భారత అగ్రశ్రేణి మహిళా క్రికెటర్లు : Top Female cricketers of India

పురుషులకు ధీటుగా మహిళలు సైతం అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. అందులో భాగంగా అంతర్జాతీయ క్రికెట్లో సైతం మన దేశపు మహిళల (womens) జట్టులోని క్రీడాకారిణులు ఎన్నో రికార్డులు (records) సైతం సృష్టిస్తున్నారు.

భారత అగ్రశ్రేణి మహిళా క్రికెటర్లు : Top Female cricketers of India

భారత అగ్రశ్రేణి మహిళా క్రికెటర్లు : Top Female cricketers of India

పురుషులకు ధీటుగా మహిళలు సైతం అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. అందులో భాగంగా అంతర్జాతీయ క్రికెట్లో సైతం మన దేశపు మహిళల (womens) జట్టులోని క్రీడాకారిణులు ఎన్నో రికార్డులు (records) సైతం సృష్టిస్తున్నారు.

 

రాణిస్తున్న మహిళా క్రికెటర్లు : Prominent women cricketers

క్రికెట్లో సైతం మన దేశపు క్రీడాకారిణులు (women criketers) గొప్పగా రాణిస్తున్నారు. ఎడంచేతి వాటం ఓపెనర్ అయిన స్మృతి మంథాన (Smriti Mandana) 2018, 2021 సంవత్సరాల్లో ఐసీసీ 'క్రికెటర్ ఆఫ్ ది ఇయర్' గా నిలిచి దేశ ఖ్యాతిని వ్యాపింప చేసింది.

  • మూడు ఫార్మాట్లలో కలిపి 10868 పరుగులు చేసిన మొట్టమొదటి మహిళా క్రికెటర్ గా ప్రపంచ రికార్డు మిథాలీ (Mithali Raj) పేరున ఉంది.
  • 6 ప్రపంచ కప్స్ లో పాల్గొని ప్రపంచ రికార్డు సృష్టించిన మిథాలీ (Mithali Raj), వరుసగా 7 అర్ధ సెంచరీలు చేసి మరో రికార్డు సృష్టించింది
  • హర్మన్ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) 135 అంతర్జాతీయ టీ20 మ్యాచ్లు ఆడిన రెండో మహిళా బ్యాటర్గా రికార్డు సృష్టించింది.

 

మహిళా క్రికెటర్ల ప్రపంచ రికార్డులు : Women cricketers world records

  • అత్యధిక వికెట్లు (Most wickets) : అత్యధిక మహిళా వన్డే అంతర్జాతీయ వికెట్లు (255) తీసిన బౌలర్ గా నిలిచిన ఝులన్ (Jhulan Gosvami) గోస్వామి
  • ఓపెనింగ్ భాగస్వామ్యం (Opening partnership) : దక్షిణాఫ్రికాపై వన్డేలో అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం 320 పరుగులు (పూనమ్ రౌత్ (Poonam raut), దీప్తి శర్మ (Deepti sharma)
  • రెండో వికెట్ భాగస్వామ్యం (2nd wicket partnership): దక్షిణాఫ్రికాపై టెస్టు మ్యాచ్లో రెండో వికెట్ అత్యధిక భాగస్వామ్యం 275 పరుగులు (తిరుష్ కామిని (Thirush kamini), పూనమ్ రౌత్ (Poonam raut)
  • పిన్నవయసులో సెంచరీ (Century in small age) : అత్యంత పిన్న వయసులో సెంచరీ (114 పరుగులు) సాధించిన మహిళా క్రికెటర్ గా మిథాలీ రాజ్ (Mithali Raj) రికార్డు (16 సంవత్సరాల 205 రోజులు)

2005, 2017 సంవత్సరాల్లో మహిళల ప్రపంచ కప్ పోటీల్లో ఫైనల్స్ కి చేరుకొని రన్నరప్ (Runner-up) గా నిలిచింది.

