ఐపీఎల్ లో అత్యధిక వికెట్ల వీరులు : Most wicket takers in IPL

ప్రపంచంలోని అతి పెద్ద క్రీడా ఈవెంట్ గా నిలిచింది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టోర్నమెంట్. ఎందరో క్రికెటర్లను కోటీశ్వరులను చేస్తోంది. ప్రతి ఏడాది నిర్వహించే ఈ టోర్నమెంట్ కు ప్రపంచ వ్యాపంగా ఎంతో ప్రాముఖ్యం లభించింది. ఈ ఐపీఎల్ ద్వారా ఎందరో వర్ధమాన క్రికెటర్లు తమ ప్రతిభను ప్రదర్శిస్తున్నారు.

ఐపీఎల్ లో అత్యధిక వికెట్ల వీరులు : Most wicket takers in IPL

ఐపీఎల్ లో అత్యధిక వికెట్ల వీరులు : Most wicket takers in IPL

 

మెగా ఈవెంట్ గా ఐపీఎల్ : Megaevent IPL

ప్రపంచంలోని అతి పెద్ద క్రీడా ఈవెంట్ గా నిలిచింది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టోర్నమెంట్. ఎందరో క్రికెటర్లను కోటీశ్వరులను చేస్తోంది. ప్రతి ఏడాది నిర్వహించే టోర్నమెంట్ కు ప్రపంచ వ్యాపంగా ఎంతో ప్రాముఖ్యం లభించింది. కోట్లాది మంది టోర్నమెంట్ ను  ఆస్వాదిస్తున్నారు. ఐపీఎల్ ద్వారా ఎందరో వర్ధమాన క్రికెటర్లు తమ ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. తద్వారా జాతీయ జట్టులోకి స్థానం సంపాదిస్తున్నారు.

 

ప్రపంచంలోని క్రికెట్ ఆడే దేశాలకు చెందిన క్రికెటర్లు ఈవెంట్ లో ఆడుతున్నారు. వీరికి ఐపీఎల్ ఫ్రాంచైజీలు కోట్లు కుమ్మరిస్తున్నాయి. వచ్చే ఏడాది 2023 మర్చి నెలలో ప్రారంభమయ్యే టోర్నమెంట్ కు ఇప్పటికే వేలం నిర్వహించే ప్రక్రియ పూర్తి చేసారు. కొంతమంది క్రికెటర్లు కోట్ల రూపాయల ధర పలికి అందరినీ ఆశ్చర్యపరిచారు.

 

ఐపీఎల్ లో కోట్ల ధర పలికిన క్రికెటర్లు : Cricketers who cost crores in IPL

ప్రముఖ క్రికెటర్, ఇంగ్లాండ్ కి చెందిన సామ్ కరణ్ 16 సీజన్ ఐపీఎల్ లో అత్యధిక ధరకు అమ్ముడుబోయిన క్రికెటర్ గా రికార్డు సృష్టించాడు. పంజాబ్ కింగ్స్ జట్టు యాజమాన్యం రూ.18.50 కోట్లకు వేలంలో కొనుగోలు చేసింది. ఆస్ట్రేలియన్ క్రికెటర్ కామెరాన్ గ్రీన్ ను ముంబై ఇండియన్స్ జట్టు రూ.17.50 కోట్లకు, ఇంగ్లాడ్ క్రికెటర్ బెన్ స్టోక్స్ ను చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం రూ.16.25 కోట్ల అత్యధిక ధరకు కొనుగోలు చేసాయి.

 

ఐపీఎల్ అంటేనే ధనా ధన్ క్రికెట్. ఇందులో సిక్సర్లు, బౌన్సర్లు ఎమోషన్లు అన్నీ ఉంటాయి. కళ్ళు మూస్తే ఎదో మిస్ అయిపోతామన్న భావన మ్యాచ్ ను వీక్షించే వారికి కలుగుతుంది. క్రికెటర్ల విన్యాసాలు, అద్భుతమైన ప్రతిభ క్రికెట్ అభిమానులను ఎంతగానో అలరిస్తుంది. ఇటువంటి మెగా టోర్నీలో బ్యాటర్లతోపటు బౌలర్లు కూడా ఎన్నో రికార్డులు సృష్టించారు. తమ బౌన్సర్లతో బ్యాటింగ్ చేసేవారిని బోల్తా కొట్టించడం.. బెంబేలెత్తించడం జరుగుతుంటుంది. ఎంతో మంది బౌలర్లు రికార్డులు సృష్టించిన వారిలో ఉన్నారు.

