సచిన్ ఆల్ టైమ్ బెస్ట్ క్రికెటర్ : Sachin All-time best cricketer

భారతదేశంలో క్రికెట్ దేవుడిగా పిలువబడే సచిన్ రమేష్ టెండూల్కర్. లిటిల్ మాస్టర్, చిచ్చర పిడుగు. ఇంగ్లాండ్ లో పుట్టిన క్రికెట్ ను భారత్ కి చెందిన ఆటగాడు సచిన్ శాసించి తన ఆటతీరుతో ఎవరికీ సాధ్యం కాని రికార్డులను సాధించాడు.

సచిన్ ఆల్ టైమ్ బెస్ట్ క్రికెటర్ : Sachin All-time best cricketer

సచిన్ ఆల్ టైమ్ బెస్ట్ క్రికెటర్ : Sachin All-time Best Cricketer

భారతదేశంలో క్రికెట్ దేవుడిగా పిలువబడే సచిన్ రమేష్ టెండూల్కర్. లిటిల్ మాస్టర్, చిచ్చర పిడుగు. ఇంగ్లాండ్ లో పుట్టిన క్రికెట్ ను భారత్ కి చెందిన ఆటగాడు సచిన్ శాసించి తన ఆటతీరుతో ఎవరికీ సాధ్యం కాని రికార్డులను సాధించాడు.

 

లిటిల్ మాస్టర్ భారీ సెంచరీలు : Big Centuries From Little Master

తన 15 ఏట (15 years age) 1988-89 లో సచిన్ టెండుల్కర్ (Sachin) మొదటి సారి క్రికెట్ ఆడి, రాష్ట్ర స్థాయి పోటీల్లో గుజరాత్ పై తన మొదటి మ్యాచ్ (first match) లోనే సచిన్ సెంచరీ కొట్టాడు. తరువాత రంజీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీ, ఇరానీ ట్రోఫీలలో కూడా వరుసగా సెంచరీలు (century) కొడుతూ అందరినీ అబ్బురపరిచాడు. 1990 నుంచి 2010 వరకు తన క్రికెట్ చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయానికి (Golden era) నాంది పలికాడు. కేవలం పదహారేళ్ళ వయసులో (in the age of 16) భారత జట్టులోకి వచ్చి తన సత్తా ఏంటో ప్రపంచదేశాలకు చూపించడమే కాదు, క్రికెట్లో భారతదేశాన్ని తల ఎత్తుకునేలా చేసినటువంటి వ్యక్తి సచిన్.

అప్పట్లో సచిన్ (Sachin) ఆడుతున్న మ్యాచ్ అంటే అతడి ఆట కోసం అభిమానులు (fans) పిచ్చెక్కి పోయేవారు. టీవీలకు అతుక్కుపోయేవారు. సచిన్... సచిన్ అంటూ స్టేడియంని సైతం హోరెత్తించేవారు. సచిన్ అరంగేట్రం (first match) మ్యాచ్ దాయాది దేశం పాకిస్థాన్ (Pakistan) తో ఆడడం జరిగింది. పదహారేళ్ళ (16 years) వయసులో పాక్ బౌలర్లు వేస్తున్న బౌన్సర్లకి (bouncers) తడబడి 15 పరుగులు మాత్రమే చేసిన సచిన్ తర్వాత అదే పాకిస్తాన్ బౌలర్లని ఒక ఆట ఆడుకున్నాడు. సచిన్ మైదానంలోకి వస్తున్నాడు అంటేనే బౌలర్స్ కి చెమటలు పట్టేవి

మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన సచిన్ : Sachin came from Middle Class

ముంబైలో 1973 లో బ్రాహ్మణ కుటుంబంలో సచిన్ జన్మించాడు. తల్లిదండ్రులు రజనీ, తండ్రి రమేష్. సచిన్ తల్లి ఇన్సూరెన్స్ కంపెనీ ఏజెంట్ (mother insurance agent) గా పనిచేస్తూ ఉండేవారు. తండ్రి నవలా రచయిత (Father Novel writer). సచిన్ తన చిన్నతనంలో బౌలింగ్ లో శిక్షణ తీసుకోవడానికి వెళ్లాడు. కానీ అక్కడి కోచ్ (coach) సచిన్ ని పూర్తిస్థాయిలో బ్యాటింగ్ పై శ్రద్ధ పెట్టమని సూచించాడు. బ్యాటింగ్ పై శ్రద్ధ పెట్టిన అనంతరం ఉన్నత శిఖరాలను అధిరోహించాడు.

