'సార్' మూవీ రివ్యూ : 'Sir' Movie Review

అవ‌స‌రంలో ఎవ‌రికీ కులాలు (Castes) గుర్తుకు రావు అని చెప్పే సందర్భం... విద్య (Education) అనేది దేవుడుకి పెట్టే నైవేద్యంలాంటిది. దాన్ని అంతే ప‌విత్రంగా చూడాల‌ని చెప్పే సిట్యువేష‌న్... వంటి డైలాగులు (Dialogues) ఆలోచింపచేస్తాయి.

'సార్' మూవీ రివ్యూ : 'Sir' Movie Review

'సార్' మూవీ రివ్యూ : 'Sir' Movie Review 

తనకంటూ ఒక ఇమేజ్ ఏర్పరచుకుని చక్కటి కథలతో విజయాలను అందుకుంటున్న హీరోల్లో ధనుష్ (Hero Dhanush) ఒకరు. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన ధనుష్ ఇప్పటివరకూ తెలుగులో నేరుగా ఏ చిత్రమూ (No Straight Movie) చేయలేదు. ఇప్పుడు 'సార్' సినిమాతో నేరుగా తెలుగులో నటించాడు. తమిళం, తెలుగులో మంచి మార్కెట్ (Good Market) ఉన్న ధనుష్ నటించిన ఈ సినిమా తమిళంలో 'వాత్తి' (Tamil release name 'Vaatthi') పేరుతో విడుదలయింది. 

సూర్య దేవ‌ర నాగ‌వంశీ, సాయి సౌజ‌న్య నిర్మించిన ఈ సినిమాకు అట్లూరి వెంకీ దర్శకత్వం (Director Atluri Venky) వహించారు. విద్యను వ్యాపారంగా మార్చివేసిన కార్పొరేట్ కళాశాలల యాజమాన్యంపై ఓ యువకుడు చేసిన పోరాటం (Fight Against Private College Management)... అని ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైల‌ర్‌ల‌ను గమనిస్తే అర్ధం అవుతుంది.  ‘సార్‌’ లో దర్శకుడు అందించిన సందేశం (Message) ఏంటనేది తెలియాలంటే ఒకసారి కథ ఏమిటో పరిశీలిద్దాం.

క‌థ‌ : Story 

క‌డ‌ప జిల్లా క‌లెక్ట‌ర్ గా (District Collector) పనిచేస్తున్న మూర్తి (సుమంత్‌ Sumanth) త‌న‌ను క‌ల‌వ‌టానికి వ‌చ్చిన స్టూడెంట్స్‌తో త‌న గురువు బాల‌గంగాధర తిల‌క్ అలియాస్ బాలు (ధ‌నుష్‌ Dhanush) గురించి చెప్ప‌టంతో అస‌లు క‌థ మొదలు అవుతుంది. 1990 దశకంలో ప్రైవేట్ కళాశాలల హవా (Private Colleges Effect) ప్రారంభం అయింది. నాణ్యమైన విద్య కోసం పిల్లల తల్లిదండ్రులు కూడా ప్రైవేట్ కళాశాలల వైపే మొగ్గు చూపారు. దీనికి కారణం ప్రభుత్వ కళాశాలల్లో (Government Colleges) సరైన లెక్చరర్లు (Proper Lecturers Not Available) ఉండకపోవడమే. త్రిపాఠి జూనియర్ కళాశాలలో లెక్చ‌ర‌ర్‌గా పనిచేసే బాలు సిరిపురంలోని ప్ర‌భుత్వ జూనియ‌ర్ కాలేజీకి మ్యాథ్స్ లెక్చ‌ర‌ర్‌గా వెళ‌తాడు. 

బాలుతో పాటుగా ఆయనతో పనిచేసే ఫిజిక్స్‌, కెమిస్ట్రీ లెక్చ‌ర‌ర్స్ కూడా ఆయన వెంట వస్తారు. వీరు వెళ్లే కళాశాలలోనే (College) బ‌యాల‌జీ లెక్చ‌ర‌ర్‌గా మీనాక్షి (సంయుక్తా మీన‌న్‌ Samyukta Menon) ప‌ని చేస్తుంటుంది. అయితే అక్కడ బాలు ఒక విషయాన్ని గమనిస్తాడు. విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలని చదువు కోసం కాలేజీకి వెళ్లడం కంటే పనికి (Outside work) పంపించడమే మంచిదని భావిస్తుంటారు. వీరిలో బాలు ఎలాంటి మార్పు తీసుకు వచ్చాడు? బాలు చేసిన పని వల్ల త్రిపాఠి (స‌ముద్ర ఖ‌ని Samudra Khani) కి వచ్చిన నష్టమేంటి? బాలు తనకు వచ్చిన సమస్యలను (Problems) ఎలా ఎదుర్కొన్నాడు... అనే విషయాలు తెలుసుకోవాలంటే 'సార్' సినిమాను చూసి తీరాల్సిందే. 