 

ఐపీఎల్ లో ప్రతిభ చాటిన కొందరు బౌలర్లు : Some Talented bowlers in IPL

 

డ్వాయిన్ బ్రావో (181)

వెస్టిండీస్ కి చెందిన లోయర్ ఆర్డర్ లో బ్యాటింగ్ కి వచ్చే బ్రావో ఆల్-రౌండర్ గా ప్రసిద్ధి చెందాడు. తన బ్యాటింగ్ తో పాటు డెత్ ఓవర్లలో బౌలింగ్ తో వికెట్లను పడగొట్టడం బ్రావో కే సాధ్యమనేలా అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. 2004 లో వన్డేలు, టెస్టుల్లో, 2006 లో టీ20ల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. భారత దేశంలో 2008 లో ప్రారంభించిన ఐపీఎల్ లో అడుగుపెట్టాడు. ముంబై ఇండియన్స్, గుజరాత్ లయన్స్ కి ఆడిన బ్రావో ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్నాడు.

 

బ్రావో తన బౌలింగ్ ప్రతిభతో అందరికంటే టాప్ లో కొనసాగుతున్నాడు. మొత్తం 158 మ్యాచుల్లో 156 ఇన్నింగ్స్ లో 515.1 ఓవర్లు బౌలింగ్ చేసిన బ్రావో 181 వికెట్లు పడగొట్టాడు. 10 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీసి (4/10) ఉత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసాడు. నాలుగు వికెట్లను రెండుసార్లు తీసాడు.

 

ఇప్పటి వరకు మొత్తం 161 ఐపీఎల్ మ్యాచుల్లో 113 ఇన్నింగ్స్ ఆడాడు. 44 సార్లు నాటవుట్ గా నిలిచాడు. అత్యధిక స్కోర్ 70 పరుగులు. 22.61 సగటుతో మొత్తం 1560 పరుగులు చేశారు. 129.57 అతని స్ట్రయిక్ రేట్. ఐదు అర్ధ సెంచురీలు సాధించాడు. 120 ఫోర్లు, 66 సిక్సులు బాదాడు.

 

లసిత్ మలింగా (170)

శ్రీలంకకు చెందిన ఫాస్ట్ బౌలర్ మలింగా పరిమిత ఓవర్ల క్రికెట్లో ఒక సంచలనం. 2014 టీ20 ప్రపంచ కప్ లో కేవలం నాలుగు బంతుల్లోనే 4 వికెట్లు తీసి తన జట్టు కప్ సాధించడంలో ఘనత వహించాడు. ఫీట్ ను అంతర్జాతీయ క్రికెట్లో రెండు సార్లు సాధించాడు. 140.-150 కిలోమీటర్ల వేగంతో స్థిరంగా బౌలింగ్ చేయడం మలింగాకే సాధ్యం.

 

మొత్తం 122 ఐపీఎల్ మ్యాచుల్లో 170 వికెట్లను తీసాడు. అతని ఉత్తమ బౌలింగ్10 పరుగులిచ్చి 5 (5/10) వికెట్లు తీయడం. 4 వికెట్లను 6 సార్లు, 5 వికెట్లను ఒకసారి సాధించాడు.

 

ఇసుక తిన్నెలు, కొబ్బరి తోటల్లో క్రికెట్ ఆటను తన స్నేహితులతో ఆడే స్థాయి నుంచి అంతర్జాతీయ బౌలర్ గా ఎదిగాడు. అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన మలింగా వన్డేల్లో యార్కర్లు సంధించే బౌలర్ గా తన పేరును సార్ధకం చేసుకున్నాడు. మొత్తం 226 వన్డేల్లో 220 ఇన్నింగ్స్ ఆడిన మలింగా 338 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. 38 పరుగులకు 6 వికెట్లు (6/38) పడగొట్టి ఉత్తమ గణాంకాలు నమోదు చేసాడు. 5 వికెట్ల ఫీట్ ను 8 సార్లు సాధించాడు.

