ఐపీఎల్ కు వేళాయెరా... : It's Time for IPL...

ఎన్నోరోజుల ఉత్కంఠతకు (Suspense) తెరదించుతూ ఐపీఎల్ (IPL) 16వ సీజన్ మ్యాచ్ ల షెడ్యూల్ విడుదల కావడంతో ఫ్యాన్స్ సంబరాల్లో మునిగిపోయారు. నరాలు తెగే ఉత్కంఠ ఐపీఎల్ సొంతం. ఈ ఏడాది కూడా ఫ్యాన్స్ కి సంబరమే అని చెప్పొచ్చు.

ఐపీఎల్ కు వేళాయెరా... : It's Time for IPL...

ఐపీఎల్ కు వేళాయెరా... : It's Time for IPL...

ఎన్నోరోజుల ఉత్కంఠతకు (Suspense) తెరదించుతూ ఐపీఎల్ (IPL) 16 సీజన్ మ్యాచ్ షెడ్యూల్ విడుదల కావడంతో ఫ్యాన్స్ సంబరాల్లో మునిగిపోయారు. నరాలు తెగే ఉత్కంఠ ఐపీఎల్ సొంతం. ఏడాది కూడా ఫ్యాన్స్ కి సంబరమే అని చెప్పొచ్చు.

 

రికార్డులు బద్దలు కొట్టగలరా? : Can beat the records?

ఐపీఎల్ 16 సీజన్లో గత 15 సీజన్ల కంటే మరిన్ని ఎక్కువ రికార్డులు బద్దలవుతాయని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఆయా జట్ల అభిమానుల్లో (Fans) ఇప్పటి నుంచే ఎవరు ఎక్కువ రికార్డులు (Discussions about Records) సాధిస్తారనే చర్చలు మొదలయ్యాయి. దీనికి తగ్గట్లుగా నెట్ ప్రాక్టీస్ లో (Net Practice) సైతం ఆయా క్రికెటర్లు సాధనలో సిక్సర్ల మోత మోగించిన వీడియోలు సైతం వైరల్ గా మారి, వీరి అంచనాలను (expectations) మరింతగా పెంచాయని చెప్పవచ్చు.

వచ్చే నెలాఖరు (March ending) నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 16 సీజన్ (16th season) కోసం ఆయా జట్ల ఎంపిక, కూర్పు ప్రక్రియ మొత్తం పూర్తయింది. ఇక మ్యాచ్ లు జరగడమే తరువాయి. ధనాధన్, పొట్టి క్రికెట్, ఆటగాళ్లకు కోట్లు (Crores of rupees) కుమ్మరించే టోర్నమెంట్ అని పేరొందిన ఐపీఎల్ (IPL) లో ఏడాది కూడా రికార్డులు బద్దలవుతాయని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. వీరి అంచనాలకు (estimations) తగ్గట్లుగా ఆటగాళ్లు సైతం ఐపీఎల్ కోసం సిద్ధమవుతున్నారు. అయితే ప్రస్తుతం ఆయా దేశాలకు చెందిన క్రికెటర్లు, భారత క్రికెటర్లు కొన్ని అంతర్జాతీయ మేజర్ టోర్నమెంట్లు (Playing Major Tournaments) ఆడుతున్నారు. టోర్నమెంట్లలో ఆడుతున్న కారణంగా ఐపీఎల్ కోసం మంచి ప్రాక్టీస్ గా ఉంటుందని చెప్పవచ్చు.

 

ఐపీఎల్ 16 సీజన్లో పాల్గొనే జట్లు : List of IPL 16th Season Teams

  • చెన్నై సూపర్ కింగ్స్ (CSK)
  • గుజరాత్ టైటాన్స్ (GT)
  • ముంబై ఇండియన్స్ (MI)
  • పంజాబ్ కింగ్స్ (PBKS)
  • ఢిల్లీ క్యాపిటల్స్ (DC)
  • రాజస్థాన్ రాయల్స్ (RR)
  • రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)
  • సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH)
  • లక్నో సూపర్ జెయింట్స్ (LSG)
  • కోల్కతా నైట్ రైడర్స్ (KKR)

 