స‌మీక్ష‌ : Review 

జూనియ‌ర్ లెక్చ‌ర‌ర్ పాత్ర‌లో ధ‌నుష్ ఒదిగి పోయాడని చెప్పవచ్చు. ఫ‌స్టాఫ్ అంతా కూడా మంచి ఊపుతో ఈ పాత్ర‌ కొనసాగుతుంది. సెకండాఫ్‌లో మాత్రం భావోద్వేగమైన పాత్రకి  మళ్లుతుంది. ధ‌నుష్ త‌న‌దైన న‌ట‌న‌తో ఈ రెండింటిని చ‌క్క‌గా బ్యాలెన్స్ చేసుకుని నటించాడు. ఇక ఎమోష‌న‌ల్ సీన్స్‌లో అయితే మరింతగా రక్తి కట్టించాడు. హీరోయిన్ సంయుక్తా మీన‌న్ పాత్ర పరిమితంగానే ఉన్నప్పటికీ ఉన్నంతలోనే యాక్టింగ్ ప‌రంగా ఓకే అనిపించింది. విల‌క్ష‌ణ నటుడు సాయికుమార్ త‌న‌దైన న‌ట‌నతో ప్రెసిడెంట్ పాత్ర‌కు న్యాయం చేశారు. చాలా రోజుల త‌ర్వాత ఆయ‌నకు మంచి నటనకు ఆస్కారమున్న పాత్ర దొరికిందనే చెప్పాలి. స‌ముద్ర ఖ‌ని త‌నదైన న‌ట‌న‌తో విల‌న్ పాత్ర‌కు న్యాయం చేశారు. ఆయ‌న‌కు ఇలాంటి పాత్ర‌ను చేయ‌టం కొత్తేమీ కాదు. చాలా సింపుల్‌గా తనకిచ్చిన పాత్రకు న్యాయం చేస్తుంటారు. ప్ర‌త్యేక పాత్ర‌లో న‌టించిన సుమంత్ నటన ఆకట్టుకుంటుంది. హైప‌ర్ ఆది వేసిన పంచులు నవ్విస్తాయి. మిగితా నటులు వారి వారి పాత్ర‌ల్లో చ‌క్క‌గా న‌టించారు.

విద్య అనేది మ‌న ప్రాథ‌మిక హ‌క్కు (Education is our fundamental right). దాన్ని అంద‌రికీ స‌మానంగా ఇవ్వాల‌నే పాయింట్‌ను (Main Point) ద‌ర్శ‌కుడు అట్లూరి వెంకీ ఈ సినిమాకు ప్రాధాన్యంగా తీసుకున్నాడు. ఈ పాయింట్‌ను ఆయ‌న అలాగే చివరికంటా తీసుకుంటూ వెళ్లారు. క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌గా పాటలు, ఫైట్స్ ఇందులో అక్క‌డ‌క్క‌డా కనిపిస్తాయి. సినిమాలో ట్విస్టులు, కీలక మలుపులు (No Twists and Turns) అంటూ ఏమీ ఉండ‌వు. ప్రేక్షకుల ఊహకు తగ్గట్లుగానే సినిమా సాగుతుంది. సెకండాఫ్‌లో భావోద్వేగాన్ని పండించే సీన్స్ (Emotional Scenes) బాగున్నాయి. ఫ‌స్టాఫ్ మాత్రం పర్వాలేదు అని మాత్రం అనిపిస్తుంది. హీరో హీరోయిన్ల‌ మధ్య నడిచే లవ్ ట్రాక్ (Love Track) అంతగా ఆక‌ట్టుకునేలా లేదు. అవ‌స‌రంలో ఎవ‌రికీ కులాలు (Castes) గుర్తుకు రావు అని చెప్పే సందర్భం... విద్య (Education) అనేది దేవుడుకి పెట్టే నైవేద్యంలాంటిది. దాన్ని అంతే ప‌విత్రంగా చూడాల‌ని చెప్పే సిట్యువేష‌న్... వంటి డైలాగులు (Dialogues) ఆలోచింపచేస్తాయి.

సాంకేతిక విలువలు : Technical values  

మాస్టారు మాస్టారు సాంగ్ విజువల్ గా ఎంతో అద్భుతంగా ఉంది. సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ కుమార్ (Music Director GV Praksh) అందించిన నేపథ్య సంగీతం (Background Music) సినిమాకు ప్లస్ పాయింట్ అయింది. సినిమాలోని మిగిలిన పాటలు (Songs) కూడా ఫరవాలేదు. యువరాజ్ సినిమాటోగ్రఫీ (Cinematography is good) సినిమాకు అనుకూలంగా ఉంది. తన కెమెరా పనితనంతో సినిమాకు మంచి రూపాన్ని తీసుకొచ్చాడు. నవీన్ నూలి ఎడిటింగ్ (Editing) అద్భుతంగా ఉంది. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్ నిర్మాణ విలువలు అత్యున్నతంగా ఉన్నాయి. దర్శకుడిగా వెంకి అట్లూరి మంచి కథను సందేశాత్మకంగా ప్రేక్షకులకు అందించాడు. అద్భుతమైన డైలాగులు (Dialogues) రాశాడు.

నటులు (Actors) : ధనుష్, సంయుక్తా మీనన్, సముద్ర ఖని, సాయి కుమార్, సుమంత్, హైపర్ ఆది

సంగీతం (Music) : జీవి ప్రకాష్ కుమార్

ఎడిటర్ (Editor) : నవీన్ నూలి

నిర్మాతలు (Producers) : సాయి సౌజన్య, సూర్యదేవర నాగ వంశీ, శ్రీకర స్టూడియోస్

కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం (Story-Screen Play-Direction) : వెంకీ అట్లూరి

సినిమాటోగ్రాఫర్ (Cinematographer) : యువరాజ్

విడుదల తేదీ (Releasing Date) : ఫిబ్రవరి 17 

Director : 

అట్లూరి వెంకీ దర్శకత్వం (Director Atluri Venky)