అధిక పారితోషికం తీసుకుంటున్న తెలుగు హీరోలు : Highest remuneration in Tollywood Heroes

టాలీవుడ్ లో నిర్మితమవుతున్న సినిమాల్లో ఉండే కంటెంట్, యాక్షన్, డ్రామా అన్ని భాషల వారిని ఎంతగానో అలరిస్తున్నాయి. బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి చిత్రాలు ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ సునామీని సృష్టించాయి.

అధిక పారితోషికం తీసుకుంటున్న తెలుగు హీరోలు : Highest remuneration in Tollywood Heroes

అధిక పారితోషికం తీసుకుంటున్న తెలుగు హీరోలు : Highest Remuneration in Tollywood Heroes

 

టాలీవుడ్ లో నిర్మితమవుతున్న సినిమాల్లో ఉండే కంటెంట్, యాక్షన్, డ్రామా అన్ని భాషల వారిని ఎంతగానో అలరిస్తున్నాయి. బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి చిత్రాలు ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ సునామీని సృష్టించాయి.

 

అంచలంచెలుగా ఎదిగిన తెలుగు సినీ పరిశ్రమ

తెలుగు సినిమా ఇండస్ట్రీ.. అందరూ పిలుచుకునే పేరు టాలీవుడ్. నేడు భారత దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమాలంటే చెవి కోసుకుంటున్నారు. దీనికి తోడు ఇక్కడి హీరోలు.. వీరు చేసే యాక్షన్ కు పాన్ ఇండియా సినీ ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కడ టీవీలు చూసినా హిందీలో డబ్బింగ్ చేసిన తెలుగు సినిమాలు చూస్తూ వుంటారు. అంతలా తెలుగు సినిమా రేంజ్ పెరిగింది. ఒకప్పుడు చెన్నై లో ఉండే చిత్ర పరిశ్రమ తదనంతరం హైదరాబాద్ కు షిఫ్ట్ అయింది. అప్పటి నుంచి సినిమాలు ఇక్కడే నిర్మితమవుతున్నాయి.

 

తెలుగు సినీ ఇండస్ట్రీస్ కి సంబంధించి పలు ప్రపంచ రికార్డులు కూడా ఉన్నాయి. 1909 లో తెలుగు సినిమాలను ప్రోత్సహించడానికి తెలుగు సినీ పితామహుడిగా పేరుగాంచిన రఘుపతి వెంకయ్య నాయుడు ఆసియా దేశాల్లో పర్యటించారు. తెలుగు సినిమాల్లో అత్యంత ప్రతిష్టాత్మక అవార్డు ఏదైనా ఉందంటే ఆది నంది అవార్డు మాత్రమే. ఉత్తమ నటన, వివిధ సాంకేతిక విభాగాల్లో ప్రతిభ కనబరచిన వారికి వివిధ రంగాల్లో అవార్డుని అందిస్తారు. దీనిని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వమే తాము ఏర్పాటు చేసిన ఫిలిం టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ద్వారా అవార్డులు ప్రదానం చేస్తారు.

 

2005, 2006, 2008 సంవత్సరాల్లో బాలీవుడ్ (హిందీ సినీ పరిశ్రమ) ను అధిగమించి దేశంలోనే అత్యధిక సినిమాలు నిర్మించింది. అంతే కాకుండా రంగం పలు గిన్నిస్ రికార్డులు కూడా నమోదు చేసింది.

 

గిన్నిస్ బుక్ లో తెలుగు సినీ రంగం

  • ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్ స్థూడియోగా రామోజీ ఫిల్మ్ సిటీ గిన్నిస్ బుక్ లో నమోదయింది
  • దేశంలోనే అత్యధిక సినిమా థియేటర్లు ఆంధ్ర ప్రదేశ్ లోనే ఉన్నాయి
  • తెలంగాణాలోని హైదరాబాద్ లో ఉన్న ప్రసాద్ ఐమ్యాక్స్ ప్రపంచంలోనే అతి పెద్ద 3డీ ఐమ్యాక్స్ అత్యధికంగా సినిమాను వీక్షించే స్క్రీన్.
  • వివిధ భాషల్లో 30 వేలకు పైగా పాటలు పాడిన గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం
  • ఎక్కువ సినిమాలకి దర్శకత్వం వహించిన మహిళా దర్శకురాలు విజయనిర్మల
  • పలు భాషల్లో ఎక్కువ సినిమాలు నిర్మించిన నిర్మాతగా రామానాయుడు రికార్డు సృష్టించారు.
  • జాతీయ భాషల్లో ఎక్కువ సినిమాలకి (149) దర్శకుడిగా వ్యహరించిన వ్యక్తి దాసరి నారాయణరావు
  • అతి తక్కువ కాలంలో 750 కి పైగా సినిమాల్లో నటించిన నటుడు బ్రహ్మానందం

ఆనాటి తరం నుంచి ఈనాటి తరం నటులు

ఇంతటి ఖ్యాతిని గడించిన సినీ పరిశ్రమలో ఎంతోమంది తమ నటనతో ప్రేక్షకుల్ని హూషారెత్తించారు. అప్పటి తరంలో నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్), అక్కినేని నాగేశ్వరావు (ఏఎన్నార్), కృష్ణ, శోభన్ బాబు, మురళీ మోహన్, కైకాల సత్యనారాయణ  వంటి పలువురు నటులు ఉన్నారు.

