నేడు ఐపీఎల్ లో అలరించనున్న రెండు మ్యాచ్ లు : today there is 2 matches in ipl

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) క్రికెట్ ప్రేమికులను ఎంతగానో అలరిస్తోంది. ఇప్పటికే ధనాధన్ బ్యాటింగ్, నిప్పులు చెరిగే బంతులతో ఆటగాళ్లు అభిమానులకు కనువిందు చేస్తున్నారు. తక్కువ స్కోర్ (low score) ను కాపాడుకునే ప్రయత్నాలు, భారీ స్కోర్లను ఛేదించే విన్యాసాలు వెరసి కోట్లాది మందికి ఎంతగానో ఉత్సాహభరితంగా ఈ మ్యాచ్ లు అలరిస్తున్నాయి.

నేడు ఐపీఎల్ లో అలరించనున్న రెండు మ్యాచ్ లు : today there is 2 matches in ipl

నేడు ఐపీఎల్ లో అలరించనున్న రెండు మ్యాచ్ లు : Today there is 2 matches in IPL

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) క్రికెట్ ప్రేమికులను ఎంతగానో అలరిస్తోంది. ఇప్పటికే ధనాధన్ బ్యాటింగ్, నిప్పులు చెరిగే బంతులతో ఆటగాళ్లు అభిమానులకు కనువిందు చేస్తున్నారు. తక్కువ స్కోర్ (low score) ను కాపాడుకునే ప్రయత్నాలు, భారీ స్కోర్లను ఛేదించే విన్యాసాలు వెరసి కోట్లాది మందికి ఎంతగానో ఉత్సాహభరితంగా ఈ మ్యాచ్ లు అలరిస్తున్నాయి. 

ఐపీఎల్ 16 వ సీజన్ లో దాదాపు ప్లేఆఫ్స్ దశకు మ్యాచ్ లు చేరుకున్నాయి. అన్ని జట్లు కూడా ప్లేఆఫ్స్ కి చేరుకునేందుకు ఎంతగానో శ్రమిస్తున్నాయి. ఇందుకు టీమ్ లోని ఆయా ఆటగాళ్లు తమవంతు కృషి చేస్తున్నారు. గత ఏడాది 15 వ సీజన్లో పాయింట్ల పరంగా ఆఖరి నుంచి రెండో స్థానంలో నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ ఈ ఏడాది జరుగుతున్న ఐపీఎల్ లో అద్భుతమైన ఫామ్ ను కనబరుస్తోంది. కొద్ది రోజులు అగ్రస్థానంలో ఉన్న ఈ జట్టు తరువాత మ్యాచ్ లను చేజార్చుకోవడంతో 4వ స్థానంలో కొనసాగుతోంది. అది కూడా రన్ రేట్ పరంగానే. రన్ రేట్ మెరుగ్గా ఉంటే పాయింట్ల పరంగా రెండో స్థానంలో ఉండేది. ఆడిన 9 మ్యాచుల్లో 5 గెలిచి 4 మ్యాచులను కోల్పోయింది. అయితే నేడు జరగనున్న మ్యాచ్ చెన్నై జట్టుకు కీలకం  కానుంది. ఎందుకంటే ఇప్పటికే అన్ని జట్లూ ప్లేఆఫ్స్ రేసులో ఉన్నాయి. మిగతా మ్యాచులు గెలిచి దర్జాగా ప్లేఆఫ్స్  కి చేరుకోవాలని చెన్నై జట్టు భావిస్తోంది. 

చెన్నై vs లక్నో : CSK vs LSG 

నేడు జరిగే రెండు మ్యాచుల్లో మొదటి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK), లక్నో సూపర్ జెయింట్స్ (LSG) తలపడనున్నాయి. చెన్నై, లక్నో జట్లు పటిష్ట స్థితిలో ఉన్నాయి. ఈ మ్యాచ్ లక్నోలో తమ హోమ్ గ్రౌండ్ ఎకానా స్టేడియంలో జరగనుంది. ఈ రోజు హోరాహోరీ పోరు జరిగే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ ఇక్కడ జరిగిన చివరి మ్యాచ్ వివాదాస్పదమైంది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ కేఎల్ రాహుల్ గాయపడ్డాడు. రాహుల్ గాయంపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ప్లేయింగ్ XI లో మార్పులతో లక్నో బరిలోకి దిగనుంది. గత మ్యాచ్ లో కేఎల్ రాహుల్ గాయపడ్డాడు. దీంతో నేడు చెన్నైపై జరిగే మ్యాచులో రాహుల్ రంగంలోకి దిగే అవకాశం లేదు. రాహుల్ గైర్హాజరీలో కృనాల్ పాండ్యా జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా వెటరన్ ఆటగాడు క్వింటన్ డి కాక్‌కు లక్నో స్థానం కల్పించవచ్చు. డి కాక్ ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. గత సీజన్‌లో 508 పరుగులు చేశాడు. డి కాక్ ఒక సెంచరీతో పాటు మూడు అర్ధ సెంచరీలు కూడా చేశాడు.

