ఐపీఎల్ లో అత్యధిక వ్యక్తిగత స్కోర్లు : Highest Individual Scores in IPL

కొడితే కొట్టాలిరా సిక్సు కొట్టాలి అన్నట్లుగా.. ధనాధన్ పొట్టి క్రికెట్ గా పిలవబడే ఐపీఎల్ సీజన్ వచ్చే ఏడాది మర్చి 25 న ప్రారంభం కానుంది. 2008 లో ప్రారంభమైన ఈ ఐపీఎల్ చిన్నారుల నుంచి పెద్దవాళ్ళ వరకు ఆదరణ చూరగొంది.

ఐపీఎల్ లో అత్యధిక వ్యక్తిగత స్కోర్లు : Highest Individual Scores in IPL

ఐపీఎల్ లో అత్యధిక వ్యక్తిగత స్కోర్లు : Highest Individual Scores in IPL

కొడితే కొట్టాలిరా సిక్సు కొట్టాలి అన్నట్లుగా.. ధనాధన్ పొట్టి క్రికెట్ గా పిలవబడే ఐపీఎల్ సీజన్ వచ్చే ఏడాది మర్చి 25  ప్రారంభం కానుంది. 2008 లో ప్రారంభమైన  ఐపీఎల్ చిన్నారుల నుంచి పెద్దవాళ్ళ వరకు ఆదరణ చూరగొంది.

రికార్డుల మోతలకు చిరునామా ఐపీఎల్

ఐపీఎల్ మ్యాచులు జరుగుతున్నాయంటే రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారతాయనడంలో సందేహమే లేదు. టీవీలకు అతుక్కు పోయేవారు కొందరైతే, మొబైల్ లో లీనమైపోయేవారు మరి కొందరు. అంతటి క్రేజ్ ను సంపాందించుకుంది ఐపీఎల్. ప్రపంచంలో ఎన్ని క్రికెట్ లీగ్ లు జరుగుతున్నప్పటికీ ఐపీఎల్ కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. టెస్టులు, వన్డే మ్యాచుల కన్నా కోట్లాది మంది ఐపీఎల్ పై ఆదరణ చూపుతున్నారు. తమ ఆరాధ్య క్రికెటర్ల విన్యాసాలను ఆస్వాదిస్తున్నారు.

 

ఇప్పటికే ఆయా ఫ్రాంచైజీలు ఆటగాళ్ల కొనుగోలు ప్రక్రియను దాదాపు పూర్తి చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఎప్పటి మాదిరిగానే బ్యాటర్లు తమ బ్యాట్ కి పని చెప్పి పరుగుల దాహం తీర్చుకునేందుకు తహతహలాడుతున్నారు. మొత్తం 74 మ్యాచులు జరగనున్నాయి. ఇప్పటి వరకూ జరిగిన 15 సీజన్లలో ఎంతో మంది తమ బ్యాట్ కి పని చెప్పి సెంచరీలు సాధించారు.

 

విధ్వంసం సృష్టిస్తున్న బ్యాటర్లు

మరి వచ్చే ఏడాది కూడా ఇదేమారిగా పరుగులు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. దానికోసం కళ్ళల్లో వత్తులు వేసుకుని మరీ ఎదురు చూస్తున్నారు. ఎంతో మంది బ్యాటర్లు తమ ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకు పడి సిక్సులు, ఫోర్లతో మైదానాన్ని హోరెత్తించారు. ఇప్పటివరకూ జరిగిన 15 ఐపీఎల్ సీజన్లలో అత్యధిక వ్యక్తిగత స్కోర్లు నమోదు చేసిన వారి వివరాలను ఒకసారి పరిశీలిద్దాం.

 

వీరిలో కొందరు రెండేసి సార్లు అత్యధిక స్కోర్లు నమోదు చేసిన వారు కూడా ఉన్నారు. ఆయా ఫ్రాంచైజీలు వేల కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి క్రీడాకారులను తీసుకుంటుంది. ప్రపంచంలోనే అత్యంత ఆదరణ పొందిన, పొందుతున్న ఐపీఎల్ వచ్చే ఏడాది కూడా కనువిందు చేసేలా ఉంటుందని ఆశిస్తున్నారు అభిమానులు. ఆయా క్రీడాకారుల గణాంకాలు కూడా తమ ప్రతిభ ఆధారంగా మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి.

 

మొత్తం 10 జట్లు పాల్గొంటున్న ఐపీఎల్ క్రీడల్లోనే అత్యంత విలువైనదిగా ప్రపంచ ప్రసిద్ధి చెందింది. భారత దేశం లోని వివిధ నగరాల్లోని క్రికెట్ స్టేడియంలలో జరిగే మ్యాచ్ లకు టిక్కెట్లు కూడా హాట్ కేకుల్లా అమ్ముడవుతాయి అనడంలో అతిశయోక్తి లేదు.

