ఐపీఎల్ లో నేడు తలపడనున్న కేకేఆర్ vs ఎస్ఆర్‌హెచ్ : KKR vs SRH will play in IPL today
ఐపీఎల్ 2023 (IPL 2023) లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), కోల్కతా నైట్ రైడర్స్ (KKR) జట్ల మధ్య 47 వ మ్యాచ్ (47th match) హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది.
ఐపీఎల్ లో నేడు తలపడనున్న కేకేఆర్ vs ఎస్ఆర్హెచ్ : KKR vs SRH will play in IPL today
ఎంతో ఉత్కంఠభరితంగా జరుగుతున్న ఐపీఎల్ 2023 మ్యాచ్ లు అభిమానుల రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తున్నాయి. పాయింట్ల పట్టికలో 8, 9 స్థానాల్లో ఉన్న కోల్కతా నైట్ రైడర్స్ (KKR), సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్ల మధ్య నేడు ఐపీఎల్ లో 47వ మ్యాచ్ హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో (Rajiv Gandhi International stadium) జరగనుంది. రెండు జట్లూ పాయింట్ల పట్టికలో చివరి మూడు జట్లలో చోటు దక్కించుకున్నాయి. ఈ సీజన్లో కోల్కతా (KKR) 6 మ్యాచ్ల్లో ఓడిపోగా, హైదరాబాద్ (SRH) కూడా 5 మ్యాచ్ల్లో ఓడిపోయింది. ప్లేఆఫ్ రేసులో వెనుకబడకుండా ఉండాలంటే ఈ రెండు జట్లకు నేటి మ్యాచ్ చాలా కీలకంగా ఉండి. ముఖ్యంగా కేకేఆర్ (KKR) టీమ్ కి ఈ మ్యాచ్లో తప్పకుండా గెలవాల్సి ఉంది. ఒకవేళ మ్యాచ్లో గనుక ఓడిపోతే కేకేఆర్ ప్లేఆఫ్స్ (Playoffs) దాదాపు అవకాశం లేనట్టే. హైదరాబాద్, కోల్కతా జట్లు రెండూ కూడా గత 5 మ్యాచుల్లో రెండేసి మ్యాచుల చొప్పున విజయం సాధించాయి. తన చివరి మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు.. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును ఓడించింది. కోల్కతా నైట్రైడర్స్ (KKR) తన చివరి మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ (GT) చేతిలో ఓటమి పాలైంది.
హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలోని పిచ్ నేటి మ్యాచ్లో ఫాస్ట్ బౌలర్లకు (fast bowlers pitch) మరింత సహకారం అందించగలదు. దీంతో కోల్కతా జట్టు తమ స్పిన్ బౌలర్లలో నుండి సుయాష్ శర్మను బెంచ్కి పరిమితం చేసి అదనంగా మరో ఫాస్ట్ బౌలర్ను ప్లేయింగ్-11లో (extra fast bowler) భాగం చేయాలనీ ఆలోచిస్తోంది. నేటి మ్యాచ్లో జాసన్ రాయ్ (Jason Roy) ఆడనుండడం కూడా కేకేఆర్కు నిజంగా మంచి వార్తే అని చెప్పవచ్చు. రాయ్ గనుక విజృంభిస్తే బౌలర్లకు చుక్కలు చూపించగలడు. ఈ సీజన్లో జాసన్ రాయ్ మంచి ఫామ్ లో ఉన్నాడు.
గత మ్యాచ్ (previous match) లో కోల్కతా నైట్రైడర్స్పై (KKR) సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో SRH స్టార్ బ్యాట్స్మెన్ హ్యారీ బ్రూక్ (Harry Brook) బ్యాట్ నుండి IPL 2023 సీజన్లో మొదటి సెంచరీ వచ్చింది. అయితే ఇరు జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్ చాలా ఉత్కంఠగా సాగింది. అయితే చివరికి SRH జట్టు KKR ను ఓడించింది. దీంతో ఈరోజు జరిగే మ్యాచ్ లో విజయం సాధించి ప్రతీకారం తీర్చుకోవడమే కాకుండా ప్లేఆఫ్ రేసులో నిలవాలని భావిస్తోంది. ఇందుకోసం టీమ్ కసరత్తు చేస్తోంది.
