ప్లేఆఫ్‌కు చేరువలో చెన్నై : Chennai is close to the playoffs
పిల్లికి చెలగాటం... ఎలుకకు ప్రాణసంకటం అన్నట్లుగా... నేడు ఐపీఎల్ (IPL) లో మ్యాచ్ జరగనుంది. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న ఒక జట్టు... అట్టడుగు స్థానంలో ఉన్న మరో జట్టు...
ప్లేఆఫ్‌కు చేరువలో చెన్నై : Chennai is close to the playoffs
పిల్లికి చెలగాటం... ఎలుకకు ప్రాణసంకటం అన్నట్లుగా... నేడు ఐపీఎల్ (IPL) లో మ్యాచ్ జరగనుంది. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న ఒక జట్టు... అట్టడుగు స్థానంలో ఉన్న మరో జట్టు...
ఐపీఎల్ 16 వ సీజన్లో జరుగుతున్న మ్యాచ్ లు రోజురోజుకూ ఉత్కంఠగా సాగుతున్నాయి. ఒక జట్టు గెలుపు ఓటములు (win and loses) ఇతర జట్ల మీద ప్రభావం చూపిస్తున్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 16 వ సీజన్లో నేడు చెన్నై సూపర్ కింగ్స్ (CSK), ఢిల్లీ క్యాపిటల్స్ (DC) జట్ల మధ్య కీలకమైన మ్యాచ్ జరగనుంది. ఇప్పటివరకూ 11 మ్యాచ్‌లు ఆడిన సీఎస్‌కే టీమ్ 6 విజయాలు, 4 ఓటములతో 13 పాయింట్లతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో (2nd place in points table) ఉంది. ఢిల్లీ టీమ్ 10 మ్యాచ్‌ల్లో 4 గెలిచి, 6 మ్యాచ్‌ల్లో ఓడి 8 పాయింట్లతో చివరి స్థానంలో ఉంది. నేడు చెపాక్ స్టేడియం(Chepauk stadium) వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ లో చెన్నై జట్టుకు ధోని నాయకత్వం (Captain Dhoni) వహిస్తుండగా, ఢిల్లీ జట్టుకు డేవిడ్ వార్నర్ (Captain Warner) నాయకత్వం వహిస్తున్నాడు. ఒకవేళ ఈ మ్యాచ్ లో చెన్నై టీమ్ గెలిస్తే దాదాపు ప్లేఆఫ్ దశకు చేరినట్లే.
చెన్నై టీమ్ అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ విభాగాల్లో పటిష్టంగా ఉంది. జట్టులో ప్రధానంగా రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్య రహానే అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. దూబే సైతం ప్రతి మ్యాచ్‌లో కీలక సమయాల్లో విశేషంగా రాణిస్తున్నాడు. అయితే ఇప్పటి వరకూ అంబటి రాయుడు, మొయిన్ అలీ రాణించలేకపోవడం జట్టుకు ఆందోళన కలిసాగిస్తోంది. యువకులు రాణిస్తున్న, సీనియర్లు రాణించక పోవడం జట్టుకు పెద్ద లోటు అని చెప్పవచ్చు. ఫినిషింగ్ బాధ్యతలను ధోని సమర్ధవంతంగా నిర్వహిస్తున్నాడు. జడేజా టచ్ లోకి రావడం జట్టుకి ఎంతో మేలు చేస్తోంది. మతీషా పతిరణ, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ అద్భుతమైన బౌలింగ్ తో ఆకట్టుకుంటున్నారు.
బెంగళూర్ జట్టుతో జరిగిన గత మ్యాచ్‌లో ఢిల్లీ అద్భుతమైన విజయం సాధించింది. ప్లేఆఫ్ కి చేరాలంటే మిగతా మ్యాచ్‌ల్లో తప్పనిసరిగా గెలవాల్సి ఉంది. అయితే జట్టులోని ఆటగాళ్లు ఎవరు ఎప్పుడు ఎలా ఆడతారో అన్నట్లుగా ఉంది ఢిల్లీ జట్టు పరిస్థితి. పృథ్వీ షా స్థానంలో వచ్చిన ఫిలిప్ సాల్ట్ మ్యాచ్‌లో అద్భుతమైన బ్యాటింగ్ చేసాడు. మిచెల్ మార్ష్, రిలీ రోసోవ్ కూడా రాణిస్తున్నారు. వార్నర్ కూడా తన అనుభవాన్ని ఉపయోగిస్తున్నారు. ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ రాణిస్తున్నప్పటికీ మిగతా బౌలర్లు ఇషాంత్ శర్మ, ముఖేష్ కుమార్, ఎన్రిచ్ నార్ట్జే, కుల్దీప్ యాదవ్ తగిన సహకారం అందిస్తే విజయం సాధించే అవకాశాలు ఉంటాయి. అయితే నేటి మ్యాచ్ చెన్నై హోమ్ గ్రౌండ్ లో జరుగుతుండడం, అక్కడ వారి అభిమానుల పూర్తి మద్దతు వారికి ఉండడం, చెన్నై మంచి ఫామ్ లో ఉండడం ఢిల్లీ జట్టు విజయావకాశాలు ప్రతిబంధకమేనని చెప్పవచ్చు. టీమ్ మొత్తం అద్భుతంగా రాణిస్తే తప్ప చెన్నై టీమ్ ని నిలువరించలేరు.
