ కుమార్, మనీశ్ పాండే

ఢిల్లీ క్యాపిటల్స్ ఫుల్ స్క్వాడ్ : DC full squad

డేవిడ్ వార్నర్ (కెప్టెన్), పృథ్వీ షా, మిచెల్ మార్ష్, యశ్ ధుల్, మనీష్ పాండే, ఫిల్ సాల్ట్, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, చేతన్ సకారియా, అమన్ హకీమ్ ఖాన్, లలిత్ యాదవ్, విక్కీ ఓస్త్వాల్, అన్రిచ్ నార్ట్జే, కుల్దీప్ యాదవ్, ముస్తాఫిజుర్ రెహమాన్, ముఖేష్ కుమార్, కమలేష్ నాగర్‌కోటి, సర్ఫరాజ్ ఖాన్, ప్రవీణ్ దూబే, రిలీ రోసౌవ్, రోవ్‌మాన్ పావెల్, ఖలీల్ అహ్మద్, ఇషాంత్ శర్మ, లుంగి ఎంగిడి, రిపల్ పటేల్