ఐపీఎల్ లో వేగవంతమైన స్కోర్లు : Fastest Scores in IPL

ఐపీఎల్ లో వేగవంతమైన స్కోర్లు : Fastest Scores in IPL

ఐపీఎల్ లో వేగవంతమైన స్కోర్లు : Fastest Scores in IPL

 

ఐపీఎల్ అంటేనే సిక్సర్ల హోరు, బౌండరీల జోరు. ఎంత వేగంగా ఆడితే అంత ఎక్కువ స్కోర్ చేయవచ్చు. అందుకే బ్యాట్స్మెన్లు తమ బ్యాటింగ్ నైపుణ్యంతో ఉత్తమ స్కోర్లు నమోదు చేస్తుంటారు.

 

స్ట్రయిక్ రేట్ తో పరుగుల వరద : Amazing Strike Rate

 

వన్డేలయినా, టీ20 లు అయినా బ్యాట్స్మెన్లకు ముఖ్యంగా కావాల్సింది టెక్నిక్, టైమింగ్. అంతేకాకుండా మరి ముఖ్యంగా కావాల్సింది స్ట్రయిక్ రేట్. తక్కువ బంతుల్లోనే ఎక్కువ పరుగులు రాబడుతుంటారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్) లో విన్యాసాలన్నీ చూస్తుంటాము. అందుకే ఐపీఎల్ కి అంత క్రేజ్ లభిస్తోంది. ఐపీఎల్ లో ఆడుతున్న 10 ఫ్రాంచైజీలలోని ఆటగాళ్లలో చాలామంది బ్యాట్స్మెన్లు అత్యుత్తమ స్కోర్లు నమోదు చేశారు. వీరు పరుగుల వరద పారించడానికి ముఖ్య కారణం వారి స్ట్రయిక్ రేట్.

 

ఎంతమంది ఎక్కువ పరుగులు చేసినప్పటికీ, వారిలో కొందరు తమ అత్యుత్తమ స్ట్రయిక్ రేట్ తో తక్కువ బంతుల్లోనే ఎక్కువ పరుగులు చేసారు. అతి తక్కువ బంతుల్లోనే సెంచరీలు, అతి తక్కువ మ్యాచుల్లోనే ఎక్కువ పరుగులు చేసారు. దీనివల్లే ఎవరికీ సాధ్యం కానీ రికార్డులు సృష్టించారు. ఐపీఎల్ లో ఇలాంటి రికార్డులు నమోదు చేసి చరిత్రను తిరగరాసిన కొందరు బ్యాట్స్మెన్ల గురించి తెలుసుకుందాం.

 

ఉత్తమ స్ట్రయిక్ రేట్ బ్యాట్స్మెన్లు

బ్యాటింగ్ లో 150 కి పైగా స్ట్రయిక్ రేట్ సాధించి ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నారు కొందరు బ్యాట్స్మెన్లు. వీరు వస్తూనే తమ ధనాధన్ బ్యాటింగ్ తో ఎక్కువ బంతుల్లోనే ఎక్కువ పరుగులు సాధించేవారు.

 

ఆండ్రూ రస్సెల్

ఆడిన మ్యాచ్ లు : 70

చేసిన పరుగులు : 1700

సగటు : 29.31

స్ట్రయిక్ రేట్ : 178.57

 

సునీల్ నరైన్

ఆడిన మ్యాచ్ లు :  76

చేసిన పరుగులు : 954

సగటు : 15.63

స్ట్రయిక్ రేట్ : 161.69

 

వీరేంద్ర సెహ్వాగ్

ఆడిన మ్యాచ్ లు : 104

చేసిన పరుగులు : 2728

సగటు : 27.55

స్ట్రయిక్ రేట్ : 155.44

 

క్రిస్ మోరిస్

ఆడిన మ్యాచ్ లు : 51

చేసిన పరుగులు :  618

సగటు : 22.07

స్ట్రయిక్ రేట్ : 155.27

 

నికోలస్ పూరన్

ఆడిన మ్యాచ్ లు : 31

చేసిన పరుగులు : 606

సగటు : 22.44

స్ట్రయిక్ రేట్ : 154.98

 

తక్కువ మ్యాచుల్లో 1000 పరుగులు

ఐపీఎల్ లో తక్కువ ఇన్నింగ్స్ ఆడి 1000 కి పైగా పరుగులు చేశారు కొందరు బ్యాట్స్మెన్లు. కింగ్స్ XI పంజాబ్, రాజస్థాన్ రాయల్స్ జట్లకు చెందిన బ్యాట్స్మెన్లు ఉన్నారు. వీరు 30 మ్యాచుల కంటే తక్కువ మ్యాచుల్లోనే పరుగులను సాధించారు.