16 ఏళ్లకే జాతీయ జట్టులోకి ఎంట్రీ : In the age of 16 Entry into National team

సచిన్ 1989 సంవత్సరంలో జాతీయ క్రికెట్లోకి (National cricket) అరంగేట్రం చేసాడు. సమయంలో టెండుల్కర్ వయస్సు కేవలం 16 సంవత్సరాలు మాత్రమే. తన గురువు రమాకాంత్ అచ్రేకర్ (Ramakant achrekar) సలహాపై సచిన్ శారదాశ్రమ్ (sharada ashram) విద్యామందిర్ ఉన్నత పాఠశాలలో చేరాడు. పేస్ బౌలింగ్ లో శిక్షణ కోసం MRF పేస్ అకాడమీకి హాజరైనా తిరిగి వెనక్కి పంపించేశారు. ఒకప్పటి ఫాస్ట్ బౌలర్ డెన్నిస్ లిల్లీ బ్యాటింగ్ పై దృష్టి పెట్టమని సూచించాడు. సలహాను పాటించడంతోనే ఈనాడు ఎవరికీ సాధ్యం కానీ బ్యాటింగ్ రికార్డులను సచిన్ సాధించేలా చేసాయి.

1988లో స్థానికంగా జరిగిన హరీష్ షీల్డ్ టోర్నీలో సహచరుడు వినోద్ కాంబ్లీ (Vinod kambli)తో కలిసి 644 పరుగుల భాగస్వామ్యంతో (partnership) ప్రపంచ రికార్డు (world record) సృష్టించాడు. ఇన్నింగ్స్ లో సచిన్ (Sachin) బౌలర్లపై విరుచుకుపడి పరుగుల వరద సాధించి 320 కి పైగా పరుగులు చేశాడు. మొత్తం టోర్నీలో సచిన్ వెయ్యికి పైగా పరుగులు సాధించాడు. హైదరాబాదులో 2006లో జరిగిన అండర్-13 మ్యాచ్ లో ఇద్దరు కుర్రాళ్ళు రికార్డును ఛేదించే వరకు 18 ఏళ్ళ పాటు సచిన్-కాంబ్లీ లదే రికార్డుగా కొనసాగింది.

అంతర్జాతీయ క్రికెట్లో ప్రవేశం : Enter into the International Cricket

సచిన్ తన కెరీర్ ను (career) పాకిస్థాన్ తో జరిగిన సిరీస్ తో ఆరంభించాడు. 1989లో తొలి టెస్ట్ మ్యాచ్ పాకిస్తాన్ పై ఆడి కేవలం 15 పరుగులకే వకార్ యూనిస్ (Waqar younis) బౌలింగ్ లో అవుటయ్యాడు. వకార్ కు కూడా ఇదే తొలి టెస్ట్ మ్యాచ్. తరువాత ఫైసలాబాద్ లో జరిగిన మ్యాచ్ లో తన తొలి అర్ధ శతకం (first half-century) సాధించాడు. తొలి వన్డే మ్యాచ్ లో కూడా పరుగులేమీ చేయకుండానే వకార్ యూనిస్ బౌలింగ్ లోనే డకౌట్ (duck out) అయ్యాడు. పాకిస్తాన్ పర్యటన తరువాత న్యూజిలాండ్ పర్యటనకు (Newzealand) వెళ్ళాడు. అక్కడ న్యూజిలాండ్ తో జరిగిన రెండవ టెస్టు మ్యాచ్ లో 88 పరుగులు చేసాడు. తన తొలి సెంచరీని (1st century) 1990 ఆగస్టులో ఇంగ్లాండ్ లోని ఓల్డ్ ట్రఫర్డ్ లో జరిగిన మ్యాచ్ లో సాధించాడు.

ఉన్నత శిఖరాలకు సచిన్ ప్రతిభ : Sachin's talent for high peaks

1994 మార్చి 27 న్యూజిలాండ్ తో జరిగిన రెండవ వన్డేలో సచిన్ కేవలం 49 బంతుల్లో 82 పరుగులు చేసాడు. సచిన్ తన తొలి సెంచరీ కోసం 79 మ్యాచ్ లు వేచి ఉండాల్సి వచ్చింది. 1994, సెప్టెంబర్ 27 ఆస్ట్రేలియాపై (Australia) తన తొలి వన్డే సెంచరీ సాధించాడు. 1996 లో జరిగిన ప్రపంచ కప్ (World cup) క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ మెన్గా (most runs) సచిన్ నిలిచాడు. ప్రపంచ కప్ లో రెండు సెంచరీలు నమోదు చేసాడు. 1998 లో భారత్ తో మ్యాచ్ లు ఆడేందుకు వచ్చిన ఆస్ట్రేలియాపై వరుసగా మూడు సెంచరీలు (3 centuries) చేసాడు. ఆస్ట్రేలియా బౌలర్లు షేన్వార్న్, రాబర్ట్ సన్ బౌలింగ్ ను ఉతికారేసాడు.