చెన్నై సూపర్ కింగ్స్ ఫుల్ స్క్వాడ్ : CSK full squad

అంబటి రాయుడు, దీపక్ చాహర్, డెవాన్ కాన్వే, డ్వైన్ ప్రిటోరియస్, మహేశ్ తీక్షణ, మతీషా పతిరణ, మిచెల్ సాంట్నర్, మొయిన్ అలీ, MS ధోని (కెప్టెన్), ముఖేష్ చౌదరి, ప్రశాంత్ సోలంకి, రాజ్వర్ధన్ హంగర్గేకర్, రవీంద్ర జడేజా, రుతురాజ్ గైక్వాయిడ్, శివమ్ దూబే, సిమర్జీత్ సింగ్, సుభ్రాంశు సేనాపతి, తుషార్ దేశ్పాండే, భగత్ వర్మ, అజయ్ మండల్, కైలే జామీసన్, నిశాంత్ సింధు, షేక్ రషీద్, బెన్ స్టోక్స్, అజింక్యా రహానే.

ప్లేయింగ్ XI అవకాశం ఉన్న ఆటగాళ్లు : CSK PROBABLE PLAYING XI

డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అంబటి రాయుడు, అజింక్యా రహానే, మొయిన్ అలీ, బెన్ స్టోక్స్, ఎంఎస్ ధోని (WK), రవీంద్ర జడేజా, దీపక్ చాహర్, ముఖేష్ చౌదరి, మహేశ్ తీక్షణ.

 

గుజరాత్ టైటాన్స్ (GT) ఫుల్ స్క్వాడ్ : GT full squad

హార్దిక్ పాండ్యా (కెప్టెన్), శుభమన్ గిల్, డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్, సాయి సుదర్శన్, వృద్ధిమాన్ సాహా, మాథ్యూ వేడ్, రషీద్ ఖాన్, రాహుల్ తెవాటియా, విజయ్ శంకర్, మహ్మద్ షమీ, అల్జారీ జోసెఫ్, యశ్ దయాల్, ప్రదీప్ సాంగ్వాన్, దర్శన్ నల్కండే, జయంత్ యాదవ్, R సాయి కిషోర్, నూర్ అహ్మద్, కేన్ విలియమ్సన్, ఓడియన్ స్మిత్, KS భరత్, శివం మావి, ఉర్విల్ పటేల్, జాషువా లిటిల్, మోహిత్ శర్మ

 

తుది XI ఆడే అవకాశం ఉన్న ఆటగాళ్లు : GT PROBABLE PLAYING XI

వృద్ధిమాన్ సాహా (WK), శుభమన్ గిల్, కేన్ విలియమ్సన్, హార్దిక్ పాండ్యా, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్, మహమ్మద్ షమీ, R. సాయి కిషోర్, యశ్ దయాల్.

 

ముంబై ఇండియన్స్ ఫుల్ స్క్వాడ్ : MI full squad

రోహిత్ శర్మ (కెప్టెన్), టిమ్ డేవిడ్, రమణదీప్ సింగ్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, ట్రిస్టన్ స్టబ్స్, డెవాల్డ్ బ్రెవిస్, జోఫ్రా ఆర్చర్, జస్ప్రీత్ బుమ్రా, అర్జున్ టెండూల్కర్, అర్షద్ ఖాన్, కుమార్ కార్తికేయ, హృతిక్ షోకీన్, జాసన్ బెహ్రెండోర్ఫ్, ఆకాష్ మధ్వాల్, కామెరాన్ గ్రీన్, జ్యే రిచర్డ్సన్, పీయూష్ చావ్లా, దువాన్ జాన్సెన్, విష్ణు వినోద్, షామ్స్ ములానీ, నేహాల్ వధేరా, రాఘవ్ గోయల్.

 

ప్లేయింగ్ XI అవకాశం ఉన్న ఆటగాళ్లు : MI PROBABLE PLAYING XI

రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ (WK), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, కామెరూన్ గ్రీన్, జోఫ్రా ఆర్చర్, జస్ప్రీత్ బుమ్రా, కుమార్ కార్తికేయ, హృతిక్ షోకీన్, జ్యే రిచర్డ్సన్ / జేసన్ బెహ్రెండోర్ఫ్.