8, 9 స్థానాల్లో KKR, SRH
ఈ ఏడాది జరుగుతున్న 16 వ సీజన్ ఐపీఎల్ లో కోల్కతా నైట్ రైడర్స్ (KKR) ఆడిన 9 మ్యాచుల్లో మూడింటిలో గెలిచి ఆరు మ్యాచుల్లో ఓడిపోయింది. 6 పాయింట్లతో పాయింట్ల పట్టికలో 8 వ స్థానంలో నిలిచింది. సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) టీమ్ ఆడిన 8 మ్యాచుల్లో మూడు మ్యాచుల్లో గెలిచి 5 మ్యాచుల్లో ఓటమి పాలయింది. 6 పాయింట్లతో 9 వ స్థానంలో నిలిచింది. పాయింట్ల పరంగా సమానమే అయినప్పటికీ రన్ రేట్ పరంగా హైదరాబాద్ టీమ్ కంటే కోల్కతా టీమ్ మెరుగ్గా ఉండడంతో ముందంజలో ఉండి. అయితే నేటి మ్యాచ్ లో గనుక హైదరాబాద్ గెలిస్తే స్థానాల్లో మార్పు సంభవిస్తుంది. దీంతో రెండు జట్లూ విజయం కోసం సిద్ధపడుతున్నాయి.
హెడ్ టు హెడ్ : head-to-head
మొత్తమ్మీద ఇరుజట్లలో హెడ్-టు-హెడ్ రికార్డులో నైట్రైడర్స్దే (KKR) పైచేయి. రెండు జట్ల మధ్య జరిగిన 24 మ్యాచులలో, కోల్కతా నైట్ రైడర్స్ (KKR) 14 గేమ్లు గెలుపొందగా, సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) తొమ్మిది మ్యాచుల్లో గెలుపొందింది. ఒక మ్యాచ్ టై (tie) అయ్యింది.
సన్రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ XI : SRH playing XI
మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), హ్యారీ బ్రూక్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, అకేల్ హోసేన్, మయాంక్ మార్కండే, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్
సన్ రైజర్స్ హైదరాబాద్ ఫుల్ స్క్వాడ్ : SRH full squad
సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు: హ్యారీ బ్రూక్, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రామ్(సి), అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్(w), అబ్దుల్ సమద్, మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, టి నటరాజన్, వాషింగ్టన్ సుందర్, వివ్రంత్ శర్మ, ఉమ్రాన్ మాలిక్, మయాంక్ డాగర్, అకేల్ హోసేన్, గ్లెన్ ఫిలిప్స్, ఆదిల్ రషీద్, సమర్థ్ వ్యాస్, అన్మోల్ప్రీత్ సింగ్, ఉపేంద్ర యాదవ్, కార్తీక్ త్యాగి, సన్వీర్ సింగ్, ఫజల్హాక్ ఫరూకీ, నితీష్ రెడ్డి
కోల్కతా నైట్ రైడర్స్ ప్లేయింగ్ XI : KKR playing XI
జాసన్ రాయ్, రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), ఎన్ జగదీసన్, వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా (కెప్టెన్), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, శార్దూల్ ఠాకూర్, సునీల్ నరైన్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి
కేకేఆర్ ఫుల్ స్క్వాడ్ : KKR full squad
ఎన్ జగదీశన్, జాసన్ రాయ్, నితీష్ రాణా, ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్, సునీల్ నరైన్, డేవిడ్ వీస్, కుల్వంత్ ఖేజ్రోలియా, సుయాష్ శర్మ, ఉమేష్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, వెంకటేష్ అయ్యర్, మన్దీప్ సింగ్, అనుకుల్ రాయ్, వైభవ్ అరోరా, లిట్టన్ దాస్, టిమ్ సౌథీ, లాకీ ఫెర్గూసన్, శార్దూల్ ఠాకూర్, రహ్మానుల్లా గుర్బాజ్, హర్షిత్ రాణా, ఆర్య దేశాయ్.
సన్రైజర్స్ హైదరాబాద్ vs కోల్కతా నైట్ రైడర్స్ (SRH vs KKR) IPL 2023 మ్యాచ్ వివరాలు
వేదిక: రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం, హైదరాబాద్
తేదీ & సమయం: మే 4, 730 PM
లైవ్ స్ట్రీమింగ్, టీవీ : స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ (Star sports network), జియో సినిమా వెబ్సైట్ & యాప్