మహిళల ఆసియా కప్ పోటీల్లో (Women’s Asia-cup) 2018 మినహా మిగిలిన అన్ని సంవత్సరాలు విజేతగా నిలిచింది. 2022 కామన్వెల్త్ గేమ్స్ లో జట్టు సిల్వర్ మెడల్ సాధించింది.

ఫేసర్ రేణుక సింగ్ (Renuka Singh, 2022)… ఐసీసీ (ICC) ప్రకటించిన అవార్డుల్లో భాగంగా ఉమెన్స్ ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ (Women’s emerging cricketer of the year) అవార్డును రేణుక సింగ్ గెలుచుకుని చరిత్ర సృష్టించింది. ఇలాంటి అరుదైన అవార్డును గెలుచుకున్న తొలి భారత మహిళా క్రికెటర్ (1st Indian women cricketer) గా నిలిచింది. 26 ఏళ్ల రేణుక సింగ్ 2022లో అన్ని ఫార్మాట్లలో కలిపి 40 వికెట్లు పడగొట్టింది. భారత్ లో అగ్రస్థానంలో ఉన్న కొందరు మహిళా క్రికెటర్లు, వారు సాధించిన గణాంకాలను ఒకసారి పరిశీలిద్దాం.

మిథాలీ రాజ్ (Mithali Raj)

మంచి ఆల్ రౌండర్ అయిన మిథాలీ అటు బ్యాట్, బంతితో తన ప్రదర్శనతో అలరించింది. 10 వన్డే ఇన్నింగ్స్ లో 8 వికెట్లను సాధించింది. 3/4 ఉత్తమ బౌలింగ్ గణాంకాలు.

12 టెస్ట్ మ్యాచ్ల్లో 19 ఇన్నింగ్స్ ఆడి, 691 పరుగులు చేసింది. అత్యధిక స్కోరు 214 పరుగులు. ఒక సెంచరీ సహా, 4 అర్ధ సెంచరీలు సాధించింది. బ్యాటింగ్ సగటు 43.69

232 వన్డే మ్యాచ్ల్లో 211 ఇన్నింగ్స్ ఆడి, 7805 పరుగులు చేసింది. అత్యధిక స్కోరు 125 పరుగులు. మొత్తం 7 సెంచరీలు, 64 అర్ధ సెంచరీలు సాధించింది. బ్యాటింగ్ సగటు 50.68

89 టీ20I మ్యాచ్ల్లో 84 ఇన్నింగ్స్ ఆడి, 2364 పరుగులు చేసింది. అత్యధిక స్కోరు 97 పరుగులు. ఇందులో 17 అర్ధ సెంచరీలు ఉన్నాయి. బ్యాటింగ్ సగటు 37.52

హర్మన్ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur)

హర్మన్ప్రీత్ అన్ని ఫార్మాట్లలో తన ఆల్ రౌండ్ ప్రతిభ కనబరిచింది. బౌలింగ్ లో 4 టెస్ట్ ఇన్నింగ్స్ లో 9 వికెట్లు (ఉత్తమ బౌలింగ్ 5/44) తీసింది. 68 వన్డే ఇన్నింగ్స్ లో 31 వికెట్లు (2/16), 62 టీ20I ఇన్నింగ్స్ లో 32 వికెట్లు (4/23) తీసింది.

3 టెస్ట్ మ్యాచ్ల్లో 5 ఇన్నింగ్స్ ఆడి, 38 పరుగులు చేసింది. అత్యధిక స్కోరు 17 పరుగులు బ్యాటింగ్ సగటు 7.60

124 వన్డే మ్యాచ్ల్లో 105 ఇన్నింగ్స్ ఆడి, 3322 పరుగులు చేసింది. అత్యధిక స్కోరు 171 పరుగులు. మొత్తం 5 సెంచరీలు, 17 అర్ధ సెంచరీలు సాధించింది. బ్యాటింగ్ సగటు 38.18

143 టీ20I మ్యాచ్ల్లో 129 ఇన్నింగ్స్ ఆడి, 2887 పరుగులు చేసింది. అత్యధిక స్కోరు 103 పరుగులు. ఇందులో ఒక సెంచరీ, 9 అర్ధ సెంచరీలు ఉన్నాయి. బ్యాటింగ్ సగటు 28.03  