 

పంజాబ్ కింగ్స్ ఫుల్ స్క్వాడ్ : PBKS full squad

శిఖర్ ధావన్ (కెప్టెన్), షారుఖ్ ఖాన్, రాహుల్ చాహర్, అర్ష్దీప్ సింగ్, హర్ప్రీత్ బ్రార్, రాజ్ అంగద్ బావా, ప్రభ్సిమ్రాన్ సింగ్, రిషి ధావన్, జితేష్ శర్మ, బల్తేజ్ సింగ్ ధండా, అథర్వ టైడే, లియామ్ లివింగ్స్టోన్, కగిసో రబాడా, జానీ బెయిర్స్టో, నాథన్ ఎల్లిస్, భానుక రాజపక్స శివమ్ సింగ్, మోహిత్ రాఠీ, విద్వత్ కవేరప్ప, హర్ప్రీత్ భాటియా, సికందర్ రజా, సామ్ కరన్

ప్లేయింగ్ XI అవకాశం ఉన్న ఆటగాళ్లు : PBKS PROBABLE PLAYING XI

జానీ బెయిర్స్టో (WK), శిఖర్ ధావన్, భానుక రాజపక్సే, లియామ్ లివింగ్స్టోన్, M. షారుఖ్ ఖాన్, సామ్ కరన్, కగిసో రబాడా, అర్ష్దీప్ సింగ్, రాహుల్ చాహర్, హర్ప్రీత్ బ్రార్.

 

ఢిల్లీ క్యాపిటల్స్ ఫుల్ స్క్వాడ్ : DC full squad

డేవిడ్ వార్నర్ (కెప్టెన్), పృథ్వీ షా, రిపాల్ పటేల్, రోవ్మన్ పావెల్, సర్ఫరాజ్ ఖాన్, యశ్ ధుల్, మిచెల్ మార్ష్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, అన్రిచ్ నార్ట్జే, చేతన్ సకారియా, కమలేష్ నాగర్కోటి, ఖలీల్ అహ్మద్, లుంగీ ఎంగిడి, ముస్తాఫిజుర్ రెహమాన్, అమన్ ఖాన్, కుల్దీప్ యాదవ్, ప్రవీణ్ దూబే, విక్కీ ఓస్త్వాల్, ఇషాంత్ శర్మ, ఫిల్ సాల్ట్, ముఖేష్ కుమార్, మనీష్ పాండే, రిలీ రోసౌవ్.

ప్లేయింగ్ XI అవకాశం ఉన్న ఆటగాళ్లు : DC PROBABLE PLAYING XI

పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్ (WK), రిలీ రోసౌ, మనీష్ పాండే, అక్షర్ పటేల్, అన్రిచ్ నార్ట్జే, కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్, చేతన్ సకారియా.

 

రాజస్థాన్ రాయల్స్ ఫుల్ స్క్వాడ్ : RR full squad

సంజు శాంసన్ (కెప్టెన్), దేవదత్ పడిక్కల్, జాస్ బట్లర్, షిమ్రోన్ హెట్మెయర్, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, రియాన్ పరాగ్, కేసీ కరియప్ప, కుల్దీప్ సేన్, కుల్దీప్ యాదవ్, నవదీప్ సైనీ, ఒబెద్ మెక్కాయ్, కేఎమ్ ఆసిఫ్, ప్రసిద్ద్ కృష్ణ, ట్రెంట్ బౌల్ట్, మురుగన్ అశ్విన్, యజువేంద్ర చాహల్, ఆకాష్ వశిష్ట్, జాసన్ హోల్డర్, డోనోవన్ ఫెరీరా, కునాల్ రాథోడ్, ఆడమ్ జంపా, అబ్దుల్ P A

ప్లేయింగ్ XI అవకాశం ఉన్న ఆటగాళ్లు : RR PROBABLE PLAYING XI

జాస్ బట్లర్ (WK), యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, దేవదత్ పడిక్కల్, షిమ్రోన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, జాసన్ హోల్డర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, యజువేంద్ర చాహల్

 

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫుల్ స్క్వాడ్ : RCB full squad

ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, సుయాష్ ప్రభుదేశాయ్, రజత్ పాటిదార్, దినేష్ కార్తీక్, అనూజ్ రావత్, ఫిన్ అలెన్, గ్లెన్ మాక్స్వెల్, వనిందు హసరంగా, షాబాజ్ అహ్మద్, హర్షల్ పటేల్, డేవిడ్ విల్లీ, కరణ్ శర్మ, మహిపాల్ లోమ్రార్, మొహ్మద్ సిరాజ్, జోష్ హేజిల్వుడ్, సిద్దార్థ్ కౌల్, ఆకాష్ దీప్, రీస్ టాప్లీ, హిమాన్షు శర్మ, విల్ జాక్స్, మనోజ్ భండాగే, రాజన్ కుమార్, అవినాష్ సింగ్, సోనూ యాదవ్.