చెన్నై vs ఢిల్లీ హెడ్ టు హెడ్ : CSK vs DC head to head
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 16 సీజన్లలో ఇప్పటివరకూ తలపడిన మ్యాచుల్లో ఢిల్లీ జట్టుపై చెన్నై జట్టుదే పైచేయి. చెన్నై సూపర్ కింగ్స్ (CSK), ఢిల్లీ క్యాపిటల్స్ (DC) 27 మ్యాచుల్లో తలపడ్డాయి. ఇందులో చెన్నై 17 సార్లు, ఢిల్లీ 10 సార్లు గెలుపొందాయి.
అత్యధిక స్కోర్లు (Highest scores) : చెన్నై సూపర్ కింగ్స్ 222 పరుగులు, ఢిల్లీ క్యాపిటల్స్ 198 పరుగులు
అత్యల్ప స్కోర్లు : చెన్నై సూపర్ కింగ్స్ 110 పరుగులు, ఢిల్లీ క్యాపిటల్స్ 83 పరుగులు
చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయింగ్ XI : CSK playing XI
రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, మొయిన్ అలీ, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, MS ధోని (కెప్టెన్, వికెట్ కీపర్), దీపక్ చాహర్, మతీషా పతిరణ, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ
చెన్నై సూపర్ కింగ్స్ ఫుల్ స్క్వాడ్ : CSK full squad
రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, మొయిన్ అలీ, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (కెప్టెన్, వికెట్ కీపర్), దీపక్ చాహర్, మతీషా పతిరణ, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ, అంబటి రాయుడు, మిచెల్ సాంట్నర్, సుభ్రాంశు సేనాపతి, షేక్ రషీద్, ఆకాష్ సింగ్, బెన్ స్టోక్స్, డ్వైన్ ప్రిటోరియస్, సిసంద మగల, అజయ్ జాదవ్ మండల్, ప్రశాంత్ సోలంకి, సిమర్‌జీత్ సింగ్, ఆర్‌ఎస్ హంగర్గేకర్, భగత్ వర్మ, నిశాంత్ సింధు
ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ XI : DC playing XI
డేవిడ్ వార్నర్ (కెప్టెన్), ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్), మిచెల్ మార్ష్, రిలీ రోసోవ్, మనీష్ పాండే, అమన్ హకీమ్ ఖాన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్
ఢిల్లీ క్యాపిటల్స్ ఫుల్ స్క్వాడ్ : DC full squad
డేవిడ్ వార్నర్ (కెప్టెన్), ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్), మిచెల్ మార్ష్, రిలీ రోసోవ్, మనీష్ పాండే, అమన్ హకీమ్ ఖాన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్, చేతన్ సకారియా, లలిత్ యాదవ్, రిపాల్ పటేల్, ప్రవీణ్ దూబే, అభిషేక్ పోరెల్, సర్ఫరాజ్ ఖాన్, లుంగీ ఎంగిడి, ముస్తాఫిజుర్ రెహమాన్, అన్రిచ్ నార్ట్జే, రోవ్‌మన్ పావెల్, ప్రియమ్ గార్గ్, పృథ్వీ షా, యష్ ధుల్, విక్కీ ఓస్త్వాల్
వేదిక (Stadium) - ఎంఏ చిదంబరం స్టేడియం, చెన్నై (MA Chidambaram stadium, Chennai)
తేదీ, సమయం: మంగళవారం, మే 10, 7:30 PM
టెలికాస్ట్, స్ట్రీమింగ్ (Telecast, Streaming) : స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్, జియో సినిమా (Star Sports, Jio Cinema)
ఐపీఎల్ 2023 పాయింట్ల పట్టిక : IPL 2023 Points Table
జట్లు |
ఆడినవి |
గెలిచినవి |
ఓడినవి |
పాయింట్లు |
నెట్ రన్ రేట్ |
11 |
8 |
3 |
16 |
+0.951 |
|
11 |
6 |
4 |
13 |
+0.409 |
|
11 |
6 |
5 |
12 |
-0.255 |
|
11 |
5 |
5 |
11 |
+0.294 |
|
11 |
5 |
6 |
10 |
+0.388 |
|
11 |
5 |
6 |
10 |
-0.079 |
|
11 |
5 |
6 |
10 |
-0.345 |
|
11 |
5 |
6 |
10 |
-0.441 |
|
10 |
4 |
6 |
8 |
-0.472 |
|
ఢిల్లీ క్యాపిటల్స్ |
10 |
4 |
6 |
8 |
-0.529 |