‘రైటర్ పద్మభూషణ్’.. మూవీ రివ్యూ : 'Writer Padmabhushan' movie review

మ‌నింట్లోనే ఉండే అమ్మ‌ అక్క, చెల్లెలు (family) అందరూ ఇంటి ప‌నులు చేస్తూ ఎప్పుడూ బిజీబిజీగా క‌న‌ప‌డుతుంటారు. పిల్లలని చ‌దువుకోనిస్తాం కానీ.. ఒక స్టేజ్ దాటినా త‌ర్వాత వారు ఏమి కావాల‌నుకుంటున్నారో అనేది మ‌నం ప‌ట్టించుకోం.

‘రైటర్ పద్మభూషణ్’.. మూవీ రివ్యూ : 'Writer Padmabhushan' movie review

‘రైటర్ పద్మభూషణ్’.. మూవీ రివ్యూ : 'Writer Padmabhushan' movie review 

చిన్న పాత్ర‌ల‌తో సినిమాల్లో కెరీర్ స్టార్ట్ చేసిన సుహాస్ (Hero Suhas) ఇప్పుడు కీల‌క పాత్ర‌ల‌తో క‌థానాయ‌కుడిగానూ నటిస్తూ రాణిస్తున్నాడు. గతంలో న‌టించిన క‌ల‌ర్ ఫొటో త‌న‌కు మంచి గుర్తింపును తెచ్చి పెట్టింది. అదే ప్రయత్నంలో సుహాస్ చేసిన మ‌రో ప్ర‌య‌త్న‌మే ‘రైటర్ పద్మభూషణ్’. ఈ సినిమా టీజర్, ట్రైలర్ (trailer) చూస్తే ఓ యువ‌కుడు రైట‌ర్‌గా గుర్తింపు పొంద‌టానికి చేసిన ప్ర‌య‌త్న‌మ‌ని తెలుస్తోంది. సుహాస్ హీరోగా (hero) గతంలో నటించిన కలర్ ఫొటో సినిమా డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అయ్యింది. అయితే ‘రైట‌ర్ ప‌ద్మ‌భూష‌ణ్‌’ థియేట‌ర్స్‌లో రిలీజ్ అవుతోంది. సుహాస్‌కు ఈ సినిమా ఎలాంటి విజ‌యాన్ని అందించిందో తెలుసుకోవాలంటే ముందుగా క‌థ‌ని సమీక్షిద్దాం.

ప‌ద్మ‌భూష‌ణ్ (సుహాస్‌) అసిస్టెంట్ లైబ్రేరియ‌న్‌గా (librarian) విజ‌య‌వాడ‌లోని ప్రాంతీయ గ్రంథాల‌యంలో పని చేస్తుంటాడు. తల్లిదండ్రులకు (ఆశిష్ విద్యార్థి, రోహిణి) చెప్పకుండా ప‌ద్మ‌భూష‌ణ్‌ రైట‌ర్‌గా పేరు తెచ్చుకోవాల‌నుకుంటాడు. అందు కోసం 'తొలి అడుగు' అనే పుస్త‌కాన్ని రాస్తాడు. అంతేకాకుండా దీని కోసం నాలుగు ల‌క్ష‌ల రూపాయలు అప్పు చేసి మరీ పుస్తకాన్ని అచ్చు (printing) వేయిస్తాడు. అయితే ఆ పుస్త‌కాలు (books) ఎవరూ కొనకపోవడంతో అమ్ముడుపోకుండా ఉండిపోతాయి. త‌న‌కు రచయితగా (Writer) గుర్తింపు రావ‌టం లేద‌నే బాధ పెరిగిపోతుంటుంది. అలాంటి స‌మ‌యంలో మామ‌య్య పెద్ద కూతురి పెళ్లికి వెళ‌తాడు. అక్క‌డే అందరి సమక్షంలో త‌న చిన్న కూతురు సారిక (టీనా శిల్పా రాజ్‌) (Teena Silparaj) ను రైటర్ ప‌ద్మ‌భూష‌ణ్‌కిచ్చి పెళ్లి చేయాల‌నుకుంటున్న‌ట్లు తన మామ‌య్య చెబుతాడు.

