నేడు ఐపీఎల్లో జరగనున్న కీలక మ్యాచ్ : Today is a crucial match in IPL
నేటి మ్యాచ్ గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని నిలబెట్టుకోవాలని చూస్తోన్న ఒక జట్టు... ఈరోజు ఎలాగైనా గెలిచి నాలుగో స్థానం నుంచి అగ్రస్థానంలోకి చేరుకోవాలని ఒక జట్టు... వెరసి నేడు ఐపీఎల్ (IPL) లో జరగనున్న కీలక మ్యాచ్ (crucial match) అభిమానులకు కనువిందు చేయనుంది.
నేడు ఐపీఎల్లో జరగనున్న కీలక మ్యాచ్ : Today is a crucial match in IPL
నేటి మ్యాచ్ గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని నిలబెట్టుకోవాలని చూస్తోన్న ఒక జట్టు... ఈరోజు ఎలాగైనా గెలిచి నాలుగో స్థానం నుంచి అగ్రస్థానంలోకి చేరుకోవాలని ఒక జట్టు... వెరసి నేడు ఐపీఎల్ (IPL) లో జరగనున్న కీలక మ్యాచ్ (crucial match) అభిమానులకు కనువిందు చేయనుంది.
రాజస్థాన్ రాయల్స్ జట్టు విశ్లేషణ : RR team analysis
ఎంతో ఉత్సాహభరితంగా, ఉత్ఖంఠంగా సాగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 16 వ సీజన్ (16th season) అభిమానులకు ఎంతగానో కనువిందు చేస్తోంది. కోట్లాది మంది క్రికెట్ అభిమానులు ఐపీఎల్ ను వీక్షిస్తున్నారు. ఇందులో భాగంగా నేడు 48 వ మ్యాచ్ (48th match) గుజరాత్ టైటాన్స్ (GT), రాజస్థాన్ రాయల్స్ (RR) మధ్య జరగనుంది. ఈ కీలక మ్యాచ్ ఆడనున్న ఈ రెండు జట్లూ తాము ఆడిన గత మ్యాచుల్లో ఓటమి పాలవడం (2 teams lost their last match) గమనార్హం. అందుకే ఈ రెండు జట్లకూ ఈ మ్యాచ్ కీలకంగా ఉండనుంది. అయితే గుజరాత్ టీమ్ తో పోలిస్తే రాజస్థాన్ జట్టుకు ఇది కీలక పోరు. గత మ్యాచ్లో రాజస్థాన్ టీమ్ 200 కి పైగా పరుగులు చేసినప్పటికీ మ్యాచ్ను కాపాడుకోలేక ఓటమి పాలయింది. రాజస్థాన్ విధించిన ఈ లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ (MI) జట్టు సునాయాసంగా ఛేదించింది. దీంతో ఆ ఓటమి నుంచి బయటపడి విజయం సాధించాలనే పట్టుదలతో రాజస్థాన్ జట్టు ఉంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో బలంగా ఉన్నప్పటికీ ఆ జట్టుకు కీలకమైన మ్యాచుల్లో మాత్రం ఓటమి తప్పడం లేదు. లీగ్ దశలో జరిగే మ్యాచ్లు (league matches) చివరి అంకానికి చేరుకున్నాయి. దీంతో ఈ మ్యాచ్లో గెలిచి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలని రాజస్థాన్ జట్టు భావిస్తోంది. జట్టుకు చెందిన యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Jaiswal) ఫామ్లో ఉండడం రాజస్థాన్కు కలిసివస్తోంది. గత మ్యాచ్లో సెంచరీని సాధించాడు. జైస్వాల్ తో జోస్ బట్లర్ (Butler) మంచి ఆరంభాన్ని జట్టుకి అందిస్తున్నాడు. వీరిద్దరూ చెలరేగితే గుజరాత్ కు కష్టాలు తప్పవు. అదేవిధంగా కెప్టెన్ సంజూ శాంసన్, దేవ్దుత్ పడిక్కల్, జేసన్ హోల్డర్, హెట్మెయిర్, ధ్రువ్ జురేల్, అశ్విన్ వంటి వారితో రాజస్థాన్ జట్టు బలంగా (RR strong in all divisions) ఉంది. బౌల్ట్, అశ్విన్, హోల్డర్ వంటి వారితో బౌలింగ్ విభాగం కూడా బలంగానే ఉంది.