 

క్రిస్ గేల్ (175)

పొట్టి క్రికెట్ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది విధ్వంసకర వెస్టిండీస్ బ్యాట్స్ మన్ క్రిష్ గేల్. ఐపీల్ రిత్రలోనే అత్యధిక వ్యక్తిగ రుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో వెస్టిండిస్ విధ్వంస ఓపెనర్ క్రిస్గేల్ అగ్రస్థానంలో ఉన్నాడు. రెండు సార్లు తన అత్యధిక వ్యక్తిగత స్కోర్ ను సాధించాడు.

 

ఐపీఎల్ 2013 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ రుపున ఆడిన గేల్ పుణేతో రిగిన మ్యాచ్లో 175 రుగులు సాధించాడు. కేవలం 30 బంతుల్లోనే గేల్ సెంచరీ చేసి రికార్డు సృష్టించాడు. ఇందులో 13 ఫోర్లు, 17 సిక్సులున్నాయి. మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు (ఆర్సీబీ) 130 రుగుల భారీ తేడాతో విజయం సాధించింది. అనంతరం 2012 మే 17 ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచులో 62 బంతుల్లో 128 పరుగులు చేసాడు. ఇందులో ఏడు ఫోర్లు, 13 సిక్సులు ఉన్నాయి. 50 ఓవర్ల పరిమిత క్రికెట్ మ్యాచుల్లోనే సాధ్యమయ్యే సెంచురీలను 20 ఓవర్ల పొట్టి క్రికెట్ మ్యాచుల్లో 150 కి పైగా పరుగులు సాధించి ఔరా అనిపించాడు.

 

క్రిస్ గేల్ ఐపీఎల్ లో మొత్తం 142 మ్యాచులు ఆడాడు. ఇందులో 46 సార్లు నాటవుట్ గా నిలిచాడు. 39.72 సగటుతో 148.96 స్ట్రయిక్ రేట్ తో 4965 పరుగులు సాధించాడు. పరుగులో ఆరు సెంచురీలు, 31 అర్ధ సెంచురీలు ఉన్నాయి. మొత్తం 405 ఫోర్లు, 357 సిక్సులు బాదాడు.

 

బ్రెండన్ మెక్మ్ (158)

న్యూజిలాండ్ దేశానికి చెందిన బ్రెండన్ మెక్మ్ కోల్కతా తరపున ఐపీఎల్ బరిలోకి దిగాడు. తాను ఆడిన ప్రారంభ సీజన్ తొలి మ్యాచులోనే సెంచురీని సాధించాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు తో జరిగిన మ్యాచులో కేవలం 73 బంతుల్లోనే 158 పరుగులు చేసాడు. ఇందులో 10 ఫోర్లు, 13 సిక్సులు ఉన్నాయి. మెక్మ్ యొక్క మెరుపు బ్యాటింగ్ కారణంగా కోల్కతా 140 పరుగుల తేడాతో విజయం సాధించింది.

 

మెక్మ్ తన ఐపీఎల్ కెరీర్ లో 109 మ్యాచులు ఆడాడు. ఐదు సార్లు నాటవుట్ గా నిలిచాడు. 27.69 సగటుతో 131.75 స్ట్రయిక్ రేట్ తో 2880 పరుగులు చేసాడు. మెక్మ్ తన టెస్ట్ కెరీర్ లో 107 సిక్సులు కొట్టి ప్రపంచ రికార్డు సృష్టించాడు. 2016 లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ మ్యాచులో కేవలం 54 బంతుల్లోనే అత్యంత వేగంగా సెంచురీ చేసి రికార్డు సృష్టించాడు.

 

క్వింటన్ డికాక్ (140)

లక్నో సూపర్ జెయింట్స్ తరపున ఆడిన క్వింటన్ డికాక్ దక్షిణాఫ్రికాకు చెందిన క్రికెటర్. కోల్కతా నైట్ రైడర్స్ తో  2022 మే 18 జరిగిన మ్యాచులో డికాక్ 70 బంతులను ఎదుర్కొని 10 ఫోర్లు, 10 సిక్సులతో 140 పరుగులు సాధించాడు.