దీంతో అందరికీ ప‌ద్మ‌భూష‌ణ్ ఒక రైట‌ర్ (Writer) అనే విష‌యం తెలిసిపోతుంది. అయితే ఇక్కడే అస‌లు ట్విస్ట్ వ‌స్తుంది. రైట‌ర్ ప‌ద్మ‌భూష‌ణ్ పేరుతో త‌న ఫొటోను ఉప‌యోగించి మ‌రో రైట‌ర్ రాసి అచ్చు వేయించిన పుస్త‌కానికి చాలా మంచి పేరు వ‌స్తుంది. తనకు నచ్చిన  మ‌ర‌ద‌లితో పెళ్లి అవుతుంద‌నే కార‌ణంతో ప‌ద్మ‌భూష‌ణ్ (Padmabhushan) కూడా తాను రాయ‌ని పుస్త‌కానికి త‌నే రైట‌ర్‌న‌ని చెబుతాడు. కానీ లోలోన ఎదో భ‌యం మాత్రం త‌న‌ని వెంటాడుతూనే ఉంటుంది. మ‌రో వైపు సారికతో ప‌ద్మ‌భూష‌ణ్‌ నిశ్చితార్థం (engagement) రోజునే తనకు కాబోయే అల్లుడు ప‌ద్మ‌భూష‌ణ్‌ రాసే కొత్త పుస్త‌కాన్ని అచ్చు వేయాల‌ని తన మామ‌య్య ఎదురు చూస్తుంటాడు. దీంతో ప‌ద్మ‌భూష‌ణ్‌లో ఈ విషయం ఇంకా ఆందోళన (fear) కలిగిస్తుంది. ఇక లాభం లేదని అస‌లు రైట‌ర్‌ని ప‌ట్టుకునే ప్ర‌య‌త్నాలు ప్రారంభిస్తాడు. అస‌లు ర‌చ‌యిత‌ని ప‌ద్మభూష‌ణ్ ప‌ట్టుకున్నాడా? లేదా? ప‌ద్మ‌భూష‌ణ్ పేరు మీద పుస్త‌కం రాసిన వేరొక రైటర్ ఎవ‌రు? ప‌ద్మ‌భూష‌ణ్ ఆ రైట‌ర్‌కి ఏం చేశాడు? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమాను చూడాల్సిందే.

స‌మీక్ష‌ : Review 

మ‌నింట్లోనే ఉండే అమ్మ‌ అక్క, చెల్లెలు (family) అందరూ ఇంటి ప‌నులు చేస్తూ ఎప్పుడూ బిజీబిజీగా క‌న‌ప‌డుతుంటారు. పిల్లలని చ‌దువుకోనిస్తాం కానీ.. ఒక స్టేజ్ దాటినా త‌ర్వాత వారు ఏమి కావాల‌నుకుంటున్నారో అనేది మ‌నం ప‌ట్టించుకోం. ఇంట్లో మ‌న‌కు అన్ని ప‌నులు జ‌రుగుతున్నాయా, అన్ని సౌకర్యాలు ఉన్నాయా, లేవా అనేదే చూస్తాం. కానీ ఇంట్లో వాళ్లకూ ఆశ‌లు, జీవితానికి సంబంధించిన ఆశయాలు ఉంటాయి అనే విష‌యాన్ని మ‌ర‌చిపోతాం. ఇదే పాయింట్ మీద తెర‌కెక్కిన చిత్ర‌మే ‘రైట‌ర్ ప‌ద్మ‌భూష‌ణ్‌’. సినిమాను రైట‌ర్‌ కోణంలో తీసుకెళ్లి.. దాన్ని దర్శ‌కుడు (Director) ష‌ణ్ముఖ ప్ర‌శాంత్‌ (Shanmukha Prasant) మ‌రో కోణంలో ఎలివేట్ చేశాడు. సినిమా మొదటి సగభాగం విష‌యానికి వ‌స్తే సుహాస్ రైట‌ర్ అవ్వాలి అనుకోవడం, నాలుగు లక్షల రూపాయలు అప్పు తెచ్చి మరీ పుస్తకం అచ్చు వేయిస్తే అది అమ్ముడు అవ్వకపోవడం, త‌న‌ని తాను రైట‌ర్‌గా నిరూపించుకోవ‌టానికి త‌న పుస్త‌కాన్ని అంద‌రూ చ‌ద‌వాల‌ని తాప‌త్ర‌య‌ప‌డ‌టం వంటి స‌న్నివేశాల‌తోనే దర్శకుడు ప్రథమార్థం మొత్తం నడిపించేసాడు. మధ్య మ‌ధ్య‌లో హీరోయిన్‌తో (heroine) ప్రేమ స‌న్నివేశాల‌ను కలుపుకుంటూ వ‌చ్చారు.

