ఢిల్లీ ఓడితే ప్లేఆఫ్స్ గల్లంతే : Delhi will miss the playoffs if lose

పాయింట్ల పట్టికలో టాప్ లో ఒక జట్టు... అట్టడుగున ఉన్న మరో జట్టు... ఈ రెండింటి మధ్య జరగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మ్యాచ్ ఒకరికి చావో రేవో గా తేలనుంది. ఎందుకంటే అట్టడుగున ఉన్న ఆ జట్టు ఈ మ్యాచ్ గనుక ఓడితే ప్లేఆఫ్స్ (playoffs) గల్లంతు అయినట్లే...

ఢిల్లీ ఓడితే ప్లేఆఫ్స్ గల్లంతే : Delhi will miss the playoffs if lose

ఢిల్లీ ఓడితే ప్లేఆఫ్స్ గల్లంతే : Delhi will miss the playoffs if lose

పాయింట్ల పట్టికలో టాప్ లో ఒక జట్టు... అట్టడుగున ఉన్న మరో జట్టు... రెండింటి మధ్య జరగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మ్యాచ్ ఒకరికి చావో రేవో గా తేలనుంది. ఎందుకంటే అట్టడుగున ఉన్న జట్టు మ్యాచ్ గనుక ఓడితే ప్లేఆఫ్స్ (playoffs) గల్లంతు అయినట్లే...

 

గుజరాత్ టీమ్ విశ్లేషణ : GT analysis 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 16 సీజన్లో భాగంగా నేడు గుజరాత్ టైటాన్స్ (GT), ఢిల్లీ క్యాపిటల్స్ (DC) జట్లు తలపడనున్నాయి. ఇప్పటివరకూ 8 మ్యాచ్లు ఆడిన గుజరాత్ టీమ్ 6 మ్యాచ్లలో (GT wins 6 matches) గెలిచింది. ఢిల్లీ జట్టు ఆడిన 8 మ్యాచ్లలో 6 ఓడి 2 మ్యాచ్లలో (DC lost 6 matches) గెలిచింది. ఈరోజు గుజరాత్ సొంత గ్రౌండ్ (GT home ground) లో జరుగుతుండడం ఢిల్లీ జట్టుకి చేదు వార్త అనే చెప్పవచ్చు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు మ్యాచ్లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది. ఎందుకంటే మ్యాచ్ ఓడితే ఢిల్లీ జట్టుకి ప్లేఆఫ్స్ అవకాశాలు దాదాపు మూసుకుపోతాయని చెప్పవచ్చు. అయితే ఢిల్లీకి మ్యాచ్ గెలవడం అంత సులభం కాదు. గుజరాత్ టీమ్ (GT strong team) ఢిల్లీ టీమ్ కంటే అన్ని విభాగాల్లోనూ ఎంతో పటిష్టంగా ఉంది. గుజరాత్ టీమ్ లో బ్యాటింగ్ విభాగంలో శుభమన్ గిల్, విజయ్ శంకర్, అభినవ్ మనోహర్, రాహుల్ తెవాటియా, డేవిడ్ మిల్లర్ లతో కూడిన జట్టు భీకర ఫామ్ లో (GT in full swing) ఉంది. ఇక బౌలింగ్ విభాగంలో షమీ, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, రషీద్ ఖాన్ లు బంతిని తిప్పేస్తున్నారు. హార్ధిక్ పాండ్యా (captain Hardik Pandya) ఒక్కడే విఫలం అవుతున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లోనో ఎంతో పటిష్టంగా ఉన్న టైటాన్స్ జట్టును ఢీ కొనడం వార్నర్ సేనకు కష్టమేనని చెప్పవచ్చు.

