ఐపీఎల్ లో ఉత్తమ జట్టు : Best Team in IPL

ఐపీఎల్... గత 15 సంవత్సరాలుగా క్రికెట్ ప్రేమికులను అలరిస్తున్న టోర్నమెంట్. భారీ షాట్లు కొట్టే బ్యాట్స్ మన్లు... మిస్సైల్ లాంటి బంతులు సంధించే బౌలర్లు... మెరుపు వేగంతో బంతిని విసిరి రన్ అవుట్ చేసే విన్యాసాలు... వెరసి ఐపీఎల్...

ఐపీఎల్ లో ఉత్తమ జట్టు : Best Team in IPL

ఐపీఎల్ లో ఉత్తమ జట్టు : Best Team in IPL

 

ఐపీఎల్... గత 15 సంవత్సరాలుగా క్రికెట్ ప్రేమికులను అలరిస్తున్న టోర్నమెంట్. భారీ షాట్లు కొట్టే బ్యాట్స్ మన్లు... మిస్సైల్ లాంటి బంతులు సంధించే బౌలర్లు... మెరుపు వేగంతో బంతిని విసిరి రన్ అవుట్ చేసే విన్యాసాలు... వెరసి ఐపీఎల్...

 

మొదటిసారి 2008 లో ప్రారంభమైన పొట్టి క్రికెట్ ఆటగాళ్లకు కోట్లు కుమ్మరిస్తోంది. క్రికెట్ అభిమానులకు కన్నులపండుగ అందిస్తోంది. ఇప్పటి వరకూ 15 సీజన్లపాటు అలరించిన ఐపీఎల్ ఏడాది మార్చి నెలలో 16 సీజన్ ఆరంభం కాబోతోంది. ఇప్పటివరకూ జరిగిన ఐపీఎల్ టోర్నీలో అత్యధిక సార్లు ఫైనల్స్ చేరడమే కాకుండా 4 సార్లు విజేతగా నిలిచిన జట్టు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే). మ్యాచ్‌ల విజయ శాతంలో కూడా జట్టు అగ్రస్థానంలో ఉంది. జట్టును విజయపథంలో నడిపించడంలో కెప్టెన్ ధోనీ అనుభవం అక్కరకు వస్తోంది.

 

ధోనీ మాయాజాలం...  విజయాల్లో అగ్రస్థానం... : Dhoni's magic... Achieves Top Position

 

ధనాధన్ ధోనీ తన జట్టు సీఎస్కే ని ఐపీఎల్ లో విజయవంతమైన జట్టుగా నడిపించడంలో తన మహేంద్రజాలాన్ని కనబరుస్తున్నాడు. ఐపీఎల్ ప్రారంభమైన 2008 లో ఫైనల్స్ కి చేర్చినా రన్నరప్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. జట్టులో అనుభవజ్ఞులైన బ్యాట్స్ మన్లు, బౌలర్లు ఉండడంతో జట్టు మరపురాని విజయాలు సాధించింది. 15 సీజన్లలో రెండు సంవత్సరాలు (2016, 2017) స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో నిషేధానికి గురయింది. అయినా మొక్కవోని ధైర్యంతో మరుసటి ఏడాది 2018 లో ఐపీఎల్ లో అడుగుపెట్టి ట్రోఫీని కైవసం చేసుకుంది.

 

ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి సీఎస్కే ప్రస్థానాన్ని గమనిస్తే... నాలుగుసార్లు విజేత... ఐదుసార్లు రన్నరప్... ఓసారి సెమీస్... మరోసారి ప్లే ఆఫ్స్ఇంకోసారి ఏడో స్థానం... మిగతా ఫ్రాంచైజీల మాదరిగా ప్రపంచ స్థాయి స్టార్ క్రికెటర్లు లేకపోయినా, జట్టులోని వెటరన్లు, యువ క్రీడాకారులతోనే జట్టును విజయవంతంగా నడిపించాడు. “డాడీస్ టీమ్” గా ముద్ర పడ్డ జట్టును అందరి అంచనాలు తలక్రిందులు చేస్తూ విజయాలు సాధించాడు.

 

2020 లో ఘోరమైన ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న జట్టును మరుసటి ఏడాది 2021 లో ఛాంపియన్ గా నిలబెట్టి అందరిచేత ఔరా అనిపించేలా చేసాడు. సీఎస్కే జట్టు 12 సీజన్లలో 9 సీజన్లు ఫైనల్స్ ఆడి రికార్డు సృష్టించింది. ఇప్పటివరకూ జట్టూ ఇలాంటి ఘనతను సాధించలేదు. అందుకే ఐపీఎల్ అగ్ర జట్లలో సీఎస్కే ఒకటిగా ఉంది.