 

ప్లేయింగ్ XI అవకాశం ఉన్న ఆటగాళ్లు : RCB PROBABLE PLAYING XI

ఫాఫ్ డు ప్లెసిస్, విరాట్ కోహ్లి, రజత్ పాటిదార్, గ్లెన్ మాక్స్వెల్, మహిపాల్ లోమ్రార్, దినేష్ కార్తీక్ (WK), షాబాజ్ అహ్మద్, వనిందు హసరంగా, హర్షల్ పటేల్, జోష్ హేజిల్వుడ్, మహ్మద్ సిరాజ్.

సన్ రైజర్స్ హైదరాబాద్ ఫుల్ స్క్వాడ్ : SRH full squad

అబ్దుల్ సమద్, ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), రాహుల్ త్రిపాఠి, గ్లెన్ ఫిలిప్స్, అభిషేక్ శర్మ, మార్కో జాన్సెన్, వాషింగ్టన్ సుందర్, ఫజల్ హక్ ఫారూఖీ, కార్తీక్ త్యాగి, భువనేశ్వర్ కుమార్, నటరాజన్, ఉమ్రాన్ మాలిక్, హ్యారీ బ్రూక్, మయాంక్ అగర్వాల్, హేన్రిచ్ క్లాసేన్, ఆదిల్ రషీద్, మయాంక్ మార్కండే, వివ్రంత్ శర్మ, సమర్థ్ వ్యాస్, శాన్వీర్ సింగ్, ఉపేంద్ర యాదవ్, మయాంక్ డాగర్, నితీష్ కుమార్ రెడ్డి, అకీల్ హోసేన్, అన్మోల్ప్రీత్ సింగ్.

 

ప్లేయింగ్ XI అవకాశం ఉన్న ఆటగాళ్లు : SRH PROBABLE PLAYING XI

మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, హ్యారీ బ్రూక్, ఐడెన్ మార్క్రామ్, అబ్దుల్ సమద్, హెన్రిచ్ క్లాసెన్ (WK), వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, మార్కో జాన్సెన్.

 

లక్నో సూపర్ జెయింట్స్ ఫుల్ స్క్వాడ్ : LSG full squad

కెఎల్ రాహుల్ (కెప్టెన్), ఆయుష్ బదోని, కరణ్ శర్మ, మనన్ వోహ్రా, క్వింటన్ డి కాక్, మార్కస్ స్టోయినిస్, కృష్ణప్ప గౌతమ్, దీపక్ హుడా, కైల్ మేయర్స్, కృనాల్ పాండ్యా, అవేశ్ ఖాన్, మొహిసిన్ ఖాన్, మార్క్ వుడ్, మయాంక్ యాదవ్, రవి బిష్ణోయ్, నికోలస్ పూరన్, జయదేవ్ ఉనద్కత్, యశ్ ఠాకూర్, రొమారియో షెపర్డ్, డేనియల్ సామ్స్, అమిత్ మిశ్రా, ప్రేరక్ మన్కడ్, స్వప్నిల్ సింగ్, నవీన్-ఉల్-హక్, యుధ్వీర్ చరక్.

 

ప్లేయింగ్ XI అవకాశం ఉన్న ఆటగాళ్లు : LSG PROBABLE PLAYING XI

క్వింటన్ డి కాక్ (WK), KL రాహుల్, దీపక్ హుడా, నికోలస్ పూరన్, మార్కస్ స్టోయినిస్, ఆయుష్ బదోని, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, మార్క్ వుడ్, మొహ్సిన్ ఖాన్ / జయదేవ్ ఉనద్కత్.

కోల్కతా నైట్ రైడర్స్ ఫుల్ స్క్వాడ్ : KKR full squad

శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), నితీష్ రాణా, రహమానుల్లా గుర్బాజ్, వెంకటేష్ అయ్యర్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, లోకీ ఫెర్గూసన్, ఉమేష్ యాదవ్, టిమ్ సౌథీ, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, అనుకుల్ రాయ్, రింకూ సింగ్, జగదీశన్, వైభవ్ అరోరా, సుయాష్ శర్మ, డేవిడ్ వీస్, కుల్వంత్ ఖేజ్రోలియా, లిట్టన్ దాస్, మన్దీప్ సింగ్, షకీబ్ అల్ హసన్.

