ఐపీఎల్ లో అత్యుత్తమ జట్టు ఏది : Which is the Best Team in IPL

ఫోర్లు.. సిక్సులు.. కళ్ళు చెదిరే ఫీల్డింగ్ విన్యాసాలు.. బౌండరీ లైన్ వద్ద అమాంతం గాల్లోకి ఎగిరి పట్టే క్యాచులు.. ధనాధన్ బ్యాటింగ్ .. క్రికెటర్ల భావోద్వేగాలు.. క్రీడాభిమానుల ఉత్కంఠ.. వెరసి ఇలాంటి కనీవినీ ఎరుగని విన్యాసాలు చూసేందుకు లభించే ఒకేఒక చోటు.. ఐపీఎల్

ఐపీఎల్ లో అత్యుత్తమ జట్టు ఏది : Which is the Best Team in IPL

ఐపీఎల్ లో అత్యుత్తమ జట్టు ఏది : Which is the Best Team in IPL

 

ఫోర్లు.. సిక్సులు.. కళ్ళు చెదిరే ఫీల్డింగ్ విన్యాసాలు.. బౌండరీ లైన్ వద్ద అమాంతం గాల్లోకి ఎగిరి పట్టే క్యాచులు..  ధనాధన్ బ్యాటింగ్ .. క్రికెటర్ల భావోద్వేగాలు.. క్రీడాభిమానుల ఉత్కంఠ.. వెరసి ఇలాంటి కనీవినీ ఎరుగని విన్యాసాలు చూసేందుకు లభించే ఒకేఒక చోటు.. ఐపీఎల్ వేదిక.. వేలకోట్ల రూపాయల వెచ్చించి క్రీడాకారులను ఆయా జట్ల యాజమాన్యాలు వేలంలో చేజిక్కించుకుంటారు.

 

దేశవిదేశీ క్రీడాకారుల మేళవింపుతో ఐపీఎల్

ప్రపంచ వ్యాపంగా కోట్లాదిమంది మనసులను ప్రతి ఏడాది గెలుచుకుంటున్న ఒకే ఒక టోర్నమెంట్ ఐపీఎల్. 2008 లో ప్రారంభించిన  ఐపీఎల్  ఏడాదితో 15 సీజన్లు పూర్తి చేసుకుంది. ఎన్నో టీమ్, వ్యక్తిగత రికార్డులు రికార్డులు నమోదయ్యాయి. మరెందరో యువ క్రీడాకారులకు ఆయా దేశాల జాతీయ జట్టులో స్థానం సంపాదించుకునేందుకు చక్కటి ప్లాట్ ఫామ్ గా ఉపయోగపడింది. పేద యువ క్రీడాకారులను వేలంలో ఆయా ఫ్రాంచైజీలు దక్కించుకుని వారిని లక్షాధికారులను, కోటీశ్వరులను చేసాయి. ఆయా ప్లేయర్ల వ్యక్తిగత ట్రాక్ రికార్డులు, దేశవాళీ, లీగ్స్ లో వారు చూపే ప్రతిభ ఆధారంగా ఆయా ఫ్రాంచైజీలు ఆటగాళ్లకు తగిన ధరను నిర్ణయిస్తాయి.

 

దేశ విదేశాలకు చెందిన క్రీడాకారులు ఆయా జట్లలో మిళితమై ఆడడం గమనార్హం. అంతర్జాతీయ టోర్నమెంట్లలో ప్రత్యర్థులుగా ఆడే ఆయా జట్ల క్రీడాకారులు, ఐపీల్ వరకు వచ్చేసరికి కలిసి ఆడుతుండడం క్రీడారంగంలోనే ఒక గొప్ప మలుపు అని చెప్పవచ్చు. దీనివల్ల ఆయా ఆటగాళ్లలో స్నేహపూర్వక వాతావరణం ఎల్లప్పుడూ నిలిచి ఉండేందుకు ఇది దోహద పడుతుంది. అందుకే విదేశీ క్రికెటర్లు ఐపీల్ లో ఆడేందుకు ఉత్సాహం చూపిస్తుంటారు. తమ పేర్లను నమోదు చేసుకుంటుంటారు.