స్మృతి మంథాన (Smriti Mandhana)

4 టెస్ట్ మ్యాచ్ల్లో 7 ఇన్నింగ్స్ ఆడి, 325 పరుగులు చేసింది. అత్యధిక స్కోరు 127 పరుగులు. ఒక సెంచరీ సహా, 2 అర్ధ సెంచరీలు సాధించింది. బ్యాటింగ్ సగటు 46.43

77 వన్డే మ్యాచ్ల్లో 77 ఇన్నింగ్స్ ఆడి, 3073 పరుగులు చేసింది. అత్యధిక స్కోరు 135 పరుగులు. మొత్తం 5 సెంచరీలు, 25 అర్ధ సెంచరీలు సాధించింది. బ్యాటింగ్ సగటు 43.28             

109 టీ20I మ్యాచ్ల్లో 105 ఇన్నింగ్స్ ఆడి, 2646 పరుగులు చేసింది. అత్యధిక స్కోరు 86 పరుగులు. ఇందులో 20 అర్ధ సెంచరీలు ఉన్నాయి. బ్యాటింగ్ సగటు 27.85  

అంజుమ్ చోప్రా (Anjum Chopra)

12 టెస్ట్ మ్యాచ్ల్లో 20 ఇన్నింగ్స్ ఆడి, 548 పరుగులు చేసింది. అత్యధిక స్కోరు 98 పరుగులు. 4 అర్ధ సెంచరీలు సాధించింది. బ్యాటింగ్ సగటు 30.44  

127 వన్డే మ్యాచ్ల్లో 112 ఇన్నింగ్స్ ఆడి, 2856 పరుగులు చేసింది. అత్యధిక స్కోరు 100 పరుగులు. మొత్తం ఒక సెంచరీ సహా 18 అర్ధ సెంచరీలు సాధించింది. బ్యాటింగ్ సగటు 31.38  

18 టీ20I మ్యాచ్ల్లో 16 ఇన్నింగ్స్ ఆడి, 241 పరుగులు చేసింది. అత్యధిక స్కోరు 37 పరుగులు. బ్యాటింగ్ సగటు 17.21                  

*టెస్టుల్లో 2 వికెట్లు, వన్డేల్లో 9 వికెట్లు పడగొట్టింది

పూనమ్ గణేష్ రౌత్ (Punam Ganesh Raut)

4 టెస్ట్ మ్యాచ్ల్లో 7 ఇన్నింగ్స్ ఆడి, 264 పరుగులు చేసింది. అత్యధిక స్కోరు 130 పరుగులు. ఇందులో ఒక సెంచరీ సాధించింది. బ్యాటింగ్ సగటు 44.00  

73 వన్డే మ్యాచ్ల్లో 73 ఇన్నింగ్స్ ఆడి, 2299 పరుగులు చేసింది. అత్యధిక స్కోరు 109 పరుగులు. మొత్తం 3 సెంచరీలు, 15 అర్ధ సెంచరీలు చేసింది. బ్యాటింగ్ సగటు 34.83

35 టీ20I మ్యాచ్ల్లో 31 ఇన్నింగ్స్ ఆడి, 719 పరుగులు చేసింది. అత్యధిక స్కోరు 75 పరుగులు. ఇందులో 4 అర్ధ సెంచరీలు ఉన్నాయి. బ్యాటింగ్ సగటు 27.65 

జయా శర్మ (Jaya Sharma)

1 టెస్ట్ మ్యాచ్ల్లో 1 ఇన్నింగ్స్ ఆడి, 24 పరుగులు చేసింది. అత్యధిక స్కోరు 24 పరుగులు. బ్యాటింగ్ సగటు 24.00  

77 వన్డే మ్యాచ్ల్లో 75 ఇన్నింగ్స్ ఆడి, 2091 పరుగులు చేసింది. అత్యధిక స్కోరు 138 పరుగులు. మొత్తం 2 సెంచరీలు, 14 అర్ధ సెంచరీలు ఉన్నాయి. బ్యాటింగ్ సగటు 30.75

1 టీ20I మ్యాచ్ల్లో 1 ఇన్నింగ్స్ ఆడి, 5 పరుగులు చేసింది. అత్యధిక స్కోరు 5 పరుగులు.