 

షాన్ మార్ష్

ఆడిన ఇన్నింగ్స్ : 21

చేసిన పరుగులు : 1008

ఆడిన జట్లు : కింగ్స్ XI పంజాబ్

 

పాట్ సిమన్స్

ఆడిన ఇన్నింగ్స్ : 23

చేసిన పరుగులు : 1008

ఆడిన జట్లు : ముంబై ఇండియన్స్

 

మాథ్యూ హేడెన్

ఆడిన ఇన్నింగ్స్ : 25

చేసిన పరుగులు : 1022

ఆడిన జట్లు : చెన్నై సూపర్ కింగ్స్

 

జానీ బెయిర్స్టో

ఆడిన ఇన్నింగ్స్ : 26

చేసిన పరుగులు : 1001

ఆడిన జట్లు : సన్ రైజర్స్ హైదరాబాద్, కింగ్స్ XI పంజాబ్

 

క్రిస్ గేల్

ఆడిన ఇన్నింగ్స్ : 27

చేసిన పరుగులు : 1071

ఆడిన జట్లు : కోల్కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు

 

మెరుపు సెంచరీల వీరులు

స్ట్రయిక్ రేట్, తక్కువ మ్యాచుల్లో ఎక్కువ పరుగులు రికార్డులతో పాటు తక్కువ బంతుల్లో సెంచరీలు సాధించి ఔరా అనిపించిన బ్యాట్స్మెన్లు సైతం ఉన్నారు. వీరు సిక్సర్లు, బౌండరీల వర్షంతో ప్రేక్షకులను అలరించారు. 2008 నుంచి 2022 వరకు జరిగిన ఐపీఎల్ లో రికార్డులు సృష్టించిన విధ్వంసకర బ్యాట్స్మెన్లను చూద్దాం.

 

క్రిస్ గేల్ (175*)

వెస్టిండీస్ కి చెందిన గేల్ యూనివర్సల్ బాస్ గా క్రికెట్ అభిమానులచే పిలువబడతాడు. ఒక టీమ్ ఐపీఎల్ లో 20 ఓవర్లు ఆడి 150 నుంచి 180 పరుగులు చేస్తే మంచి స్కోర్ గా భావిస్తారు. అటువంటిది ఒక బ్యాట్స్మెన్ 175 పరుగులతో నాటవుట్ గా మిలవడం నిజంగా ఒక గొప్ప రికార్డ్. అసాధ్యం అనుకున్న దానిని సుసాధ్యం చేసాడు గేల్. అతి తక్కువ బంతుల్లో సెంచరీ చేసి రికార్డు సృష్టించి మొదటి స్థానంలో నిలిచాడు. మ్యాచ్ లో గేల్ కేవలం 30 బంతుల్లోనే సెంచరీ చేసాడు. గేల్ స్ట్రయిక్ రేట్ 265.15

 

ఐపీఎల్ సీజన్ : 2013 ఏప్రిల్ 23

ఆడిన జట్టు : రాయల్ ఛాలెంజెర్స్ బెంగుళూరు

ప్రత్యర్థి జట్టు : పూణె వారియర్స్

చేసిన పరుగులు : 175*

బంతులు : 66

సిక్సులు : 17

ఫోర్లు : 13

 

యూసఫ్ పఠాన్ (100)

రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడిన యూసఫ్ పఠాన్ ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో టాపార్డర్ లోని నలుగురు బ్యాట్స్మెన్లు అవుట్ అయిన తరువాత క్రీజ్ లోకి వచ్చి సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. అయితే నాటకీయంగా 18 ఓవర్లో రన్ అవుట్ కావడంతో రాజస్థాన్ రాయల్స్ ఓటమి చెందింది. 2010 ఐపీఎల్ సీజన్లో మ్యాచ్ జరిగింది.

 

ఐపీఎల్ సీజన్ : 2010 మార్చి 13

ఆడిన జట్టు : రాజస్థాన్ రాయల్స్

ప్రత్యర్థి జట్టు : ముంబై ఇండియన్స్

చేసిన పరుగులు : 100

బంతులు : 37

సిక్సులు : 8

ఫోర్లు : 9

 

డేవిడ్ మిల్లర్ (101)

దక్షిణాఫ్రికాకు చెందిన విధ్వంసకర బ్యాట్స్మెన్ ఛేజింగ్ లో సెంచరీ సాధించి  తన జట్టుకు విజయాన్ని అందించాడు.

 

ఐపీఎల్ సీజన్ : 2013 మే 06

ఆడిన జట్టు : రాయల్ ఛాలెంజెర్స్ బెంగుళూరు

ప్రత్యర్థి జట్టు : కింగ్స్ XI పంజాబ్

చేసిన పరుగులు : 101

బంతులు : 38

సిక్సులు : 7

ఫోర్లు : 8

 

ఆడమ్ గిల్క్రిస్ట్ (109)

గిల్క్రిస్ట్ ఆస్ట్రేలియాకు చెందిన వికెట్ కీపర్, బ్యాట్స్మెన్. 155 పరుగుల టార్గెట్ ను సహచర బ్యాట్స్మెన్ వీవీఎస్ లక్ష్మణ్ తో కలిసి వికెట్ నష్టపోకుండా కేవలం 12 ఓవర్లలోనే పూర్తి చేసాడు. ఐపీఎల్ ప్రారంభించిన మొదటి సీజన్ 2008 లో ఫీట్ ను సాధించాడు. 42 బంతుల్లోనే 100 పరుగులు చేసాడు.

