క్రికెట్ మ్యాచ్లో ఫోర్లు, సిక్సర్లు ఎలా లెక్కిస్తారు : How to calculate the 4s & 6s in Cricket
బౌండరీ... క్రికెట్ ను వీక్షించే ప్రతి ఒక్కరికీ తెలిసిన పదం. బ్యాటింగ్ చేసే వారికి బంగారు పదం. ఎందుకంటే బౌండరీని దాటితే 4 లేదా 6 పరుగులు వస్తాయి... అందుకే బౌండరీ కొట్టాలని మ్యాచ్ సమయంలో కేరింతలు కొడుతుంటారు.
క్రికెట్ మ్యాచ్లో ఫోర్లు, సిక్సర్లు ఎలా లెక్కిస్తారు : How to calculate the 4s & 6s in Cricket
బౌండరీ... క్రికెట్ ను వీక్షించే ప్రతి ఒక్కరికీ తెలిసిన పదం. బ్యాటింగ్ చేసే వారికి బంగారు పదం. ఎందుకంటే బౌండరీని దాటితే 4 లేదా 6 పరుగులు వస్తాయి... అందుకే బౌండరీ కొట్టాలని మ్యాచ్ సమయంలో కేరింతలు కొడుతుంటారు.
బౌండరీ దాటితే సిక్సర్... బౌండరీని తాకితే ఫోర్...
నిజ జీవితంలో ఎవరితోనైనా గొడవ పడేటప్పుడు కొట్టానంటే సిక్సర్ లా ఎగిరి పడతావు అని కోపంతో అంటూ ఉంటాము. అదేవిధంగా క్రికెట్లో అయితే బ్యాట్స్మెన్ లాగి పెట్టి కొడితే అది సిక్సర్ అయినా అవ్వాలి లేదా ఫోర్ అయినా అవ్వాలి. సాధారణంగా బ్యాటింగ్ చేసేటప్పుడు బ్యాట్స్మెన్ తాను ఎదుర్కునే బంతికి ఒక పరుగు లేదా 2, 3 పరుగులు చేయాలంటే పిచ్ పై పరిగెత్తాలి. వ్యక్తిగత, టీమ్ స్కోర్ పెరగాలంటే కొంచెం టెక్నిక్ ఉపయోగించి బౌండరీని దాటించాలని ప్రయత్నిస్తారు. ఈ బౌండరీకి సంబంధించిన విషయాలు పరిశీలిస్తే...
బౌండరీ అంటే మైదానం చుట్టుకొలత. దీని కోసం ఒక తాడును ఉపయోగిస్తుంటారు. కొన్నిసార్లు స్పాన్సర్స్ కి సంబంధించిన లోగోలు ఉండే ప్యాడెడ్ కుషన్లను వాడుతుంటారు. గతంలో తాడును ఎక్కువగా ఉపయోగించేవారు. అయితే 2000 వ దశకం నుంచి లోగోలు ఉండే ప్యాడెడ్ కుషన్లను వాడుతున్నారు.
పురుషుల అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లలో మైదానం మధ్య నుంచి బౌండరీ దూరం 59 మీటర్లు (195 అడుగులు) ఉంటుంది. అదే మహిళల క్రికెట్లో అయితే ఈ దూరం 55 మీటర్లు (180 అడుగులు) ఉండేలా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నిబంధనలు విధించింది. దీని ప్రకారమే అన్ని అంతర్జాతీయ మ్యాచ్లు జరుగుతాయి.
ఫోర్
బ్యాట్స్మెన్ కొట్టిన బంతి మైదానంపై దొర్లుకుంటూ వెళ్లి బౌండరీకి తగిలితే ఫోర్ అంటారు. బంతి బౌండరీకి తగలకుండా, ఫీల్డర్ చేతిలో ఉండి... ఆ ఫీల్డర్ బౌండరీ లైన్ కి తగిలి ఉంటే దానిని కూడా ఫోర్ గానే పరిగణిస్తారు.