 

·         ఫైనల్స్ విజేత : 2010, 2011, 2018, 2021

·         రన్నరప్ : 2008, 2012, 2013, 2015, 2019

·         సెమీఫైనల్స్ : 2009,2014

 

అటు బౌలింగ్... ఇటు బ్యాటింగ్...

ఐపీఎల్ లో సీఎస్కే అత్యధిక శాతం విజయాలు సాధించి అగ్రస్థానంలో ఉంది. మొత్తం ఆడిన అన్ని సీజన్లలో 209 మ్యాచ్‌లు ఆడి 121 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. విజయ శాతం 58.41% బౌలింగ్ లో కూడా ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తూ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా జట్టుకు చెందిన బ్రావో నిలిచాడు. బ్రావో 158 ఇన్నింగ్స్ లో 183 వికెట్లు తీసి అగ్రస్థానంలో నిలిచాడు. 4 చొప్పున వికెట్లను రెండుసార్లు సాధించాడు. ఐపీఎల్ లో 4/22 బ్రావో యొక్క ఉత్తమ బౌలింగ్ గణాంకాలు

 

బ్యాటింగ్ లో సైతం టాప్-10 బ్యాట్స్ మెన్లలో సీఎస్కే జట్టు నుంచి ఇద్దరు ఉన్నారు. వీరిలో సురేష్ రైనా 200 మ్యాచుల్లో 5528 పరుగులు, ఎమ్మెస్ ధోనీ 206 మ్యాచుల్లో 4978 పరుగులు చేసారు. ఐపీఎల్ లో అందించే ఉత్తమ ఫెయిర్ ప్లే అవార్డును సీఎస్కే జట్టు 6 సార్లు గెలుచుకుని రికార్డు సృష్టించింది. ఒక ఫ్రాంచైజీ తరపున ఎటువంటి గ్యాప్ లేకుండా 100 మ్యాచ్‌లకు కెప్టెన్ గా చేసిన ఘనతను ధోనీ సాధించాడు. ఐపీఎల్ 2013 సంవత్సరం సీజన్లో అత్యధిక వికెట్లు (32) తీసిన బౌలర్ గా బ్రావో రికార్డు సృష్టించాడు.

 

సీఎస్కే బౌలర్ల గణాంకాలు

 బ్రావో

ఆడిన మ్యాచ్‌లు : 158

వికెట్లు : 183

ఉత్తమ బౌలింగ్ : 4/22

 

రవీంద్ర జడేజా

ఆడిన మ్యాచ్‌లు : 181

వికెట్లు : 132

ఉత్తమ బౌలింగ్ : 5/16

 

ఐపీఎల్ చరిత్రలో మొట్టమొదటి హ్యాట్రిక్ కూడా సీఎస్కే జట్టుకే చెందింది. తొలి సీజన్ 2008 లో జట్టు బౌలర్ లక్ష్మీపతి బాలాజీ హ్యాట్రిక్ ను పంజాబ్ కింగ్స్ జట్టుపై సాధించాడు. 20 ఓవర్లో బ్యాటింగ్ చేస్తూ అత్యధిక పరుగులు రాబట్టిన బ్యాట్స్మెన్ గా ఎమ్మెస్ ధోనీ ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. మొత్తం 655 పరుగులు చేసాడు. ఇందులో 48 ఫోర్లు, 51 సిక్సులు ఉన్నాయి. అందుకే ధోనీని 'మ్యాచ్ ఫినిషర్' అని అంటారు. ఓవర్లో ధోనీ స్ట్రయిక్ రేట్ 243.96

 

పవర్ ప్లే ఓవర్లలో అత్యధికంగా 100 పరుగులు చేసిన రికార్డు సీఎస్కే పేరునే ఉంది. 2008 నుంచి 2018 వరకు ఒక్క మ్యాచ్ కూడా మధ్యలో మానివేయకుండా 134 మ్యాచ్ లు ఆడిన ఘనతను సురేష్ రైనా దక్కించుకున్నాడు.

 

ఐపీఎల్ చరిత్రలో సీఎస్కే ప్రస్థానం (2008 - 2022)

 

2008

ఆడిన మ్యాచ్‌లు : 14

విజయాలు : 8

ఓటములు : 6

ఫలితం : రన్నరప్

 

2009

ఆడిన మ్యాచ్‌లు : 14

విజయాలు : 8

ఓటములు : 5

 

2010 

ఆడిన మ్యాచ్‌లు : 14

విజయాలు : 7

ఓటములు : 7

ఫలితం : టోర్నీ విజేత

 

2011 

ఆడిన మ్యాచ్‌లు : 14

విజయాలు : 9

ఓటములు : 5

ఫలితం : టోర్నీ విజేత

 

2012 

ఆడిన మ్యాచ్‌లు : 16

విజయాలు : 8

ఓటములు : 7

డ్రా : 1

 

2013 

ఆడిన మ్యాచ్‌లు : 16

విజయాలు : 11

ఓటములు : 5

ఫలితం : రన్నరప్

 

2014 

ఆడిన మ్యాచ్‌లు : 14

విజయాలు : 9

ఓటములు : 5

 

2015 

ఆడిన మ్యాచ్‌లు : 14

విజయాలు : 9

ఓటములు : 5

ఫలితం : రన్నరప్

 

2016, 2017 లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో నిషేధానికి గురయింది. దీంతో జట్టు రెండేళ్లు లీగ్ లో పాల్గొనలేదు.