 

అనంతరం చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి నటులు వచ్చారు. ప్రస్తుత తరంలో మహేష్ బాబు, ప్రభాస్, పవన్ కళ్యాణ్, రవితేజ, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి మేటి నటులున్నారు. వీరే కాకుండా కళ్యాణ్ రామ్, అల్లు శిరీష్, నాని, శర్వానంద్, నాగ చైతన్య, అఖిల్ వంటి నటులు సినిమాల్లో నటిస్తున్నారు. ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ నేటి తరం సినీ రంగాన్ని శిఖరాగ్రంపై నిలబెట్టారు.

 

వీరు నటిస్తున్న సినిమాలు రిలీజ్ అయ్యాయంటే చాలు వీరి అభిమానుల కోలాహలం చెప్పనక్కర్లేదు. పాన్ ఇండియాలోనూ, ప్రపంచ వ్యాప్తంగా వీరి సినిమాలు కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. మరి హీరోల్లో ఎవరు అత్యధిక పారితోషికం తీసుకుంటున్నారో ఒకసారి గమనిస్తే మైండ్ బ్లాక్ అయిపోద్ది. కోట్లలో పారితోషకం తీసుకుంటున్న హీరోలకు ఎంతైనా ఇచ్చేందుకు నిర్మాతలు వెనుకాడడం లేదు. ఎందుకంటే లాభాలు కలెక్షన్ల రూపంలో వచ్చి పడుతున్నాయి కాబట్టి. అత్యధిక పారితోషికం తీసుకుంటున్న అగ్ర హీరోలను పరిశీలిద్దాం.

 

ప్రభాస్

బాహుబలి.. తెలుగు సినిమా అంటే ఇలా ఉంటుందా అనేలా ప్రపంచం మొత్తం ఆశ్చర్య పడేలా చేసిన తెలుగు చిత్రం. రెండు భాగాలుగా వచ్చిన చిత్రాన్ని దర్శకుడు రాజమౌళి నిర్మించారు. ఇందులో హీరోగా నటించిన ప్రభాస్ కి మంచి పేరు వచ్చింది. ఈయన ఒక్కో సినిమాకు 100 కోట్లకు పైగా తీసుకుంటున్నట్లు సినీ పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ప్రభాస్ నటించిన రాధేశ్యామ్‌, సలార్అనే సినిమాలకు ఆయన వందకోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నారు. దీంతో ప్రభాస్ పాన్ ఇండియా సూపర్ స్టార్ గా పేరుపొందారు. ప్రస్తుతం నటిస్తున్న ఆదిపురుష్ కోసం 120 కోట్లు తీసుకుంటున్నట్లు టాక్. హిందీ హీరోలతో కూడా కలిసి నటిస్తూ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు.

 

మహేష్ బాబు

మిల్క్ బాయ్ గా పిలిపించుకునే మహేష్ బాబు చిన్నప్పటి నుంచే సినిమాల్లో నటిస్తున్నాడు. తన తండ్రితో పాటు నటించిన సినిమాల్లో మహేష్ చేసిన డ్యాన్సులు, ఫైట్స్ అభిమానులను అలరించేవి. పెద్దయ్యాక హీరోగా తక్కువ సినిమాలే చేసినా… చేసే ప్రతి సినిమా పక్కాగా కంటెంట్ కలిగి ఉండడంతో మంచి పేరు పొందాడు. మహేష్ పలికే డైలాగులు ఎంతో ఆకట్టుకుంటాయి. 2006 ఏప్రిల్ లో రిలీజ్ అయిన అయన నటించిన పోకిరి సినిమా అప్పట్లో తెలుగు ఇండస్ట్రీలో ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. ఒక్కో సినిమాకు మహేష్ బాబు 70 కోట్ల రూపాయలు తీసుకుంటున్నాడు. "ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో వాడే పండు" డైలాగ్ ఎంతో పాపులర్  అయింది.