 

ప్లేయింగ్ XI అవకాశం ఉన్న ఆటగాళ్లు : KKR PROBABLE PLAYING XI

N. జగదీశన్, రహ్మానుల్లా గుర్బాజ్ (WK), శ్రేయాస్ అయ్యర్, రింకూ సింగ్, నితీష్ రాణా, ఆండ్రీ రస్సెల్, శార్దూల్ ఠాకూర్, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, ఉమేష్ యాదవ్, లాకీ ఫెర్గూసన్.

 

అగ్రస్థానంలో ముంబై, చెన్నై : MI, CSK are at the Top

 మొత్తం ఐపీఎల్ 15 సీజన్లలో (15 seasons) అత్యధికసార్లు టైటిల్స్ గెలిచిన జట్లుగా ముంబై, చెన్నై జట్లు నిలిచాయి. ముంబై జట్టు ఐదు సార్లు (MI 5 times), చెన్నై జట్టు నాలుగు సార్లు (CSK 4 Times) విజేతలుగా నిలిచాయి. మొత్తం 10 జట్లలో రెండు జట్లే 9 సార్లు విజేతలుగా (Both Teams Win 9 Titles) నిలిచి ట్రోఫీలను ఎగరేసుకుపోయాయి.

ముంబై ఇండియన్స్ (MI) జట్టు అత్యధికంగా 5 సార్లు 2013, 2015, 2017, 2019, 2020 లో టైటిల్స్ గెలుచుకుంది. MI జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ సారధ్యంలోని జట్టు 16 ఐపీఎల్ సీజన్లో టైటిల్ ఫేవరెట్ జట్లలో ఒకటిగా ఉంది.

చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు 4 సార్లు 2010, 2011, 2018, 2021 లో టైటిల్ గెలుచుకుంది. అంతే కాకుండా చెన్నై జట్టు 5 సార్లు 2008, 2012, 2013, 2015, 2019 రన్నరప్ (5 Times Runners) గా నిలిచింది. ధోని సారధ్యంలోని CSK ఐపీఎల్ టోర్నీలో అత్యంత విజయవంతమైన జట్లలో రెండో స్థానంలో నిలిచింది. ఇప్పుడు జరగబోయే 16 సీజన్ ధోనీకి ఆఖరి సీజన్ కావొచ్చని విశ్లేషకులు (Analysts), అభిమానులు భావిస్తున్నారు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ (Dhoni announced Retirement for all formats) ప్రకటించిన ధోని గత ఐపీఎల్ సీజన్లో T20 లకు కూడా రిటైర్మెంట్ చెబుతాడని భావించారు.

అయితే ఏడాది కూడా జట్టుతోనే ఉన్న ధోనీ ఎలాగైనా 16 సీజన్ (16th season) ఐపీఎల్ ఛాంపియన్ గా నిలిచి వీడ్కోలు పలకాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఎల్లప్పుడూ ఫిట్నెస్ (Fitness) పైన శ్రద్ధ చూపించే ధోనీ మరికొన్నాళ్లు ఐపీఎల్ (IPL) ఆడినా ఆశ్చర్యపోనక్కర్లేదని అభిమానులు అంటున్నారు. ధోనీ నెట్ ప్రాక్టీస్ చేస్తున్న దృశ్యాల వీడియోలు వైరల్ (Net practice videos went viral) అవుతున్నాయి. ప్రాక్టీస్ లో సిక్సర్ల వర్షం (Sixes in Practice) కురిపించడంతో ఇంకా అసలు మ్యాచ్ ల్లో చెలరేగిపోతాడని అభిమానులు (Fans) సంబర పడిపోతున్నారు.

ప్రతీ సీజన్లో ఎన్నో రికార్డులను (records) సృష్టిస్తున్న ఐపీఎల్ 16 సీజన్ (IPL 16th season) మరిన్ని రికార్డులను సృష్టించేందుకు సిద్ధమవుతోంది. ఐపీఎల్ వేలంలో ఇంగ్లాండ్ ఆల్-రౌండర్ సామ్ కరన్ (Sam Curran) ను పంజాబ్ జట్టు (PBKS) యాజమాన్యం ఐపీఎల్ చరిత్రలోనే (IPL History) అత్యధిక ధర రూ.18.25 (18.25 Crores) కోట్లకు కొనుగోలు చేసి రికార్డు సృష్టించింది.