సిక్సర్
బ్యాట్స్మెన్ కొట్టిన బంతి నేలపై పడకుండా అలానే గాల్లో నుంచి బౌండరీ లైన్ అవతల పడితే దానిని సిక్సర్ కింద పరిగణిస్తారు. ఒకవేళ బౌండరీ వద్ద లోపల ఫీల్డర్ క్యాచ్ పట్టి బాల్ తో సహా బౌండరీ లైన్ ని దాటితే దానిని కూడా సిక్సర్ గానే పరిగణిస్తారు.
రాడార్ గన్...
రాడార్ గన్ అనేది బాల్ యొక్క వేగాన్ని లెక్కించేందుకు ఉపయోగించే సాంకేతిక పరిజ్ఞానం. ఈ రాడార్ గన్ రేడియో ట్రాన్స్మిటర్, రిసీవర్ రెండింటినీ కలిగి ఉంటుంది. "డాప్లర్ ప్రభావం" సూత్రంపై ఈ పరికరం పనిచేస్తుంది. ఈ రాడార్ గన్ రిసీవర్కు రేడియో తరంగాలను పంపినప్పుడు అవి రేడియో సిగ్నల్స్ ను విడుదల చేస్తాయి. లక్ష్య కణం నుండి బౌన్స్ అయిన తర్వాత అదే సిగ్నల్ను అందుకుంటాయి.
హాక్ ఐ పద్ధతి...
హాక్ ఐ పద్ధతిలో బంతి బౌలర్ చేతి నుండి విడుదలైనప్పటి నుండి అది క్రింద పడేవరకు బంతి యొక్క మార్గాన్ని ట్రాక్ చేస్తుంది. గ్రౌండ్ చుట్టూ ప్రత్యేకంగా ఉంచబడిన ఆరు కెమెరాలను ఈ ట్రాకింగ్ కోసం ఉపయోగిస్తుంది. ఈ 6 కెమెరాల మిశ్రమ ప్రభావంతో 3-D ఇమేజ్ ఏర్పడుతుంది. దీంతో పాటు బౌల్ చేయబడిన బంతి వేగాన్ని కొలవడానికి ఉపయోగించబడుతుంది.
వన్డేలు... టెస్టులు... టీ20 లు...
క్రికెట్లో వన్డేలు, టెస్టులు, టీ20 లు ఇలా ప్రతి ఫార్మాట్లో వినబడేవి ఫోర్లు, సిక్సర్లు. ఎందుకంటే ఆటలో వేగాన్ని పెంచేవి, స్కోర్ బోర్డు ని పరుగులు పెట్టించేవి ఇవే కాబట్టి. అందరికీ కనువిందును చేసే ఈ ఫోర్లు, సిక్సర్లను దిగ్గజ బ్యాట్స్మెన్లు ఎంతో మంది రికార్డు స్థాయిలో కొట్టారు... కొడుతూనే ఉన్నారు. వన్డేల్లో భారత్ నుంచి ఇద్దరు, శ్రీలంక నుంచి ఇద్దరు, ఆస్ట్రేలియా నుంచి ఒకరు టాప్-5 లో ఉన్నారు.
వన్డే మ్యాచ్లు
సచిన్ టెండూల్కర్ (1989-2012)
ఆడిన ఇన్నింగ్స్ : 452
చేసిన పరుగులు : 18426
ఫోర్లు : 2016
సిక్సర్లు : 195
సనత్ జయసూర్య (1989-201)
ఆడిన ఇన్నింగ్స్ : 433
చేసిన పరుగులు : 13430
ఫోర్లు : 1500
సిక్సర్లు : 270
కుమార సంగక్కర (2000-2015)
ఆడిన ఇన్నింగ్స్ : 380
చేసిన పరుగులు : 14234
ఫోర్లు : 1385
సిక్సర్లు : 88
రికీ పాంటింగ్ (1995-2012)
ఆడిన ఇన్నింగ్స్ : 365
చేసిన పరుగులు : 13704
ఫోర్లు : 1231
సిక్సర్లు : 162
విరాట్ కోహ్లీ (2008-2022)
ఆడిన ఇన్నింగ్స్ : 256
చేసిన పరుగులు : 12471
ఫోర్లు : 1172
సిక్సర్లు :127
ఐదు రోజులపాటు జరిగే టెస్ట్ మ్యాచ్ల్లో కూడా ఇద్దరు భారతీయ బ్యాట్స్మెన్లు ఉండడం విశేషం. వీరితో పాటు వెస్టిండీస్, ఆస్ట్రేలియా, శ్రీలంకకు చెందిన ఒక్కొక్క బ్యాట్స్మెన్ ఉన్నారు.