 

అల్లు అర్జున్

డీజే, సరైనోడు సినిమాలతో ఉత్తరాది రాష్ట్రాల్లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న నటుడు అల్లు అర్జున్. పుష్ప సినిమాతో అభిమానులు మరింత పెరిగారు. ఈయన సినిమాలు ఉత్తరాది రాష్ట్రాల్లో హిందీ డబ్బింగ్ తో ఎక్కువగా రిలీజ్ చేస్తారు. పుష్ప సినిమా రిలీజ్ అయిన తరువాత తన రెమ్యూనరేషన్ పెంచేసాడు. పుష్ప 2 ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. తన నటన, కామెడీ, ముఖ్యంగా అర్జున్ చేసే ఫైట్లు, డ్యాన్స్ అన్ని భాషల వారిని ఎంతగానో అలరిస్తున్నాయి. 6 సార్లు ఫిల్మ్ ఫేర్ అవార్డులు, మూడు సార్లు నంది అవార్డులు దక్కించుకున్నాడు.

 

పవన్ కళ్యాణ్

నాకు కొంచెం తిక్కుందిదానికో లెక్కుంది డైలాగ్ తెలుగు వారందరికీ సుపరిచితమే. అంతలా పాపులర్ అయిందంటే దానికి కారణం పీకే... పవన్ కళ్యాణ్. పాన్ ఇండియా స్టార్ కాకపోయినా, తాను నటించే సినిమాలకు తెలుగు ఇండస్ట్రీ నుంచే చక్కటి వసూళ్లు రాబట్టుకునే చిత్రాల్లో నటిస్తున్న హీరో ఎవరైనా ఉన్నారంటేఆది ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమే. ఒక పక్క రాజకీయాల్లో తలమునకలవుతూ, మరోపక్క చక్కటి చిత్రాలను ఎంపిక చేసుకుని తన అభిమానులను ఎంతగానో తన నటనతో అలరిస్తున్నాడు.

తమ్ముడు, తొలిప్రేమ, కొమరం పులి వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు. తన పదునైన మాటలను, డైలాగులతో ఆకట్టుకుంటాడు పీకే. ఆయన ఒక్కో సినిమాకు 50-65 కోట్ల రూపాయలు తీసుకుంటారు. తాను సంపాదించే దానిలో చనిపోయిన రైతన్నల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి లక్ష చొప్పున అందిస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు.

 

జూనియర్ ఎన్టీఆర్

ఆర్ఆర్ఆర్... ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అందరి నోళ్ళలో నానుతున్న పేరు. అంతటి పేరు సంపాదించి సినిమాలో ఒక హీరోగా చేసిన ఎన్టీఆర్... చిన్నప్పటి నుంచే పౌరాణిక, సాంఘిక సినిమాల్లో నటించారు. స్టూడెంట్ నెం.1, ఆది, సింహాద్రి, ఆంధ్రావాలా వంటి సినిమాల్లో నటించి మెప్పించాడు. నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ తెలుగు వారితో పాటు ఉత్తరాది రాష్ట్రాల వారిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇటీవల వచ్చిన ఆర్ఆర్ఆర్ అంతర్జాతీయంగా ఎన్నో అవార్డులను అందుకుంది. ఇప్పటికీ అందుకుంటోంది. ఎన్టీఆర్ ఒక్కో సినిమాకు 30-80 కోట్లు వసూలు చేస్తున్నారు.

 

చిరంజీవి

తెలుగు సినిమాల్లో డిస్కో డాన్స్ అంటే ఆయనే... బ్రేక్ డాన్స్ అన్నా ఆయనే... అలా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఎన్నో ఏళ్లుగా "ఖైదీ" అయిన హీరో చిరంజీవి. 90'ల్లో హీరో నెంబర్ 1 గా నిలిచారు చిరంజీవి. గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు, ఇలా ఎన్నో చిత్రాలు. ఒక్కో సినిమా ఒక్కో ఆణిముత్యం. స్వయంకృషి, ఆపద్భాంధవుడు వంటి సినిమాలో అయన నటన అమోఘం. విజేత సినిమా ఆయన్ని సినీ జగత్తులో నిజంగా విజేత గానే నిలిపింది. 150 కి పైగా సినిమాల్లో ఆయన హీరోగా నటించారు. ఇప్పటికీ నటిస్తూనే ఉన్నారు. ఆయన ఒక్కో సినిమాకు 50 కోట్లు తీసుకుంటున్నారు.

 

రామ్ చరణ్

ధీర నటన, గంభీరమైన డైలాగులు, అద్భుతమైన ఫైట్లు, డ్యాన్సులు... ఇలా నవరసాలు పండించే నేటి తరం హీరోల్లో ఒకరిగా నిలిచారు రామ్ చరణ్. తన తండ్రి చాటు హీరో గా కాకుండా తన స్వంత నటనతో అంచెలంచెలుగా ఎదిగారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ తో కలిసి మరో హీరోగా నటించిన చరణ్ నటన అమోఘం. రంగస్థలం సినిమాలో చెవిటివాని పాత్రలో చేసిన ఆయన నటన ఆయన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లింది. పాన్ ఇండియా స్టార్ గా పేరు పొందాడు. తన ఒక్కో సినిమాకు 30-70 కోట్లు తీసుకుంటున్నాడు.