 

అమిత్ మిశ్రా (166)

హర్యానా తరపున రంజీల్లో ఆడిన అమిత్ మిశ్రా ఐపీఎల్ లో ఒక సంచలనం. అతని స్థిరమైన బౌలింగ్ తో భారత జట్టులో స్థానం సంపాదించాడు. 2002 లో వెస్టిండీస్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో ఆడేందుకు పిలుపు వచ్చింది కానీ, ఆడేదుకు అవకాశం రాలేదు. 2007 లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచులో 5 వికెట్లు తీయడంతో గుర్తింపు లభించింది. టెస్టుల్లో 4 అర్ధ సెంచురీలు కూడా చేసి తన బ్యాటింగ్ ప్రతిభను నిరూపించుకున్నాడు. ఇప్పటికే రిటైర్మెంట్ ని ప్రకటించాడు మిశ్రా. వన్డేల్లో 36 మ్యాచుల్లో 34 ఇన్నింగ్స్ ఆడి 64 వికెట్లను పడగొట్టాడు. 6/48 అతని ఉత్తమ బౌలింగ్ గణాంకాలు.

 

ఐపీఎల్ లో కూడా వైవిధ్యమైన బౌలింగ్ తో తనదైన ముద్రను వేసాడు. 154 ఇన్నింగ్స్ లో 166 వికెట్లను పడగొట్టాడు. 5 వికెట్ల ఫీట్ ను ఒకసారి సాధించాడు. 5/17 అతని ఉత్తమ బౌలింగ్ గణాంకాలు. 2008, 2011, 2012 ఐపీఎల్ సీజన్లలో మూడు సార్లు హ్యాట్రిక్ నమోదు చేసి చెక్కు చెదరని రికార్డు ను తన పేరు మీద నమోదు చేసుకున్నాడు. ఇప్పటి వరకు రికార్డును ఎవ్వరూ బ్రేక్ చెయ్యలేదు.

 

యజువేంద్ర చాహల్ (166)

హర్యానాకు చెందిన యజువేంద్ర చాహల్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. తన 19 ఏటా మధ్య ప్రదేశ్ తో ఆరంగ్రేటం చేసాడు. ఎక్కువ ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడకపోయినా ఐపీఎల్ అతనికి తలుపు తీసింది. 2011 లో ముంబై ఇండియన్స్ అతనిని తమ జట్టులోకి ఆహ్వానించింది. ముంబై ఇండియన్స్ అతనికి ఎక్కువ మ్యాచులు ఆడే అవకాశం ఇవ్వకపోవడంతో 2014 లో వేలానికి వెళ్ళాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు అతడిని కొనుగోలు చేసింది. 2016 లో జింబాబ్వే టూర్ కి భారత జాతీయ జట్టులో స్థానం సంపాదించాడు. వన్డేల్లో 70 మ్యాచుల్లో 67 ఇన్నింగ్స్ ఆడి 118 వికెట్లు పడగొట్టాడు. 6/42 అతని ఉత్తమ బౌలింగ్ గణాంకాలు.

 

చాహల్ ఐపీఎల్ కెరీర్ ని గమనిస్తే... 131 మ్యాచుల్లో 130 ఇన్నింగ్స్ ఆడి 166 వికెట్లను తీసాడు. 5 వికెట్లను ఒకేసారి తీసాడు. ఉత్తమ బౌలింగ్ 5/40 గా ఉంది. టీ20 చరిత్రలో 6 వికెట్లు తీసిన రెండో బౌలర్ గానూ, మొదటి భారతీయ క్రికెటర్ గా రికార్డు సృష్టించాడు. చాహల్ భారత్ తరపున అంతర్జాతీయ చెస్ లో కూడా ప్రాతినిధ్యం వహించడం విశేషం.

 

పీయూష్ చావ్లా (157)

ఉత్తరప్రదేశ్ తరపున అండర్-22 టీమ్ లో తన 15 సంవత్సరాల వయస్సులోనే అడుగుపెట్టి రికార్డు సృష్టించాడు చావ్లా. తన అమ్ములపొదిలోని గుగ్లీలతో బ్యాట్స్ మన్ ను బోల్తా కొట్టించేవాడు. 2006 లో ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ తో జాతీయ జట్టులో చేరాడు. 25 వన్డే మ్యాచుల్లో 32 వికెట్లు పడగొట్టాడు. 4/23 అతని ఉత్తమ బౌలింగ్ గణాంకాలు.

 

ఐపీఎల్ కేరీర్లో అతని బౌలింగ్ తో బ్యాటర్లను ఇబ్బందులకు గురిచేసేవాడు. మొత్తం 165 మ్యాచుల్లో 164 ఇన్నింగ్స్ ఆడి 157 వికెట్లు పడగొట్టాడు. 17 పరుగులిచ్చి 4 వికెట్లు తీసాడు. తన బ్యాట్ కి కూడా పదును చెప్పి కొన్ని చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు. 82 ఇన్నింగ్స్ లో 584 పరుగులు చేసాడు. అత్యధిక స్కోర్ 24. అతని బ్యాటింగ్ స్ట్రయిక్ రేట్ 111 కి పైగా ఉంది.