 

ఐపీఎల్ సీజన్ : 2008 ఏప్రిల్ 27

ఆడిన జట్టు : డెక్కన్ ఛార్జర్స్

ప్రత్యర్థి జట్టు : ముంబై ఇండియన్స్

చేసిన పరుగులు : 109

బంతులు : 47

సిక్సులు : 10

ఫోర్లు : 9

 

ఏబీ డివిలియర్స్ (129)

మిస్టర్ 360 డిగ్రీస్ గా పిలువబడే డివిలియర్స్ విరాట్ కోహ్లీతో కలిసి సుడిగాలి బ్యాటింగ్ చేసాడు. వీరిద్దరూ కదంతొక్కడంతో 248 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. అనంతరం ప్రత్యర్థిని కట్టడి చేయడంతో 144 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. డివిలియర్స్ 43 బంతుల్లోనే 100 పరుగులు సాధించాడు.

 

ఐపీఎల్ సీజన్ : 2016 మే 14

ఆడిన జట్టు : రాయల్ ఛాలెంజెర్స్ బెంగుళూరు

ప్రత్యర్థి జట్టు : గుజరాత్ లయన్స్

చేసిన పరుగులు : 129

బంతులు : 52

సిక్సులు : 12

ఫోర్లు : 10

 

వ్యక్తిగత స్కోర్లే కాకుండా 20 ఓవర్లలో 200 కు పైగా స్కోర్లు చేసిన జట్లు కూడా ఉన్నాయి. వన్డేల్లో ఒకప్పుడు 250 స్కోర్ అంటే చాలా ఎక్కువ. అందులో 300 నుంచి 400 స్కోర్లు నమోదవుతున్నాయి. 20 ఓవర్లు పాటు ఆడే ఐపీఎల్ లో 200 కి పైగా స్కోర్లు నమోదు కావడమంటే దీనికి ఆయా జట్లలోని బ్యాట్స్మెన్లు కారణం. ఓవర్ కి 10 కి పైగా రన్ రేట్ తో స్కోర్లను సాధించాయి. తామాడిన మొదటి ఇన్నింగ్స్ లో స్కోర్లు చేసాయి. ఆయా జట్లు సాధించిన అత్యధిక స్కోర్లను ఒకసారి పరిశీలిద్దాం.

 

రాయల్ ఛాలెంజెర్స్ బెంగుళూరు (263/5)

మ్యాచ్ తేదీ : 2013 ఏప్రిల్ 23

ప్రత్యర్థి జట్టు : పూణె వారియర్స్

స్కోర్ : 263

రన్ రేట్ : 13.15

 

రాయల్ ఛాలెంజెర్స్ బెంగుళూరు (248/3)

మ్యాచ్ తేదీ : 2016 మే 14

ప్రత్యర్థి జట్టు : గుజరాత్ లయన్స్

స్కోర్ : 263

రన్ రేట్ : 12.4 

 

చెన్నై సూపర్ కింగ్స్ (246/5)

మ్యాచ్ తేదీ : 2010 ఏప్రిల్ 03

ప్రత్యర్థి జట్టు : రాజస్థాన్ రాయల్స్

స్కోర్ : 246

రన్ రేట్ : 12.3 

 

కోల్కతా నైట్ రైడర్స్  (245/6)

మ్యాచ్ తేదీ : 2018 మే 12

ప్రత్యర్థి జట్టు : కింగ్స్ XI పంజాబ్

స్కోర్ : 245

రన్ రేట్ : 12.25

 

చెన్నై సూపర్ కింగ్స్ (240/5)

మ్యాచ్ తేదీ : 2008 ఏప్రిల్ 19

ప్రత్యర్థి జట్టు : కింగ్స్ XI పంజాబ్

స్కోర్ : 240

రన్ రేట్ : 12 

ఏడాది జరగనున్న 16 సీజన్లో మరిన్ని రికార్డులు నమోదయ్యే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే ఆయా ఫ్రాంచైజీలకు చెందిన ఆయా దేశాలకు చెందిన ఆటగాళ్లు గత సీజన్ నుంచి తమ దేశం తరపున ఆడిన ఇతర టోర్నీల్లో మంచి ప్రతిభ కనబరుస్తున్నారు. ఐపీఎల్ సీజన్ కూడా క్రికెట్ ప్రేమికులకు కనువిందు చేయనుందనడంలో సందేహమే లేదు.