రక్షితతో హీరో శర్వానంద్ పెళ్లి బంధం : hero sharwanand ties the knot with rakshita

టాలీవుడ్ హీరో శర్వానంద్ (Hero Sharwanand) పెళ్లి రక్షిత రెడ్డితో జైపూర్ లో ఘనంగా జరిగింది. పెళ్ళికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ వివాహ వేడుకకు ఇరు కుటుంబాలకు చెందిన బంధువులు, స్నేహితులు సహా సినీ రంగానికి చెందిన వారు హాజరయ్యారు

రక్షితతో హీరో శర్వానంద్ పెళ్లి బంధం : hero sharwanand ties the knot with rakshita

రక్షితతో హీరో శర్వానంద్ పెళ్లి బంధం : hero sharwanand ties the knot with rakshita 

టాలీవుడ్ హీరో శర్వానంద్ (Hero Sharwanand) పెళ్లి రక్షిత రెడ్డితో జైపూర్ లో ఘనంగా జరిగింది. పెళ్ళికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ వివాహ వేడుకకు ఇరు కుటుంబాలకు చెందిన బంధువులు, స్నేహితులు సహా సినీ రంగానికి చెందిన వారు హాజరయ్యారు. జైపూర్ లోని లీలా ప్యాలెస్‌లో ఈ వివాహం జరిగింది. ఈ వివాహ కార్యక్రమానికి హీరో చిరంజీవి, సురేఖ దంపతులు, శర్వానంద్ బెస్ట్ ఫ్రెండ్, హీరో రామ్ చరణ్, ఉపాసన దంపతులు, సిద్ధార్థ్, అదితిరావు హైదరి, నాని తదితర ప్రముఖులు హాజరయ్యారు.

శర్వానంద్ నటించిన హిట్ చిత్రాలు : Sharwanand starrer hit films 

శర్వానంద్ వెస్లీ డిగ్రీ కళాశాల (సికింద్రాబాద్) లో బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ (బీ.కాం) పూర్తి చేశాడు. 17 ఏళ్ల వయసులో శర్వానంద్ ముంబైలోని కిషోర్ నమిత్ కపూర్ యాక్టింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరాడు. శర్వానంద్ విజయవాడలోని వీఆర్ సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీలోని ఓ డైరెక్టర్ కి దగ్గరి బంధువు.

శర్వానంద్ పలు హిట్ చిత్రాల్లో నటించి మెప్పించాడు. ఎక్కువగా ఫ్యామిలీ చిత్రాలకి అధిక ప్రాధాన్యతనిస్తాడు. లక్ష్మి, సంక్రాంతి, క్లాస్‌మేట్స్, ప్రస్థానం, రన్ రాజా రన్, ఎక్స్ ప్రెస్ రాజా, శతమానం భవతి, మహానుభావుడు, ఒకే ఒక జీవితం వంటి హిట్ చిత్రాల్లో నటించి మెప్పించాడు.