ఆదిపురుష్ సినిమాపై ఆగని ట్రోలింగ్స్ : Non-stop trolling on the movie Adipurush

ప్రభాస్ నటించిన రామాయణ ఇతివృత్త 'ఆదిపురుష్' మూవీ విడుదలకు ముందు నుంచీ సమస్యలు ఎదుర్కొంటోంది. ఇప్పుడు రిలీజ్ తరువాత అది మరింత ఎక్కువయింది.

ఆదిపురుష్ సినిమాపై ఆగని ట్రోలింగ్స్ : Non-stop trolling on the movie Adipurush

ఆదిపురుష్ సినిమాపై ఆగని ట్రోలింగ్స్ : Non-stop trolling on the movie Adipurush

ప్రభాస్ నటించిన రామాయణ ఇతివృత్త 'ఆదిపురుష్' మూవీ విడుదలకు ముందు నుంచీ సమస్యలు ఎదుర్కొంటోంది. ఇప్పుడు రిలీజ్ తరువాత అది మరింత ఎక్కువయింది. టీజర్ విడుదల చేసినప్పుడు విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్, పాత్రలను తీర్చిదిద్దిన తీరు ఇలా అన్ని విషయాల్లోనూ ట్రోలింగ్ కి గురవుతోంది.

సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా 'ఆదిపురుష్' మూవీని బ్యాన్ చేయాలి, అందులో నటించిన వారిని తగులబెట్టాలి, వాళ్లకు రామాయణం అంటే తెలీదు... అయినా సినిమా తీశారు... అంటూ ఇలా ఎక్కడ చూసినా ఈ సినిమాపై నెగెటివ్ వార్తలు వస్తున్నాయి. అయినప్పటికీ ఈ వారాంతానికి 500 కోట్ల రూపాయల క్లబ్ లో చేరవచ్చనే టాక్ తో పాటు కలెక్షన్లు కూడా ఏమాత్రం తగ్గడం లేదు. ప్రభాస్ వ్యతిరేకులు, ట్రోలర్స్ రకరకాల ట్రోలింగ్స్ తో పాటు మీమ్స్ తో సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చేలా చేసారు. అయినా కలెక్షన్లు ఏమాత్రం తగ్గక పోవడం గమనార్హం. టీజర్లో హనుమంతుడి క్యారెక్టర్, రావణాసురుడి గెటప్ పై ఎంతో నెగెటివ్ టాక్ వచ్చింది. విఎఫ్ఎక్స్ బాగోలేదని టాక్ టీజర్ సమయంలో రావడంతో తిరిగి దానిని సరి చేసి ట్రైలర్ విడుదల చేసారు. ట్రైలర్లో విఎఫ్ఎక్స్ విజువల్స్ ఎంతగానో ఆకట్టుకోవడంతో పాటు చిత బృందానికి అద్భుతమైన ప్రశంసలు లభించాయి.

అయితే ప్రధానంగా సినిమాని తెరకెక్కించిన దర్శకుడు ఓం రౌత్ విమర్శకుల దాడిని తీవ్రంగా ఎదుర్కొంటున్నాడు. దర్శకుడితో పాటుగా సినిమా రైటర్ మనోజ్ ముంతాషిర్ సైతం ట్రోలింగ్ తో పాటు తనని చంపేస్తామని బెదిరింపులు సైతం వస్తున్నాయి. దీంతో ముంతాషీర్ ఇంటి వద్ద పోలీసు రక్షణను ఏర్పాటు చేసారు. కొత్తదనం (modern) పేరుతో రామాయణాన్ని కొన్ని మార్పులు చేసి తెరకెక్కించడం సగటు అభిమానులు సైతం అంగీకరించలేక పోతున్నారు. రావణాసురుడి వేషధారణ, కేశాలంకరణ, పది తలల డిజైన్ ఏమాత్రం మెప్పించలేక పోయింది.

సినిమాకి కథ అందించిన రైటర్ మనోజ్ ముంతాషిర్ సినిమా విడుదల అయినప్పటి నుంచి ఎప్పుడూ ఎదో ఒక వ్యాఖ్యలు చేస్తూ సమస్యను మరింత జఠిలం చేస్తున్నాడు. ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అసలు ఈ సినిమా రామాయణమే కాదు అని వ్యాఖలు చేసాడు. తాను రాసిన డైలాగులు తప్పుగా ఏమీ రాయలేదని, సమర్ధించుకున్నాడు. అనంతరం మీకోసం మళ్ళీ డైలాగులు మారుతున్నాం అని పేర్కొన్నాడు. హనుమంతుడు దేవుడు కాదు, ఓ భక్తుడు మాత్రమే. ఆయనకున్న శక్తిని బట్టి మనం హనుమంతుడిని దేవుడ్ని చేశామని అన్నాడు. దీంతో హిందువులు, హిందూ సంఘాలు ముంతాషిర్ ని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

సినిమా గురించి ఒకసారి క్లుప్తంగా సమీక్షిస్తే... : A brief review of the film...

