రోడ్డు ప్రమాదంలో మలయాళ నటుడు కొల్లం సుధి మృతి : Kollam Sudhi

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో (film industry) ఈమధ్య వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న స్టార్ నటులు (star actors) Kollam Sudhi

రోడ్డు ప్రమాదంలో మలయాళ నటుడు కొల్లం సుధి మృతి :  Kollam Sudhi

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో (film industry) ఈమధ్య వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న స్టార్ నటులు (star actors), మేకర్స్, టెక్నీషియన్స్ ఎప్పటికీ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోతున్నారు. ఇన్నాళ్లు తమకు ఎంతో వినోదాన్ని పంచిన తారల మరణవార్తలను విని ఆడియెన్స్ తట్టుకోలేకపోతున్నారు. తమను ఎంటర్​టైన్ చేయడంతో పాటు స్ఫూర్తిగా నిలిచిన స్టార్స్ ఇక లేరనే (many stars passing away) వార్తతో అభిమానులు శోకసంద్రంలో మునిగిపోతున్నారు. తాజాగా అలాంటి మరో చేదు వార్త వినాల్సి వస్తోంది. 

ప్రముఖ మలయాళ నటుడు, మిమిక్రీ ఆర్టిస్ట్  కొల్లం సుధీ (39) సోమవారం వేకువజామున జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు మిమిక్రీ కళాకారులు బిను ఆదిమాలి, ఉల్లాస్ ఆరూర్, మహేశ్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ముగ్గురినీ ఘటనా స్థలానికి సమీపంలోని కొడుంగలూర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స కోసం తరలించారు. పిన్న వయస్సులోనే మృత్యువాత పడ్డ సుధీ ఆత్మకు శాంతి చేకూరాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయం సంతాపం తెలిపారు. కొల్లం సుధీ అకాల మరణం ఆయన సన్నిహితులకు, ఆత్మీయులకు దిగ్భ్రాంతిని కలిగించింది. సుధీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ అతని కుటుంబానికి సంతాపం తెలిపారు. సుధీ మళయాళంతో పాటు తమిళ ప్రేక్షకులకు కూడా ఎంతో సుపరిచితుడు. సుధీ అకాల మరణం పట్ల వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసారు.

సోమవారం తెల్లవారుజామున నాలుగున్నర గంటల ప్రాంతంలో జరిగింది. కైపమంగళం ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ నలుగురు కళాకారులు వటకరా ప్రాంతంలో గత రాత్రి జరిగిన ఓ కార్యక్రమాన్ని సుధీ మిగతా ముగ్గురు మిమిక్రీ కళాకారులు ముగించుకుని తమ స్వస్థలాలకు ప్రయాణమయ్యారు. వీరు ప్రయాణిస్తున్న కారు ఓ కంటైనర్  ను ఢీకొంది. ఈ సంఘటనలో సుధీ తలకు బలమైన గాయం తగలడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతుండగా పరిస్థితి విషమించి మృతి చెందాడు. తీవ్ర గాయాలపాలైన మిగతా ముగ్గురికీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. 

సుధీ కెరీర్ : Sudhi's Career 

మంచి మిమిక్రీ ఆర్టిస్ అయిన కొల్లం సుధీ సుప్రసిద్ధ రియాల్టీ షో స్టార్ మ్యాజిక్ షోతో పాపులర్ అయ్యాడు. 2015 వ సంవత్సరంలో అజ్మల్ దర్శకత్వం వహించిన కంఠారి చిత్రం ద్వారా సినీ రంగానికి పరిచయమయ్యాడు. అనంతరం కట్టప్పనయిలే రిత్విక్ రోషన్, కుట్టనాదన్ మరప్పప్ప, కేసు ఈ వీడింటే నాధన్, ఎస్కేప్, స్వర్గతిలే కత్తురుంబు, కొల్లం వంటి పాపులర్ చిత్రాల్లో నటించి ఎంతగానో పేరు తెచ్చుకున్నాడు. మలయాళంలో ఎన్నో చిత్రాల్లో నటించినప్పటికీ, బుల్లితెరపై నటనతోనే అందరినీ ఆకట్టుకున్నాడు. మిమిక్రీతోనో, మలయాళంలో పలు కామెడీ షోలతోనూ అందరినీ అలరించాడు. 

కొల్లం సుధీ గురించి : About Kollam Sudhi 

కొల్లం సుధి మలయాళ చిత్ర పరిశ్రమలో సుప్రసిద్ధుడు. తన మిమిక్రీ, హాస్య చతురతతో అందరినీ అలరించాడు. అతను 1 జనవరి 1984 వ సంవత్సరంలో కేరళలోని కొల్లంలో జన్మించాడు. కేరళ యూనివర్సిటీలో విద్యాభ్యాసం చేసాడు. సుధీకి పెళ్లి అయి రిత్విక్ అనే కొడుకు ఉన్నాడు. ఎప్పుడూ ప్రేక్షకులను నవ్వించే సుధీ తాను జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను ఒక ఛానెల్ షోలో వివరించడంతో అందరూ షాక్ అయ్యారు. 2020లో వనిత ఆన్‌లైన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, అతను ఎదుర్కొన్న కష్టాల గురించి వివరించాడు. 

Also Read - hero sharwanand ties the knot with rakshita Reddy

నేను జీవితంలో ఎదుర్కొన్న బాధలు ఇప్పటివరకూ నాతో సన్నిహితంగా ఉన్న వారికి మాత్రమే తెలుసు. 16 ఏళ్ల క్రితం మొదటి పెళ్లి ప్రేమ వివాహం. కానీ ఆ వివాహం ఎక్కువ కాలం నిలవలేదు. వేరొకరి కోసం నా భార్య నన్ను, మా ఒకటిన్నర సంవత్సరాల బాబును వదిలేసి వెళ్ళిపోయింది. నిజంగా ఈ సంఘటన నా జీవితంలో అత్యంత బాధాకరమైన రోజులు. దీని నుంచి బయటపడడానికి ఎంతగానో కష్టపడాల్సి వచ్చింది. ఆ బాధ నుండి తేరుకోవడానికి చాలాకాలం పట్టింది. నేను కామెడీ స్టార్స్‌లో భాగమయ్యాను, మజావిల్ మనోరమ యొక్క 'కామెడీ ఫెస్టివల్' నన్ను బాగా పాపులర్ చేసి మంచి పేరు వచ్చేలా చేసింది. మేము ప్రదర్శించిన స్కిట్‌లు ఎంతగానో ప్రజాదరణ పొందాయి. మేము వాటికి మొదటి బహుమతిని కూడా పొందాము. ఇప్పటికి 40 సినిమాల్లో నటించాను. నా తొలి చిత్రం ‘చెన్నై కూట్టం’. తర్వాత స్టార్ మ్యాజిక్ ద్వారా టెలివిజన్‌లో యాక్టివ్‌గా ఉన్నాను. ఇప్పుడు ప్రజలు నన్ను గుర్తించి సెల్ఫీలు తీసుకుంటున్నారు అని ఆ ఇంటర్వ్యూలో సుధీ వివరించాడు. అయితే సుధీ జీవితంలో అత్యంత విషాదం ఆయన మొదటి పెళ్లి అని చెప్పవచ్చు. ఆ వివాహ బంధం ముగియడంతో ఆయన ఎంతగానో ఆవేదన చెందారు. ఆ బాధను తట్టుకుని తన ఒకటిన్నర సంవత్సరాల బాబుతో కష్టాల సుడిగుండాలని అధిగమించి అనంతరం ఎంతగానో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు కొల్లం సుధీ.

Our Related Articles - Impressive trailer of Adi Purush