సచిన్ టెండూల్కర్ (1989-2012)
ఆడిన ఇన్నింగ్స్ : 329
చేసిన పరుగులు : 15921
ఫోర్లు : 2058
సిక్సర్లు : 69
రాహుల్ ద్రావిడ్ (1996-2012)
ఆడిన ఇన్నింగ్స్ : 286
చేసిన పరుగులు : 13288
ఫోర్లు : 1654
సిక్సర్లు : 21
బ్రియాన్ లారా (1990-2006)
ఆడిన ఇన్నింగ్స్ : 232
చేసిన పరుగులు : 11953
ఫోర్లు : 1559
సిక్సర్లు : 88
రికీ పాంటింగ్ (1995-2012)
ఆడిన ఇన్నింగ్స్ : 287
చేసిన పరుగులు : 13378
ఫోర్లు : 1509
సిక్సర్లు : 73
కుమార సంగక్కర (2000-2015)
ఆడిన ఇన్నింగ్స్ : 233
చేసిన పరుగులు : 12400
ఫోర్లు : 1491
సిక్సర్లు : 51
పొట్టి క్రికెట్ గా పిలవబడే టీ20 మ్యాచ్ల్లో సైతం ఫోరులు, సిక్సర్ల వర్షం కురుస్తుంటుంది. ధనాధన్ క్రికెట్ గా పిలవబడే ఇందులోని రికార్డులను చూద్దాం. అగ్ర స్థానంలో ఐర్లాండ్ కి చెందిన పీఆర్ స్టిర్లింగ్, తరువాతి స్థానాల్లో భారత్ కి చెందిన విరాట్ కోహ్లీ, బాబర్ ఆజమ్ (పాకిస్తాన్), రోహిత్ శర్మ (భారత్), ఆరోన్ ఫించ్ (ఆస్ట్రేలియా) ఉన్నారు.
పీఆర్ స్టిర్లింగ్
ఆడిన ఇన్నింగ్స్ : 120
చేసిన పరుగులు : 3181
ఫోర్లు : 360
సిక్సర్లు : 117
విరాట్ కోహ్లీ
ఆడిన ఇన్నింగ్స్ : 107
చేసిన పరుగులు : 4008
ఫోర్లు : 356
సిక్సర్లు : 117
బాబర్ ఆజమ్
ఆడిన ఇన్నింగ్స్ : 94
చేసిన పరుగులు : 3355
ఫోర్లు : 355
సిక్సర్లు : 50
రోహిత్ శర్మ
ఆడిన ఇన్నింగ్స్ : 140
చేసిన పరుగులు : 3853
ఫోర్లు : 348
సిక్సర్లు : 182
ఆరోన్ ఫించ్
ఆడిన ఇన్నింగ్స్ : 103
చేసిన పరుగులు : 3120
ఫోర్లు : 309
సిక్సర్లు : 125
ఒక ఓవర్లో ఆరు బంతులకు ఆరు సిక్సర్లు కొట్టిన వారిలో దక్షిణాఫ్రికాకు చెందిన హెర్షెల్ గిబ్స్ (వన్డే), భారత్ కి చెందిన యువరాజ్ సింగ్ (టీ20), వెస్టిండీస్ కి చెందిన కీరన్ పోలార్డ్ (టీ20) ఉన్నారు.
ఈ ఏడాది జరగనున్న ఐపీఎల్, ఆసియా కప్, ప్రపంచ కప్ పోటీల్లో ఈ రికార్డులు బద్దలవుతాయా లేదా అన్నది చూడాలి.