సినిమాలో దర్శకుడు ఓం రౌత్ మొత్తం రామాయణాన్ని చూపించలేదు. కేవలం అరణ్య కాండ, యుద్ధకాండలను మాత్రమే తీసుకుని దానిని మాత్రమే తెరకెక్కించాడు. ఇక సినిమాలో రాఘవుడు (ప్రభాస్, Prabhas) భార్య జానకి (కృతి న్‌, Kriti Sanan), సోదరుడు శేషు (న్నీ సింగ్‌, Sunny Singh) తో లిసి వాసం చేస్తుంటాడు. లంకేష్ (సైఫ్ అలీఖాన్, Saif Ali Khan) మాయోపాయంతో జానకిని అపహరిస్తాడు. వానర సైన్యంతో లంకేశ్ పై యుద్ధానికి ఎలా సిద్ధమయ్యాడు, లంకేశ్ మాయల్ని ఛేదిస్తూ రాఘవుడు యుద్ధంలో ఎలా విజయం సాధించి జానకిని కాపాడుకున్నాడు అన్నదే క్లుప్తంగా సినిమా కథ.

రామాయణంపై తెలుగు, హిందీ మరికొన్ని భాషల్లో అనేకమైన సినిమాలు వచ్చాయి. అయితే ఆయా చిత్రాల దర్శకులు ఒక్కొక్కరు ఒక్కో కోణంలో చూపించారు. అప్పటి కాలంలో రాముడ్ని ఒంటి నిండా ఆభరణాలతో నిండైన రూపంలో చూపించేవారు. మాట్లాడే భాష సైతం గ్రాంథిక భాషలోనే వాడటం చేసేవారు. సీతారాముల మధ్య ప్రేమ, అనుబంధం, వనవాసం, సీత కోసం పడే ఆరాటం, హనుమంతుడి కలయిక, రావణుడితో యుద్ధం ఇలా రామాయణాన్ని చక్కగా కళ్ళకు కట్టినట్లు చూపించేవారు. అయితే ఆదిపురుష్ సైతం అంతలా కాకపోయినా రామాయణానికి తగ్గట్లుగా ఉంటుంది అందరూ అంచనా వేశారు. అయితే అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ అసలు రామాయణాన్ని పక్కన పెట్టేసాడు దర్శకుడు. ఇప్పటి జెనరేషన్ కి తగ్గట్లుగా తీసాడని చెప్పవచ్చు. మీసకట్టుతో రాముడు, సీతారాముల మధ్య డ్యూయెట్ సాంగ్ పెట్టి అందరినీ ఆశ్చర్య పరిచాడు దర్శకుడు ఓం రౌత్.

దర్శకుడు రాముడి జననం నుంచి కాకుండా వనవాసం చేసినప్పటి నుంచి జతను తీసుకున్నాడు. అందుకే మారు పేర్లతో అంటే హనుమంతుడి పేరును భజరంగ్ గా, లక్ష్మణుడి పేరును శేషు అని, రావణుడిని లంకేశుడని పేరు మార్పులు చేసాడు. రావణుడి పాత్ర రాగానే ప్రేక్షకులు, అభిమానులు ఎంతో చిరాకుని ప్రదర్శిస్తున్నారు. కేవలం ప్రభాస్ సినిమాను తన డైలాగులు, నటనతోనే కొంత గట్టెక్కించాడని చెప్పవచ్చు. జానకి పాత్రలో కృతి సనన్ నటన బాగుంది. ప్రస్తుతం సినిమాను బ్యాన్ చేయాలనీ కోరుతూ కొందరు ఏకంగా ప్రధాని మోదీకి లెటర్ రాసారు. రానున్న రోజుల్లో సినిమా దర్శకుడు, రైటర్ పై ట్రోలింగ్ ఆగుతుందా? సినిమాకు పెట్టిన ఖర్చు అయినా వస్తుందా... ఇవన్నీ తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.