నేడు ఐపీఎల్ లో కోల్కతా, రాజస్థాన్ కీలక మ్యాచ్ : Kolkata vs Rajasthan match in IPL today
ఐపీఎల్ (IPL) లో భాగంగా మరో కీలక పోరు (crucial match) జరుగనుంది. ఇవాళ కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ (Kolkata, Eden Gardens) స్టేడియంలో కోల్‌కతా కింగ్ రైడర్స్ (KKR) vs రాజస్థాన్ రాయల్స్ (RR) జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. ఈ 56వ మ్యాచ్ ఇవాళ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. ఫ్లేఆఫ్స్ లో చోటు దక్కించుకోవాలంటే ఈ మ్యాచ్ లో రెండు జట్లు గెలిచి తీరాల్సిన పరిస్థితి.
నేడు ఐపీఎల్ లో కోల్కతా, రాజస్థాన్ కీలక మ్యాచ్ : Kolkata vs Rajasthan match in IPL today
ఐపీఎల్ (IPL) లో భాగంగా మరో కీలక పోరు (crucial match) జరుగనుంది. ఇవాళ కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ (Kolkata, Eden Gardens) స్టేడియంలో కోల్‌కతా కింగ్ రైడర్స్ (KKR) vs రాజస్థాన్ రాయల్స్ (RR) జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. ఈ 56వ మ్యాచ్ ఇవాళ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. ఫ్లేఆఫ్స్ లో చోటు దక్కించుకోవాలంటే ఈ మ్యాచ్ లో రెండు జట్లు గెలిచి తీరాల్సిన పరిస్థితి. రెండు జట్లు గెలవడం సాధ్యం కాదు కాబట్టి... గెలిచిన జట్టు ఫ్లేఆఫ్ కు (Play Offs) మరింత దగ్గరవుతుంది. ఓడిన జట్టు దాదాపు ఇంటి ముఖం పట్టినట్లే.
పాయింట్ల పట్టికలో రాజస్థాన్ రాయల్స్ (RR) పటిష్టంగా కనిపిస్తోంది. మొత్తం 11 మ్యాచ్‌ల్లో 5 గెలిచింది. 10 పాయింట్లతో 5వ స్థానంలో ఉంది. అదే సమయంలో కోల్‌కతా జట్టు రాయల్స్ (KKR) కంటే ఒక స్థానం దిగువన అంటే ఆరో స్థానంలో ఉంది. ఆ జట్టు ఖాతాలో 10 పాయింట్లు ఉన్నాయి. మెరుగైన రన్‌రేట్ కలిగి ఉండడం రాజస్థాన్‌కు కాస్త ఊరటనిచ్చే అంశంగా చెప్పాలి. ఆరంభంలో వరుస విజయాలతో అదరగొట్టిన రాజస్థాన్ ఆ తర్వాత ఆ జోరును కొనసాగించలేక పోతోంది. ప్రారంభంలో రాజస్థాన్ వరుసగా నాలుగు మ్యాచుల్లో గెలిచి పెను ప్రకంపనలు సృష్టించింది. కానీ తర్వాత ఆడిన ఏడు మ్యాచుల్లో ఆరింటిలో ఓటమి పాలైంది.
జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, కెప్టెన్ సంజూ శాంసన్, దేవ్‌దుత్ పడిక్కల్, ధ్రువ్ జురేల్, హెట్‌మెయిర్ వంటి విధ్వంసక బ్యాటర్లు జట్టుకు అందుబాటులో ఉన్నారు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఉన్న రియాన్ పరాగ్ కూడా ధాటిగా ఆడడంలో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇలా బ్యాటింగ్‌లో రాజస్థాన్ బలంగానే కనిపిస్తోంది. మరోవైపు ట్రెంట్ బౌల్ట్, చాహల్, అశ్విన్, ఆడమ్ జంపాలతో బౌలింగ్ విభాగం కూడా పటిష్టంగా ఉంది. అయితే నిలకడలేమీ రాజస్థాన్‌కు ప్రధాన ఇబ్బందిగా మారింది. దీన్ని అధిగమిస్తేనే జట్టుకు గెలుపు అవకాశాలుంటాయి. ఇక ఆతిథ్య కోల్‌కతాకు కూడా ఈ మ్యాచ్ కీలకమే. ప్లేఆఫ్‌కు చేరుకోవాలంటే మిగిలిన మూడు మ్యాచుల్లో భారీ తేడాతో గెలవడమే కాకుండా ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిన పరిస్థితి కోల్‌కతాకు నెలకొంది.