దీప్తి శర్మ (Deepti Sharma)

మహిళల క్రికెట్ టీమ్ లో ఒక గొప్ప ఆల్ రౌండర్ దీప్తి శర్మ. 2 టెస్టు ఇన్నింగ్స్ లో 5 వికెట్లు (3/65), 80 అంతర్జాతీయ వన్డేల్లో 91 వికెట్లు (6/20), 83 టీ20Iల్లో 92 వికెట్లు (4/10) పడగొట్టింది

2 టెస్ట్ మ్యాచ్ల్లో 4 ఇన్నింగ్స్ ఆడి, 152 పరుగులు చేసింది. అత్యధిక స్కోరు 66 పరుగులు. ఇందులో రెండు అర్ధ సెంచరీలు సాధించింది. బ్యాటింగ్ సగటు 76.00  

80 వన్డే మ్యాచ్ల్లో 71 ఇన్నింగ్స్ ఆడి, 1891 పరుగులు చేసింది. అత్యధిక స్కోరు 188 పరుగులు. మొత్తం 1 సెంచరీ, 12 అర్ధ సెంచరీలు ఉన్నాయి. బ్యాటింగ్ సగటు 36.36  

84 టీ20I మ్యాచ్ల్లో 62 ఇన్నింగ్స్ ఆడి, 898 పరుగులు చేసింది. అత్యధిక స్కోరు 64 పరుగులు. ఇందులో 2 అర్ధ సెంచరీలు ఉన్నాయి. బ్యాటింగ్ సగటు 25.65 

అంజూ జైన్ (Anju Jain)

8 టెస్ట్ మ్యాచ్ల్లో 12 ఇన్నింగ్స్ ఆడి, 441 పరుగులు చేసింది. అత్యధిక స్కోరు 110 పరుగులు. ఇందులో ఒక సెంచరీ, 3 అర్ధ సెంచరీలు ఉన్నాయి. బ్యాటింగ్ సగటు 36.75 

65వన్డే మ్యాచ్ల్లో 65 ఇన్నింగ్స్ ఆడి, 1729 పరుగులు చేసింది. అత్యధిక స్కోరు 90 పరుగులు. మొత్తం 12 అర్ధ సెంచరీలు చేసింది. బ్యాటింగ్ సగటు 29.81

ఝులన్ గోస్వామి (Jhulan Goswami)

అటు బ్యాట్, ఇటు బాల్ తో ఒక మంచి ఆల్ రౌండర్ గా ప్రపంచ ప్రసిద్ధి చెందింది ఝులన్. 12 టెస్టుల్లో 21 ఇన్నింగ్స్ లో 44 వికెట్లు (ఒక ఇన్నింగ్స్ లో 5/25, మ్యాచ్లో 10/78) తీసింది. 204 వన్డేల్లో 203 ఇన్నింగ్స్ లో 255 (6/31) వికెట్లు సాధించింది. 67 టీ20I ఇన్నింగ్స్ లో 56 వికెట్లు (5/11) తీసింది.

12 టెస్ట్ మ్యాచ్ల్లో 15 ఇన్నింగ్స్ ఆడి, 291 పరుగులు చేసింది. అత్యధిక స్కోరు 69 పరుగులు. ఇందులో రెండు అర్ధ సెంచరీలు సాధించింది. బ్యాటింగ్ సగటు 24.25 

204 వన్డే మ్యాచ్ల్లో 121 ఇన్నింగ్స్ ఆడి, 1228 పరుగులు చేసింది. అత్యధిక స్కోరు 57 పరుగులు. ఇందులో ఒక అర్ధ సెంచరీ ఉంది. బ్యాటింగ్ సగటు 14.61                  

68 టీ20I మ్యాచ్ల్లో 46 ఇన్నింగ్స్ ఆడి, 405 పరుగులు చేసింది. అత్యధిక స్కోరు 37 పరుగులు. బ్యాటింగ్ సగటు 10.94 