ఢిల్లీ టీమ్ విశ్లేషణ : DC analysis

రిషబ్ పంత్ యాక్సిడెంట్ (Pant accident) కి గురికావడంతో ఢిల్లీ టీమ్ పగ్గాలు అందుకున్న డేవిడ్ వార్నర్ కి జట్టులోని మిగతా ఆటగాళ్ల నుంచి సహకారం కరువయింది. ఐపీఎల్ (IPL) సీజన్లో ఇప్పటివరకూ ఆడిన 8 మ్యాచ్లు ఆడిన టీమ్ కేవలం రెండింటిలో మాత్రమే విజయం సాధించి మిగతా 6 మ్యాచ్లలో ఓటమి పాలయింది. ఇప్పటివరకూ బ్యాటింగ్ లో రాణిస్తున్న కెప్టెన్ డేవిడ్ వార్నర్ (captain David Warner) గత మ్యాచ్లో సున్నా పరుగులకే వెనుదిరిగాడు. అయితే సాల్ట్, మిచెల్ మార్ష్ ఫామ్ లోకి రావడం జట్టుకు శుభపరిణామమని చెప్పవచ్చు.  గల్లీ క్రికెట్ కంటే దారుణంగా ఆడుతున్నారని అభిమానులు నిరాశ పడుతున్నారు. అంతర్జాతీయ క్రికెట్లో స్టార్లుగా చెలామణి అవుతున్న అన్రిచ్ నోర్జే, కుల్దీప్ యాదవ్ (Nortje, Kuldeep failed) వంటి బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేక పోతున్నారు. మిచెల్ మార్ష్ ఫామ్ లోకి వచ్చి గత మ్యాచ్లో 4 వికెట్లు తీసాడు. వీరికి ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ (All-rounder Akshar Patel) మినహా మిగతా వారి నుంచి జట్టుకి ఏమాత్రం సహకారం అందటం లేదు. నేడు అహ్మదాబాద్ లో మ్యాచ్ జరిగే మైదానం అక్షర్ పటేల్ కి హోమ్ గ్రౌండ్ కావడంతో ఆటను ఇక్కడ ఏవిధంగా రాణిస్తాడో అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

 

హెడ్ టు హెడ్ : head to head

ఐపీఎల్ లో (IPL) రెండు జట్ల మధ్య గత సీజన్ లో ఒక మ్యాచ్, సీజన్ లో మరో మ్యాచ్ జరిగాయి. రెండు మ్యాచ్లలోనూ గుజరాత్ టైటాన్స్ (GT) జట్టే విజయం సాధించింది.

పిచ్ : pitch

అహ్మదాబాద్ స్టేడియం పిచ్ బ్యాటింగ్ కి స్వర్గధామం (batting pitch). 16 ఐపీఎల్ (IPL) సీజన్ లో ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోరు 190 (average score 190 runs) పరుగులుగా నమోదైంది. ఛేదన చేసే జట్టుకు విజయావకాశాలెక్కువగా ఉంటాయి.

 

గుజరాత్ టైటాన్స్ ప్లేయింగ్ XI : GT playing XI

వృద్ధిమాన్ సాహా, శుభ్మన్ గిల్, హార్ధిక్ పాండ్యా (కెప్టెన్), విజయ్ శంకర్, అభినవ్ మనోహర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మహ్మద్ షమీ, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ

 

గుజరాత్ టైటాన్స్ ఫుల్ స్క్వాడ్ : GT full squad

హార్దిక్ పాండ్యా (కెప్టెన్), శుభమన్ గిల్, డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్, సాయి సుదర్శన్, వృద్ధిమాన్ సాహా, మాథ్యూ వేడ్, రషీద్ ఖాన్, రాహుల్ తెవాటియా, విజయ్ శంకర్, మహమ్మద్ షమీ, అల్జారీ జోసెఫ్, యశ్ దయాల్, ప్రదీప్ సాంగ్వాన్, దర్శన్ నల్కండే, జయంత్ యాదవ్, ఆర్ సాయి కిషోర్, నూర్ అహ్మద్, కేన్ విలియమ్సన్, ఒడియన్ స్మిత్, కెఎస్ భరత్, శివమ్ మావి, ఉర్విల్ పటేల్, జాషువా లిటిల్, మోహిత్ శర్మ.

ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ XI : DC playing XI

డేవిడ్ వార్నర్ (కెప్టెన్), ఫిలిప్ సాల్ట్, మిచెల్ మార్ష్, మనీష్ పాండే, ప్రియమ్ గార్గ్, అక్షర్ పటేల్,  రిపల్ పటేల్,  కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నోర్జ్, ఇషాంత్ శర్మ, ముఖేష్ కుమార్

 

ఢిల్లీ క్యాపిటల్స్ ఫుల్ స్క్వాడ్ : DC full squad

డేవిడ్ వార్నర్(సి), పృథ్వీ షా, మిచెల్ మార్ష్, యశ్ ధుల్, మనీష్ పాండే, ఫిల్ సాల్ట్, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, చేతన్ సకారియా, అమన్ హకీమ్ ఖాన్, లలిత్ యాదవ్, విక్కీ ఓస్త్వాల్, అన్రిచ్ నార్ట్జే, కుల్దీప్ యాదవ్, ముస్తాఫిజుర్ రెహమాన్, ముఖేష్ కుమార్, కమలేష్ నాగర్కోటి, సర్ఫరాజ్ ఖాన్, ప్రవీణ్ దూబే, రిలీ రోసౌవ్, రోవ్మాన్ పావెల్, ఖలీల్ అహ్మద్, ఇషాంత్ శర్మ, లుంగి ఎంగిడి, రిపల్ పటేల్