 

రవిచంద్రన్ అశ్విన్ (157)

తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై కి చెందిన స్పిన్నర్ అశ్విన్ కెరియర్ ఐపీఎల్ నుంచే భారత జాతీయ జట్టులోకి ప్రవేశించేందుకు మార్గం ఏర్పడింది. 2011 లో వెస్టిండీస్ తో జరిగిన టెస్ట్ మ్యాచుతో జాతీయ జట్టులోకి ప్రవేశించాడు. అశ్విన్ వికెట్ల వేట మొదలుపెట్టాడు. 2011 క్రికెట్ ప్రపంచ కప్ లో కూడా ఆడాడు. బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ లో కూడా సత్తా చూపగా అల్-రౌండర్ అశ్విన్. 2013 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్ లో 29 వికెట్లు తీసి తానేమిటో నిరూపించాడు. 113 వన్డే మ్యాచుల్లో 63 ఇన్నింగ్స్ ఆడిన అశ్విన్ 707 పరుగులు చేసాడు. అత్యధిక స్కోర్ 65 పరుగులు.

 

ఐపీఎల్ తో తన క్రికెట్ కెరీర్ ను ప్రారంభించిన అశ్విన్ బౌలింగ్, బ్యాటింగ్ లో సత్తా చాటాడు. 184 మ్యాచుల్లో 181 ఇన్నింగ్స్ ఆడిన అశ్విన్ 157 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. 34 పరుగులిచ్చి 4 (4/34) వికెట్లు అశ్విన్ బౌలింగ్ ఉత్తమ గణాంకాలు. బ్యాటింగ్ లో కూడా సత్తా చాటిన అశ్విన్ 75 ఇన్నింగ్స్ లో 647 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోర్ 50 పరుగులు.

 

భువనేశ్వర్ కుమార్(154)

భారత జట్టులో ఓపెనింగ్ ఫాస్ట్ బౌలర్ గా స్థిరంగా వికెట్లు తేజ్ వాడిగా పేరుగాంచాడు భువీ గా పిలువబడే భువనేశ్వర్ కుమార్. యూపీ లోని మీరట్ కి చెందిన భువీ. దేశవాళీ క్రికెట్ లో దిగ్గజ క్రికెటర్ టెండూల్కర్ ను డకవుట్ చేసిన భువీ వయస్సు అప్పటికి 19 ఏళ్ళు. తన స్వింగ్ బౌలింగ్ తో హడలెత్తించేవాడు. 2013 లో ట్రై సిరీస్  కి ఎంపికైన భువీ 4/8 గణాంకాలు నమోదు చేసాడు. అప్పటి నుంచి భారత జట్టులో రెగ్యులర్ బౌలర్ గా మారాడు. బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ లో భారీ షాట్లు కూడా ఆడగలడు.

 

ఐపీఎల్ లో భువీ సన్ రైజర్స్ హైదరాబాద్ కి ప్రాతినిధ్యం వహించాడు. 146 మ్యాచుల్లో 154 వికెట్లు పడగొట్టాడు. 19 పరుగులిచ్చి 5 వికెట్లు తీసాడు. తన వన్డే కెరీర్లో ఇప్పటివరకు 55 ఇన్నింగ్స్ లో 552 పరుగులు చేసాడు. అత్యధిక స్కోర్ 53. బౌలింగ్ లో తానాడిన 121 మ్యాచుల్లోని 120 ఇన్నింగ్స్ లో 141 వికెట్లు పడగొట్టాడు. 42 పరుగులకు 5 వికెట్లు పడగొట్టాడు.

 

హర్భజన్ సింగ్ (150)

తన కోపంతో ప్రత్యర్థి మీద విరుచుకు పడడం, బౌలింగ్ తో బ్యాటింగ్ ని కట్టడి చేయడంలో దిట్టగా హర్భజన్ నిలిచాడు. భారత జట్టుకు ఎనలేని సేవలందించిన హర్భజన్ పంజాబ్ కి చెందిన వాడు. వన్డేలు, టెస్టులు, పొట్టి క్రికెట్ లో తనదైన ముద్ర వేసాడు. 2001 లో ఆస్ట్రేలియాతో జరిగిన 3 మ్యాచుల టెస్ట్ సిరీస్ లో 32 వికెట్లు తీసాడు. ఇందులో హ్యాట్రిక్ సాధించిన మొదటి బౌలర్ గా ఖ్యాతి గడించాడు.