హేమలత కళ (Hemlatha Kala)

7 టెస్ట్ మ్యాచ్ల్లో 10 ఇన్నింగ్స్ ఆడి, 503 పరుగులు చేసింది. అత్యధిక స్కోరు 110 పరుగులు. ఇందులో 2 సెంచరీలు, 3 అర్ధ సెంచరీలు ఉన్నాయి. బ్యాటింగ్ సగటు 50.30       

78 వన్డే మ్యాచ్ల్లో 59 ఇన్నింగ్స్ ఆడి, 1023 పరుగులు చేసింది. అత్యధిక స్కోరు 65 పరుగులు. ఇందులో 3 అర్ధ సెంచరీలు ఉన్నాయి. బ్యాటింగ్ సగటు 20.87  

1 టీ20I మ్యాచ్ల్లో 1 ఇన్నింగ్స్ ఆడి, 5 పరుగులు చేసింది.

కరుణా జైన్ (Karuna Jain)

5 టెస్ట్ మ్యాచ్ల్లో 9 ఇన్నింగ్స్ ఆడి, 195 పరుగులు చేసింది. అత్యధిక స్కోరు 40 పరుగులు. బ్యాటింగ్ సగటు 21.66                   

44 వన్డే మ్యాచ్ల్లో 40 ఇన్నింగ్స్ ఆడి, 987 పరుగులు చేసింది. అత్యధిక స్కోరు 103 పరుగులు. ఇందులో ఒక సెంచరీతో సహా 9 అర్ధ సెంచరీలు ఉన్నాయి. బ్యాటింగ్ సగటు 20.87  

9 టీ20I మ్యాచ్ల్లో 3 ఇన్నింగ్స్ ఆడి, 9 పరుగులు చేసింది.

రుమేలీ ధర్ (Rumeli Dhar)

అటు బ్యాట్, ఇటు బాల్ తో ఒక మంచి ఆల్ రౌండర్ గా ప్రపంచ ప్రసిద్ధి చెందింది రుమేలీ. 4 టెస్టుల్లో 7 ఇన్నింగ్స్ లో 8 వికెట్లు (ఒక ఇన్నింగ్స్ లో 2/16) తీసింది. 78 వన్డేల్లో 77 ఇన్నింగ్స్ లో 63 (4/19) వికెట్లు సాధించింది. 17 టీ20I ఇన్నింగ్స్ లో 13 వికెట్లు (3/13) తీసింది.

4 టెస్ట్ మ్యాచ్ల్లో 8 ఇన్నింగ్స్ ఆడి, 236 పరుగులు చేసింది. అత్యధిక స్కోరు 57 పరుగులు. ఇందులో ఒక అర్ధ సెంచరీ ఉంది. బ్యాటింగ్ సగటు 29.50     

78 వన్డే మ్యాచ్ల్లో 60 ఇన్నింగ్స్ ఆడి, 961 పరుగులు చేసింది. అత్యధిక స్కోరు 92 పరుగులు. ఇందులో 6 అర్ధ సెంచరీలు ఉన్నాయి. బ్యాటింగ్ సగటు 19.61 

18 టీ20I మ్యాచ్ల్లో 11 ఇన్నింగ్స్ ఆడి, 131 పరుగులు చేసింది. అత్యధిక స్కోరు 66 పరుగులు. ఇందులో ఒక అర్ధ సెంచరీ ఉంది. బ్యాటింగ్ సగటు 18.71

భారత్ లో క్రికెట్ కు ఉన్న ఆదరణ అంతాఇంతా కాదు. పురుషులతో సమానంగా మహిళా క్రికెటర్లు సైతం అటు బ్యాట్, ఇటు బంతితో తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా మన మహిళా క్రికెటర్లు మరిన్ని రికార్డులు సాధించాలని కోరుకుందాం.

Recommended Reads 

All Time Best cricketer 

IPL 2023 Schedule

IPL Matches Prediction

Kohlis Centuries in sankranti