ఇప్పటివరకూ జరిగిన కొన్ని మ్యాచులలో చెన్నై ప్లేయింగ్ XI ను మార్చలేదు. దీంతో ఈ మ్యాచ్‌లోనూ ఆ జట్టు ఎలాంటి మార్పులు చేయకపోవచ్చని తెలుస్తోంది. బెన్ స్టోక్స్ గాయం కారణంగా వైదొలిగాడు. అతని ఫిట్‌నెస్‌కు సంబంధించి ఇంకా ఎలాంటి అప్‌డేట్ అందలేదు. జట్టు తరఫున తుషార్ దేశ్‌పాండే అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఇప్పటి వరకు ఆడిన 9 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు తీశాడు. అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్లలో ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్నాడు. 

లక్నో సూపర్ జెయింట్స్ ప్లేయింగ్ XI : LSG playing XI 

KL రాహుల్ (కెప్టెన్), MP స్టోయినిస్, YS ఠాకూర్, కైల్ మేయర్స్, దీపక్ హుడా, KH పాండ్యా, కృష్ణప్ప గౌతం, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), రవి బిష్ణోయ్, A మిశ్రా, నవీన్-ఉల్-హక్

లక్నో ఫుల్ స్క్వాడ్ : LSG full squad 

KL రాహుల్(C), MP స్టోయినిస్, YS ఠాకూర్, కైల్ మేయర్స్, దీపక్ హుడా, KH పాండ్యా, కృష్ణప్ప గౌతం, నికోలస్ పూరన్(wk), రవి బిష్ణోయ్, A మిశ్రా, నవీన్-ఉల్-హక్. మార్క్ వుడ్, అవేష్ ఖాన్, జయదేవ్ ఉనద్కత్, DR సామ్స్, పిఎన్ మన్కడ్, ఎ బడోని, క్యూ డి కాక్, రొమారియో షెపర్డ్, ఎం వోహ్రా, కరణ్ శర్మ, స్వప్నిల్ సింగ్, మొహ్సిన్ ఖాన్, మయాంక్ యాదవ్, యుధ్వీర్ సింగ్, AN గులేరియా

చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయింగ్ XI : CSK playing XI 

రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అంబటి రాయుడు, అజింక్యా రహానే, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, శివమ్ దుబే, MS ధోని (కెప్టెన్), TU దేశ్‌పాండే, మతీషా పతిరణ, M తీక్షణ.

చెన్నై సూపర్ కింగ్స్ ఫుల్ స్క్వాడ్ : క్స్క్ full squad 

రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అంబటి రాయుడు, అజింక్యా రహానే, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, శివమ్ దుబే, MS ధోని (కెప్టెన్), TU దేశ్‌పాండే, మతీషా పతిరణ, M తీక్షణ. బెన్ స్టోక్స్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, RS హంగర్గేకర్, SP సేనాపతి, షేక్ రషీద్, నిశాంత్ సింధు, సిమర్జీత్ సింగ్, SSB మగల, డ్వైన్ ప్రిటోరియస్, భగత్ వర్మ, AJ మండల్, ముఖేష్ చౌదరి, ప్రశాంత్ సోలంకి, ఆకాష్ సింగ్

రెండో మ్యాచులో పంజాబ్, ముంబై : PBKS vs MI 

ఐపీఎల్ లో భాగంగా నేడు రెండో మ్యాచులో పంజాబ్, ముంబై జట్లు తలపడనున్నాయి. పంజాబ్ 6 వ స్థానంలోనూ, ముంబై దానివెనుకే 7 వ స్థానంలోనూ ఉన్నాయి. దీంతో ఇరుజట్లూ ఈ మ్యాచును గెలిచి పాయింట్ల పట్టికలో ముందుకు వెళ్లాలని చూస్తున్నాయి.

పంజాబ్ కింగ్స్ పూర్తి జట్టు ; Punjab full squad 

శిఖర్ ధావన్ (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, బల్తేజ్ సింగ్, విధ్వత్ కావరప్ప, జితేష్ శర్మ (వికెట్ కీపర్), షారుక్ ఖాన్, మాథ్యూ షార్ట్, రిషి ధావన్, మోహిత్ రాథీ, సికందర్ రజా, సామ్ కర్రాన్, హర్‌ప్రీత్ బ్రార్, గుర్నూర్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్ భాటియా, సింగ్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, రాహుల్ చాహర్, శివమ్ సింగ్, భానుకా రాజపక్స, అథర్వ తైడే, కగిసో రబడ, నాథన్ ఎల్లిస్.

ముంబై ఇండియన్స్ పూర్తి జట్టు : MI full squad 

ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), కామెరాన్ గ్రీన్, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, సందీప్ వారియర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, విష్ణు వినోద్, షామ్స్ ములానీ, రమణదీప్ సింగ్, పీయూష్ చావ్లా, కుమార్ కార్తికేయ, రిలే మెరెడిత్, ట్రిస్టన్ స్టబ్స్, డెవాల్డ్ బ్రీవిస్, రాఘవ్ గోయల్ , నేహాల్ వధేరా, అర్జున్ టెండూల్కర్, అర్షద్ ఖాన్, హృతిక్ షోకీన్, రోహిత్ శర్మ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, ఆకాష్ మధ్వల్, D జాన్సెన్.