ఫేవరెట్గా టైటాన్స్ : Titans as the favorites
పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ (defending champion GT) ఈ మ్యాచ్లో ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది. జట్టులోని ఆటగాళ్లు భీకర ఫామ్ (good form) లో ఉన్నారు అనుకున్న సమయంలో ఢిల్లీతో (Delhi Capitals) జరిగిన గత మ్యాచ్లో స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక (lost low score match) చతికిలపడింది. దీంతో జట్టులో ఆందోళన మొదలయింది. వొంటి చేత్తో మ్యాచ్ను తారుమారు చేసే ఆటగాళ్లు తేలిపోవడం జట్టును కలవర పరుస్తోంది. అందుకే గత మ్యాచ్లో జరిగిన పొరపాట్లకు ఈ మ్యాచ్లో ముగింపు పలకాలని జట్టు భావిస్తోంది. జట్టులోని వృద్ధిమాన్ సాహా (Saha), శుభ్మన్ గిల్ (Gill), హార్దిక్ పాండ్య, విజయ్ శంకర్, మిల్లర్, తెవాటియా, రషీద్ ఖాన్, మనోహర్ వంటి వారితో బ్యాటింగ్ విభాగం బలంగా ఉంది. గిల్, విజయ్ శంకర్, మిల్లర్లు ఈ ఐపీఎల్ 16 వ సీజన్లో నిలకడైన బ్యాటింగ్ చేస్తున్నారు. రషీద్ ఖాన్, షమి, జోషువా లిటిల్, నూర్ అహ్మద్ వంటి వారోతో బౌలింగ్ విభాగం కూడా పటిష్టంగా ఉంది. పాయింట్ల పరంగా చూసుకుంటే డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ అగ్రస్థానంలో ఉంది. ఇప్పటివరకూ 9 మ్యాచ్ లు ఆడిన గుజరాత్ టైటాన్స్ టీమ్ 6 మ్యాచుల్లో గెలిచి మూడింటిలో ఓడింది. దీంతో 12 పాయింట్లతో (GT on top with 12 points) పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. రాజస్థాన్ రాయల్స్ కూడా 9 మ్యాచ్ లు ఆడి 5 మ్యాచుల్లో గెలిచి నాలుగు మ్యాచుల్లో ఓడింది. దీంతో 10 పాయింట్లతో 4 వ స్థానంలో (RR in 4th place) ఉంది.
RR vs GT హెడ్-టు-హెడ్ రికార్డ్ : RR vs GT head-to-head
ఆడిన మ్యాచ్లు (played matches) - 4
గుజరాత్ టైటాన్స్ గెలిచిన మ్యాచ్లు (GT wins) - 3
రాజస్థాన్ రాయల్స్ గెలిచిన మ్యాచ్లు (RR wins) - 1
రాజస్థాన్ రాయల్స్ (RR) ప్లేయింగ్ XI : RR playing XI
యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, దేవదత్ పడిక్కల్, సంజు శాంసన్ (కెప్టెన్ & వికెట్ కీపర్), షిమ్రాన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, జాసన్ హోల్డర్, ఆడమ్ జంపా, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్
రాజస్థాన్ రాయల్స్ ఫుల్ స్క్వాడ్ : RR full squad
యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, దేవదత్ పడిక్కల్, సంజు శాంసన్ (కెప్టెన్, వికెట్ కీపర్), షిమ్రాన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, జాసన్ హోల్డర్, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, యజువేంద్ర చాహల్, అబ్దుల్ బాసిత్, ఆకాష్ వశిష్ట్, డోనవ్ వశిష్త్, డోనావన్ ఫెరీరా, మురుగన్ అశ్విన్, కెఎమ్ ఆసిఫ్, రియాన్ పరాగ్, జో రూట్, ఆడమ్ జంపా, నవదీప్ సైనీ, కెసి కరియప్ప, ఒబెద్ మెక్కాయ్, కుల్దీప్ యాదవ్, కుల్దీప్ సేన్, కునాల్ సింగ్ రాథోడ్
గుజరాత్ టైటాన్స్ (GT) ప్లేయింగ్ XI : GT playing XI
వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), శుభమన్ గిల్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, మహ్మద్ షమీ, మోహిత్ శర్మ, జాషువా లిటిల్
గుజరాత్ టైటాన్స్ ఫుల్ స్క్వాడ్ : GT full squad
హార్దిక్ పాండ్యా (కెప్టెన్), శుభమన్ గిల్, డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్, సాయి సుదర్శన్, వృద్ధిమాన్ సాహా, మాథ్యూ వేడ్, రషీద్ ఖాన్, రాహుల్ తెవాటియా, విజయ్ శంకర్, మహమ్మద్ షమీ, అల్జారీ జోసెఫ్, యశ్ దయాల్, ప్రదీప్ సాంగ్వాన్, దర్శన్ నల్కండే, జయంత్ యాదవ్, ఆర్ సాయి కిషోర్, నూర్ అహ్మద్, కేన్ విలియమ్సన్, ఒడియన్ స్మిత్, కెఎస్ భరత్, శివమ్ మావి, ఉర్విల్ పటేల్, జాషువా లిటిల్, మోహిత్ శర్మ.
RR vs GT మ్యాచ్ వివరాలు (Match details)
రాజస్థాన్ రాయల్స్ vs గుజరాత్ టైటాన్స్ : మ్యాచ్ 48
స్టేడియం (Stadium) : సవాయ్ మాన్సింగ్ స్టేడియం, జైపూర్
తేదీ & సమయం : శుక్రవారం, మే 5, 7:30 PM IST
టెలికాస్ట్ & లైవ్ స్ట్రీమింగ్ (Telecast & Live streaming) : స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్, జియో సినిమా