 

డికాక్ తన ఐపీఎల్ కెరీర్ లో 92 ఇన్నింగ్స్ ఆడి 2764 పరుగులు సాధించాడు. ఇతని బ్యాటింగ్ సగటు 32.14 కాగా స్ట్రయిక్ రేట్ 133.91 గా ఉంది. తన కెరీర్లో మొత్తం 277 ఫోర్లు, 106 సిక్సర్లు కొట్టాడు. ఇందులో రెండు సెంచురీలు, 19 అర్ధ సెంచురీలు ఉన్నాయి. వికెట్ కేర్ అయిన డికాక్ 35 టెస్ట్ మ్యాచుల్లో అతి వేగంగా 150 మందిని అవుట్ చేసిన ఘనతను సాధించాడు. తదనంతరం మొత్తం 47 టెస్ట్ మ్యాచుల్లో 200 మార్క్ ని చేరుకున్నాడు. దక్షిణాఫ్రికా తరపున టీ20 మ్యాచుల్లో అత్యంత వేగంగా 17 బంతుల్లోనే అర్ధ సెంచురీ చేసిన బ్యాటర్ గా డికాక్ గుర్తింపు పొందాడు.

 

ఏబీ డివిలియర్స్ (133)

మిస్టర్ 360 గా పిలువబడే దక్షిణాఫ్రికా బ్యాట్స్ మన్ ఎటువంటి బంతినైనా బౌండరీ లైన్ అవతలకి పంపించే సత్తా గలవాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు తరపున ఐపీఎల్ ఆడాడు. 2015 సీజన్లో ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచులో 59 బంతుల్లో 133 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. ఇదే మ్యాచులో విరాట్ కోహ్లీతో కలిసి 215 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఏబీడీ సెంచురీలో 19 ఫోర్లు, 4 సిక్సులు ఉన్నాయి.

 

మరలా 2016 ఐపీఎల్ సీజన్లో గుజరాత్ లయన్స్ తో జరిగిన మ్యాచ్ లో కేవలం 52 బంతుల్లోనే 129 పరుగులను 10 ఫోర్లు, 12 భారీ సిక్సులతో సాధించాడు. మ్యాచులో కూడా విరాట్ కోహ్లీ 109 పరుగులను 55 బంతుల్లోనే చేసాడు.

 

ఏబీడీ తన ఐపీఎల్ కెరీర్లో మొత్తం 184 మ్యాచులు ఆడాడు. ఇందులో 40 సార్లు నాటవుట్ గా నిలిచాడు. 39.71 సగటుతో 151.69 స్ట్రయిక్ రేట్ తో 5162 పరుగులు చేసాడు. ఇందులో మూడు సెంచురీలు, 40 అర్ధ సెంచురీలు ఉన్నాయి. మొత్తం 413 ఫోర్లు, 251 సిక్సులు తన ఐపీఎల్ కెరీర్లో బాదాడు.

 

కేఎల్ రాహుల్ (132)

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు కెప్టెన్ గా రాహుల్ వ్యహరించాడు. 2020 సీజన్లో యూఏఈ వేదికగా జరిగిన మ్యాచులో తన అత్యధిక ఐపీఎల్ స్కోర్ ను సాధించాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు తో జరిగిన మ్యాచులో 14 ఫోర్లు, 7 సిక్సులు సాయంతో 132 పరుగులు చేసాడు. భారతీయ ఆటగాళ్లలో ఐపీఎల్ లో సాధించిన వ్యక్తిగత స్కోర్ లో ఇదే అధికం కావడం గమనార్హం.

 

తన కెరీర్లో మొతం 109 ఐపీఎల్ మ్యాచెస్ ఆడిన రాహుల్ 48.01 సగటుతో 3889 పరుగులు చేసాడు. 136.22 అతని స్ట్రయిక్ రేట్. అతని ఐపీఎల్ కెరీర్లో 4 సెంచురీలు, 31 అర్ధ సెంచురీలు ఉన్నాయి. 327 ఫోర్లు, 164 సిక్సులు బాదాడు. అత్యంత వేగంగా మూడు ఫార్మాట్లలోనూ సెంచురీలు చేసిన బ్యాటర్ గా రాహుల్ రికార్డు సృష్టించాడు.

 

రిషబ్ పంత్ (128)

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన పంత్ విధ్వంసకర బ్యాటింగ్ తో బౌలర్లను హడలెత్తిస్తాడు. 2018 మే 10 తేదీన సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచులో తన ఐపీఎల్ సెంచురీ సాధించాడు. మ్యాచులో పంత్ 63 బంతుల్లోనే 15 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచురీ చేసాడు. పంత్ తన ఐపీఎల్ కెరీర్లో మొత్తం 98 మ్యాచులు ఆడాడు. ఇందులో 15 సార్లు నాటవుట్ గా నిలిచాడు. అతను బ్యాటింగ్ సగటు 34.61 కాగా స్ట్రయిక్ రేట్ 147.97 గా ఉంది. ఒక సెంచురీతో పాటు 15 అర్ధ సెంచురీలు చేసాడు. 260 ఫోర్లు, 129 సిక్సులు బాదాడు.