 

ఇంతటి ప్రసిద్ధి చెందిన ఐపీఎల్ లో 10 టీమ్స్ ఆడుతుంటాయి. ఇప్పటి వరకు జరిగిన 15 సీజన్లలో అన్ని జట్లు తమ అత్యుత్తమ ప్రదర్శనను ఇచ్చాయి. అయితే ఇందులో కొన్ని జట్లు మాత్రం ఎవరికీ అందనంత ఎత్తులోనూ.. ఎవరికీ సాధ్యం కానీ రికార్డులను నమోదు చేశాయి. ఇప్పటి వరకు జరిగిన ఐపీఎల్ అన్ని సీజన్లలో కలిపి ఉత్తమ జట్లుగా ఉన్నవాటిని పరిశీలిస్తే ఎన్నో జట్లు తమ ఉత్తమ ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

 అడుగు పెడుతూనే అద్భుత ప్రదర్శన చేసిన గుజరాత్ టైటాన్స్

ఐపీఎల్ ప్రారంభించిన తరువాత 15 సీజన్లో అంటే 2022 లో గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ లో అడుగుపెట్టింది. వస్తూనే సంచలనాలు నమోదు చేసింది. అద్భుతమైన ప్రదర్శన చేసి ఆడిన 9 మ్యాచుల్లో 8 మ్యాచులను గెలుపొందడమే కాకుండా ట్రోఫీని కూడా కైవసం చేసుకుని ఐపీల్ లో చరిత్రను తిరగరాసింది. భారత జాతీయ జట్టులో సభ్యుడు హార్దిక్ పాండ్యా కెప్టెన్ గా వ్యవహరించాడు.

ఆడిన తొమ్మిది మ్యాచుల్లో 8 విజయాలతో 16 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచి ప్లే ఆఫ్స్ కి అర్హత సాధించింది. అద్భుతమైన వీరి ప్రదర్శన 2008 లో ప్రారంభించిన ఐపీఎల్ తరువాత ఒక్కరికీ సాధ్యం కాలేదు. మొట్టమొదటిసారి 2008 లో ఆడిన ఏడు మ్యాచుల్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఆరు విజయాలు సాధించింది. తరువాత ఇలా విజయాలు సాధించిన జట్టు ఏదైనా ఉంది అంటే అది గుజరాత్ టైటాన్స్ మాత్రమే.

 

ఉత్తమ జట్టులో గణాంకాలు పరిశీలించాలి...

రోహిత్ శర్మ సారధ్యం లోని ముంబై ఇండియన్స్ 15 ఐపీఎల్ సీజన్లలో 5 సార్లు ఛాంపియన్ గా అవతరించింది. ఒకసారి రన్నరప్ గా నిలిచింది.  చెన్నై సూపర్ కింగ్స్ కూడా 4 సార్లు ఛాంపియన్ గా నిలిచి మరో మరో 5 సార్లు రన్నరప్ గా నిలిచింది. అయితే ఎక్కువ సార్లు గెలిచింది ముంబై కాబట్టి జట్టు ఉత్తమమైనదని అంటుంటారు.

 

ఇక్కడ తగిన గణాంకాలు గమనిస్తే పలు ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. అయితే అన్ని సీజన్లలో కలిపి మ్యాచుల విజయ శాతాన్ని పరిశీలిస్తే చెన్నై సూపర్ కింగ్స్ అత్యధిక విజయ శాతం నమోదు చేసింది. 15 సీజన్లలో రెండు సీజన్లలో సీఎస్కే జట్టు ఆడలేదు. ముంబై జట్టు మ్యాచుల విజయ శాతం 55.84% ఉంటె సీఎస్కే జట్టుది 58.98% గా ఉంది.

 

2016, 2017 ఐపీఎల్ సీజన్లలో సీఎస్కే జట్టు ఆడలేదు. ముంబై ఇండియన్ జట్టు 2008 నుంచి 2022 వరకు జరిగిన 15 సీజన్లలో 231 మ్యాచులు ఆడి 129 మ్యాచుల్లో గెలిచి 98 మ్యాచుల్లో ఓడింది. సీఎస్కే జట్టు 13 సీజన్లలో 210 మ్యాచులో ఆడి 121 మ్యాచుల్లో గెలిచి 86 మ్యాచుల్లో ఓడిపోయింది.

 

ముంబై ఇండియన్స్ 2013, 2015, 2017, 2019, 2020 సంవత్సరాల్లో విజేతగా నిలవగా 2010 సంవత్సరంలో రన్నరప్ గా నిలిచింది. అదేవిధంగా 2010, 2011, 2018, 2021 లో విజేతగా నిలవగా 2008, 2012, 2013, 2015, 2019 లో రన్నరప్ గా నిలిచింది.