 

2018 

ఆడిన మ్యాచ్‌లు : 14

విజయాలు : 9

ఓటములు : 5

ఫలితం : రన్నరప్

 

2019 

ఆడిన మ్యాచ్‌లు : 14

విజయాలు : 9

ఓటములు : 5

ఫలితం : రన్నరప్

 

2020 

ఆడిన మ్యాచ్‌లు : 14

విజయాలు : 6

ఓటములు : 8

 

2021 

ఆడిన మ్యాచ్‌లు : 10

విజయాలు : 8

ఓటములు : 2

ఫలితం : టోర్నీ విజేత

 

2022 

ఆడిన మ్యాచ్‌లు : 14

విజయాలు : 4

ఓటములు : 10

 

ఐపీఎల్ 16 సీజన్ 2023 కి సంబంధించి ఆటగాళ్ల ఆక్షన్ ప్రక్రియ కూడా పూర్తయింది. జట్టులో అత్యధిక పారితోషకం అందుకుంటున్న టాప్-4 ఆటగాళ్ల వివరాలను పరిశీలిద్దాం.

 

బెన్ స్టోక్స్ - 16.25 కోట్లు

రవీంద్ర జడేజా - 16 కోట్లు

దీపక్ చాహర్ - 14 కోట్లు

ఎమ్మెస్ ధోనీ - 12 కోట్లు

 

చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) గురించి క్లుప్తంగా...

 

ఐపీఎల్ లో సంచలనాలకు మారుపేరుగా 'మిస్టర్ కూల్'ధోన్ కెప్టెన్సీలో అద్భుత విజయాలు సాధిస్తున్న జట్టుగా సీఎస్కే ఫ్రాంచైజీ ఎంతో ఘనత వహించింది. చాలా మందికి సీఎస్కే జట్టు గురించి తెలియని కొన్ని విషయాలను గురించి తెలుసుకుందాం.

 

·         ఫ్రాంచైజీకి ఒకప్పుడు ఐసీసీ చైర్మన్ గా చేసిన ఎన్. శ్రీనివాసన్ యజమాని

·         2022 లో భారతదేశంలో మొట్టమొదటి 'యునికార్న్ స్పోర్ట్స్ ఎంటర్ప్రైజ్' గా నిలిచింది

·         2019 లో రూ.732 కోట్ల విలువైన జట్టుగా ఘనత వహించింది

·         2010 లో జరిగిన ఐపీఎల్ తో పాటు ఛాంపియన్స్ లీగ్ టైటిల్ కూడా సొంతం

·         2014 లో రెండోసారి ఛాంపియన్స్ లీగ్ టైటిల్ విజేత

 

ఏడాది మార్చిలో ప్రారంభం కానున్న 16 సీజన్ ఐపీఎల్ లో పాల్గొనే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు టాప్-11 ఆటగాళ్ల వివరాలు...

 

రుతురాజ్ గైక్యాయిడ్, డెవాన్ కాన్వే, అంబటి రాయుడు, బెన్ స్టోక్స్, ఎమ్మెస్ ధోని, మొయిన్ అలీ, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ముకేశ్ చౌదరి, దీపక్ చాహర్, మహీష్ తీక్షణ.

 

ఐపీఎల్ 2023 మినీ వేలంలో రూ.20.45 కోట్ల పర్స్ మనీతో పాల్గొని రూ.16.25 కోట్లు ఖర్చు పెట్టి కొన్న బెన్ స్టోక్స్, మ్యాచ్ ఫినిషర్ ధోనీ, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా మొయిన్ అలీ వీరు గనుక తమ ప్రతిభతో రాణిస్తే ఈసారి ఐపీఎల్ కప్పును తమ జట్టే ఎగరేసుకుపోతుందని సీఎస్కే అభిమానులు సంబరపడిపోతున్నారు. స్టోక్స్ ను సీఎస్కే భవిష్యత్ కెప్టెన్ గా చేసేందుకే అంత ధర పెట్టి కొన్నట్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ "మిస్టర్ కూల్" ధోనీ ఆధ్వర్యం లోని సీఎస్కే జట్టు ఈసారి కూల్ గా తమ పని తాము చేసుకుపోయి టైటిల్ అందుకుని రికార్డు సృష్టించాలని భావిస్తోంది. అందుకు ఇప్పటి నుంచే సన్నాహాలు మొదలుపెట్టింది.