 

విజయ్ దేవరకొండ

చేసింది తక్కువ సినిమాలే అయినా ఎంతో పాపులారిటీని సంపాదించి హీరో విజయ్ దేవరకొండ. నంది అవార్డు, ఫిల్మ్ ఫేర్, సైమా అవార్డు అందుకున్న విజయ్ పేరుతోనూ, ఆదాయంతోనూ ఫోర్బ్స్ టాప్-100 లో స్థానం సంపాదించాడు. నువ్విలా సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు. పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి వంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించాడు. మహానటి లో మంచి నటన కనబరిచాడు. విజయ్ తన ఒక్కో సినిమాకు 15-30 కోట్లు వసూలు చేస్తున్నాడు.

 

రవితేజ

మాస్ మహారాజా గా పేరొందిన రవితేజ సినిమాలంటే యావత్ భారత దేశంలోని సినీ అభిమానులకు పండగే పండగ. విక్రమార్కుడు సినిమాలోని "జింతాతా చితా చితా" అనే పాటలోని లైన్ ప్రతి ఒక్కరి నోట్లో ఇప్పటికీ నానుతుంది. ఇటివంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా స్వయంకృషితో ఉన్నతంగా ఎదిగిన ఒదిగి ఉండే నటుడు రవితేజ. ఎప్పుడూ కొత్త కొత్త టెక్నీషియన్లను పరిచయం చేస్తుంటారు. అందరికీ అవకాశం ఇవ్వాలి అనేది ఆయన కోరిక. అయన కూడా ఆలా అవకాశాల కోసం సినీ ఇండస్ట్రీ కి వచ్చిన వారే.

సింధూరం సినిమాతో మెరిసిన ఆయన ఇడియట్, ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు, నా ఆటోగ్రాఫ్, ఖడ్గం వంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించారు. కిక్ రెండుభాగాల సినిమాతో అందరినీ అలరించాడు. మిరపకాయ్, దరువు సినిమాలతో బాక్సాఫీస్ దద్దరిల్లేలా చేసాడు. ఈయన ఒక్కో సినిమాకు 15-20 కోట్లు తీసుకుంటున్నారు.

 వీరే కాకుండా ఇంకా ఎంతో మంది హీరోలు ప్రేక్షకులను అలరిస్తున్నారు. ముఖ్యంగా టాప్ లిస్ట్ లో ఉన్న హీరోల్లో అధిక శాతం హీరోలు ఆంధ్ర ప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందినవారే కావడం గమనార్హం. ప్రభాస్, చిరంజీవి, రవితేజ, ఆలు అర్జున్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ వీరంతా ఒకే జిల్లాకు చెందినవారు. భాష ఏదైనా భావం ఒక్కటే. అందుకే సినీ రంగానికి ఎల్లలు, భాష అంటూ ఏవీ లేవు. అందరూ ఒకటే. అందరి నినాదమూ ఒకటే... కేవలం నటన...

అధిక పారితోషకం తీసుకుంటున్న తెలుగు హీరోలు : Highest Remuneration in Tollywood Heroes

తెలుగు హీరోల్లో మహేష్ బాబు, ప్రభాస్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, జూనియర్ ఎన్ఠీఆర్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో హీరోలు (Heroes) ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. వీరి సినిమాలు సూపర్ హిట్ అవుతుండడమే కాకుండా జాతీయ, అంతర్జాతీయంగా (National, International) కూడా వీరికి పేరు తెస్తున్నాయి. వీళ్ళు ఒక్కో సినిమాకు తీసుకునే రెమ్యూనరేషన్ కోట్లలోనే ఉంటోంది. 50 కోట్ల నుంచి 100 కోట్ల (Crores) వరకు ఆయా హీరోలు తీసుకుంటున్నారు.

టాలీవుడ్‌లో అత్యధిక అభిమానులు : Highest Fans in Tollywood

జాతీయ స్థాయిలోపాన్ ఇండియా హీరోలుగా  (PAN India Heroes) వెలుగుతున్న ప్రభాస్ కి, డీజే గా (DJ) అల్లు అర్జున్ కి భారత దేశంలో ఎంతోమంది అభిమానులు ఉన్నారు. రామ్ చరణ్, ఎన్ఠీఆర్ , మహేష్ బాబు వీరందరికీ అభిమానులు కోట్లలోనే ఉన్నారు. తమ అభిమాన హీరో సినిమా విడుదల అవుతుందంటే చాలు, ఆ హడావిడి వేరుగా ఉంటుంది. కటౌట్లు, బ్యానర్లతో హంగామా చేస్తుంటారు అభిమానులు. హీరోల కోసం అభిమాన సంఘాలు కూడా ఉన్నాయి.