కోల్‌కతా నైట్ రైడర్స్ ప్లేయింగ్ XI : Kolkata Knight Riders playing XI
రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా (కెప్టెన్), ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, సుయాష్ శర్మ, వరుణ్ చక్రవర్తి, జాసన్ రాయ్
కోల్‌కతా నైట్ రైడర్స్ పూర్తి జట్టు : KKR full squad
జాసన్ రాయ్, లిట్టన్ దాస్ (వికెట్ కీపర్), వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా (కెప్టెన్), మన్‌దీప్ సింగ్, ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్, సునీల్ నరైన్, కుల్వంత్ ఖేజ్రోలియా, ఉమేష్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, అనుకుల్ రాయ్, టిమ్ సౌథీ, డేవిడ్ వైస్, శార్దూల్ ఠాకూర్, లాకీ ఫెర్గూసన్, ఎన్ జగదీసన్, రహ్మానుల్లా గుర్బాజ్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, సుయాష్ శర్మ, ఆర్య దేశాయ్
రాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ XI : Rajasthan Royals playing XI
జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (కెప్టెన్, వికెట్ కీపర్), జో రూట్, ధృవ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, రవిచంద్రన్ అశ్విన్, మురుగన్ అశ్విన్, సందీప్ శర్మ, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, ఒబెద్ మెక్‌కాయ్
రాజస్థాన్ రాయల్స్ ఫుల్ స్క్వాడ్ : RR full squad
యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, దేవదత్ పడిక్కల్, సంజు శాంసన్ (కెప్టెన్, వికెట్ కీపర్), షిమ్రాన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, జాసన్ హోల్డర్, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, యజువేంద్ర చాహల్, అబ్దుల్ బాసిత్, ఆకాష్ వశిష్ట్, డోనవ్ వశిష్త్, డోనావన్ ఫెరీరా, మురుగన్ అశ్విన్, కెఎమ్ ఆసిఫ్, రియాన్ పరాగ్, జో రూట్, ఆడమ్ జంపా, నవదీప్ సైనీ, కెసి కరియప్ప, ఒబెద్ మెక్‌కాయ్, కుల్దీప్ యాదవ్, కుల్దీప్ సేన్, కునాల్ సింగ్ రాథోడ్
కోల్కతా vs రాజస్థాన్ హెడ్ టు హెడ్ : KKR vs RR head to head
ఐపీఎల్ అన్ని సీజన్లలో ఇప్పటివరకూ కోల్‌కతా, రాజస్థాన్ జట్లు 27 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఈ 27 మ్యాచ్‌ల్లో కోల్‌కతా 14 మ్యాచ్‌ల్లో గెలుపొందగా, రాజస్థాన్ 12 సార్లు విజయం సాధించింది. 1 మ్యాచ్ ఫలితం లేకుండా ముగిసింది.
అత్యధిక స్కోర్లు (highest score) : కోల్కతా 210 పరుగులు, రాజస్థాన్ 217 పరుగులు
అత్యల్ప పరుగులు (lowest scores) : కోల్కతా 125 పరుగులు, రాజస్థాన్ 81 పరుగులు
IPL 2023 పాయింట్ల పట్టిక : IPL 2023 Points table
ర్యాంక్ |
జట్టు |
మ్యాచ్‌లు |
విజయాలు |
ఓడినవి |
ఫలితం తేలనివి |
పాయింట్లు |
నెట్ రన్ రేట్ |
1 |
గుజరాత్ టైటాన్స్ |
11 |
8 |
3 |
0 |
16 |
0.951 |
2 |
చెన్నై సూపర్ కింగ్స్ |
12 |
7 |
4 |
1 |
15 |
0.493 |
3 |
ముంబై ఇండియన్స్ |
11 |
6 |
5 |
0 |
12 |
-0.255 |
4 |
లక్నో సూపర్ జెయింట్స్ |
11 |
5 |
5 |
1 |
11 |
0.294 |
5 |
రాజస్థాన్ రాయల్స్ |
11 |
5 |
6 |
0 |
10 |
0.388 |
6 |
కోల్‌కతా నైట్ రైడర్స్ |
11 |
5 |
6 |
0 |
10 |
-0.079 |
7 |
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు |
11 |
5 |
6 |
0 |
10 |
-0.345 |
8 |
పంజాబ్ కింగ్స్ |
11 |
5 |
6 |
0 |
10 |
-0.441 |
9 |
సన్‌రైజర్స్ హైదరాబాద్ |
10 |
4 |
6 |
0 |
8 |
-0.472 |
10 |
ఢిల్లీ రాజధానులు |
11 |
4 |
6 |
0 |
8 |
-0.605 |