ప్రథమార్థం (first half) తరువాత అస‌లు పుస్త‌కం రాసిన రైట‌ర్‌ని ప‌ట్టుకుని మ‌రో పుస్త‌కం రాయించాల‌నే ప్ర‌య‌త్నం, ఆ ప్రయత్నం కోసం జరిగే స‌న్నివేశాలు ప్ర‌ధానంగా క‌నిపిస్తాయి. క్లైమాక్స్ కి ముందు హీరో (Hero) పద్మభూషణ్ త‌న‌లోని రచయితను బ‌య‌ట‌కు తీయాల‌నుకోవ‌టం, చివరిలో రైట‌ర్ ఎవ‌రో తెలుసుకున్న హీరో అందుకోసం తీసుకునే నిర్ణ‌యం, దాని చుట్టూ ఉండే ఎమోష‌న‌ల్ ఎలిమెంట్స్‌తో సినిమా పూర్తవుతుంది. క్లైమాక్స్ (climax) లో మహిళ‌ల‌కు మ‌ద్ద‌తుగా ఓ ఎమోష‌న‌ల్ పాయింట్‌ను దర్శకుడు ట‌చ్ చేసాడు. లోకం ఎంతో ముందుకు వెళుతోంది, మ‌న చుట్టూ ఉన్న మ‌హిళ‌లు అన్ని రంగాల్లోనూ విజయాలు సాధించేస్తున్నారు. అయితే మ‌నం మాత్రం మ‌న ఇంట్లో ఉన్న వారి గురించి ఏమాత్రం ఆలోచించం. మనం ఎప్పుడూ (we never think) కూడా వారికి ఏం కావాలి, వారు జీవితంలో ఏం సాధించాలి అనుకుంటున్నారు అనే విష‌యాన్ని అస్సలు ప‌ట్టించుకోం. కానీ మ‌గ‌వాళ్లు చేయాల్సిన పనుల్లో అది కూడా ఒక ప్రధానమైన భాగమని దర్శకుడు చెప్పే ప్ర‌య‌త్న‌మే ఈ ‘రైట‌ర్ ప‌ద్మ‌భూష‌ణ్‌’ సినిమాకి ప్రధానమైన పాయింట్.

సుహాస్ త‌న బాడీ లాంగ్వేజ్‌తో ఓ వైపు కామెడీ (comedy) చేస్తూనే ఎమోష‌న్స్‌ను కూడా పండించాడు. మ‌న ఇంటి ప‌క్కన ఉండే సగటు కుర్రవాడి క‌థలాగానే సినిమా ప్రారంభం అవుతుంది. దానికి సుహాస్ తగిన న్యాయం చేసాడనే చెప్పవచ్చు. హీరో తండ్రి పాత్రలో నటించిన ఆశిష్ విద్యార్థి (Ashish Vidyardhi) న‌ట‌న ఆక‌ట్టుకుంటుంది. మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ్య‌క్తి, అత‌ని ఆలోచ‌న‌లు, ప్ర‌వ‌ర్త‌న ఎలా ఉంటుంది అనే పాత్ర‌లో ఆయన ఒదిగిపోయాడు. గతంలో ఎప్పుడూ ఆయన్ని చూడ‌న‌టువంటి ఓ డిఫ‌రెంట్ (different) పాత్ర‌లో ఆయ‌న క‌నిపించ‌టం.. ఆయ‌న న‌ట‌న అద్భుతంగా ఉంది. హీరో త‌ల్లిగా ఎమోష‌న‌ల్ రోల్‌ను రోహిణి అద్భుతంగా పండించింది. సినిమా క్లైమాక్స్ అంతా ఆమె చుట్టూనే తిరుగుతుంది. హీరోయిన్ గా నటించిన టీనా శిల్పా రాజ్‌, కీల‌క పాత్ర‌లో న‌టించిన గౌరి ప్రియ, హీరో మామ‌య్య‌గా చేసిన గోప‌రాజు ర‌మ‌ణ ఇలా అంద‌రూ వారి వారి పాత్ర‌ల ప‌రిధి మేరకు చ‌క్క‌గా న‌టించారు. శేఖ‌ర్ చంద్ర‌, క‌ళ్యాణ్ నాయ‌క్ సంగీతం (music), వెంకట్ ఆర్‌.శాఖ‌మూరి సినిమాటోగ్ర‌ఫీ (cinematography) బావుంది.

సినిమా పేరు : రైటర్ పద్మభూషణ్ 

బ్యానర్ : చాయ్ బిస్కెట్ ఫిలిమ్స్, లహరి ఫిలిమ్స్

తారాగణం : సుహాస్, టీనా శిల్పరాజ్, రోహిణి, ఆశిష్ విద్యార్ధి, శ్రీ గౌరీప్రియ, గోపరాజు  రమణ

సంగీతం : శేఖర్ చంద్ర

సినిమాటోగ్రాఫర్ : వెంకట్ R శాఖమూరి

ఎడిటింగ్ : కోదాటి పవన్ కళ్యాణ్, సిద్ధార్థ్ తాతోలు

నిర్మాతలు : అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర , చంద్రు మనోహరన్

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : షణ్ముఖ ప్రశాంత్