 

ఐపీఎల్ లో 163 మ్యాచుల్లో 160 ఇన్నింగ్స్ ఆడిన హర్భజన్ 150 వికెట్లు తీసాడు. 18 పరుగులకు 5 వికెట్లు ఉత్తమ బౌలింగ్ గణాంకాలు. వన్డేల్లో 236 మ్యాచుల్లో 227 ఇన్నింగ్స్ ఆడి 269 వికెట్లు తీసాడు. 5 వికెట్ల ఫీట్ ను మూడుసార్లు సాధించాడు. 31 పరుగులకు 5 వికెట్లు బెస్ట్ బౌలింగ్.

 

సునీల్ నరైన్ (152)

మిస్టరీ బౌలర్ గా పేరుపొందిన సునీల్ నరైన్ వెస్టిండీస్ కి చెందిన భారత సంతతి బౌలర్. వెస్టిండీస్ లో ట్రయల్ మ్యాచులో 10 కి 10 వికెట్లు తీయడంతో అక్కడి ట్రినిడాడ్ జట్టులోకి పిలుపు వచ్చింది. ఐపీఎల్ లో కోల్కతా నైట్ రైడర్స్ 2012 లో 5 కోట్లు వెచ్చించి సునీల్ ను దక్కించుకుంది.

 

సునీల్ ఐపీఎల్ లో 148 మ్యాచుల్లో 147 ఇన్నింగ్స్ ఆడి 152 వికెట్లు పడగొట్టాడు. 19 పరుగులకు 5 వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్ లో 86 ఇన్నింగ్స్ ఆడి 1025 పరుగులు చేసాడు. అత్యధిక స్కోర్ 75 పరుగులు.  తానాడిన 65 వన్డేల్లో 92 వికెట్లు తీసాడు. 27 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. 5 వికెట్ల ఫీట్ ను రెండుసార్లు నమోదు చేసాడు.

 

జస్ప్రీత్ బూమ్రా (145)

బూమ్ బూమ్ బూమ్రాగా పేరొందిన బూమ్రా తన వైవిధ్యమైన బౌలింగ్ తో ప్రపంచ అగ్రశ్రేణి బౌలర్లలో ఒకడిగా మారాడు. గుజరాత్ లోని అహ్మదాబాద్ కి చెందిన బూమ్రా భారత జట్టులో సభ్యుడు. డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ గా పేరుపొందాడు. ఐపీఎల్ ద్వారానే జట్టులో స్థానం సంపాదించుకున్నాడు.

 

బుమ్రా ఐపీఎల్ లో తాను ఆడిన120 ఇన్నింగ్స్ లో 145 వికెట్లు పడగొట్టాడు. 5 వికెట్ల ఫీట్ ను ఒకసారి సాధించాడు. 10 పరుగులిచ్చి 5 వికెట్లను పడగొట్టాడు. వన్డేల్లోనో బుమ్రా తన సత్తా చాటాడు. 72 వన్డేల్లో 121 వికెట్లు పడగొట్టాడు. 5 వికెట్ల ఫీట్ ను రెండుసార్లు సాధించాడు. 19 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టడం బూమ్రా ఉత్తమ బౌలింగ్ గణాంకాలు.

ఐపీఎల్ లో ప్రతిభ చాటిన బౌలర్లు : Some Talented bowlers in IPL

గత ఏడాది 2022లో జరిగిన 15వ ఐపీఎల్ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఫాస్ట్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ (Umran Malik Speed) గంటకు 157 కి.మీ. వేగంతో బంతిని విసిరాడు. దీంతో ఇది ఇప్పటివరకూ ఏ భారతీయ బౌలరూ వేయలేని అత్యంత వేగవంతమైన బంతిగా నిలిచింది

ఎంతోమందిని జీరో స్థాయి నుంచి హీరో స్థాయికి తీసుకెళ్లిన ఐపీఎల్ మరో కొన్ని నెలల్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే కొన్ని జట్లకు చెందిన క్రీడాకారులు తమ ప్రాక్టీస్ ను కూడా ప్రారంభించారు. ఇంకెందుకు ఆలస్యం మనం కూడా తయారుగా ఉందాం. ఈసారి బౌలర్ల ప్రతిభను మనం కూడా ఆస్వాదిద్దాం.