రోడ్డు ప్రమాదంలో క్రికెటర్ పంత్ కు తీవ్ర గాయాలు : Pant injured in a road Accident
టీమ్ ఇండియా క్రికెటర్ రిషబ్ పంత్ శుక్రవారం తెల్లవారుఝామున జరిగిన ఘోర ప్రమాదంలో తీవ్ర గాయాలపాలయ్యాడు. ఆయన నడుపుతున్న కారు రోడ్డు డివైడర్ ను ఢీ కొనడంతో కారులో మంటలు చెలరేగాయి. కారు పూర్తిగా దగ్ధమయ్యింది.

రోడ్డు ప్రమాదంలో క్రికెటర్ పంత్ కు తీవ్ర గాయాలు : Pant injured in a road Accident
టీమ్ ఇండియా క్రికెటర్ రిషబ్ పంత్ శుక్రవారం తెల్లవారుఝామున జరిగిన ఘోర ప్రమాదంలో తీవ్ర గాయాలపాలయ్యాడు. ఆయన నడుపుతున్న కారు రోడ్డు డివైడర్ ను ఢీ కొనడంతో కారులో మంటలు చెలరేగాయి. దీంతో పంత్ కారు కిటికీలు బద్దలు కొట్టి బైటికి దూకేసాడు. ఈ సంఘటనలో పంత్ తలకు, వెనుక భాగంలో, మోకాళ్ళకి తీవ్రంగా గాయాలయ్యాయి. కారు పూర్తిగా దగ్ధమయ్యింది. ఢిల్లీ-డెహ్రాడూన్ NH-58 హైవేపై హరిద్వార్ జిల్లాలోని మంగ్లౌర్ దగ్గర ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో పెద్ద ఎత్తున శబ్దం రావడంతో స్థానికులు, పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ప్రమాద సంఘటనపై పంత్ సహచర క్రికెటర్లు దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు.
నిద్ర మత్తుతోనే ప్రమాదం : Accident due to sleep intoxication
తాను డ్రైవింగ్ చేస్తున్న సమయంలో నిద్ర మత్తు వచ్చినట్లు పంత్ తన స్టేట్మెంట్ లో పేర్కొన్నాడని ఉత్తరాఖండ్ డీజీపీ అశోక్ కుమార్ తెలిపారు. తొలుత తాము పంత్ నడుపుతున్నది మెర్సిడెజ్ కారు అని భావించామని, దర్యాప్తు అనంతరం అది బీఎండబ్ల్యూ కారుగా తేలిందన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే రూర్కీ ఆసుపత్రికి తరలించినట్లు డీజీపీ పేర్కొన్నారు. రూర్కీ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం డెహ్రాడూన్లోని మ్యాక్స్ హాస్పిటల్కు తరలించారు. కారును వేగంగా నడపడంతో నియంత్రణ కోల్పోవడంతోనే ప్రమాదం జరిగినట్లు ఆయన తెలిపారు.
పంత్ చికిత్స ఖర్చు ప్రభుత్వానిదే : సీఎం ధామి
ఉత్తరాఖండ్ బ్రాండ్ అంబాసిడర్ గా రిషబ్ పంత్ ను అక్కడి ప్రభుత్వం నియమించింది. పంత్ రోడ్డు ప్రమాదంలో గాయపడిన విషయాన్నీ తెలుసుకున్న సీఎం పుష్కర్ సింగ్ ధామి పంత్ చికిత్సకయ్యే మొత్తం ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. అతను త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
సీసీటీవీ లో నమోదైన ప్రమాద దృశ్యాలు
పంత్ నడుపుతున్న కారు డివైడర్ ను ఢీ కొట్టి కారు దగ్ధమైన సంఘటన దగ్గరలోని సీసీటీవీలో నమోదయింది. దీనిని బట్టి పంత్ కారును అతివేగంతో నడిపినట్లుగా తెలుస్తోంది.
ఇటీవల మాజీ క్రికెటర్ ధోనీతో కలిసి దుబాయ్ లో క్రిస్మస్ వేడుకలను జరుపుకున్నాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పంత్ పరిస్థితి మెరుగ్గానే ఉన్నట్లు ఆయనకు చికిత్స అందిస్తున్న మ్యాక్స్ హాస్పిటల్ వైద్యుల్లో ఒకరైన డాక్టర్ ఆశిష్ యాగ్నిక్ తెలిపారు.