 

మురళీ విజయ్ (127)

చెన్నై సూపర్ కింగ్స్ కి ప్రాతినిధ్యం వహించిన మురళీ విజయ్ రాజస్థాన్ రాయల్స్ తో 2010 ఏప్రిల్ 3 తేదీన జరిగిన మ్యాచులో సెంచురీ సాధించాడు. 226 స్ట్రయిక్ రేట్ తో 8 ఫోర్లు, 11 సిక్సుల సాయంతో 127 పరుగులు చేసాడు. తన ఐపీఎల్ కెరీర్లో మొత్తం 106 మ్యాచులు ఆడి ఐదు సార్లు నాటవుట్ నిలిచాడు. ఇతని బ్యాటింగ్ సగటు 25.93 కాగా 121.87 స్ట్రయిక్ రేట్. రెండు సెంచురీలు, 13 అర్ధ సెంచురీలు చేసాడు. ఐపీఎల్ లో మొత్తంగా 247 ఫోర్లు, 91 సిక్సులు కొట్టాడు.

 

డేవిడ్ వార్నర్ (126)

ఆస్ట్రేలియాకి చెందిన డేవిడ్ వార్నర్ ఢిల్లీ క్యాపిటల్స్ కి 2017 లో ప్రాతినిధ్యం వహించాడు. 2017 ఏప్రిల్ 30 కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచులో వార్నర్ 59 బంతుల్లో 213.55 స్ట్రయిక్ రేట్ తో 10 ఫోర్లు, 8 సిక్సులు సాయంతో 126 పరుగులు చేసాడు. వార్నర్ తన ఐపీఎల్ కెరీర్లో 162 మ్యాచులు ఆడి 22 సార్లు నాటవుట్ గా నిలిచాడు. 5881 పరుగులను 42.01 సగటుతో సాధించాడు. వార్నర్ స్ట్రయిక్ రేట్ 140.69 గా ఉంది. నాలుగు సెంచురీలు, 55 అర్ధ సెంచురీలు చేసాడు. ఐపీఎల్ లో 577 ఫోర్లు, 216 సిక్సులు బాదాడు.

 

జాస్ బట్లర్ (124)

ఇంగ్లాండ్ కి చెందిన బట్లర్ రాజస్థాన్ రాయల్స్ కి ప్రాతినిధ్యం వహించాడు. తన ఐపీఎల్ సెంచురీని 2021 మే 2 తేదీన సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచులో సాధించాడు. బట్లర్ తాను చేసిన 124 పరుగులను 64 బంతుల్లో 193.75 స్ట్రయిక్ రేట్ తో 11 ఫోర్లు, 8 సిక్సులు సాయంతో చేసాడు. ఐపీఎల్ కెరీర్లో 82 మ్యాచులు ఆడిన బట్లర్ 10 సార్లు నాటవుట్ గా నిలిచాడు. 39.87 సగటుతో 2831 పరుగులు చేసిన బట్లర్ స్ట్రయిక్ రేట్149.71 బట్లర్ 5 సెంచురీలు, 15 అర్ధ సెంచురీలు చేసాడు. మొత్తం ఐపీఎల్ లో 27 ఫోర్లు, 135 సిక్సులు కొట్టాడు.

 

వీరేంద్ర సెహ్వాగ్ (122)

తన బ్యాట్ తో విధ్వంసాన్ని సృష్టించే సెహ్వాగ్ కి బౌలింగ్ చేయాలంటే బౌలర్స్ హడలి పోయేవాళ్లు. ఫార్మాట్ అయినా అతనికి ఒక్కటే. ఐపీఎల్ లో 2014 మే 30 తేదీన చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచులో 122 పరుగులను 210.34 స్ట్రయిక్ రేట్ తో 12 ఫోర్లు, 8 సిక్సులు సాయంతో చేసాడు. సెహ్వాగ్ తన ఐపీఎల్ కెరీర్లో మొత్తం 104 మ్యాచులు ఆడి ఐదు సార్లు నాటవుట్ గా నిలిచాడు. 27.56 సగటుతో 2728 పరుగులను చేసాడు. 155.44 స్ట్రయిక్ రేట్ తో రెండు సెంచురీలు, 16 అర్ధ సెంచురీలు చేసాడు. 334 ఫోర్లు, 106 సిక్సులు ఉన్నాయి.

 

వచ్చే ఏడాది 2023 లో జరగబోయే ఐపీఎల్ లో కూడా ఎన్ని సెంచురీలు నమోదు అవుతాయనే లెక్కలు ఇప్పటి నుంచే క్రికెట్ అభిమానులు అంచనాలు వేస్తున్నారు. తమ అభిమాన క్రికెటర్ బ్యాట్ నుంచి సెంచురీలను అభిమానులు ఆశిస్తున్నారు.