 

సచిన్ సాధించిన ప్రపంచ రికార్డులు : Sachin's world records

టెస్టుల్లో అత్యధిక పరుగులు (most runs in tests) - 15,921

వన్డేల్లో అత్యధిక పరుగులు (most runs in ODI’s) - 18,426

అత్యధిక టెస్టు మ్యాచ్ లు (highest played tests) - 200

అత్యధిక వన్డేలు (highest played ODI’s) - 463

వన్డే చరిత్రలో మొట్టమొదటి డబుల్ సెంచరీ (first double century in ODI history)

అంతర్జాతీయ క్రికెట్లో 100 సెంచరీలు (టెస్టుల్లో- 51, వన్డేల్లో- 49)

అత్యధిక వన్డే అర్ధ సెంచరీలు - 96

ప్రపంచ కప్ చరిత్రలో అత్యధిక పరుగులు - 2,278.

ఒక ప్రపంచ కప్లో ఎక్కువ పరుగులు - 2003 సంవత్సరంలో 673

అత్యధిక ప్రపంచ కప్ లు ఆడినవారిలో జావెద్ మియాందాద్ తో సమానంగా సచిన్

ఒక ప్రపంచ కప్ లో అత్యధిక సెంచరీలు - 6

టెస్టుల్లో అత్యధిక 90 పరుగులు (90's) - 10

వన్డేల్లో అత్యధిక 90 పరుగులు (90's) - 18

2001 మార్చి 31 ఇండోర్ లోని నెహ్రూ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో అంతర్జాతీయ వన్డే క్రికెట్లో 10 వేల పరుగుల మైలురాయిని చేరుకున్న తొలి బ్యాట్స్మన్గా రికార్డు.

టెస్టుల్లో అత్యధిక అర్ధ సెంచరీలు (50’s) - 68

50+ పరుగులు (50+) - 119

టెస్టుల్లో అత్యధిక ఫోర్లు (4’s) - 2,058 +

300 టెస్టుల్లో వేగంగా 15,000 పరుగులు

15,000 పరుగులు పూర్తి చేసిన తొలి, ఏకైక ఆటగాడు

వన్డేల్లో అత్యధిక సెంచరీల భాగస్వామ్యం (గంగూలీతో - 26 సార్లు)

వన్డేల్లో రెండో  అత్యధిక పరుగుల భాగస్వామ్యం - (331, రాహుల్ ద్రావిడ్తో కలిసి 1999లో న్యూజిలాండ్ పైన)

టెస్టుల్లో అత్యధిక సెంచరీల భాగస్వామ్యం - (ద్రావిడ్ తో కలిసి 20 సార్లు)

వన్డేల్లో అత్యదిక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్లు – 62 (Man of the matches)

వన్డేల్లో అత్యధిక మ్యాన్ ఆఫ్ ది సిరీస్లు - 15 (Man of the series)

 

అన్ని ఫార్మాట్లలో సచిన్ పరుగులు, వికెట్లు : Sachin's runs and Wickets in all formats

టెస్టులు, వన్డేలు ఇలా అన్ని ఫార్మాట్లలో (all formats) సచిన్ సాధించిన రికార్డులను (Sachin records) మరే ఒక్కరూ సాధించలేదంటే అతిశయోక్తి కాదు. అటు బ్యాట్ తో, ఇటు బంతితో తన మ్యాజిక్ (magic) చేసి అందరి చేత ఔరా అనిపించుకున్న క్రికెట్ మాంత్రికుడు సచిన్ ఒక్కడే. సచిన్ తన కెరీర్లో అన్ని ఫార్మాట్లలో (all formats) సాధించిన పరుగులు, తీసిన వికెట్లను ఒకసారి పరిశీలిద్దాం.

టెస్టు మ్యాచ్ లు (Test matches)

200 టెస్టుల్లో 329 ఇన్నింగ్స్ ఆడి 15921 పరుగులు చేసాడు. వీటిలో 51 సెంచరీలు, 68 అర్ధ సెంచరీలు చేసాడు. అత్యధిక స్కోరు 248 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. బ్యాటింగ్ సగటు 53.78 ఫీల్డింగ్ లో 115 క్యాచ్ లు పట్టాడు.

200 టెస్టుల్లో 145 ఇన్నింగ్స్ లో బౌలింగ్ వేసి 46 వికెట్లను తీశాడు. 3/10 సచిన్ ఉత్తమ బౌలింగ్ గణాంకాలు

వన్డే మ్యాచ్ లు (One day matches)

463 అంతర్జాతీయ వన్డేల్లో 452 ఇన్నింగ్స్ ఆడి 18426 పరుగులు చేసాడు. వీటిలో 49 సెంచరీలు, 96 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 200 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. సచిన్ బ్యాటింగ్ సగటు 44.83. అధికంగా 2016 ఫోర్లు, 195 సిక్సులు బాదాడు. ఫీల్డింగ్ లో 145 క్యాచ్ లు పట్టాడు.