 

ముంబై ఇండియన్స్ పై సమీక్ష

ఆర్ధిక రాజధానిగా ఉన్న ముంబై కి చెందిన ముంబై ఇండియన్స్ జట్టుకి రిలయన్స్ స్పాన్సర్ గా వ్యవహరిస్తోంది. జట్టుకి ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారు. మొదటిగా ఆడిన రెండు సీజన్లలో జట్టు ప్లే ఆఫ్స్ కి చేరుకోలేదు. మూడో సీజన్లో ఫైనల్ కి చేరినా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు చేతిలో ఓడి రన్నరప్ తో సరిపెట్టుకుంది. అనంతరం 2013 లో విజేతగా నిలిచింది. సీఎస్కే తరువాత అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిచింది.

 

ముంబై ఇండియన్స్ జట్టు సాధించిన కొన్ని రికార్డులను చూద్దాం. అత్యధిక పరుగులు (146) తేడాతో గెలుపొందిన జట్టు ముంబై ఇండియన్స్. 2017 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన 45 మ్యాచులో ఇది సాధించింది. అలజర్రి జోసెఫ్..  ముంబై జట్టులో బౌలర్. 11 ఏళ్లుగా సొహయిల్ తన్వీర్ రికార్డును సవరించాడు. 2019 లో సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచులో జోసెఫ్ ఉత్తమ గణాంకాలు నమోదు చేసాడు.

 

రికార్డు ఇప్పటికీ పదిలంగానే ఉంది. జోసెఫ్ కేవలం 12 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు (6/12) తీసాడు. అదేవిధంగా చెన్నై ని వారి హోమ్ గ్రౌండ్ లోనే నిరాటంకంగా 10 సార్లు ఓడించి రికార్డు సృష్టించింది. రికార్డు ఇప్పటికీ చెక్కుచెదరలేదు. దీంతో పాటు ముంబై ఇండియన్స్ 5 సార్లు ఐపీల్ ట్రోఫీని గెలిచి అందరికంటే టాప్ లో నిలిచింది.

 

చెన్నై సూపర్ కింగ్స్ (CSK)

ఐపీఎల్ టోర్నమెంట్ ప్రారంభించినప్పటి నుంచి చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టుది ఒక అద్భుత ప్రయాణం అని చెప్పవచ్చు. ప్రతీ సీజన్లో జట్టు ప్లే ఆఫ్స్ కి చేరుకుంది. లీగ్ లో కూడా అత్యంత విజయవంతమైన జట్టుగా పేర్కొనవచ్చు. అంతేకాకుండా  సీఎస్కే జట్టు ఏడాది జనవరి లో భారతదేశంలో మొట్టమొదటి యునికార్న్ స్పోర్ట్స్ ఎంటర్ప్రైజ్ అయింది. జట్టుకి ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులున్నారు.

ధోని సారధ్యంలో జట్టు ఆడిందంటే ఇతర జట్ల అభిమానులు కూడా వీరిని ఫాలో అవుతారంటే అతిశయోక్తి కాదు. అందుకే జట్టు అంత్యంత ప్రసిద్ధి చెందింది. స్పాట్ ఫిక్సింగ్ మకిలి అంటుకుని రెండేళ్లు ఐపీఎల్ కి దూరమైన జట్టు ఇది. 2020 లో పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న సీఎస్కే జట్టు మరుసటి ఏడాది 2021 లో విజేతగా నిలిచింది. టాప్ క్లాస్ క్రికెటర్లు లేకపోయినా, యువ ఆటగాళ్లు అందుబాటులో లేకపోయినా, టీమ్ లో అనుభవమున్న ఇద్దరు ముగ్గురిని ఉపయోగించుకుని విజయం సాధించడంలో విజయవంతం అయ్యాడు జట్టు కెప్టెన్ ఎమ్మెస్ ధోని.

ఆడిన మొదటి ఐపీఎల్ 2008 లో సీఎస్కే జట్టు రన్నరప్ గా నిలిచింది. 2009 లో మూడో ప్లేస్ లో నిలిచినా జట్టు 2010 లో ట్రోఫీ ని సాధించి అప్పటి నుంచి ఐపీఎల్ లో విజయవంతంగా తమ ప్రదర్శనతో అదరగొడుతోంది. ధోనీని చెన్నై లో ముద్దుగా తలై అని పిలుచుకుంటారు.

 

ఏది ఏమైనా .... ఎన్ని రికార్డులు ఉన్నప్పటికీ, అవి ప్రతీ సీజన్లో బద్దలవుతూనే ఉంటాయి. అంతిమంగా మాత్రం గెలిచేది క్రికెట్ మాత్రమే.