463 అంతర్జాతీయ వన్డేల్లో 270 ఇన్నింగ్స్ లో బౌలింగ్ వేసి 154 వికెట్లను పడగొట్టాడు. 5/32. సచిన్ ఉత్తమ బౌలింగ్ గణాంకాలు. 4 వికెట్ల ఫీట్ ను 4 సార్లు, 5 వికెట్ల ఫీట్ ను రెండు సార్లు నమోదు చేసాడు.

అంతేకాకుండా సచిన్ ఒక అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడి 10 పరుగులు చేసాడు. బౌలింగ్ లో ఒక వికెట్ కూడా పడగొట్టాడు.

 

96 టీ20 ఇన్నింగ్స్ లో 2797 పరుగులు చేసాడు. ఇందులో ఒక సెంచరీ, 16 అర్ధ సెంచరీలు ఉన్నాయి. సచిన్ అత్యధిక స్కోరు 100 పరుగులు.

 

లిస్ట్ A మ్యాచుల్లో టన్నుల కొద్దీ పరుగులు చేసాడు. 551 మ్యాచుల్లో 538 ఇన్నింగ్స్ ఆడి 21999 పరుగులు సాధించాడు. ఇందులో 60 సెంచరీలు, 114 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 200 పరుగులు. సచిన్ బ్యాటింగ్ సగటు 45.54 అంతేకాకుండా 201 వికెట్లను కూడా తీసాడు.

రికార్డులకు అంతు లేదు : Records are endless

సచిన్ టెండూల్కర్ చేసిన రికార్డులకు (Sachin records forever) ఇప్పటివరకూ ఎవ్వరూ చేరుకోలేదు. సెంచరీల రికార్డుకు విరాట్ కోహ్లీ ఒక్కడే దగ్గరగా ఉన్నాడు. అయితే సచిన్ ఇప్పటివరకూ భారత్ తరపున 200 టెస్టులు, 460 వన్డేలు, ఒక టీ20 మ్యాచ్ ఆడి ఉన్నాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 100 అంతర్జాతీయ సెంచరీలు (100 International centuries) కొట్టిన ఏకైన బ్యాట్స్మెన్గా ప్రపంచ రికార్డులకు ఎక్కాడు. రంజీ క్రికెట్లో ముంబై తరపున ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్లో సచిన్ ముంబై ఇండియన్స్తరపున ఆడాడు.

సచిన్ గురించి కొన్ని వివరాలు : Some details about Sachin

మొట్ట మొదటి టెస్టు మ్యాచ్ : పాకిస్థాన్ తో 1989 నవంబర్ 15-20 (Debt Test Match)

ఆఖరి టెస్టు మ్యాచ్ : వెస్టిండీస్ తో 2013 నవంబర్ 14-16 (Last Test Match)

మొట్ట మొదటి వన్డే మ్యాచ్ : పాకిస్థాన్ తో 1989 డిసెంబర్ 18 (Debt ODI)

ఆఖరి వన్డే మ్యాచ్ : పాకిస్థాన్ తో 2012 మార్చి 18 (Last ODI)

తీరిన ప్రపంచ కప్ కల : World cup dream come true

సచిన్ 5 ప్రపంచ కప్ టోర్నీల్లో (World cup) పాల్గొన్నప్పటికీ, భారత్ ఒక్కసారి కూడా కప్ గెలవలేకపోయింది. లోటు అలానే ఉండిపోతుందా అనే బాధ (sadness) సచిన్ ని వెంటాడేది. అయితే తన స్వరాష్ట్రమైన మహారాష్ట్రలోని ముంబై వాంఖడే స్టేడియం లో 2 ఏప్రిల్ 2011 లో జరిగిన ప్రపంచ కప్ సచిన్ పాల్గొన్న 6 ప్రపంచ కప్. ధోనీ సారధ్యంలోని (World cup wins in Dhoni Captaincy) భారత జట్టు గెలవడంతో సచిన్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. లెజెండరీ క్రికెటర్ ని అప్పటి టీమ్ లోని సభ్యులు తమ భుజాల పైకి ఎత్తుకుని స్టేడియం మొత్తం తిప్పి, (Lift Sachin upon their shoulders and turn the whole stadium) సచిన్ పై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు.

Recommended Reads 

Female Cricketers of India

IPL 2023 Schedule

IPL Matches Prediction

Kohlis Centuries in sankranti